మానవులందరూ సమానమేనని నొక్కి చెబుతున్నాయి దివ్య ఖుర్ ఆన్ , ప్రవక్త ప్రవచనాలు (హదీసులు). మనుషులంతా సోదరులుగా గమనించినప్పుడు ఎక్కువతక్కువలకు తావుండదు. అందరితో సత్సంబంధాల సాధనకు కృషి చేయాలి. ఈ సంబంధాలు పెంచుకోవడం వలన స్నేహం, సౌభ్రాతృత్వం, సానుభూతి, శ్రేయోభిలాషిత్వం, సహకారం మొదలైన సద్గుణాలు అలవడతాయి. మానవ సంబంధాల పట్ల బాగా మెలగాలని, ముస్లిములు, ముస్లిమేతరులు అనే భేదభావం కూడదని, మనిషి తన శక్తికొలదీ తల్లిదండ్రులకు, అనాథలకు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించవలెనని, బంధుత్వం లేని పొరుగువారికి, స్నేహితులకు, బాటసారులకు మేలుచేయాలని దివ్య ఖుర్ ఆన్ చెబుతోంది.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు కొందరు మహిళలు ఖైదీలుగా వచ్చారు. అందులో ఒక స్త్రీ రొమ్ము నుంచి పాలు ఉబుకుతున్నాయి. ఆమె కంగారుగా అటూఇటూ పరుగెత్తుతూ ఉంది. ఖైదీలలో ఒక పిల్లవాడిని వెదికి ఎత్తుకొని ఆ పసికందుకు పాలు పట్టసాగింది. అప్పుడు ప్రవక్త (స) తమ సహచరులతో ‘‘ఈ స్త్రీ ఆ పిల్లవాడిని ఎలా ప్రేమిస్తుందో, దైవం తన దాసును అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు’’ అన్నారు. దైవం మానవునిపై ఎంతటి అవ్యాజమైన ప్రేమ కలవాడో చెప్పేందుకు నిదర్శనంగా మహాప్రవక్త (స) ఈ సంఘటనను ఉటంకించారు. పూర్వం స్త్రీ పురుషులకు సమానత్వం లేకుండెడిది. పురుషులు ఉత్తమజాతికి చెందిన వారమనే అహంకారముండేది.
ఈ అహంకారాన్ని రద్దు పరుస్తూ స్త్రీ పురుషులు ఒకే ప్రాణి నుండి ఉద్భవించినవారని, అందరూ సమానులేనని తెలుపుతున్నది ఖుర్ ఆన్. దైవం తన భక్తులకు రెండు విషయాలు నొక్కి చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దైవానికి భయపడటం, మానవ సంబంధాల విషయంలో జాగ్రత్త పడటం అవసరం అంటున్నాడు.