క్యా…న్స…ర్‌

క్యా...న్స...ర్‌

ఈ మూడక్షరాల్ని తలచుకుంటే మృత్యువు కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పేరు పలుకుతున్నా…గుండెల్లో దడ, పెదాల్లో తడబాటు, స్వరంలో మార్పు. కారణం….అపోహలు, అనుమానాలు, అవగాహనా రాహిత్యం. క్యాన్సర్‌ను ఎది రించి నిలవడం సాధ్యమే. పోరాడి గెలవడం సాధ్యమే. అది మన దరిదాపు ల్లోకి కూడా రాకుండా చుట్టూ దుర్బేధ్యమైన కోట కట్టుకోవడమూ సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాం రండి! – ఈనాడు దిన పత్రికకు కృతజ్ఞతలతో….

క్యాన్సర్‌ ఎందుకు వస్తుంది?

మనిషి శరీరంలో కణ విభజన ఓ క్రమ పద్ధతిలో నియంత్రితమవుతూ ఉంటుంది. అవసరమైన చోట, అవసరమైన మేరకే విభ జన జరుగుతుంది. కొన్నిసార్లు ఆ విభజన దారి తప్పుతుంది. లెక్కలేనన్ని కొత్త కణాలు పుట్టుకొచ్చి, ఓ పెద్ద సమూహం ఏర్పడు తుంది. అదే పెద్ద ‘కణితి’లా తయారవు తుంది. చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా మింగేస్తూ విస్తరిస్తుంది. అదే క్యాన్సర్‌. ఆ లక్షణాల్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. శరీరంలో ఏ భాగం లో అయినా ఈ దాడి జరగవచ్చు. రెండు కారణాల వల్ల ఇలాంటి మార్పు సంభవించ వచ్చు.
1) జన్యుపరమైన లోపాలు, శరీర వ్యవస్థలో వైఫల్యాలు..మొదలైన అంతర్గత పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు. దాదాపు 25 శాతం క్యాన్సర్లు ఇలాంటి కారణాల వల్ల వస్తాయి. వీటి మీద మనకు నియంత్రణ ఉం డదు.
2) బాహ్య పరిస్థితుల ప్రభావం. దాదాపు 75 శాతం క్యాన్సర్‌ రోగాలకు మనం, మన అల వాట్లు, మన చుట్టూ ఉన్న వాతావరణమే కార ణం. తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఆ ప్రభా వాన్ని తప్పించుకోవడం అసాధ్యమేమి కాదు.

అవగాహనాలేమి

భారత్‌లో ఏటా పది లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. నోరు, గొంతుం ఊపిరి తిత్తులు, ప్రొస్టేట్‌, మెదడు, జీర్ణాశయం, గర్భాశయ ముఖద్వారం, థైరాడ్‌, గాల్‌ బ్లాడర్‌ …ఒకటేమిటి శరీరంలోని ఏ భాగం మీద అయినా క్యాన్సర్‌ దాడి చేసే అవకాశం ఉంది.
అసలే ఆరోగ్య స్పృహ అంతంత మాత్రంగా ఉన్న దేశం మనది. దీంతో క్యాన్సర్‌ విస్తరణ కు అడ్డూ అదుపూ ఉండటం లేదు. 70 శాతం రోగులు జబ్బు పూర్తిగా ముదిరిపోయిన థలోనే వైద్యుల్ని ఆశ్రయిస్తున్నారు. క్యాన్సర్‌ అంటే అవగాహన లేకపోవడం, రేడియోషన్‌ లాంటి చికిత్సా విధానాలంటే భయం, సమస్యే మిటో చెప్పుకోలేని బిడియం, భరించలేనంత ఖరీదై పోయిన వైద్యం…ఇలా భారత దేశంలో క్యాన్సర్‌ విజృంభణకు ఎన్నో కారణాలు. పరిస్థి తులు ఇలానే కొనసాగితే, అవగాహనా రాహి త్యం అదే స్థాయిలో రాజ్యమేలితే… ఇంకో పదేళ్ళలో క్యాన్సర్‌ నరహంతక వ్యాధుల జాబి తాలో పైభాగాన ఉంటుంది. యుద్ధంలో గెలవ డం గొప్పే, యుద్ధం లేకుండా గెలవడం ఇంకా గొప్ప. ఇది ఎలా సాధ్యం? అంటే, నిపుణుల సహకారంతో, ఆధునిక వైద్య విధా నాల సాయంతో ఆ ప్రభావం నుంచి బయట పడగలం.

మీ రాక శుభప్రదం మీ పొగ హాని కరం

‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అది లాంగ్‌ కాన్సర్‌కి దారి తీయవచ్చు’ అన్న స్లోగన్‌ మనకు ప్రతి సిగరెట్‌ ప్యాక్‌ మీద దర్శనమిస్తుంది. దీన్ని బట్టే తెలుస్త్తుంది – ఆయా కంపెనీలకు ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో. ‘సిగరెట్‌ ఒక వైపు నిప్పు ఉంటుంది. మరో వైపు మూర్ఖుడు ఉంటాడు’ అన్న మాట అక్షరాలా నిజం. కోరి కోరి ప్రాణాంతకమైన క్యాన్సర్‌ బారిన పడే వారిని మూర్ఖులు కాదు, పరమ మూర్ఖులు అనాలి. ఏదో ఒక రోజు బంగారు వన్నె డబ్బా శవ పేటికలా మారిపోతుంది. పొగలు గక్కే సిగరెట్టు కాటికి దారి తీస్తుంది. ఊపిరి తిత్తులు, నోటి క్యాన్సరే కాదు – గర్భ సంచి, మూత్ర కోసం, కిడ్నీ – పొగాకు దుష్ప్రభావం మొత్తం శరీరమంతా విస్తరిస్తుంది. ఏటా దేశంలో పది లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతుంటే, అందులో మూడు లక్షల మంది పొగాకు పీడితులే. సిగరెట్టు, బీడి, గుట్కా లాంటివి క్యాన్సర్‌ను నిరోధించే జన్యువుల్ని నిర్వీర్యం చేస్తాయి. ప్రాణాంతక వ్యాధికి ఎర్ర తివాచీ పరుస్తాయి.

కుటుంబాన్ని ప్రేమించేవారు పొగాకును ద్వేషిస్తారు

మనిషికి మినహా ఇతర ఏ జీవికి తెలియని వ్యసనమిది. పేరుకు ‘ఒక’ సిగరెట్టే అయినా … అందులో నాలుగు వేల పదార్థాలుం టాయి. దేనికదే ప్రమాదకరం. క్యాన్సర్‌ మోనాక్సైడ్‌ (కారు పొగ గొట్టంలోంచి వెలు వడే కాలుష్య సంబంధమైంది), అమ్మోనియా (టాయిలెట్‌ క్లీనర్‌లో వాడతారు), ఆర్సెనిక్‌ (ఎలుకల మందులో కలుపుతారు).. మచ్చుకు కొన్ని. అలాగే మద్యం ప్రభావమూ తక్కువేం కాదు. దాదాపు మూడు శాతం కాన్సర్‌ రోగా లకు అదే కారణం. మద్యం త్రాగుతూ గుప్పు గుప్పుమని పొగలు వదిలే సవ్యసాచుల్ని అయితే, మృత్యువు రెండు వైపుల నుంచీ తరుముకొస్తుంది.

దృఢ సంకల్పంతో పొగాకు వ్యసనాన్ని దూరం చేసుకోవచ్చు. మనల్ని ప్రేమించే వారినీ, మన మీదే ఆధారపడినవారినీ ఒక్క సారి తలచుకుంటే…సిగరెట్‌ వెలిగించాలన్న ఆలోచనే రాదు. నూటికి 80 శాతం కేసుల్లో ధూమపానం వారసత్వంగా మారే ప్రమాదం ఉంది. ‘పరోక్ష ధూమపానం’ కారణంగా ఇంటిల్లిపాది ఇబ్బంది పడతారు. తర్వాతి వైద్యంకన్నా ముందస్తు పత్యం మిన్న

మసాలా వేపుళ్ళు ఎక్కువగా తీసుకునే వారిలో నోటి క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ఆహార పదా ర్థాల్ని వేయించినప్పుడు అందులోని క్యాన్సర్‌ కారకాలు చైతన్య వంతం అవుతాయి. ముఖ్యం గొడ్డు, పంది మాంసాల్లో క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచే గుణాలున్నాయని వరల్డ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. వేయించిన మాంసం కంటే ఉడికించి నదే తక్కువ ప్రమాదకారి. అలాగే పిజ్జాలు, బర్గర్లు, చిప్స్‌ వంటి వాటికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. ఇలాంటి చిరుతిళ్ళలో రుచిని పెంచడానికి వాడే, కొన్ని రకాల రసాయ నాలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. తీపి పదార్థాలు కూడా బాగా తగ్గించాలి. నిన్న మొన్నటి దాకా విదేశాల్లో బాగా విస్తరించిన పెద్ద పేగు క్యాన్సర్‌ ఇప్పుడు మన దగ్గర ఎక్కువుతోంది అంటే కారణం, మనం పాశ్చాత్య రుచులకు మరగటమేనంటున్నారు.

సురక్షిత శృంగారం, అరక్షిత శృంగారం – రెండూ ప్రమాదకరమే!

ఆధునిక జీవితంలో లైంగిక విశృంఖలత హద్దులు మీరుతోంది. అది అరక్షిత శృంగారం కావచ్చు, సురక్షిత శృంగారం అవ్వొచ్చు – అక్రమ సంబంధం, స్త్రీపురుషుల విచ్చలవిడి కలయిక, సహ జీవనం పేరుతో కామపిశాచాల్లా వ్యవహరించడం అనేెది అనేకానేక అనర్థాలకు, లైంగిక వ్యాధులకు దారి తీస్తుంది. ఎయిడ్స్‌, సార్స్‌ వంటి మహమ్మారి రోగాల ప్రమాదమూ ఎక్కువే. ఎయిడ్స్‌ రోగుల్లో క్యాన్సర్‌ ప్రబలే అవకాశం అధికం. మలద్వార, గర్భాశయ ముఖద్వార, పురుషాంగ, యోని క్యాన్సర్లు కూడా విచ్చలవిడి లైంగిక అలవాట్లతో ముడిపడినవే.

తొలి దశలోనే గుర్తిస్తే….

మన శరీరానికి ఒక భాష ఉంది. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయినా మనం పట్టించుకోం. ఇది సరికాదు. శరీరంతో సంభా షించాలి. దాని ఆవేదనను అర్థం చేసుకోవాలి. దాని ఫిర్యాదును శ్రద్ధగా ఆలకించాలి. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా నిశితంగా పపరిశీలించాలి. అవసరమైతే వైద్యుల్ని సంప్రదిం చాలి. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం ఆరోగ్యానికి తొలి శత్రువు, మహిళలకైతే మరీ ప్రమాదకారి. కాబట్టి వ్యక్తిగత వ్యాయామం పరిశుభ్రతతోపాటు, ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిం చాలి. మానసిక సమస్యలు శరీరం మీద ప్రభావం చూపినప్పుడు …అల్సర్‌, తలనొప్పి లాంటి రుగ్మతలొస్తాయి. శారీరక ఆరోగ్యం మనసును కృంగదిస్తే…ఆత్మహత్య ఆలోచనలు, విసుగు, కోపం, అసహనం తదితర ప్రభావాలు కనిపిస్తాయి. కాబట్టి జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరం అలాగే ఆకలేస్తే అన్నం పెట్టమని అడగాలని కూడా ఆతెలియని చిన్నారులు, శరీరంలో ఓ మూలన చిన్నగా మొదలైన మార్పును మాత్రం ఎలా గుర్తిస్తారు? ఏమని చెబుతారు? ఆ పూచి కన్నవారిదే. తోబుట్టువులు క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బిడ్డలకు ఆరోగ్యమైన భవిష్యత్తు ఇవ్వడం కన్నవారి బాధ్యత.

చివరి మాట స్ఫూర్తిగా

క్యాన్సర్‌ కణాలు ఎక్కడి నుంచో రావు. మన శరీరంలోంచే పుడతాయి. సమస్య మనలో ఉన్నప్పుడు, పరిష్కారం కూడా మనలోనే దొరుకుతుంది. క్యాన్సర్‌ను ఎదిరించడానికి రెండే మార్గాలు.
1) అది రాకుండా జాత్త్ర పడటం.
2)….అయినా వస్తే తొలి థలోనే గుర్తించడం, అధైర్యపడ కుండా పోరాడటం. క్యాన్సర్‌ ఒట్టి పిరికిది. ధైర్యవంతుల ముందు, దాని ఆటలు ఎంతోకాలం సాగవు. విష్‌ యూ హ్యాపి లైప్‌!

Related Post