Originally posted 2013-04-06 07:37:28.
”రబ్బనా జలమ్‌నా అన్‌ఫుసనా, వ ఇల్లమ్ తగ్‌ఫిర్ లనా, వ తర్‌హమ్‌నా లనకూనన్న మినల్ ఖాసిరీన్”. (7:23)
మా ప్రభూ! మేము మాకు అన్యాయం చేసుకున్నాము. నీవు గనక మమ్మల్ని మన్నిం చకపోతే, మాపై కనికరించకపోతే మేము నిశ్చయంగా సర్వనాశనం అయిపోతాము.
”రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వ హబ్‌లనా మిల్లదున్‌క రహ్‌ామతన్ ఇన్నక అన్‌తల్ వహ్హాబ్”. (3:8)
మా ప్రభూ! నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు. ఇక మా మనస్సులను వక్ర మార్గం వైపునకు మళ్ళించకు. నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసా దించు. నిజమైన దాతవు నీవే.
”రబ్బనా ఆతినా ఫిద్దున్‌యా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వ ఖినా అజాబ న్నార్”. (2:201)
మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు. మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.
”రబ్బనా అఫ్‌రిగ్ అలైనా సబ్‌రవ్-వ సబ్బిత్ అఖ్‌దామనా వన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్”. (2:250)
మా ప్రభూ! మాకు ధైర్యస్థయిర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను చేకూర్చు అవిశ్వాస వర్గంపై మాకు విజయం అనుగ్రహించు.
”రబ్బనా ఆమన్నా బిమా అన్‌జల్‌త వత్తబఅనర్-రసూల ఫక్‌తుబ్‌నా మఅష్-షాహి దీన్”. (3:53)
మా ప్రభూ! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము. సందేశహరుడ్ని అనుసరించటానికి మేము అంగీకరించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో రాయి.
”రబ్బీ అద్‌ఖిల్‌నీ ముద్‌ఖల సిద్‌ఖిన్-వ అఖ్‌రిజ్‌నీ ముఖ్‌రజ సిద్‌ఖిన్-వజ్‌అల్లీ మిల్ల దున్‌క సుల్‌తానన్-నసీరా”. (17:80)
నా ప్రభూ! నీవు నన్ను ఎక్కడకు తీసుకెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు, ఎక్కడ నుండి తీసినా సత్యంతో తియ్యి. నీ తరపు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు.
”రబ్బనా హబ్ లనా మిన్ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్‌అల్‌నా లిల్‌ముత్తఖీన ఇమామా”. (25:74)
మా ప్రభూ! మాకు మా భార్యల ద్వారాను, మా సంతానం ద్వారాను కన్నుల చల్ల దనాన్ని ప్రసాదించు. మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమామ్‌గా చేయి.
”ఫాతిరస్సమావాతి వల్ అర్‌జ అన్‌త వలియ్యీ ఫిద్దున్‌యా వల్ ఆఖిరతి తవప్ఫనీ ముస్లిమన్ వ అల్‌హిఖ్‌నీ బిస్సాలిహీన్”. (12:101)
భూమ్యాకాశాల నిర్మాతా! నీవే ఇహపరలోకాలలో నాకు సంరక్షకుడవు. నేను ఇస్లాం ధర్మంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి. చివరకు నన్ను సజ్జనులతో కలుపు.
”అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఇల్మన్ నాఫిఅన్, వ రిజ్‌ఖన్ తయ్యిబన్, వ అమలన్ ముతఖబ్బలన్”. (ఇబ్ను మాజా)
ఓ అల్లాహ్! ప్రయోజనకరమైన జ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని, ఆమోదయోగ్యమై న ఆచరణను ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను.
”అల్లాహుమ్మక్‌ఫినీ బిహలాలిక అన్ హరామిక, వ అగ్‌నినీ బి ఫజ్‌లిక అమ్మన్ సివాక”. (తిర్మిజీ)
ఓ అల్లాహ్! నాకు హలాల్ (ధర్మసమ్మతమైన) సంపాదనను ప్రసాదించు, హరాం (నిషిద్ధమైన సంపాదన)నుండి రక్షించు. నాపై దయతలచి నీవు తప్ప అందరి వద్ద నన్ను నిరుపేక్షాపడిగా చేయి.
”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌హమ్మి, వల్‌హుజ్‌ని, వల్‌అజ్‌జి, వల్‌కస్లి, వల్ బుఖ్‌లి, వల్‌జుబ్‌ని, వ జల్‌ఇద్-దైని, వ గలబతిర్రిజాలి”. (బుఖారి)
ఓ అల్లాహ్! నేను దిగులు దుఃఖాల నుండి, బలహీనత, సోమరితనాల నుండి, పిసినారితనాల నుండి, అప్పుల బారి నుండి, ప్రజలు నాపై పెత్తనం చలాయించడం నుండి నీ శరణు కోరుకుంటున్నాను.
”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు, వలహుల్ హమ్‌దు, యుహ్‌యీ వ యుమీతు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్”. (తిర్మిజీ)
అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవము లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. ఆధిపత్యము ఆయనకే, బ్రతికించేవాడు, చంపేవాడు ఆయనే. ఆయనే ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.