మవాఖీత్‌

Originally posted 2013-04-04 22:50:03.

04cd2dc9b8bec7

ఇహ్రామ్‌ అంటే ధర్మసమ్మతమైన ఏదైనా వస్తువుని నిషేధించుకోవటం, మరి దాని నుండి దూరంగా ఉండటం. షరీఅత్‌ ప్రకారం హజ్‌-ఉమ్రా సంకల్పాన్ని ఇహ్రామ్‌ (దీక్ష) అంటారు. అంటే ఎవరైతే ఉమ్రా-హజ్‌ సంకల్పం చేస్తారో వారిపై అంతకు ముందు ధర్మ సమ్మతమైన ఉన్న కొన్ని పనులు నిషేధించబడతాయి.

: మీఖాత్‌ అంటే ఓ నిర్ణీత సమయం మరియు స్థలం. ఇవి రెండు విధాలు  1) మీఖాతె జమానీ  2) మీఖాతె మకానీ.
1) మీఖాతె జమానీ: ”హజ్‌ మాసాలు అందరికీ తెలిసినవే”. (బఖరా :197)
 అంటే హజ్‌ కోసం ప్రత్యేకించబడిన ఈ నెలలకి ముందు హజ్‌ సంకల్పం, హజ్‌కి సంబంధించిన తవాఫ్‌, సయీ చేస్తే అది ఆమోదించబడదు. హజ్‌ స్వీకరించబడా లంటే హజ్‌ నెలల్లోనే చెయ్యాలి. అవి-1) షవ్వాల్‌ 2) జుల్‌ ఖఅద 3) జుల్‌ హిజ్జ మొదటి 10రోజులు   (బుఖారీ).
2) మీఖాతె మకానీ: ”(తరిగే పెరిగే చంద్రుని రూపాలు) తేదీల లెక్కకు హజ్‌ కాల నిర్ణయానికి గుర్తులు”. (బఖరా: 189) అంటే ఏ ప్రదేశాల్లో ఇహ్రాం (దీక్ష) బూనటం తప్పనిసరో ఆ స్థలాలు. హజ్‌-ఉమ్రాలకు వెళ్ళేవారు ఈ ప్రదేశాలకు చేరిన పిదప ఇహ్రాం బూనాలి. ఇహ్రాం ధరించకుండా ఈ హద్దులను దాటకూడదు.
1) మదీనా వాసులకు ”జుల్‌ హులైఫా”
2) సిరియా వాసులకు ”జహ్ఫా”
3) నజ్ద్‌ వాసులకు ”ఖర్నుల్‌ మనాజిల్‌”
4) యమన్‌ వాసులకు ”యలమ్‌లమ్‌”
5) ఇరాక్‌ వాసులకు ”జాతు ఇరఖ్‌” (ముస్లిం హథీసు గ్రంథం) మీఖాత్‌లుగా  నిర్ణయించబడ్డాయి.

మీఖా మకానీ మూడు విధాలు

1) ఆఫాఖి: మీఖాత్‌ వెలుపల నివసించేవారు. వీరు పైన వివరించబడిన మీఖాత్‌ల  నుండి ఇహ్రామ్‌ బూనాలి.
2) అహ్‌లుల్‌ హిల్‌: అంటే పైన చెప్పబడిన 5 మీఖాతుల (పరిధి) లోపల వుండే వారు కాని హరమ్‌ బైట ఉండేవారు. వీరు తమ ఇళ్ల నుంచే ఇహ్రామ్‌ బూనవచ్చు.
3) అహ్‌లుల్‌ హరమ్‌: హరమ్‌ (పవిత్రస్థలం) లోపల నివసించేవారు. వీరు కూడా    తమ ఇళ్ళ నుండి ఇహ్రామ్‌ బూనవచ్చు.
ఇహ్రామ్‌: ఇహ్రామ్‌ అంటే ధర్మసమ్మతమైన ఏదైనా వస్తువుని నిషేధించుకోవటం, మరి దాని నుండి దూరంగా ఉండటం. షరీఅత్‌ ప్రకారం హజ్‌-ఉమ్రా సంకల్పాన్ని ఇహ్రామ్‌ (దీక్ష) అంటారు. అంటే ఎవరైతే ఉమ్రా-హజ్‌ సంకల్పం చేస్తారో వారిపై అంతకు ముందు ధర్మ సమ్మతమైన ఉన్న కొన్ని పనులు నిషేధించబడతాయి. ”నిశ్చ యంగా కర్మలన్నీ సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయి.” (ముత్తఫఖున్‌ అలైహి)

Related Post