లైంగిక సంబంధాలు ప్రకృతి నియమాలు

లైంగిక సంబంధాలు ప్రకృతి నియమాలు

 అబుల్ ఆలా మౌదూది 

”వ్యభిచార దరిదాపులకు కూడా పోకూడదు సుమా! అది ఎంతో నీతిబాహ్య మైన చేష్ట. మహా చెడ్డ మార్గం”. (బనీ ఇస్రాయీల్: 32)

ఒక్కసారి వ్యభిచారం, దాని పరిణామాలను గురించి ప్రశాంతంగా ఆలోచిం చండి. మన సామూహిక జీవితంపై, సమాజంపై అదెలాంటి దుష్ప్రభావాన్ని వేస్తుందో పరిశీలించండి.

ప్రథమంగా వ్యభిచారి తనను సుఖరోగాల కు గురిచేస్తాడు. తద్వారా తన శారీరక శక్తుల కార్యాచరణలో లోపాన్ని సృష్టించు కోవటమే కాదు, సమాజానికి, సంతతికి తీరని నష్టం కూడా కలిగిస్తాడు. సెగరోగం లేక పాండు రోగాన్ని గురించి ఏ వైద్యున్నై నా అడిగి చూడండి. మర్మాంగంలో ఏర్ప డిన పుండు సామాన్యంగా నయం కానిది. ఒక గొప్ప డాక్టర్‌ లోకోక్తి ఏమిటంటే ”ఒకసారి సోకిన సెగ రోగము శాశ్వతమైన రోగము.” దీనివల్ల కాలేయము, మూత్ర కోశము మొదలగు అవయవాలు కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బ తింటాయి. ఇది కీళ్ళ నొప్పులు, ఇతర రోగాలకు కారణ భూతమవుతుంది. వ్యభిచారం వల్ల శాశ్వతంగా గొడ్డుతనం ఏర్పడే ప్రమాదముంది. అంతేకాక ఇది ఇతరులకు సోకే ప్రమాద మున్న రోగం కూడాను. మరికొన్ని సుఖ రోగాల ప్రభావాలయితే ఇంకా తీవ్రంగా, భయంకరంగా ఉంటాయి. అవి రోగి నుండి ఇతరులకు కుడా పాకిపోతాయి. ఇలా ఈ దుర్మార్గుడి మూలంగా అతని సంతానం, ఆ సంతానపు సంతానం కూడా, చేయని నేరానికి శిక్ష అనుభవించ వలసివస్తుంది. అంధులు, మూగ, చెవిటి, మతిలేని పిల్లల జననం-దౌర్జన్యకారుడైన తండ్రి, తన జీవితపు మధురానుభూతులు అనుకొని గడిపిన ఆ కొద్ది క్షణాల దుష్ఫలితాలే.

సుఖరోగాలు ప్రతి వ్యభిచారికి సోకడం తప్పనిసరి కాకపోయినా ఈ చర్య తో అనివార్య సంబంధమున్న నైతిక బల హీనతల నుండి మాత్రం ఎవరూ తప్పించు కోలేరు. అశ్లీలం, మోసం, కాపట్యం, అబద్ధం, అవినీతి,స్వార్థం, భోగలాలస, నిగ్రహలోపం, ఆలోచనల్లో పోకిరి తనం, నడవడికల్లో చంచలత్వం, ముఖం చాటేసు కోవటం, విశ్వాసఘాతుకం- ఇవన్నీ వ్యభి చారానికి  సంబంధించిన  నైతిక రుగ్మ  తలు. ఇవి వ్యభిచారి మనోమస్తిష్కాలపై ప్రభావం వేయకుండా ఉండజాలవు. ఏ వ్యక్తిలో ఈ దుష్ట గుణాలు చోటుచేసు కుంటాయో అవి కేవలం లైంగిక విష యాల వరకే పరిమితమై ఉండవు. జీవితంలోని ప్రతి రంగంలో ఆ వ్యక్తి తన సంఘానికి ఈ గుణాలనే, వాటి ప్రభావా లనే సమర్పించుకుంటాడు.ఒకవేళ పైన పేర్కొన్న గుణాలు సమాజంలోని అత్యధిక మందికి కనుక సోకినట్లయితే అవి కళ, సాహిత్యం, వినోద క్రీడలు, పరిశ్రమలు, సంస్కృతి, ఆర్థికత్వము, రాజకీయము, న్యాయ వ్యవస్థలు, సైనిక సేవలు, రాజ్య వ్యవహారాలు- ఒక్కటేమిటి, సర్వ రంగా లను నిర్వీర్యం చేసి పడేస్తాయి. ప్రత్యేకించి ప్రజాస్వామ్యవ్యవస్థ లోనైతే…..వ్యభిచారాన్ని అనుమతించటమంటే సమాజంలో వేశ్యవృత్తి సాగకుండా ఉండదు. ఒక వ్యక్తి, యువకుడైన పురుషు నికి ‘వినోదం’ హక్కు ఉండాలని చెప్తున్నా డంటే దాని అర్థం సామూహిక జీవితంలో, సాంఘిక జీవితంలో అత్యంత నీచమైన పడుపువృత్తిని అవలంబించే స్త్రీల వర్గం ఒకటి ఉండి తీరాలన్న మాట. అయితే ఈ స్త్రీ వర్గం ఎక్కడి నుండి ఊడి పడుతుంది? ఈ సమాజం నుండే రావాలి కదా! సమా జంలోని ఎవరో ఒక పురుషుని బిడ్డనో, చెల్లినో కాక తప్పదు. ఒక ఇంటికి యజ మానురాలు, ఒక కుటుంబానికి స్థాపకు రాలు, అనేకమంది పిల్లలకి సంరక్షకురాలు కాగలిగిన ఇలాంటి లక్షలాది స్త్రీలనే ఈడ్చు కు వచ్చి ఈ వేశ్య బజారులో కూర్చోబెట్టా లి కదా! మునిసిపాలిటి మూత్రశాలల్లో ఇష్టం వచ్చిన వారు అవసరమనుకున్నప్పు డల్లా వెళ్ళినట్లు తమ కామవాంఛను తీర్చు కునే దుష్ట పురుషుల అవసరాలు తీర్చే కేంద్రాలుగా మార్చటమే కదా! దీని ద్వారా స్త్రీ తనలో ఉన్న సుగుణాలన్నిటినీ కోల్పోక తప్పదు. వారికి వయ్యారం,కుటిల మనస్తత్వం నేర్పటం జరుగుతుంది. తమ ప్రేమ, హృదయం, శరీరం, అందచం దాలు-సర్వస్వాన్ని ఒక్కొక్క గంటకు ఒక్కొక్క వినియోగ దారునికి అమ్ముకోవ టానికి తగిన విధంగా వారిని మార్చటం జరుగుతుంది. ఈ విధంగా స్త్రీ, ప్రయో జనకరమైన కుటుంబ వ్యవస్థ నిర్వాహకు రాలు కావడానికి బదులు జీవితాంతం పరపురుషుల కామవాంఛను తీర్చే కీలు బొమ్మలుగా మార్చబడుతుంది.

వ్యభిచారాన్ని అనుమతిస్తే అది తప్ప కుండా సామాజిక నియమమైన వివాహ వ్యవస్థను నష్టపరిచి తీరుతుంది. ఇంకా చెప్పా లంటే దీని అంతిమ పర్యవసానంగా వివాహ వ్యవస్థ పూర్తి గా నశించిపోయి కేవలం వ్యభి చారమే విశ్వ రూపం దాల్చి సమాజంలో రాజ్యమేలుతుంది. వ్యభిచారం పట్ల మోజు కలిగిన స్త్రీ పురుషుల్లో నిజమైన దాంపత్య జీవి తం గడిపే యోగ్యతే ఉండదు. వ్యభిచార వ్యస నం వల్ల ఉత్పన్నమయ్యే చెడు దృష్టి, చెడు తలంపు, చంచలత్వం పోకిరితనం లాంటి దుర్గు ణాలు, తద్వారా వారి ఆలోచనల్లో అని శ్చలత, భోగలాలస, నిగ్రహ లోపంలాంటి బలహీనతలు చోటు చేసుకుంటాయి. ఒకవేళ ఇలాంటి వ్యక్తుల జీవితం దాంపత్య జీవితంలో

ముడిపడి పోయినా దంపతుల మధ్య దాంపత్య జీవితానికి అవసరమైన పరస్పర ప్రేమ, అభిమానం, విశ్వాసము, సహ కారం, సానుభూతులు చోటు చేసుకోలేవు. ఇవి ఉంటేనే మంచి భావితరం, ఆనందో త్సాహాలు వెల్లి వెరిసే కుటుంబం ఉనికిలో కి వస్తుంది. ఇంకొక విషయం, వ్యభిచారా నికి అనువైన వాతావరణం నెలకొనే చోటు న లేక సమాజంలో సమాజ బాధ్యతలతో కూడిన వివాహవ్యవస్థ లేక కుటుంబ వ్య వస్థ మనగలజాలదు. ఒక వ్యక్తికి ఎలాంటి బాధ్యతలు లేకుండానే తన కామవాంఛలు తీర్చుకునే అవకాశ మున్నప్పుడు అతడెం దుకు వివాహం చేసుకొని తన భుజాలపై బాధ్యతల బరువును వేసుకుంటాడు? ఈ కారణంగానే పాశ్చాతదేశాల్లో ప్రత్యేకించి యూరోపియన్‌ సమాజాల్లో వివాహ     వ్య వస్థ కుంటు పడి పోయింది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.        వ్యభిచారానికి అనుమతించటం, ఆచారమివ్వటం మూలంగా కేవలం సాం ఘిక పతన మొక్కటే కాదు, మానవజాతి ఉనికికే ప్రమాద మేర్పడుతుంది. ఈ విష యాన్ని పైన రుజువు పరిచాము. విచ్చల విడి లైంగిక సంబంధాల్లో స్త్రీపురుషు లిద్దరికి కూడా సంతానోత్పత్తి లేక మానవజాతి మనుగడ గురించిన కోరిక ఉండదు, ఉండజాలదు కూడా.

వ్యభిచారం వల్ల సమాజానికి అసలు శిశువులే లభించరు. లభించినా వారు  అక్రమ సంతానంగానే లభిస్తారు. వంశ పరంగా అక్రమ, సక్రమ అనేది కేవలం ఒక మానసిక భావన తప్ప ఇంకేమి కాదని కొందరు అజ్ఞానులు భావిస్తారు. నిజానికి అనేకానేక కారణాల మూలంగా అక్రమ సంతానానికి జన్మనివ్వటం అంటే ఆ శిశు వుపై, సర్వ మానవ సమాజంపై ఒక ఘోర మైన అన్యాయం, దౌర్జన్యం చేయడమే. తల్లిదండ్రులిద్దరూ కేవలం పాశవిక ఉద్రే కంలో మునిగి ఉన్న సమయంలోనే ఈ శిశువుకు తల్లి గర్భంలో అంకురార్పణ జరుగుతుంద నేది మొదటి విషయం. వివాహబంధంతో ముడి పడి ఉన్న ఒక జంటలో సంభోగ సమయంలో ఉండేటట్లు వంటి పవిత్ర మానవీయ విలువలు ఈ అక్రమ లైంగిక సంబంధం ఏర్పర్చుకున్న జంటలో ఎట్టి పరిస్థితుల్లోను ఉత్పన్నం కాజాలవు. వారిని కేవలం పాశవిక ఉద్రే కం మాత్రమే కలిపేస్తుంది. అందుకని ఆ సమయంలో వారిలో ని మానవీయ ప్రత్యే కతలన్నీ పటాపంచలై పోతాయి. తత్ఫలి తంగా అక్రమంగా జన్మించిన ఆ శిశువు తన తల్లిదండ్రుల పాశవిక వారసత్వానికే అర్హుడవుతాడు. ఇక ప్రపంచంలోకి వచ్చిన ఆ శిశువును స్వాగతించటానికి తల్లిగాని, తండ్రిగాని సిద్ధంగా ఉండరు. ఎందుకంటే అతనొక కోరబడిన, అభిలషించిన, ఎదురు చూస్తున్న ఉనికి కాదు. అనాలోచితంగా, అయిష్టంగా,గత్యంతరంలేక మెడలో వచ్చి పడిన పాములాంటి వాడు. సాధారణంగా ఇలాంటి పిల్లలకు తండ్రి ప్రేమకాని, అతని వనరులు కాని లభించవు. తల్లి ఏకపక్ష  ప్రేమ, రక్షణే అతనికి దిక్కు. ఆ ప్రేమలో కూడా విసుగు, అయిష్టత ప్రస్ఫుటంగా కనబడుతాయి. అతను అవ్వ, తాతయ్యల ప్రేమ వాత్సల్యాలకు కూడా నోచుకోలేడు. కుటుంబ సంరక్షణ, ప్రేమ అంటే ఏమిటో అతనెరుగడు. అందుకని అతనొక అసం పూర్ణ వ్యక్తిగా, లోపభూయిష్టమైన వ్యక్తిగానే ఎదుగుతాడు. అతనికి సరియైన శిక్షణ దొరకనందు వలన అతని క్యారక్టర్‌ పరి పూర్ణం కాజాలదు. అతనిలోని యోగ్య తలు వికసించవు. సమాజంలో తగిన విధంగా పురోగమించ టానికి, సముచిత స్థానం పొందటానికి కావలసిన ఒనరులు అతనికి లభ్యంకావు. అందువల్ల అతను లోపభూయిష్టంగా, అనాథగా, అపరిచితుని గా, పీడితునిగా, దూషితునిగా సంఘంలో అడుగు పెడతాడు.

విశృంఖల లైంగిక సంబంధాల ధ్వజవాహ కులు దీన్ని గురించి వితండ వాదం చేస్తూ ఇలాంటి పిల్లల పోషణ, విద్యాబుద్ధుల కోసం ఒక జాతీయ వ్యవస్థ ఉండాలని, తల్లిదండ్రు లు తమ ఇష్టానుసారం కనిన పిల్లల్ని జాతి పెంచి పోషించి, సామాజిక సేవకోసం తర్ఫీదునివ్వాలని అంటారు. స్త్రీ పురుషులకు లైంగిక స్వాతంత్య్రం, వ్యక్తి గత స్వేచ్ఛ ఉండి, వారు వైవాహిక జీవితం లో బంధింపబడ కుండానే తమ లైంగిక కోరికలు తీర్చుకుంటూ తత్ఫలితంగా జన్మించిన శిశువులకు ఈ విధంగా శిక్షణ ఇస్తే మానవ సంతతీ పెరుగు తుంది; దాని శిక్షణ పూర్తి అవుతుందని వారి భావన. అయితే విచిత్రమైన విషయం ఏమి టంటే ఇటువంటి వారికి ప్రస్తుత తరం వ్యక్తి గత స్వాతంత్రమైతే ఇంతగా ప్రీతి పాత్రమైనది, కాని రాబోయే తరానికి వారు వ్యక్తిగత  పురోగాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి అవకాశం లేని జాతీయ వ్యవస్థ, ప్రభుత్వ పోషణ, శిక్షణా వ్యవస్థలను కోరుతున్నారు. లక్షలాది పిల్లలకు ఏక కాలంలో ఒకేరీతిలో, ఒకే ప్రణాళిక ప్రకారం ఒకే పద్ధతిలో పెంచే ఈ వ్యవస్థలో పిల్లల వ్యక్తిగత గుర్తింపు, ప్రత్యేకత, వ్యక్తిత్వం వికాసం ఎలా సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థలో సాధ్యమైన మేరకు కృత్రిమ ఏకత్వం, సమానత్వాలైతే కనబడతాయి. కాని ఒక ఫ్యాక్టరీ నుండి ఉత్పాదక వస్తువులు ఒకే మూసలో, ఒకే పోలికతో రూపుదిద్దుకొని బయటకు వచ్చినట్లు ఈ వ్యవస్థ నుండి కూడా పిల్లలు ఒకే వ్యక్తిత్వంతో, ఒకే మనస్తత్వంతో బయటికి వస్తారు. కాస్త ఆలోచించండి. మానవుని గురించి ఈ మూర్ఖుల ఆలోచనలు ఎంత అల్పంగా, ఎంత నీచంగా ఉన్నాయో  ఊహించండి. బాటా చెప్పుల్లాగా వీరు మానవుల్ని తయారు చేయదలిచారు.

పౌల్ట్రి ఫారంలోని కోడిపిల్లలలాగా, మానవ శిశువులకు దాణా ఇస్తూ మానవుడైనందుకు విద్యాశిక్షణ ఇప్పిస్తారట. అదీ జాతీయ స్థాయి లో ప్రభుత్వ పరంగానట. మానవ శిశువుల ను వీరు బాటా కంపెనీ బూట్లతో, పౌల్ట్రీ ఫారం కోడి పిల్లలతో సమానమనుకుంటు న్నారు. తరతరాలుగా యుగయుగాలుగా ఎందరెం దరో ప్రవక్తలు,ఋషులు,మునులు తత్వవే త్తలు పరిచయం చేసి, సమయోచితంగా దాన్ని సంస్కరిస్తూ ప్రయోగపూర్వకంగా సరి అనిపించుకున్న వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, మానవజాతికి ఈ ‘మహా సంస్కర్తలు’ అందించబోయే పరిష్కారాన్ని, ప్రతిఫలాన్ని చూడండి. ఇదంతా దేనికోసం? విచ్చలవిడిగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవటానికి అడ్డంకి ఉండకూడదనే క్షుద్రకోరికతో ఎంతటి మహోన్నత వ్యవస్థను నేలకూల్చాలని చూస్తున్నారు ఈ కామ పిశాచులు! అయితే ఒక మానవ శిశువును తీర్చిదిద్దటం ఒక సున్నితమైన కళ అనేది వారికి తెలియదు. అది కుటుంబం అనే చిరు కర్మాగారంలోనే, ఆర్ట్‌ గ్యాలరీలోనే  సాధ్య పడుతుంది. ఈ ఆర్ట్‌కు ఎంతో శ్రమ, ఓపిక అవసరం. ఒక కళాకారుడు చిత్రంలోని  ఒక్కొక్క రంగుపై ఏ విధంగానైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడో వ్యక్తిత్వాన్ని రూపొందించటం లో అనేక అంశాలపై, అనేక కోణాలతో పరి కించి సంస్కరించ వలసి ఉంటుంది. కూలీ కొచ్చిన కార్మికులు ఈ ప్రత్యేకతను ఈ సున్నిత మనస్తత్వాన్ని ఎలా సంతరించుకో గలరు?

అదీగాక జాతీయ విద్యాసంస్కారాల ఈ వ్యవస్థలో పనిచేయటానికి, సమాజం తర ఫున ఈ పిల్లల పోషణా భారాన్ని ఎత్తుకోవ టానికి యోగ్యులైన కార్యకర్తలు అవసరమై ఉంటారు. అయితే ఈ పని కోసం తమ ఐహిక కోరికలను నియంత్రించగలిగే, నైతి కంగా సంయమనం పాటించే కార్యకర్తలే యోగ్యులవుతారు. వారిలోనే ఈ గుణాలు లేకపోతే వారు పిల్లల్లో ఈ నైతిక నియమాల ను, సంయమనాన్ని ఎలా పెంపొందించగలు గుతారు. ఇక్కడో ప్రశ్న జనిస్తుంది. ఇటు వంటి కార్యకర్తల్ని మీరెక్కడి నుండి తీసుకు వస్తారు? స్త్రీపురుషులను తమ కోరికలు తీర్చు కోవటానికి స్వేచ్ఛగా ఉంచాలనే కదా మీరు జాతీయ విద్యా సంస్కారాల వ్యవస్థను ఏర్పాటు చేయదలిచింది. ఇక సమాజంలో నైతిక సంయమనం, కోరికలపై నియంత్రణ కు అవకాశం లేకుండానే చేసేశారే, ఇలాంటి సొసైటీలో మీకు పైగుణాలు కలిగిన కార్య కర్తలు ఎలా లభ్యమవుతారు. ఇష్టానుసారం తమ కోరికల్ని తీర్చుకోవటమే ధ్యేయంగా ఉన్న ఇలాంటి సొసైటీలో సంయమనాన్ని, నిగ్రహాన్ని జీర్ణించుకొని ఆదర్శ ప్రాయంగా నిలిచే నాధుడెవ్వడు?       వ్యభిచారం లేక అక్రమ సంబంధం ద్వారా స్వార్థపరుడైన ఒక వ్యక్తి ఏ స్త్రీనైతే తల్లిగా చేసేస్తాడో, ఆ స్త్రీ జీవితం శాశ్వతంగా నాశనమైపోతుంది. సాంఘికంగా అవ మానం, అవహేళన, చీదరింపు, అసూయ ద్వేషాలే కాక అనేకానేక కష్టాల ఊబిలో ఆమె కూరుకు పోతుంది. బ్రతికున్నంతకాలం ఆ ఊబిలో నుండి ఆమె బయటపడజాలదు. ఆధునిక నైతిక సూత్రాల్లో ఈ సమస్యకు కను గొన్న పరిష్కారమేమిటంటే వివాహం ద్వారా గాని, వివాహేతర సంబంధం ద్వారా గాని, మాతృత్వం దాల్చిన స్త్రీలందరికి సమాన ప్రతి పత్తిని కలుగజేయటం.

మాతృత్వం అనేది గౌరవించదగ్గ స్థానం గనక ఒక బాలిక అమాయకత్వం వల్లనో, అజాగ్రత్త వల్లనో తల్లి అయ్యే బాధ్యతను స్వీకరించింది. కనుక సమాజంలో ఆమెను అవమానపరచట మంటే ఆమెపై దౌర్జన్యం చేయడమేనంటూ వీరు సమర్థిస్తున్నారు.అయితే మొదటి విష యం – ఈ పరిష్కారం వ్యభిచారిణులకు ఎన్ని విధాల అనుకూలమైనప్పటికి, సామూ హిక రూపంలో మాత్రం సమాజానికి ఇది కష్టాల్నే తెచ్చి పెడుతుంది. సమాజం సహజంగానే అక్రమ సంతానం కన్న తల్లిని నీచంగానే,ద్వేషంగానే చూస్తుంది. అయితే ఈ నీచ, ద్వేష చూపు, ఈ ప్రవర్తన సమాజం లోని ఇతర వ్యక్తుల్ని ఇలాంటి పాపం నుండి ఆపటానికి,బెదరించటానికి అమోఘంగా పనిచేస్తుంది. వేరొక వైపు ఈ చర్యద్వారా సమాజంలో, సమాజ ప్రజల్లో నైతిక జాగృతి ఉందని నిరూపితమవుతుంది. ఒకవేళ సక్రమ సంతానం కలిగిన మరియు అక్రమ సంతానం కలిగిన ఇద్దరు తల్లులకు ఒకే హోదాను కల్పిస్తే దీని అర్థం ఏమిటి? సమాజం నుండి మంచి చెడు, పుణ్యము పాపము, అక్రమం సక్రమం అనే వ్యత్యాసమే అంతమై పోతుంది. ఒకవేళ ఇది సాధ్యపడిందే అనుకోండి, అయినప్పటికి అక్రమ సంతానం కలిగిన తల్లి కష్టాలు కడతేరుతాయా? ఆమె బాధలన్నీ దూరమై పోతాయా? అక్రమ సంతానం, సక్రమ సంతానం కలిగిన ఇద్దరు తల్లుల్ని మీ

దృష్టిలో, మీ సిద్ధాంతంలో సమానమనిపించు కోవచ్చునేమో కాని ప్రకృతి మాత్రం వీరిద్దరిని సమానంగా లెక్కించదు, వీరిద్దరూ ఎన్నటికీ సమానం కాలేరు. బుద్ధిజ్ఞానాల రీత్యా, తర్కం రీత్యా, న్యాయం రీత్యా, యదార్థతరీత్యా ఏ విధంగా చూసినా వీరిద్దరు సమానం కాలేరు. లైంగిక కోరికల క్షణిక ఉద్రేకంలో తనను తాను మరిచిపోయి, తననుగాని తనకు పుట్ట బోయే పిల్లవానికిగాని సాకటానికి, సంరక్షించ టానికి ఎలాంటి భరోసా ఇవ్వని స్వార్థపరుడైన ఒక మగవానికి శరీరం అర్పించుకున్న ఒక మూర్ఖపు స్త్రీ, బాధ్యతాపరుడు, గౌరవనీయుడు అయిన ఒక పురుషుడు లభించేంతవరకు తన కోరికల్ని, ఉద్రేకాల్ని నియంత్రణలో ఉంచు కున్న శీలవతి అయిన స్త్రీతో ఎలా సమానం కాగలదు? ఏ  బుద్ధిజ్ఞానాలు వీరిద్దరిని సమా మనగలుగుతాయి? మీరు కోరుకున్నట్లయితే  వీరిద్దరిని   కృత్రిమంగా,  ప్రదర్శనా నిమిత్తం సమానం చేసుకోవచ్చు. అయితే ఒకే భర్తతో జీవితం గడుపుతున్న స్త్రీకి లభించే పోషణ, సంరక్షణల   గ్యారంటీని  ఆ ప్రేమ వాత్సల్యా లను,  అనురాగ  పూరితమైన  ఆ యోగ క్షేమాలను ఆ శాంతిని, ఆ నిశ్చలతను, ఆ నమ్మకాన్ని ప్రేమపూర్వకమైన ఆ అనుబం ధాన్ని ఆ మూర్ఖ స్త్రీకి ఎక్కడి నుండి సమ కూర్చ గలుగుతారు? ఆమె  పిల్లవానికి కేవ లం తండ్రి మాత్రమే చూపగలిగే కరుణా వాత్సల్యాలు ఏ బజారు నుండి కొని పెడ్తారు? మహా అయితే చట్ట సహాయంతో ఆమెకు జీవన భృతి ఇప్పించగలరేమో, అయితే ఒక స్త్రీకి ఒక పిల్లవానికి ఈ ప్రపంచంలో కేవలం భృతి మాత్రంతోనే సరి పోతుందా? లేదు. అందుకని అక్రమ సక్రమ మాతృత్వాలను సమానం చేసినంతమాత్రాన పాపంచేసిన స్త్రీలకు బాహ్యంగా ఎంత సౌకర్యం కల్పించి నా వారు చేసిన ఈ పొరపాటుకు భౌతిక ఫలి తాలను ఈ విధంగా జన్మించిన కారణంగా వారి పిల్లలకు కలిగే వాస్తవ నష్టాలనుండి కాపాడలేరు.

పై కారణాలవల్ల సమాజ మనుగడకు, దాని పురోగతికి, లైంగిక సంబంధాల విచ్చలవిడి తనాన్ని కఠినంగా నిరోధించటం సమాజ అత్యవసరాల్లో పరిగణింపబడుతుంది. అంతే కాదు, లైంగిక కోరికల తృప్తికోసం ఒకేఒక ద్వారం అయిన వివాహ సంబంధం తెరిచి ఉంచక తప్పదు. వ్యక్తులకు వ్యభిచరించే స్వాతంత్య్రమివ్వటం అంటే వారి పట్ల అనవ సరమైన పక్షపాతం చూపించటమే కాదు, సమాజ హత్యగా పరిగణించబడుతుంది. ఏ సమాజమైతే దీన్ని స్వల్ప విషయంగా భావి స్తుందో, వ్యభిచారాన్ని కేవలం వ్యక్తిగత ఆనం దోల్లాసంలో గడిపే సమయం (హ్యావింగ్‌ ఎ గుడ్‌ టైమ్‌)గా భావించి దృష్టి మరల్చుకుం టుందో, విచ్చలవిడి బీజార్పణ (సోవింగ్‌ విల్డ్‌ ఓట్స్‌) పట్ల సహన వైఖరిని అవలంబిస్తుందో ఆ సమాజం ఒక మూర్ఖ సమాజమే అనబడు తుంది. దానికి తన బాధ్యతల సృహ లేదు. తనకు తానే శత్రువుగా వ్యవహరిస్తున్నది. ఆ సమాజానికి తన బాధ్యతల సృహే కనుక ఉండి ఉంటే లైంగిక సంబంధాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛవల్ల సమాజంపై, సమాజ ప్రయోజనాలపై పడే దుష్ప్రభావాల్నే కనుక అది ఎరిగి ఉంటే దొంగతనం, దోపిడి, హత్య లాంటి నేరాల దృష్టితోనే ఈ ‘చర్య’ను కూడా చూడగలిగి ఉండాలి.ఇంకా అంతకన్నా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. దొంగ, దోపిడీదారు, హంతకుడు ఏం చేస్తారు? మహా అయితే ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తులకు నష్టం కలిగిస్తారు. కాని వ్యభిచారి సర్వ సమాజాన్ని, దాని భావితరాల ను వినాశం వైపుకు నెడ్తాడు.

వ్యక్తుల స్వార్థపరమైన దౌర్జన్యాలను ఎదుర్కోవ టానికి, సమాజ ప్రయోజనాలను కాపాడటా నికే చట్టం ఉనికిలోకి వచ్చిందని చట్ట బలం తోనే సమాజ ప్రయోజనాలు కాపాడబడు తున్నాయనేది సర్వ వితం. ఈ కారణంగానే దొంగతనాన్ని, హత్యను, దోపిడీని, హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేకానేక విష యాలను చట్టపరంగా నేరాలని గుర్తించి, వాటికి తగిన శిక్షలు విధించి, సమాజాన్ని ఈ రుగ్మతల నుండి కాపాడటానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటప్పుడు ‘వ్యభిచారం’ విషయంలో చట్టం సొసైటీని ఎందుకు రక్షించకూడదు? సమాజాన్ని ఎందుకు సమ ర్థించకూడదు? వ్యభిచారాన్ని చట్ట పరమైన నేరంగా ఎందుకు పరిగిణించ కూడదు?

సిద్ధాంతపరంగా కూడా వివాహం, వ్యభి చారం ఈ రెండు ఏకకాలంలో ఒక సమాజం లోని అంతర్‌ భాగాలు కాలేవు. ఒక వ్యక్తికి  బాధ్యతలు స్వీకరించకుండానే లైంగిక వాంఛ లు తీర్చుకునే స్వాతంత్రమిచ్చి అదే పనికోసం వివాహ నియమాన్ని ఏర్పాటు చేయటం అర్థం లేని విషయం. ఉదాహరణకు రైలులో టికెట్టు లేకుండా ప్రయాణించటాన్ని సమర్థిస్తూనే, ప్రయాణం కోసం టికెట్టు కొనుక్కునే నియ మాన్ని ఏర్పాటు చేయటం ఎలా ఉంటుంది? బుద్ధీజ్ఞానాలున్న ఏవ్యక్తి కూడా ఏకకాలంలో ఈ రెండు పద్ధతుల ఉనికిని సమర్థించలేడు. సమంజసమైన, సముచితమైన పద్ధతి ఏమి టంటే టికెట్టు కొనాలనే నియమాన్నైనా తొల గించండి లేదా టికెట్టు కొనాలని నియమం విధిస్తే, టికెట్టు లేకుండా ప్రయాణించటాన్ని నేరంగా పరిగణించండి. ఈ విధంగానే వివా హం, వ్యభిచారాల విషయంలో ఈ ద్వంద్వ వైఖరి అసమంజసమైనదే కాదు. అహేతుకమై నది కూడాను. సమాజం కోసం వివాహ నియమం అనివార్యమని ఏ కారణాలతో దృవీకరించబడిందో, వాటితోనే వ్యభిచారాన్ని  (అది ఏ రూపంలోనున్నా సరే) నేరంగా పరిగణించక తప్పదు.

సమాజంలో ఒక అపోహను వ్యాపింప జేశారు. అదేమిటంటే వివాహానికి ముందు ఒక యువకునికి లైంగికవాంఛల తృప్తికోసం కొద్దోగొప్పా అవకాశం ఉండాలి. ఎందుకంటే యవ్వనంలో లైంగిక ఉద్రేకాన్ని ఆపటం కష్టమైన పని, అలా ఆపితే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది – కాని ఈ దృక్పథం ఏ విషయాల మీదైతే ఆధారపడి ఉందో, అవన్నీ కల్పితమైనవి, కృత్రిమమైనవి, కామోద్రేకాల్ని లేపే తీవ్రమైన, అసామాన్యమైన (అబ్‌నార్మల్‌) ఈ పరిస్థితి సామాన్య(నార్మల్‌) ప్రజల్లో ఎందుకు జనిస్తుందో తెలుసా? సమాజంలోని చెడు సంస్కృతి ఈ ఆలోచనలకు, భావాలకు బలవంతంగా, ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన ఉద్రేకాలకు గురిచేస్తుంది. మన సమాజంలో ప్రబలిపోయిన సినిమాలు, సాహిత్యం, నగ్న చిత్రాలు, సంగీతం, మిశ్రమ సమాజాల్లో అత్యధికంగా అలంకరించుకున్న స్త్రీలు మగ వారికి తారసపడటం-వంటి కారణాలే సామాన్య ప్రజల్ని లైంగికపరంగా అసామాన్య మైన, తీవ్రమైన పరిస్థితికి గురిచేస్తాయి. అంతే కాని ప్రశాంతమైన వాతావరణంలో సామాన్య  స్త్రీపురుషుల్లో తమనుతాము ఆపుకోలేనంత లైంగిక ఉద్రేకాలు పొడసూపవు. కొద్దోగొప్పో ఇలాంటి ఉద్రేకాలు పొడసూపినా, మానసిక, నైతిక శిక్షణ ద్వారా వాటిని కట్టడి చేయ వచ్చు. యవ్వన థలో లైంగిక కోరికలు తీర్చుకోకపోతే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందనే భావన కేవలం మోస పూరిత మైనది, భ్రమింపజేసేది తప్ప ఇంకేమి కాదు. అందుకని నైతికత, ఆరోగ్యం రెండి టినీ కాపాడుకోవాలంటే సమాజంలోని ఈ చెడు సంస్కృతిని, ధనిక జీవితపు చెడు ప్రమాణాలను మార్చక తప్పదు. వీటివల్లనే నేడు వివాహం కష్టతరమై వ్యభిచారం సుల భమై పోయింది.

అజ్ఞాన సమాజంలోని స్పష్టంగా కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే ఏ రుగ్మతల ప్రభావాలైతే పరిమితంగా, స్వల్పకాలంగా, పైకి కనపడేవిగా ఉంటాయో వాటిని వెంటనే గుర్తించగలం. కాని ఏ రుగ్మతల ప్రభావాలు బహుముఖంగా, సుదీర్ఘకాలంగా, పైకి కన్పించనిగా ఉంటాయో వాటిని సకాలంలో గుర్తించి నిర్మూలించలేము. ఎందుకంటే వాటి ప్రభావాలు చాలాకాలం గడిచిన తర్వాత గాని బయల్పడవు. అందువల్ల వాటిని గురించి పట్టించుకోవటం జరగదు. పట్టించుకోక పోవటమే కాదు, వాటిని ఉపేక్షించటం, క్షమించటం, చివరికి అనుగ్రహించటం కూడా జరుగుతుంది. దొంగతనం, దోపిడి, హత్యలాంటి నేరాలను ప్రముఖంగాను, వ్యభిచారం లాంటి నేరాన్ని అల్పంగా చూడటానికి కారణం ఇదే. ఒక వ్యక్తి తన ఇంట్లో ప్లేగు వ్యాధి వ్యాపింపజేసే ఎలుకల్ని జమచేసి అంటురోగాల్ని వ్యాపింపజేస్తే మూర్ఖ సమాజం అతన్ని క్షమించరాని నేరస్థునిగా పరిగణిస్తుంది. ఎందుకంటే అతని చర్య స్పష్టంగా, ఎంతో హానికరమైనదిగా కన్పిస్తుంది. అయితే ఇదే ఒక వ్యభిచారి తన స్వార్థంకోసం, సమాజ జీవిత నాడీ కోసేసినా, దాని నష్టాలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, అవి పైకి కనపడనివిగా ఉంటాయి కనుక ఈ ఆజ్ఞానులకు ఆ వ్యభిచారి ఆన్నివిధాల      క్షమార్హునిగా కనబడతాడు. అంతేకాదు అతను ఒక నేరానికి పాల్పడ్డాడనే అనుమానం కూడా వారికి రాదు. అజ్ఞానం, మూఢత్వాలకు బదులు విజ్ఞతావివేచనాలు, ప్రకృతి నియమాలు మన సమాజ సంస్కృతికి పునాదులు కాగలిగితే ఇలా వ్యవహరించటానికి ఆస్కారమే ఉండదు.

Related Post