‘నేను నా రమజాను’

''ఎవరయితే ఫజ్ర్‌ నమాజు జమాఅత్‌తో చేసి, ఆ తార్వత అల్లాహ్‌ను స్మరించుకుంటూ సూర్యోదయం అయ్యేంత వరకు అక్కడే కూర్చుని,

”ఒక ఉపవాసి ఉపవాస విరమణ ఏర్పాటు చేసిన వ్యక్తి ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది. అలా అని ఉపవాసి పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (తిర్మిజీ)

అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
విశ్వాస సోదరులారా! అదుగో రమజాను మాసం నిలువెత్తు అనుగ్రహమయి మన చెంతకు చేరనుంది. మన విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేయడానికి, మనల్ని అల్లాహ్‌ ప్రీతమ దాసులుగా తీర్చిదిద్దడానికి, అల్లాహ్‌ యెడల మన ననమ్మకాన్ని బల పర్చడానికి, అల్లాహ్‌ యెడల మనకున్న ప్రేమను అన్ని విధాలా వ్యక్త పరచుకునే అన్ని మార్గాలను మనకు ప్రసాదించడానికి మన చెంతకు చేరింది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి పనికొచ్చే ‘దిన బోధ’ ఉత్తమ హితబోధతో ఈ యేడాది మీ కోసం మేము అందిస్తున్న కార్యక్రమం ‘నేను నా రమజాను’. కరుణామయుడయిన అల్లాహ్‌ మా ఈ ప్రయత్న మాధ్యమంగా రమజాను మాసాన్ని సద్వినియోగ పర్చుకుని, ఆయన సజ్జన దాసుల జాబితాల్లో మనందరిని చేర్చాలని మనసారా వేడుకుంటున్నాము.

విశ్వాస సోదరులారా! రవ్వంత సత్కార్యానికి కొండంతటి పుణ్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? కాసింత శ్రమతో కరుణా కడలి స్వయంగా మీ వద్దకు కదిలొచ్చేలా చేసుకోవాలనుకుంటున్నారా? మీ విశ్వాసాన్ని వికాసమొందించి పరిపూర్ణం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వనండి! ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఈ అమృత పలుకు: ”ఎవరయితే అల్లాహ్‌ా కోసం ప్రేమిస్తాడో, అల్లాహ్‌ా కోసం ద్వేషిస్తాడో, అల్లాహ్‌ా కోసం మాత్రంఏ ఇసాఆ్తడో, అల్లాహ్‌ కోసం మాత్రమే ఇవ్వకుండా ఉంటాడో – అతడు తన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు”. ( ముస్తద్రక్ అల్స్సహీహైన్ ) ”నా దాసుడు నా వైపు (శ్రద్ధాసక్తులతో) నా వైపు ఓ అడుగంత కదిలొస్తే నేనతని వైపునకు ఒ జానెడంత కదిలొస్తాను. అతను నా వైపు ఓ జానెడంత కదిలొస్తే, నేన తని వైపునకు ఓ మూరేడు కదిలొస్తాను. అతను నా వైపు నడిచొస్తే నేనతని వైపునకు పరుగెత్తుకొస్తాను”. ( బుఖారి) ఇమామ్‌ మాలిక్‌ (ర): ”మా కాన లిల్లాహి బఖా” అల్లాహ్‌ కోసం మాత్రమే చేయబడే కార్యం మిగిలుంటుంది – అన్నట్టు మనం చేసేవి సత్కర్మలే అయినా అల్లాహ్‌ా కోసం చేసినవి మాత్రమే మిగిలుంటాయి. శుభాల సరోవరం రమజాను మాసపు ఆరాధనల్లో సంకల్పశుద్ధి ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. అల్లాహ్‌ మనందరికి సంకల్పశుద్ధిని, చిత్తశుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్‌.
2) విశ్వాస సోదరులారా! ఒకే రోజు రెండు ఉపవాసాల పుణ్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఒక రోజంతా ఇద్దరు దైవ దూతల దీవెనలు కురుస్తూనే ఉండాలనుకుంటుఆన్నరా? అయితే వినండి! ”ఒక ఉపవాసి ఉపవాస విరమణ ఏర్పాటు చేసిన వ్యక్తి ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది. అలా అని ఉపవాసి పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (తిర్మిజీ) విశ్వాస సోదరులారా! రమజాను మాసం ఉపవాసాల మాసమే కాదు, ఇప్తార్‌ ఏర్పాట్లు ముమ్మరంగా జరిగే మాసం కూడా. ఈ మాసాన్ని వదిలి అన్య మాసాల్లో ఉపవాసమ విరమణ ఏర&ఆపట్లు చేయాలనుకున్నా కుదరదు. కాబట్టి అంది వచ్చిన ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. త్వర పడండి. స్పెషల్‌ ప్యాకేజ్‌తో రమజాను మీ చెంతకు వచ్చేసింది.
3) విశ్వాస సోదరులారా! మీరు చేసిన దుఆ స్వీకరించబడాలని, ధర్మసమ్మతమయినది మీరు కోరింది మీకు దక్కాలని, మీ అక్కరలు తీరాలను కోరుకూమటున్నారా? అయితే వినండి! మూడు దుఆలు ఆమోద ముద్ర పొందనవి. 1) ఉపవాసి చేసే దుఆ. 2) బాధితుడి చేసే దుఆ. 3) బాటసారి చేసే దుఆ. (హదీస్ హసన్) రమాజను మాసం దుఆల మాసం కూడా. ”నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను” అని అల్లాహ్‌ా పిలుపునిస్తున్నాడు. ”విధిరాతను సయితం మార్చగలిగే సత్తా దుఆకు ఉంది” అని ప్రవక్త (స) సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి అత్యధిక దుఆలతో మన జీవిత దిశను, థను మార్చుకునే సువర్ణ ఘడియ రమజాను. అడగకపోతే అలిగే అల్లాహ్‌ సన్నిధిలో దీనాతిదీనంగా వేడుకోండి.

4) విశ్వాస సోదరులారా! మీరు మీ వీధిలో ఉంటూనే, మీ ఊరిలో ఉంటూనే, మీవారితో ఉంటూనే రోజుకో హజ్జ్‌ మరియు ఉమ్రా పుణ్యాల్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఆ ఏర్పాటు కూడా అల్‌హమ్దులిల్లాహ్‌ా ఉంది. మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే ఫజ్ర్‌ నమాజు జమాఅత్‌తో చేసి, ఆ తార్వత అల్లాహ్‌ను స్మరించుకుంటూ సూర్యోదయం అయ్యేంత వరకు అక్కడే కూర్చుని, ఆనక రెమడు రకాతుల నమాజు చదువుతాడో అతనికి హజ్జ్‌ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారీ) అంతే కాదు ఉమ్రా మరియు హజ్జ్‌లపై మనకున్న అమిత ప్రేమను చూసి స్వయంగా మనం ఉమ్రా మరియు హజ్జ్‌ చేసే ఆర్థిక, ఆరోగ్య స్థితికయినా అల్లాహ్‌ా చేర్చవచ్చు లేదా అటువంటి ఏర్పాటు ఇతరుల ద్వారానయినా చేయవచ్చు. మరి ఉమ్రా మరియు హజ్జ్‌ చేసేవారేమో అల్లాహ్‌ా అతిథులాయే! ఆ భాగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలంటే రమజాను మించిన మంచి సమయం మరొకటి లేదు.

5) విశ్వాస సోదరులారా! అనేక వ్యసనాలు, చెడు అలవాట్లు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? వాటి బారి నుండి బయట పడటం మీకు సమస్యగా మారిందా? వాటన్నింటి నుండి మీరు ముక్తి పొంది స్వచ్ఛమయిన వ్యక్తులుగా మారాలనుకుంటున్నారా? అయితే ప్రవక్త (స) వారి ఈ అమృత పలుకు విని తీరాల్సిందే. ”ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌ కోసం ఓ వస్తువును వదిలేస్తాడో అల్లాహ్‌ దానికన్నా అత్యుత్తమ వస్తువును అతనికి అనుగ్రహిస్తాడు. (ముస్నద్ అహ్మద్) రమజాను శుభ మాసంలో అల్లాహ్‌ా ప్రీతిని కోరుతూ, ఆయనకు భయపడుతూ మనం ధర్మసమ్మతమయిన ఆహారపానీయాలను, భార్య సంభోగాన్ని దాదాపు 14 గంటలు వదలి ఉంటున్నాము. వీటితోపాటే మనకున్న – బీడి, సిగరెట్‌, పాన్‌పరాగ్‌, ఖైనీ, సారాయి, జూదం, అబద్ధం, మోసం వంటి వ్యసనాలను, అవలకణాలను వదిలి జీవిస్తున్నాము అల్‌హమ్దులిల్లాహ్‌ా. ఇలా ఒక రోజు కాదు ఒక మాసం మొత్తం ఇదే నిష్ఠను కనబరుస్తున్నాము. మనం ఈ ఒక్క మాసంలో కనబర్చే ఈ నిష్ఠ, ఈ సహనం, నిగ్రహం సంవత్సరపు ఇతర మాసాల్లో సయితం పాటించగలిగితే ఇన్‌ షా అల్లాహ్‌ా మనం సమస్త వ్యసనాల నుండి ముక్తి పొందగలము. అల్లాహ్‌ా నిర్దేశించిన నియమాలను లోబడి జీవించి నింగీ నేలలో నిత్యకీర్తిశేషుల జాబితాలో చేరి మోకం పొందగలము. కాబట్టి గట్టి సంకల్పం చేసుకోండి. ఇన్‌ షా అల్లాహ్‌ అల్లాహ్‌ తోడ్పాటు మీకుంటుంది.

Related Post