Originally posted 2013-05-15 17:06:13.
వర్షా కాలం, శీతాకాలాలలో మిణుగురు పురుగులు కన్పిస్తుంటాయి కదా! అవి రాత్రి పూట మిణుకు మిణుకుమంటూ పచ్చని కాంతిని వెదజల్లుతూ కదిలే తారకల్లా సందడి చేస్తుంటాయి. వాటిని చూస్తే చిన్న పిల్లలకు చెప్పలేనంత సరదాగా ఉంటుంది. వాటిని చేతిలో తీసుకొని ఆడు కోవడం బహుశా ఎవ్వరూ మరచిపోలేని గొప్ప అనుభూతి. నింగిలోని తారకలే చేతిలోకి వచ్చేశా యన్నంత సంతోషం. ఈ మిణుగురు పురుగులు పిల్లలకు ఎంత ఆనందాన్నిచ్చాయో, శాస్త్రజ్ఞుల కు అంతే ఆశ్చర్యానికి లోను చేశాయి. ఎంతో ఆసక్తి పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులు – మామూలు కాంతిలో వెలుగుతోపాటు వేడి కూడా ఉంటుంది. కానీ మిణుగురు పురుగు కాంతి వేడి లేకు ండా వెలుగును మాత్రమే ఇస్తుంది. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవ రసాయనిక చర్య. అలా అవి ఎందుకు చేస్తాయి? అంటే, పక్షులు, ఇతర జీవుల నుండి తమను తాము రక్షించుకునేందుకు, జత కట్టేందుకు, తమ జాతి జీవులకు సంకేతాలు పంపేందుకు ఇవి కాంతిని విరజుమ్ముతుంటాయి. ఉదాహరణకు: ఒక చోట ఉన్న పురుగు ఒకలా మెరిస్తే వేరే చోట ఉన్న పురుగు మరొలా మెరుస్తూ మొదటి పురుగు కు సమాధానం ఇస్తుంది.
మిణుగురు పురుగు పొట్ట క్రింది భాగంలోని కణాలలో ట్రాన్స్‌ఫెరిన్ అనే ఓ వర్ణద్రవ్యం ఉంటుంది. వెలుగు రావడం అనేది ఆక్సిడేషన్ చర్య వలననే జరుగుతుంది. టాన్స్‌ఫెరిన్ ఆక్సిజన్‌తో కలిసి ట్రాన్స్‌ఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరుగుతుంది. ఫలితంగా ఆక్సీ ట్రాన్స్ ఫెరిన్ మరియు శక్తి వెలువడుతుంది. ఈ విధంగా వెలువడిన శక్తి వెలుగుగా మారు తుంది. అనంతరం ఆక్సీట్రాన్స్‌ఫెరిన్ తిరిగి ట్రాన్స్‌ఫెరిన్‌గా మారుతుంది. దీని వలన తిరిగి చర్య జరిగే వీలు ఏర్పడుతుంది. ఇదే పద్ధతిలో మనం కృత్రిమంగా వెలుగును సృష్టించాలని అనుకొంటే అందు కోసం ఖర్చు చాలా అవుతుంది. ఆ విధంగా మిణుగురు పురుగులో జరిగే ఈ చర్య విలక్షణ చర్య అనే చెప్పాలి. సృష్టి రాసుల్లో సృజనశీలుడయిన అల్లాహ్ అద్భుత శక్తి సూచనే అనాలి.
మిణుగురు పురుగు – నిజానికి మిణుగురు పురుగు నుంచి వఛ్చె కాంతి చాలా తక్కువ. ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుఇగుతో పోలిస్తే అందులో కేవలం 40వ వంతు కాంతి మాత్రమే మిణుగురు పురుగు ఇవ్వగలుగుతుంది. మనిషి కన్ను ఈ కాంతిని గ్రహించగలదు. కాబట్టే మిణుగురు పురుగు వెలుగులో మనం చకచకా ఓ పుస్తకాన్ని చదివేయచ్చు. ఆ విధంగా చైనాలో ఉండే పేద విద్యార్థులు మిణుగురు పురుగుల కాంతిలోనే పుస్తకాలు చదువుకునే వారట. ఏది ఏమైనా మనిషి ప్రగతి రీత్యా మహాద్భుతాలు చేసి చూపిస్తున్నా అతను సృష్టించుకున్న ప్రయోగశాలలో మిణుగురు పురుగులోని సహజ కాంతిని కృత్రిమంగానయినా చెయలేకపోతు న్నాడు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు:
”ఇదీ అల్లాహ్ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపిం చండి? (ఏమీ సృష్టించ లేదు) నిజానికి దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు”. (లుఖ్మాన్: 11)
పై ఆయతులో ‘ఇదీ’ అన్న పదం అల్లాహ్ రకరకాల సృష్టితాలను సూచిస్తోమది. ఎలాంటి స్థం భాలు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టడం, భూమి మానవులతోపాటు ఒరిగి పోగుండా ఉండటానికి భూమిలో పర్వతాలను నాటడం, సర్వ రకాల ప్రాణులను భూమిలో నివసింప జేయడం, ఆకాశా న్నుండి వర్షాన్ని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి పంటలను (మొలకలు) ఉత్పన్నం చేయడం అయన ఒక్కడికే చెల్లు. కాబట్టి మనషి సృష్టికర్తను వదలి పూజించే చిల్లర దేముళ్లు, సహాయం కోసం అర్థించే మిథ్యాదైవాలు భూమ్యాకాశాల ఈ వ్యవస్థలో చేసింది ఏమీ లేదు. ఒకే ఒక్క వస్తునయినా చూపెట్టలేరు వాటిని దైవంగా కొలిచేవారు. సకల చరచరాలను సృష్టించిన వాడు, పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు ఒక్క అల్లాహ్ మాత్రమే అయినప్పుడు మనిషి సకల ఉపసనారీతులకు అర్హుడు కూడా ఆయనే అవ్వాలి కదా! నిజంగా అల్లాహ్ తప్ప ఈ లోకంలో పూజలను, ఉపాసనలను అందుకోగల దైవం ఏదీ, ఎక్కడా లేదు. ఉండబోదు కూడా.