Originally posted 2013-04-24 14:40:08.
2.4 పాత్రలు
వెండి, బంగారు పాత్రలు వినియోగం అన్ని వేళల నిషిద్ధమే. వుజూ కోసంగానీ నీరు త్రాగడానికి గానీ వెండి, బంగారు పాత్రలను వాడకూడదు. అవి తప్ప వేరే పాత్రలు లేనప్పుడు వాటిని వినియోగించవచ్చు
హుజైఫా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా చెబుతుండగా నేను విన్నాను: ” పట్టు, దళసరి పట్టు వస్త్రాలు తొడగకండి. వెండి బంగారు పాత్రలలో త్రాగకండి. వాటితో చేయబడిన పళ్ళెంలో భోంచేయకండి. అవి అవిశ్వాసుల కోసం ప్రపంచంలో, అయితే మన కోసం పరలోకంలో అన్నారు”. (బుఖారి 5110)
వెండి, బంగారు పాత్రలల్లో తినడం, త్రాగడం స్త్రీ పురుషులిరువురికి నిషిద్ధం. అలాగే వాటిని కేవలం అలంకర నిమిత్తం వాడటం కూడా నిషిద్ధమే.
2.4.1 వెండి లేదా బంగారం మిశ్రమంతో తయారు చేయబడిన గిన్నెల వాడకం:
బంగారు మిశ్రమంతో తయారు చేయబడిన పాత్రలు, మిశ్రమం తక్కువ స్థాయిలో జరిగినా, ఎక్కువ స్థాయిలో జరిగినా నిషిద్ధమే. ఇక వెండి మిశ్రమంతో చేసిన పాత్రలను వాడే విషయంలో భిన్న ఆదేశాలున్నాయి:
– మిశ్రమ స్థాయి ఎక్కువగా ఉండి ఉద్దేశ్యం అలంకరణ అయితే అది హరామ్.
– మిశ్రమ స్థాయి తక్కువగా ఉండి ఉద్దేశ్యం అలంకరణ అయితే అది మక్రూహ్.
– మిశ్రమ స్థాయి తక్కువగా ఉండి అలంకరణ ఉద్దేశం లేకపోతే జాయిజ్.
– మిశ్రమ స్థాయి ఎక్కువగా ఉండి అలంకరణ ఉద్దేశం లేకపోతే అది మక్రూహ్ అవుతుంది.
ఆసిమ్ అహ్వల్ కథనం – దైవప్రవక్త(స) వారి పాత్రను నేను అనస్ బిన్ మాలిక్ గారి వద్ద చూశాను. దానికి వెండిలో అంచుకట్టబడింది. అనస్(ర) గారు ఇలా అన్నారు: ”నేను అనేకసార్లు ఈ గిన్నె,పాత్రలోనే ప్రవక్త(స) వారిని నీరు తాపించాను.” (బుఖారి 5315)
2.4.2 విలువైన ధాతువుతో తయారు చేయబడిన పాత్రలను వాడటం:
విలువైన ధాతువుతో తయారు చేయబడిన పాత్రలను వాడే అనుమతి ఉంది. ఉదాహరణకు: ముత్యాలు, పగడాలు,
మణిమాణిక్యాలు, వజ్రాలు మొదలయినవి. వీటిని వాడకూడదన్న ఎటువంటి ఆజ్ఞ లేని కారణంగా వీటికి అనుమతి ఉంది.
2.4.3 అవిశ్వాసుల పాత్రలను వాడటం:
ఈ విధమయినటువంటి పాత్రలను వాడుకునే అనుమతి ఉంది. ఆధారం:
అబూ సఅలబా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు:”మీరు వాటిని కడిగి వాటిలో భోంచేయవచ్చు”. (బుఖారి 5161)
విషయం ఏమిటంటే అవిశ్వాసులు వాడిన కారణంగా అవి అపశుద్ధమయ్యే అవకాశాలుంటాయి. ఉదాహరణకు సారాయి
సేవనం పంది మాంస భోజనం. పాత్రల ఆదేశమే వారి దుస్తులకు సయితం వర్తిస్తుంది.
పరీక్ష 3
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
1.తక్కువ శాతం వెండి మిశ్రమంతో చేయబడిన పాత్రలను అవసరార్థం వాడటం………………….
(ఎ) హరామ్
(బి) ముబాహ్
2. ఎక్కువ శాతం వెండి మిశ్రమంతో చేయబడిన పాత్రలను అవసరార్థం వాడటం………………………..
(ఎ) మక్రూహ్
(బి) ముబాహ్
3. తక్కువ శాతం వెండి మిశ్రమంతో చేయబడిన పాత్రలను అలంకరణ నిమిత్తం వాడటం…………………..
(ఎ) ముబాహ్
(బి) హరామ్
4.విలువైన ధాతులతో తయారు చేయబడిన పాత్రలు వాడుకునే అనుమతి ఉంది.
(ఎ) అవును
(బి) కాదు
5. అవిశ్వాసుల పాత్రలను వాడుకునే అనుమతి ఉంది.
(ఎ) అవును
(బి) కాదు.