మలమూత్ర విసర్జన నియమాలు

الوضوء
ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
బహిర్‌ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఖుర్‌ఆన్‌ సూక్తులుగాని, అల్లాహ్‌ా పేర్లు రాసి వున్న కాగితాలు గాని వెంట తీసుకెళ్ళకూడదు.   (అబూ దావూద్‌, ఇబ్నెమాజా)
దైవప్రవక్త(స) చేతికి ఒక ఉంగరం ఉండేది. దానిమీద ”ముహమ్మదుర్రసూలుల్లాహ్‌ా” అని నగిషీ చెక్కబడి ఉండేది. ఆయన బహిర్‌ భూమికి వెళ్ళినప్పుడల్లా ఆ ఉంగరం తీసి వెళ్ళేవారు . (ముస్లిం, అబూదావూద్‌)
 మరుగు దొడ్డికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎడమ కాలుపెట్టి లోనికి ప్రవేశిస్తూ ఈ ప్రార్థనా వచనాలను పఠించాలి.” అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌ ఖుబుసి వల్‌ ఖబాయిస్‌”
(దేవా! దుష్టులైన స్త్రీ పురుషుల (మానవులు, జిన్నాతుల) బారి నుండి నీ శరణు కోరుతున్నాను.) మరుగు దొడ్డిలో దైవప్రస్తావన తేకూడదు. ఎవరయినా సలాం చేస్తే దానికి ప్రతి సలాం కూడా చేయకూడదు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు.  (అహ్మద్‌, అబూ దావూద్‌)
 మలమూత్ర విసర్జన సమయంలో ఖిబ్లా వైపుకు తిరిగి లేక ఆ వైపుకు వీపు పెట్టి కూర్చోరాదు. (బుఖారీ- ముస్లిం)
మధ్యలో ఏదయినా వస్తువు అడ్డంగా ఉన్నప్పుడు అలా కూర్చుంటే అభ్యంతరం లేదు. ( బుఖారీ- ముస్లిం)
 ఎవరికీ కనబడని ప్రదేశానికి వెళ్ళి మలమూత్ర విసర్జన చెయ్యాలి.   ఆ సమయంలో ఇతరులెవరూ తమల్ని చూడకుండా జాగ్రత్త పడాలి.  (అబూ దావూద్‌- ఇబ్నెమాజా)
 మలమూత్ర విసర్జన తర్వాత ఆయా అవయవాలను నీటితో శుభ్రం (ఇస్తింజా) చేసుకోవాలి.
 ఇస్తింజా ఎడమ చేత్తో చేసుకోవాలి. కుడి చేత్తో ఇస్తింజా చేయరాదు.  (ముస్లిం)
మరుగు దొడ్డి నుండి వెడలిన తర్వాత చేయవలసిన ప్రార్ధన
మరుగు దొడ్డి నుండి వెడలినప్పుడు ముందుగా కుడి కాలు బయటపెట్టాలి. ఆ తరువాత ”గుఫ్‌రానక” (దేవా! నేను నీ మన్నింపుని వేడుకుంటున్నాను) అని అనాలి. (అహ్మద్‌, అబూదావూద్)
 మట్టి పెడ్డలతోగానీ, రాళ్ళతోగాని ఇస్తింజా చేయాలనుకున్నప్పుడు దాని కోసం కనీసం మూడు పెడ్డలనయినా ఉపయోగించాలి.    (బుఖారీ- ముస్లిం)
 పిడకలు, ఎముకలతో ఇస్తింజా చేయకూడదు. (ముస్లిం) మూత్ర విసర్జన కూర్చొని చేయాలి. (బుఖారీ)
 అనివార్య కారణాలుంటే నించుని కూడా మూత్రవిసర్జన చేయవచ్చు. (హదీసు వేత్తల ‘బృందం’ ఈ హదీసుని వెలికి తీసింది. అల్‌బానీ(ర) దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)
 అనివార్య కారణాలు అంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడానికి అనువుగా లేని పరిస్థితులు. ఉదా: చుట్టుప్రక్కలా చెత్తాచదారం ఉన్నప్పుడు, మరుగుదొడ్డి లేక టాయిలెట్‌ సీటు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు.
 మూత్ర విసర్జన చేసినప్పుడు దాని తుంపరులు శరీరం మీదగాని, దుస్తుల మీదగాని పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో నిర్లక్యం వహిస్తే సమాధి శిక్షకు గురయ్యే ప్రమాదముంది. (బుఖారీ)
 జనులు నడిచేదారుల్లో, నీడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయరాదు. (అబూదావూద్‌)
 కన్నాల్లో, బిలముల్లో మూత్ర విసర్జన చేయకూడదు.  (అహ్మద్‌, అబూదావూద్‌)
 ఇస్తింజా చేసుకున్న తర్వాత చేతిని నేల మీద రుద్దాలి. ( లేదా సబ్బుతో కడుక్కోవాలి). దాని వల్ల చేతి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. దైవప్రవక్త(స) ఇస్తింజా చేసిన తరువాత చేయి నేలమీద రుద్దేవారు. (అబూదావూద్‌, నసాయి)

 

Related Post