అల్లాహ్‌ స్మరణ విశిష్ఠత

''విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణతో తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ స్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి''. (అర్రాద్‌: 28)

”విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణతో తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ స్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి”. (అర్రాద్‌: 28)

నిశ్చయంగా అల్లాహ్‌ను స్మరించడం, ఆయన్ను వేడుకోవడం మహుత్పూర్వకం. అల్లాహ్‌ స్మరణలో పీల్చే ప్రతి శ్వాస, గడిచే ప్రతి ఘడియ, ప్రతి రోజు మంగళప్రదమయినదే. దాసుడు తన ప్రభువు సాన్నధ్యాన్ని పొందే అమల సాధనం అల్లాహ్‌ స్మరణ. అది దాసుని ఇహపరాల సకల మేళ్ళకు సంబంధించిన తాళంచెవి. అల్లాహ్‌ా ఈ కీని దాసునికి ప్రసాదించాడంటే దానర్థం-శుభాల తలుపులు అతని కోసం తెరిచాడన్న మాట. ఒకరిని ఈ వరప్రసాదానికి దూరం చేెశా డంటే, అతనికై మేలు తాలూకు తలుపులన్నీ మూసి వేయబడ్డాయన్న మాట. ఫలితంగా అతను కలత చెందిన మనస్సుతో, కంగారు నిండిన గుండెతో, స్థిమితం లేని ఆలోచనలతో,ఫలితం లేని చింతలతో, సత్తువ లేని సంకల్పాలతో సతమతమవ్వడం ఖాయం. దీనికి భిన్నంగా ధ్యానాన్ని ఆశ్రయించి, సదా అల్లాహ్‌ాను స్మరిస్తూ ఉండే వ్యక్తి మనస్సు నెమ్మదిస్తుంది. అతని హృదయం ప్రశాంతతో నిండుతుంది. అతని ఆత్మ శాంతితో పరవశిస్తుంది. ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది:

”విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణతో తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ స్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి”. (అర్రాద్‌: 28)

ధ్యానం తాలూకు శుభాలు అనేకం; ఇహంలోనూ, పరంలోనూ. అల్లామా అబ్దుర్రహ్మాన్‌ నాసిరుస్సఅదీ (ర) అల్లాహ్‌ ధ్యానం గురించి ఇలా అభిప్రాయ పడ్డారు: ‘మహోన్నత అర్ష్‌కి ప్రభువయిన అల్లాహ్‌ా బహిరంగ, రహస్య స్మరణ-లేనిపోని చింతలతో నీవు సతమతమవు తున్న ఘడియలో నీ నుండి దురదృష్టాన్ని, దుఖాన్ని దూరం చేస్తుంది. ఇహపరాల మేళ్లన్నీ నీ ముంగిట వచ్చి వాలేలా చేస్తుంది.
ప్రవక్త (స) తన సహచరునికి ఓ రోజు హితోపదేశం చేశారు – ”అత్యధికంగా అల్లాహ్‌ాను స్మరించే వారు, ముందువారు- ముందే ఉంటారు” అని.
హజ్రత్‌ మఆజ్‌ (ర) గారికి వసీయతు చేస్తూ- ”అల్లాహ్‌ాను ధ్యానించే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే, ఆయన్ను అత్యుత్తమ రీతిలో ఆరా ధించే విషయంలో ఆయన సహయాన్ని అర్ధించు” అన్నారు.
హితోపదేశాన్ని కోరుతూ వచ్చిన ఓ వ్యక్తిని ఉద్దేశించి-”నీ నాలుక అల్లాహ్‌ స్మరణతో సదా నానుతూనే ఉండాలి. అది నీలో స్థిత ప్రజ్ఞ తను పెంచి, నిన్ను భాగ్య బాటన నడిపిస్తుంది” అన్నారు.
”అల్లాహ్‌ా స్మరణ – స్మరించే వారి పాలిట శాశ్వత స్వర్గ వనాలలో మహా వృక్ష సృజనకు కారణం” అన్నారు.
”అల్లాహ్‌ాను స్మరించే దాసుడ్ని స్వయంగా అల్లాహ్‌ా తన వద్దనున్న దైవదూతల సమక్షంలో ప్రస్తావిస్తాడు” అన్నారు.
”దాసులు స్వర్గంలో ప్రవేశించిన మీదట కూడా అల్లాహ్‌ స్మరణ అనుక్షణం చేస్తూనే ఉంటారు” అన్నారు.
‘ధ్యానం దైవ ప్రేమకు మార్గం’ అన్న ఒక్క ప్రశంస చాలు అది ఎంత గొప్పదో చెప్పడానికి. ధ్యానం మనిషిని చాడీల నుండి, పరోక్ష నింద నుండి, ధర్మానికి కీడు కలిగించే ప్రతి చేష్ట నుండి కాపాడు తుంది.
అల్లాహ్‌ను స్మరించుకునే అదృష్టం లభించిన మనం నిజంగా మహా గొప్ప అదృష్టవంతులం. కానీ మన అశ్రద్ధో, అవివేకమో, అజ్ఞానమో ఏమో కానీ, ఎలాగయితే ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను మాత్రమే వేెడుకోవడం తగ్గించేశామో, అలాగే అల్లాహ్‌ాను స్మరిం చడం, ఆయన స్మరణలోనే తరించడం దాదాపు మరచిపోయాం.
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలోని ప్రతి వ్యక్తిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ప్రతి ఉదయం ఒక సత్కార్యం చేయడం అనివార్యమయి ఉంటుంది. పోతే, ప్రతి తస్బీహ్‌ా-సుబ్హానల్లాహ్‌ా సత్కార్యమే. ప్రతి తహ్మీద్‌-అల్‌హమ్దులిల్లాహ్‌ సత్కార్యమే. ప్రతి తహ్లీల్‌ – లా ఇలాహ ఇల్లల్లాహ్‌ సత్కార్యమే. ప్రతి తక్బీర్‌-అల్లాహు అక్బర్‌ అనడం సత్కార్యమే. మంచిని ఉపదేశించడం కూడా సత్కా ర్యమే. చెడుని వారించడం కూడా సత్కార్యమే. అయితే ఉషోదయం తర్వాత మనిషి చేసే రెండు రకాతుల (ఇష్రాక్‌) నమాజు వీటన్నిం టికి ప్రత్యామ్నాయం కాగలదు”. (ముస్లిం)
”నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించు” అన్న అల్లాహ్‌ మాట ప్రకారం మన నమాజు కూడా అల్లాహ్‌ా స్మరణే. అల్లాహ్‌ ఇలా సెల విస్తున్నాడు: ”ఓ విశ్వసిమచిన వారలారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి”. (అహ్జాబ్‌: 41)

Related Post