New Muslims APP

ఈ శిక్షణ అవ్వాలి రక్షణ!

సంభాషణ ఒక కళ. ఈ తరం యువకుల్లో సంభాషణా చాతుర్యం, చమత్కారం, చలోక్తులు తగ్గు ముఖం పడుతున్నాయి. వీటికి బదులు వెకిలి నవ్వులు, వ్యర్థ సంభాషణలు సర్వసాధారణ అవుతున్నాయి. వారి దృష్టిలో సమయ స్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం, చలోక్తులు అంటే గురువులు, సమాజ పెద్దల మీద సెటైర్లు వేయడం. వాస్తవం దీనికి భిన్నం

సంభాషణ ఒక కళ. ఈ తరం యువకుల్లో సంభాషణా చాతుర్యం, చమత్కారం, చలోక్తులు తగ్గు ముఖం పడుతున్నాయి. వీటికి బదులు వెకిలి నవ్వులు, వ్యర్థ సంభాషణలు సర్వసాధారణ అవుతున్నాయి. వారి దృష్టిలో సమయ స్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం, చలోక్తులు అంటే గురువులు, సమాజ పెద్దల మీద సెటైర్లు వేయడం. వాస్తవం దీనికి భిన్నం

ఉపవాసం అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోనూ పరిఢవిల్లుతూ వస్తున్న అనాది సంప్రదాయం. చివరికి కొన్ని జంతువులు సయితం కొన్ని వేళల్లో ఉపవాసం ఉండటం, కొన్ని మొక్కల నుండి అల్లాహ్‌ా స్మరణ వినబడటాన్ని శాస్త్ర నిపుణులు కనుగొనడం కొసమెరుపు. మానవ సమాజాల విషయానికొస్తే మాత్రం-కొందరి వద్ద కొన్ని గం టల పాటు ఏమీ తినకుండా, త్రాగకుండా ఉండటం ఉపవాసమయితే, మరికొందరికి ‘ఒక పుట మాత్రమే ఏమి పుచ్చుకోకుండా ఉండటం ఉపవాసమయితే, ఇంకొందరికి పాలు, పళ్లు తిని ఉండటం ఉపవాస మయితే, తక్కిన వారికి మంచి నీళ్లు మాత్రమే త్రాగి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆగి ఉండటం ఉపవాసం. ఇన్ని ఉపవాసాల మధ్య ఇస్లాం ధర్మం సూచించే ఉపవాసం పూర్తి భిన్నమయినదనే చెప్పాలి. ఎందుకంటే ఇస్లామీయ ఉపవాసానికి ఉన్నన్ని నియతి, నియమాలు మరే ఉపవాసానికి లేవు. ఉపవాస విషయమయి ఇస్లాం చేసే ప్రధమ హితవు ఏమిటంటే, ‘అసత్యం పలకడం, అబద్దాల పుట్టగా బతకడం వదలనంత వరకూ ఎవరు (ఎన్ని రోజులు, ఎన్ని నెలలు) ఆహారపానీ యాలను విడనాడినా అట్టి ఉపవాస అవసరం అల్లాహ్‌ాకు లేదు’ అన్నది. అలాగే నెలపాటు విశ్వ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కలిసి ఉపవాసం ఉండటం ఒక్క ముస్లిం సమాజంలో తప్ప మరెక్కడా కాన రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సమగ్ర వికాశానికి సంపూర్ణ స్వరూపం ఉపవాసం.ఈ కారణంగానే ఇస్లాం కేవలం రమజాను ఫర్జ్‌ ఉపవాసాలతోనే సరి పెట్టదు. ఆ తర్వాత షవ్వాల్‌ ఆరు ఉపవాసాలు, జుల్‌హిజ్జా ఉపవాసాలు, ముహర్రమ్‌ ఉపవాసాలు, ప్రతి నెల అయ్యామె బీజ్‌) మూడు ఉపవాసాలు, ప్రతి వారం రెండు (సోమ వారం, గురు వారం) ఉపవాసాలు ఐచ్చికంగా ఉపదేశిస్తుంది. అలాగే మరింత ఆసక్తి గలవారి కోసం ఒక రోజు వదలి ఒక రోజు ఉపవాసం ఉండే వెసులు బాటును సయితం అది అనుగ్రహిస్తుంది.

నిర్ధుష్ట లక్ష్యానికి నిరుపమాన సూత్రం ఉపవాసం: ఆశావాద ధృక్పథం ఉపవాస ప్రత్యేకం. రెండు కప్పలు ఓ లోతైన గుంతలో పడిపోయాయి. ఖర్మే దీనికి కారకం అనుకుని ఓ కప్ప అలానే పడి ఉండి పోయింది. మరో కప్ప మాత్రం బయటకు రావడానికి అనేక విధాలుగా ………. ప్రయత్నించి గట్టుకు చేరుకుంది. అప్పటి వరకు ‘బయటికి రావడం అసా ధ్యం’ అని బెకబెకలు పెట్టిన కప్పలు ఆ కప్ప అవలీలగా గట్టుకు చేర డం చూసి నివ్వరబోతూ – ‘మేము అంతలా అసాధ్యం అని అరుస్తుం టే నీకు విన్పంచ లేదా?’ అని ప్రశ్నిచాయట. అందుకు ‘మీరు అరుస్తు డటం కన్పించిందే కాని విన్పించలేదు. మీరంతా నన్ను బయటకు లాగ డానికి ప్రయత్నిస్తున్నాని భావించాను గనకే గట్టుకు చేరుకో గలిగాను’ అని వినయంగా సమాధానమిచ్చిందా కప్ప. అవును చుట్టూ ప్రతి కూల పరిస్థితులు ఎన్నున్నా ఆశావాద దృక్పథంతో ముందుకు సాగిపోతే విజయం తథ్యం.

పస్తులు ఎందుకుండటం, నువ్వు సాయంత్రం వరకూ ఈ మండు టెండల్లో ఉపవాసముండలేవు. ముప్పూటలా పుష్టిగా భోంచేయి, ఇలా ఆకలితో అలమటించడం వల్ల ప్రయోజనం ఏమి? అని ఎవరు ఎన్ని విధాల ఎద్దేవ చేసినా, ఉపవాసి మాత్రం రమజాను నెలసాంతం ఉప వాసం ఉండటం మానుకోడు. కారణం ”ఆదం పుత్రుని సంబంధించిన ప్రతి కర్మ అతని స్వయానికే, ఒక్క ఉపవాసం తప్ప. ఉపవాసం నాది, నేనే దానికి బదులిస్తాను” అన్న అల్లాహ్‌ా మాట అతను నమ్ముకున్న విశ్వాస మూట గనక. ఉపవాస ప్రతిఫలం ఇహంలో లభించినా లభిం చకపోయినా పరంలో తప్పక లభిస్తుందన్న ఆశాభావం కలిగి ఉంటాడు ఉపవాసి. అంటే మన వద్ధ ఓ నిర్ధుష్ట లక్ష్యం ఉంటే దాన్ని సాధించడా నికి, ఆత్మ పరిశీలనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము. తద్వారా ఒకరి తప్పులను ఎంచడానికి మన దగ్గర సమయం ఉండదు. ఒకరి నిరాశ వాదానికి మనసు వశమవ్వదు.

మితభాషిగా మార్చే మేలిమి సాధనం ఉపవాసం: సంభాషణ ఒక కళ. ఈ తరం యువకుల్లో సంభాషణా చాతుర్యం, చమత్కారం, చలోక్తులు తగ్గు ముఖం పడుతున్నాయి. వీటికి బదులు వెకిలి నవ్వులు, వ్యర్థ సంభాషణలు సర్వసాధారణ అవుతున్నాయి. వారి దృష్టిలో సమయ స్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం, చలోక్తులు అంటే గురువులు, సమాజ పెద్దల మీద సెటైర్లు వేయడం. వాస్తవం దీనికి భిన్నం-సమయస్ఫూర్తి, జీవితానుభవం, ఆత్మావలోకనం ద్వారా చక్కటి సంభాషణా నైపుణ్యం అలవడుతుంది.ఇవన్నీ పుష్కలంగా అందించే అపురూప సాధనం ఉపవాసం. ”ప్రజలతో మంచి మాటలే మాట్లాడండి” అన్న అల్లాహ్‌ా ఆదేశం, ”నీ నడకలో మధ్యేమార్గాన్ని అవ లంబించు, నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నిం టిలోకీ అత్యంత కఠోరమయినది గాడిదల స్వరం” అని పుణ్య పురుషు లుఖ్మాన్‌ తన పుత్రునికి పలికిన హితవు, ”అల్లాహ్‌ాను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటలే పలకాలి, అన్యదా మౌనం వహించాలి” అని ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు చేసిన మహోపదేశం నిత్యం దైవభీతి వాతావరణంలో ఉండే ఉపవాసికి గుర్తుంటుంది గనక తన సంభాషణను క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువ యిన స్వరంతో, వర్ణోత్పత్తి స్థానాలయిన హృదయ, కంఠాలను ఆశ్ర యించి మధ్యమ స్వరంతో ప్రతి అక్షరం అందంగా, హృద్యంగా పలు కుతాడు. అలా పలికిన ఆ సంభాషణ శ్రోతను ఆత్మీయతతో ఆకట్టు కుంటుంది. నేడు సర్వసాధారణంగా కన్పించే, విన్పించే స్పష్టత, లక్ష్యం కొరవడి మానవ సంబంధాలు దెబ్బ తినడం అనేది ఉండదు. అర్థం, లక్ష్యం, స్పష్టత లేని సంభాషణలు (చిట్‌చాట్‌,గాసిప్‌) ఆ సమయంలో ఆనందింపజేసేవిగా ఉన్నా తర్వాత మానసిక క్లేశాన్ని, న్యూనతా భావాన్ని కల్గిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అర్థవంతమయిన సంభాషణ ద్వారా.. ఆ సంభాషణలో వాడే పదాల ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగే పరిస్థితి ఉందంటే సంభాషణ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

సాహిత్య ఆస్వాదనకు సఫల సాధనం ఉపవాసం: వందలు, వేలకొలది పుట్టుకొస్తున్న కోర్సుల వరదలో నిర్మాణాత్మక సాహిత్యాన్ని పూర్తిగా విస్మరించడం నేటి యువతరానికి, నవ తరానికి ఒక విధంగా శాపమే అని చెప్పాలి. నేడు చదువుకునే స్థితి పోయి, చదువులు కొనే పరిస్థితి దాపురించింది గనక విద్యార్థి ఏది చదివినా ముందు దానికి సంబం ధించిన ప్రాపంచిక ప్రయోజనాల్ని చూడటం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం అంతరించిపోతోంది. ప్రాపంచిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసే మనం సాహిత్య ప్రయోజ నాలను విస్మరిస్తే..ఆధునికత పెరగవచ్చేమోగానీ, నాగరికత పెరగదు. అయితే ఈ సమస్య ఉపవాసికి ఏర్పడదు. ఎందుకంటే గ్రంథాల్లోకెల్లా గ్రంథరాజం అయిన ఖుర్‌ఆన్‌ను అతను చదవనయినా చదువుతాడు, లేదా దాని పారాయణాన్ని, అనువాదాన్ని అయినా వింటాడు. అతని ఈ నిర్మాణాత్మక సాహిత్య పఠనం ద్వారా శారీరక మానసిక వికారాలు అణిగి మనస్సు నిర్మలమవుతుంది. కఠిన హృదయాలను మృదువు హృదయాలుగా మార్చడం ఖుర్‌ఆన్‌ ఏకైక మహిమ. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఏ విధంగానయితే ఇను ముకు పట్టిన తప్పును నిప్పు వదులగొడుతుందో, అదే విధంగా హృదయ తుప్పును ఖుర్‌ఆన్‌ దూరం చేస్తుంది”.

అంతర్ముఖ అభివృద్ధికి అసలు మెట్టు ఉపవాసం: సాదారణంగా వ్యక్తులు కాల, భావ ప్రవాహాల్లో కొట్టుకుపోతుంటారు. అయితే ఉప వాసి అలా కాదు. ‘తను కడుపార భోంచేసి తన పొరుగు వాడు ఆకలి తో ఉంటే అతను సంపూర్ణ విశ్వాసి కాజాలడు’ అన్న ప్రవచనం, ‘నీ కోసం దేన్నయితే ఇష్టపడతావో నీ సోదరుని కోసం సయితం దాన్నే ఇష్ట పడు’ అన్న ప్రవక్త (స) వారి అమృత వాక్కు అతనికి బాగా గుర్తు గనక, అతనికి ఎన్ని సమస్యలు ఎదురయినా, ఎన్ని కష్టాలు ఎదుర యినా తాను ఇష్టంగానే పస్తులుండి తోటి సోదరుడి ఆకలి తీర్చి అతన్ని ఆనంద పరచి తాను ఆత్మానందాన్ని పొందుతాడు. ‘ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాకుండా ఆకలిని సగమే తీరుస్తుంది’ అన్నట్టు మనసుతో మానవ సంబంధాలను నెరపని ప్రస్తుత మన సమాజ స్థితి అంతర్ముఖ అభివృద్ధి లేని కారణంగా ఏర్పడిందని చెప్పక తప్పదు. ‘సృష్టిలో నీకు ఆసక్తి కలిగించే అంశాలలు ఏవి?’ అని ఓ పండితుణ్ణి అడిగితే, ‘అన్నీ’ అని సమాధానమిచ్చాడు. అవును మనం అనుకుంటే అందరూ మనవారే. కానివారంటూ ఎవరూ ఉండరు. చూడగలిగే కనులుండాలి, వినగలిగే వీనులుండాలి, చూసినా, విన్నా అర్థం చేసుకునే మనసుండాలే గానీ ఇక్కడ ప్రతి ప్రాణీ ఓ అద్భుతమే, ప్రతి వస్తువు ఒక మాహ గ్రంథమే.

పొదుపుకు పునాది ఉపవాసం: మనషిలో గల రెండు బలహీనత వల్ల అతను సమస్త సౌఖ్యాలకు, శుభాలకు దూరమయ్యాడు. అసహనం, అత్యాశ. నువ్వు ఈ చెట్టును సమీపించడం వల్ల ఇక్కడే శాశ్వతంగా ఉండగలవు అన్న షైతాన్‌ ప్రలోభం అతనిలో కల్గించిన అత్యాశ వల్ల స్వర్గ్గానికి దూరమయ్యాడు. నేడు అల్లాహ్‌ా ఆదేశాల్ని పాటించే విష యంలో, ఆయన నిషేధించిన విషయాల జోలికి వెళ్లకుండా ఉండే విష యంలో అతను నిగ్రహాన్ని, సహనాన్ని పాటించక అసహనం, అసం తృప్తి వల్ల దూరమయి ఆ స్వర్గానికి దగ్గర కాలేక పోతున్నాడు. దీని కారణం మనిషికి తన బలాలపై ఉన్నంత దృష్టి తనలోని బలహీనతలపై లేకపోవడమే. బలాల్ని పెంచుకోవడానికి, బలహీనతల్ని తగ్గించుకోవడా నికి అమల సాధనం ఉపవాసం. ఆకలి దాహాలు మనిషి బలహీనతలు. కాని ఉపవాసంతో వాటిని జయిస్తాడు ఉపవాసి. కాంక్షలు, మనసైన కోరికలు మనిషి బలహీనతలు. కాని 15 గంటల పాటు కట్టుకున్న ఇల్లాలినే ముట్టుకోకుండా ఉండే ఉపవాసి కోరికలకు కళ్ళె వేస్తాడు. వాటికి తాను వశమవ్వకుండా వాటిని తన అదుపులో పెట్టుకుంటాడు. కడుపు నిండితే అల్లాహ్‌ాకు కృతజతాస్తుతులు చెల్లించుకుంటాడు. ఆకలి బాధ వేధిస్తే అల్లాహ్‌ా కోసం సహనం వహిస్తాడు.

స్వీయ బ్రాండుకు చిరునామ ఉపవాసం: ఉరుకులు, పరుగులతో కూడిన యాంత్రిక జీవనాన్ని సాగిస్తూ, ఉపశమనం కోసం టీవీ లాంటి ఉపకరణాల్ని ఆశ్రయిస్తూ, కంప్లీట్‌ మ్యాన్‌ అన్పించుకోవాలంటే ఫలానా కోటు వేసుకోవాలంటూ హడావుడి చేసే ప్రకటనల దండయాత్రలకీ, పొందాలనుకునే విశ్రాంతికి బదులు అశాంతి, ఉపశమనానికి బదులు అసహనం, అసంతృప్తి లోనవుతున్నాం.ఆ ప్రకటనల యుద్ధంలో అక్కడ క్కడ గుచ్చుకున్న బ్రాండ్ల గాయాల్ని మాన్పుకోవడానికి షాపింగ్‌ మాళ్లకు పరుగెడుతున్నాం. ఈ బ్రాండ్ల గందరగోళంలో మన అసలు బ్రాండు ఏమిటో మనమే గుర్తు పట్టలేని కృత్రిమ సింగారాలకి గురవు తున్నాం. ఇంట్లో వస్తువుల బ్రాండ్లన్నీ మార్చినా మళ్ళీ కొత్త బ్రాండ్లు, కొత్త ప్రకటనలు…మళ్లీ పాత అసహనం, అశాంతి, అసంతృప్తి. ఇటు వంటి కృత్రిమ ఆకర్షణలన్నింటికీ అతీతం ఉపవాసం. అది ఉపవాసిని నిరంతరం కష్టజీవిగా తీర్చిదిద్ది అతనికంటూ ఓ వెన్నుముక వ్యక్తిత్వా న్ని, ఓ బలమైన బ్రాండును ఇస్తుంది. చూడండి! ఉదయం మూడింటికి మేల్కొంటాడు. ఫజ్ర్‌ అజాన్‌ సమయానికి ముందే సహరీ భుజిస్తాడు. తర్వాత ఫజ్ర్‌ నమాజు చేసుకుంటాడు. ఫజ్ర్‌ నమాజు ముగియగానే ఖుర్‌ఆన్‌ పారాయణంలో మునిగిపోతాడు. అంతలోనే ఇష్రాక్‌ వేళ అవుతుంది.నమాజు చేసుకుని అవసరాలు తీర్చుకుని పనికి బయలు దేరతాడు. పనిలో నిముగ్నుడయి ఉండగానే జుహ్ర్‌ా మరియు అస్ర్‌ నమాజులు వేళ అవుతుంది. అవి ముగియగానే మగ్రిబ్‌ నమాజు. మగ్రిబ్‌ నమాజు అనంతరం ఏదో కాస్త తింటాడో లేదో ఇషా నమాజు అజాన్‌ అవుతుంది. ఇషా నమాజు అవగానే మళ్ళీ తరావీహ్‌ా నమాజులో పాల్గొంటాడు. ఇలా అతన్ని కార్యనిమగన్తలో లీనపర్చి క్షణం తీరిక లేకుండా అతన్ని ఓ బిజీ పర్సెన్‌గా మారుస్తుంది నమాజు. అలా అతన్ని దేనికి ప్రాధ్యాన్నత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వ కూడదో నేర్పుతుంది ఉపవాసం.

సుఖ సంసారానికి సంజీవని ఉపవాసం: ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడటమే కాక, వాక్బుద్ధి, వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపవాసం ఉపయుక్తమవుతుంది. ”ఉపవాసం ఉన్న స్థితిలో ఎవరయినా తనతో గొడవకు దిగితే ‘నిశ్చ యంగా నేను ఉపవాసంతో ఉన్నాను’ అని సౌమ్యంగా చెప్పాలి” అని ప్రవక్త (స) వారు సెలవిచ్చారు గనక ఆయన ఈ మాటను దృష్టిలో ఉంచుకున్న ఉపవాసం ఉండే భర్తగానీ, భార్యగాని కాపురంలో సగం కలహాలకు కారణభూతమయ్యే కోపాన్ని సులువుగా అధిగమించగలరు. కాపురం అది ఎవరిదయినా అంది సుఖంగా, సాఫీగా సాగిపోవాలంటే దాని కోసం సామ, దాన, భేద, ధండోపాయాల్ని అవలంబించాల్సిన పని లేదు. ఉపవాసం ఇచ్చే ఉత్తమ శిక్షణను క్రీయా జీవితంలో అమలు పరిస్తే చాలు.

పరలోక సాఫల్యానికి సోపానం: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే అల్లాహ్‌ా కోసం ఒక్క రోజు ఉపవాసం ఉంటాడో అల్లాహ్‌ా అతన్నుండి నరకాగ్నిని 70 యేండ్లంతటి దూరం చేస్తాడు”. (బుకారీ)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.