హారూన్ యహ్యా
రక్తం యొక్క ప్రధానమైన విధులు
మన శరీరానికి జీవాన్నిచ్చే ద్రవమే రక్తం. అది మన శరీరంలో ప్రసరణ జరుగుతున్నంత కాలం, అది శరీరాన్ని వేడిగా, చల్లగా, పోషణ నిస్తూ మరియు హానికరమైన వాటిని శుభ్రపర చడం ద్వారా మనకు రక్షణనిస్తుంది. మన శరీరాలలో సందేశాలను అందించే విషయం లో దాదాపుగా ఈ రక్తమే పూర్తి బాధ్యతను తీసుకుంటుంది. అంతేకాకుండా నరాల గోడ లలోని పగుళ్ళను వెంటనే రిపేర్ చేసి, వ్యవస్థ కు తిరిగి కొత్త జీవాన్నిస్తుంది.
సగటున 60 కేజీల బరువుండే మానవుని శరీరంలో దాదాపు 5 లీటర్ల రక్తముంటుంది. ఈ మొత్తం రక్తాన్ని మన శరీరంలో సులభం గా ప్రసరణ చేయడానికి మన గుండెకు 8 సెకన్లు చాలు. అయినప్పటికీ, పరుగెత్తేటప్పు డుగాని, ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడుగాని, ఈ రక్త ప్రసరణ వేగం ఓ 5 రెట్ల వరకూ పెరగ గలుగుతుంది. మన తల వెండ్రుకల కుదుళ్ళ నుండి, కాలి వ్రేళ్ళ వరకూ, వేర్వేరు సైజులలో నున్న దమనుల లోపల ప్రతీచోటుకి రక్తం ప్రవహిస్తుంది. రక్తం ప్రవహించడానికి ఏ అడ్డూ లేకుండా, వ్రవాహంలో ఏ ఘనపదా ర్థం తయారవ్వకుండా దోషరహితమైన నిర్మా ణంతో నరాలను సృష్టించడం జరిగింది.
ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”ఆయన ఒకదానిపై నొకటి ఏడు ఆకాశాల ను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టి లో ఎలాంటి క్రమరాహిత్యాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా? మళ్ళీ మళ్ళీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి. (దివ్యఖుర్‌ఆన్- 67:3)
ఎన్నో రకాల పోషక పదార్థాలు మరియు వేడి, ఈ సంక్లిష్ట వ్యవస్థ ద్వారా తీసికెళ్ళ బడతాయి.
ఆక్సిజన్ కారియర్
మన మనుగడకు చాలా ప్రధానమైనది మరియు మూలాధారమైనది – మనం పీల్చే గాలి. కొయ్య దుంగను మండించినట్లు, ‘సుగర్’ని మండించడానికి మన జీవకణాలకి ఆక్సిజన్ కావాలి. ఆ సుగర్‌ను మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకే మన ఊపిరితిత్తుల నుండి జీవకణాలకు ఆక్సిజన్ తీసుకెళ్ళబడుతుంది. పైప్‌లైన్లను కలిపే అల్లిక వలే ఉండే ఈ రక్త ప్రసరణ వ్యవస్థే ఆక్సిజన్ ను తీసుకెళుతుంది.
ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ పరమాణు వులు ఆక్సిజన్‌ను తీసుకు వెళతాయి. డిస్క్ ఆకారంలో ఉండే ఎర్రరక్తకణంలోని ప్రతీ రక్త కణం దాదాపు 300 మిలియన్ల(30 కోట్ల) హిమోగ్లోబిన్ పరమాణువులను తీసుకువెళు తుంది. ఈ రక్త కణాలు దోషరహితమైన నిధానాన్ని చూపుతాయి. అవి ఆక్సిజన్‌ను తీసుకు వెళ్ళడమే కాకుండా ఎక్కడ ఆక్సిజన్ అవసరమో అక్కడే ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. ఉదా: కండరాల కణంలోని ఎర్ర రక్త కణాలు టిష్యూలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. చక్కెరను కాల్చడం వలన ఉత్ప న్నమైన కార్బన్ డైయాక్సైడ్‌ను తీసుకుని తిరిగి వెనక్కు అంటే ఊపిరితిత్తులకు చేరుకుని అక్కడ వదిలేస్తాయి. మరలా అక్కడి నుండి ఆక్సిజన్‌ను తీసుకుని, టిష్యూలకు తీసుకెళ తాయి.
పీడన సమతుల్య ద్రవం
ఆక్సిజన్‌తో పాటు హిమోగ్లోబిన్ పరమాణు వులు నైట్రోజెన్ మోనాక్సైడ్‌ను మోసుకెళ తాయి. ఈ గ్యాస్ కనుక బ్లడ్‌లో లేకపోతే, రక్తం యొక్క ప్రెషర్ స్థిరంగా మారిపోతూ ఉంటుంది. టిష్యూలకు ఎంత మోతాదులో ఆక్సిజన్‌ను అందివ్వాలో, నైట్రోజెన్ మోనా క్సైడ్ ద్వారా హిమోగ్లోబిన్ క్రమబద్ధీకరిస్తుంది.
ఇక్కడ వింత ఏమిటంటే, ఇలా క్రమబద్ధీక రించేది ఏమిటో కాదు ఓ పరమాణువు. ఈ పర మాణువుకి బ్రెయిన్‌గాని, కళ్లుగాని ఉండవు. మన శరీరాలని క్రమబద్ధీకరించేవి ‘కొన్ని పరమాణువుల సముదాయం’. ఇది దోషరహితంగా మన శరీరాలని సృష్టించిన అల్లాహ్‌ా యొక్క అనంత జ్ఞానానికి సూచన.
కణాల (సెల్స్) యొక్క ఆదర్శ డిజైన్
రక్తకణాలలోని మెజారిటీ రక్తకణాలు ఎర్ర రక్త కణాలే. పురుషుని రక్తం 30 బిలియన్ ఎర్ర రక్త కణాలను కలిగి ఉంటుంది. వాటి ఉపరితలాలను కలిపితే ఫుట్‌బాల్ మైదానం లో దాదాపు సగం ఉంటుంది. ఈ కణాలే రక్తానికి ఆ రంగును ఇస్తాయి.
ఎర్ర రక్త కణాలు చూడటానికి డిస్క్‌ల్లాగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించే వాటి మెత్త దనం (ఫ్లెక్సిబిలిటి) వలన, వెంట్రుక వాసి నాళాల నుండి, సూక్ష్మమైన రంధ్రాల నుండి అవి పీల్చబడతాయి. అవి అంత ఫ్లెక్సిబుల్ కాకపోతే, అవి శరీరంలోని చాలా చోట్ల అడ్డుపడిపోయి ఉండేవి.
ఒక అంగుళం వెడల్పున్న దానిని 10 లక్షల భాగాలుగా చేస్తే, ఆ విధంగా భాగాలైన సూక్ష్మ భాగాలలోని 39 భాగాలను కలిపితే ఎంత సూక్ష్మమైన వెడల్పు ఉంటుందో, అంత సైజు ఉంటుంది ఒక్కొక్క ఎర్ర రక్తం. ఈ రక్త కణం తనకంటే చిన్నదైన అంటే తన సైజులో మూడింట రెండు వంతులుండే రక్త నాళం (క్యాపిల్లరీ) గుండా పోగలుగు తుంది.
అంత ఫెక్సిబుల్ (మెత్తదనం)తో ఎర్రరక్త కణాలను సృష్టించకపోయి ఉంటే ఏం జరి గుండేది? ‘డయాబెటిస్’ పరిశోధకులు ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్పారు. డయాబెటిక్ రోగులలో, ఎర్ర రక్తకణాలు తన మెత్తదనాన్ని కోల్పోతాయి. ఇలా మెత్త దనం కోల్పోయిన రక్తకణాలు రోగి యొక్క కన్నులలోని సున్నితమైన టిష్యూలలో ఆగి పోవడం వలన, గుడ్డితనానికి దారి తీస్తాయి
ఆటోమెటిక్‌గా పనిచేసే అత్యవసర వ్యవస్థ
ఎర్ర రక్తకణం యొక్క జీవితకాలం దాదాపు 120 రోజులు. ఆ తరువాత వాటి ని స్లీప్ (ప్లీహం) తొలగిస్తుంది. ఈ నష్టాన్ని సరి చేయడానికి, నిరంతరం కొత్త కణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సాధారణ పరిస్థితుల లో ఒక సెకనులో 2.5 మిలి యన్ల ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అవసరమైన ప్పుడు, ఈ సంఖ్య పెరుగు తుంది. కిడ్నీలలో తయారయ్యే ‘ఎరిథ్రో పోయ్‌టిన్’ అనే హోర్మోన్ ఈ ఉత్పత్తి వేగాన్ని క్రమబద్ధీకరి స్తుంది. ఉదాహరణకు, ప్రమాదాల వల్ల భారీ గా రక్తం కారడం లేదా ముక్కునుండి రక్తం కారడం జరిగినప్పుడు, ఆ నష్టం వెంటనే బేలన్స్ అవుతుంది.
అంతేకాకుండా, గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గితే, ఈ ఉత్పత్తి వేగం పెరుగుతుంది. ఉదా హరణకు, బాగా ఎతైన ప్రదేశాలపై ఎక్కుతున్న ప్పుడు, గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతూ ఉన్న ప్పుడు, శరీరం ఆటోమెటిక్‌గా రక్తకణాల ఉత్ప త్తిని పెంచి, అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుం టుంది.
పెర్‌ఫెక్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థ
రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ప్లాస్మా అం టారు. ఈ ప్లాస్మా రక్త కణాలనే కాకుండా శరీరంలో ఉండే ఇతర పదార్థాలను కూడా తీసుకెళుతుంది. ప్లాస్మా స్పష్టమైన పసుపు రంగు ద్రవం. ఈ ప్లాస్మా సాధారణ శరీర బరువులో 5 శాతం ఉంటుంది. ఈ ద్రవం లో 90 శాతం నీరే. దీనిలో లవణాలు, మినరల్స్, కార్బోహైడేట్స్, కొవ్వు మరియు వందల సంఖ్యలో భిన్న రకాల ప్రోటీనులు మునిగి త్రేలుతూ ఉంటాయి. రక్తంలోని ఈ ప్రోటీను లలోని లిపిడ్స్‌ను కలిపి ఉంచి, టిష్యూలకు తీసుకు వెళ్ళే ట్రాన్స్‌పోర్ట్ ప్రోటీనులు కొన్ని ఉంటాయి. ఈ ప్రోటీన్‌లు కనుక ఈ విధంగా లిపిడ్స్‌ను తీసుకెళ్లకపోతే, ఈ లిపిడ్స్ ఓ పద్ధతి లేకుండా త్రేలుతూ, తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ప్లాస్మాలోని హోర్మోనులు ప్రత్యేకమైన కొరియర్ల పాత్ర పోషిస్తాయి. ఇవే శరీరం లోని అవయవాలకు, కణాలకు మధ్య రసా యన సందేశాల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడాన్ని సులువుచేస్తాయి.
అల్బుమిన్ ప్లాస్మాలోని ప్రముఖ ప్రోటీన్, ఇది ఒక ట్రాన్స్‌పోర్టర్. ఇది కోలెస్ట్రాల్, హోర్మోనులు, బిలిరుబిన్ లేక పెన్సిలిన్ వంటి మెడిసిన్స్ వంటి లిపిడ్స్‌ని కలిపి ఉంచుతుంది. విషపదార్థాలను లివర్‌లో వదలిలేసి, మిగతా పోషక పదార్థాలని మరియు హోర్మోనులను వాటి అవసరం ఎక్కడైతే ఉందో ఆ చోటుకి తీసుకెళతాయి.
ఈ విషయాలన్నింటినీ గనుక మనం పరి గణలోకి తీసుకుంటే, మనకి స్పష్టమయ్యే దేమిటంటే మన శరీరం ఎంతో గొప్పగా (ఇన్ ఎక్స్‌టర్‌మెలయ డీటైల్డ్‌వే) సృష్టించ బడింది. ప్రతీ ఒక్క ప్రోటీన్ యొక్క సామ ర్థ్యం ఎలా ఉంటుందంటే లిపిడ్, హోర్మోన్ మరియు మెడిసిన్‌ల మధ్య ఉండే తేడాను అది గుర్తించ గలుగుతుంది. అంతే కాదు వీటి అవసరం ఎక్కడ ఉందో, ఎంత మోతాదులో వీటి అవసరం ఉందో అన్నీ తెలుసుకోగలుగుతుంది.
అల్లాహ్‌ా యొక్క దోషరహిత డిజైన్‌కు స్పష్టమైన సూచనలే ఇవన్నీ. ఆశ్చర్యాన్ని కలిగించే ఇటువంటి జీవరసాయన చర్యలు వేల సంఖ్యలో మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. ట్రిలియస్ సంఖ్యలో ఉండే మన శరీరంలోని పరమాణువులన్నీ అద్భు తమైన సామరస్యంతో పనిచేస్తాయి. వాస్తవే మిటంటే ఈ పరమాణు వ్యవస్థలన్నీ కూడా తల్లి గర్భంలో ఏర్పడిన ఒకే ఒక కణం నుండి విభజన జరిగి ఏర్పడినవే.
ఇది ఓగొప్ప విషయాన్ని స్పష్టం చేస్తుంది. మానవ శరీరం యొక్క అద్భుత వ్యవస్థ ఒకే బిందువు నుండి మానవున్ని సృష్టిం చిన అల్లాహ్‌ా యొక్క అద్భుత ఆర్టిస్ట్రీకి ప్రత్యక్ష సాక్ష్యం. ఖుర్‌ఆన్
”మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆపైన ముద్ద ను కండగా చేశాము. తరువాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తరు వాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిల బెట్టాము. కనుక అల్లాహ్‌ా ఎంతో శుభ ప్రదుడు, సృజనకారులందరిలో కెల్లా ఉత్తమ సృజనకారుడు” (ఖుర్‌ఆన్ 23:12-14)
ప్రత్యేకమైన కంట్రోల్ మెకానిజమ్
ఆర్టెరీస్ (ధమనుల) నుండి పోషక పదా ర్థాలు అవసరమైన టిష్యూలలోకి చొచ్చుకు పోవడానికి ఆర్టెరీ గోడలను దాటవలసి ఉంది. ఆర్టెరీ గోడలు చాలా సూక్ష్మ రం ధ్రాలు కలిగి ఉన్నప్పటికి, ఏ పదార్థమూ దానంతట అదే చొచ్చుకుపోలేదు. ఈ చొచ్చుకు పోవడాన్ని సులువు చేసేది బ్లడ్ ప్రెషర్. అయినప్పటికీ అవసరానికంటే ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు టిష్యూలకు వెళితే, ఆ టిష్యూలలో మంట కు ఇవి కారణమవుతాయి. అందువలన దానికొక ప్రత్యేకమైన మెకానిజమ్ ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా బ్లడ్‌ప్రెషర్‌ని బేలన్స్ చేస్తూ, ద్రవాన్ని వెనుకకు తిరిగి బ్లడ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఈ బాధ్యతను అల్పుమిన్ తీసుకుంటుంది. ఆర్టెరీ గోడలలోని రంధ్రాలకంటే ఈ అల్బు మిన్ పెద్దగా ఉంటుంది. ఇది రక్తంలో చాలా సంఖ్యలో సరిపోయినంత ఉం టుంది. స్పాంజ్ పీల్చినట్లు వాటర్‌ని పీలు స్తుంది. శరీరంలో అల్బుమిన్ లేకపోతే, ఎండిన చిక్కుడు గింజను నీటిలో వదలి ఉంచితే ఎలా ఉబ్బిపోతుందో అలా శరీరం ఉబ్బిపోతుంది.