దేవుని కార్మికుల దినోత్సవం

పండుగలు ఆయా జాతుల, సముదాయాల సభ్యతా సంస్కృతులను, జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. జాతులు నైతికంగా ఎంత ఉచ్ఛ స్థితిలో ఉంటే, అవి జరుపుకునే పండుగలు కూడా అంతే ఉత్తమంగా ఉంటాయి. అలాగే నైతికంగా అధోగతిలో ఉన్న వారి పండుగలు కూడా అధ్వాన్నంగా, అసహ్యకరంగా ఉంటాయి.

పండుగలు ఆయా జాతుల, సముదాయాల సభ్యతా సంస్కృతులను, జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. జాతులు నైతికంగా ఎంత ఉచ్ఛ స్థితిలో ఉంటే, అవి జరుపుకునే పండుగలు కూడా అంతే ఉత్తమంగా ఉంటాయి. అలాగే నైతికంగా అధోగతిలో ఉన్న వారి పండుగలు కూడా అధ్వాన్నంగా, అసహ్యకరంగా ఉంటాయి.

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

ప్రపంచమంతటా ముస్లింలు – ఏక కాలంలో – నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించిన తర్వాత తమ ప్రభువు యెడల కృతజ్ఞతా సూచనగా రెండు రకతుల నమాజు చేసి ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ జరుపు కుంటారు. కాబట్టి ఈ పండుగ కూడా ఒక గొప్ప ఆరాధనే. నిజానికిది శ్రద్ధగా ఉపవాసాలు పాటించి, తరావీహ్‌ా నమాజులు చేసి, సత్కార్యాలలో శాయ శక్తులా పాల్గొన్నవారి పండుగ. నెల రోజులపాటు వారు పడిన కఠోర శ్రమకు గాను తమ యజమాని నుండి జీతం పుచ్చుకుని సంబర పడే దినమే ఈదుల్ ఫితర్.

 ‘ఈదుల్‌ ఫిత్ర్‌’

పండుగలు ఆయా జాతుల, సముదాయాల సభ్యతా సంస్కృతులను, జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. జాతులు నైతికంగా ఎంత ఉచ్ఛ స్థితిలో ఉంటే, అవి జరుపుకునే పండుగలు కూడా అంతే ఉత్తమంగా ఉంటాయి. అలాగే నైతికంగా అధోగతిలో ఉన్న వారి పండుగలు కూడా అధ్వాన్నంగా, అసహ్యకరంగా ఉంటాయి.

కాగా; ఇస్లాం ఒక సంస్కరణాత్మక, విప్లవాత్మక జీవన విధానం. మానవ జీవితపు ప్రతి విభాగాన్ని సంస్కరించి దాన్ని తనదైన మూసలో పోసిన ఇస్లాం పండుగ దినానికి కూడా ఓ ప్రత్యేక రూపునిచ్చింది, తనదైన ముద్రను వేసింది. పండుగ దినాన సంతోష ఘడియలను తమవారితో కలిసి ఆస్వాదించాలనీ, కేరింతలు కొట్టే తమ పిల్లాపాపల మధ్య హాయిగా నవ్వుతూ, త్రుళ్ళుతూ గడపాలన్న కోరిక కలగటం సహజం. సహజమైన ఈ కోరిక నెరవేరటానికి ఇస్లాం ఎంతో సంస్కార వంతమైన మార్గం చూపింది. పండుగ రోజు ఉదయాన్నే అందరూ స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, సుగంధ ద్రవ్యాలు పుసుకుని తమ ఊరిలోని ఈద్‌గాహ్‌ాకో, లేక తమ పేటలోని పెద్ద మస్జిద్‌కో సాగిపోతారు. ఈద్‌గాహ్‌ాకు వెళ్ళేటప్పుడు గానీ, ఈద్‌గాహ్‌ా నుండి తిరిగి వచ్చేటప్పుడు గానీ ఎలాంటి రంగేళీ చేష్టలకు ఒడిగట్టకుండా, పిచ్చి పిచ్చి నినాదాలివ్వకుండా – సభ్యత ఉట్టిపడే విధంగా ప్రవర్తిస్తారు. సంతోష ఘడియల్లో కూడా వారిలో దైవదాస్య భావం తొణికిసలాడుతూ ఉంటుంది. దేవుని ఔన్నత్యాన్ని చాటుతూ వారి అధరాలు ఆలాపించే స్తుతి గీతిక ఇలా ఉంటుంది –
”అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వలిల్లాహిల్‌ హమ్ద్‌”

వారు చేసే పండుగ నమాజులో కూడా ఎన్నో పరిశుద్ధమైన భావాలు ఇమిడి ఉన్నాయి. అక్కడ ధనిక-పేద తారతమ్యాలు ఉండవు. కఫీలు-కార్మికుడన్న వ్యత్యాసం కానరాదు. అరబ్బు-అరబ్బేతరుల భేదభావం కనిపించదు. నల్లవాడు-తెల్లవాడన్న తేెడా గోచరించదు. అక్కడ అందరూ సమానులే. అందరూ దేవుని దాసులే. అందుకే భుజానికి భుజం ఆనించి ఒకే వరుసలో నిలబడ్డారు. మామూలు దినాలకు భిన్నంగా – అదనపు తక్బీర్లతో – నమాజు చేసి అల్లాహ్‌ా బడాయిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంతరాల అగాధాలు సమసిపోయేలా పరస్పరం గాఢాలింగనాలతో పలకరించు కుంటారు. ఒండొకరి మచ్చీ చెబ్బరల గురించి వాకబు చేస్తారు.

మానవుని వద్ద ఉన్న అతి పెద్ద మూల ధనం ‘దయార్ద్రత’. అతని హృదయంలో మృదుత్వం ఉంది. ప్రేమ ఉంది. మార్దవ ముంది. ఒక వింతువు దైన్యస్థితిని చూసి నపుడు, ఒక పేదవాని ఇంట పొయ్యి వెలగకపోవడం గమనించినపుడు, ఒక అనాథుని ఉదాసీనతను పసిగట్టినపుడు అతని హృదయం ద్రవిస్తుంది. అతని కళ్ల నుండి కన్నీటి బొట్ల్లు రాల్తాయి. అలాంటప్పుడు సభ్య సమాజ సభ్యులు అగత్యపరులను, అభాగ్య జీవులను విస్మరించి పండగ ఎలా చేసుకుంటారు? అందుకే వారు ఈద్గాహ్‌ాకు వెళ్ళక ముందే ఫిత్రా దానాలు చెల్లించి, వారు కూడా ఎంతో కొంత ఈద్‌ సంబరాలను జరుపుకునేలా జాగ్రత్త పడతారు. ఈ విధంగా ఫిత్రాలు, కానుకలు ఇవ్వటం వల్ల అంతరాలు పూడుకుంటాయి. అసూయ ద్వేషాలు సమసిపోయి, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. హృదయాలు హత్తుకుంటాయి. ఏ సత్సమా జానికైనా, మరే శ్రేయో రాజ్యానికైనా ఈ సానుభూతి, త్యాగభావాలే కదా సిసలైన మూలికలు!

వెనుకటి పంక్తుల్లో చెప్పుకున్నట్లు ‘రమజాన్‌ అనే అతిథి’ పట్ల గౌరవ మర్యాదలతో మెలిగిన వారిదే అసలు పండగ. ఆ రోజు వారి ఉపవాసాలకుగాను పూర్తి ‘ప్రతిఫలం’ ఇవ్వబడుతుంది. ”కొద్ది పాటి సేవను కూడా ఆమోదించి పెద్ద ఎత్తున పుణ్యఫలం ప్రసాదించే ఆ మీ ప్రభువు వైెపునకు పదండి” అని పండుగ రోజు ఉపవాసకులకు అల్లాహ్‌ా తరఫున శుభవార్త వినిపించబడుతుంది.దీంతో దైవ దూతల ఉత్సాహం రెట్టిస్తుంది. ”ఓ మా ప్రభూ! నీ ఆజ్ఞలను శిరసా వహించిన వారికి వేతనం చెల్లించు” అని దైవదూతలు విజ్ఞప్తి చేస్తారు. దానికి అల్లాహ్‌, ”ఓ దూతలారా! నా గౌరవం, ప్రాభవాల సాక్షిగా! నేను నా దాసులకు వారి ఉపవాసాలకు, నమాజులకు, గ్రంథ పారాయణానికి బదులుగా నా క్షమాబిక్షను ప్రసాదిస్తున్నాను. దీనికి మీరు సాక్షులుగా ఉండండి. నేను వారి పట్ల ప్రసన్ను డయ్యానన్న సంతృప్తితో వారు తమ ఇళ్లకు మరలవచ్చు”.

ప్రవక్త (స అసం) వారి ప్రప్రథమ పండుగ

మహా ప్రవక్త (స) హి.శ. 2వ సంవత్సరం షవ్వాల్‌ మాసం ఒకటవ తేదీన (క్రీ.శ. 624 మార్చి 27వ తేదీన) మొట్టమొదటి సారిగా తన ప్రియ సహచరులతో కలిసి ఈదుల్‌ ఫిత్ర్‌ జరుపుకున్నారు. ఆ రోజు ఉదయం ఆయన (స) ముస్లిములందరినీ వెంటబెట్టుకుని మదీనా పురానికి బయట ఒక మైదానంలో సమావేశమై నమాజు చేయించారు. ఖుత్బా ఇచ్చారు. అప్పటి నుంచి ఏటేటా ముస్లింలు రెండు సార్లు ఈద్‌గాహ్‌ాకు వచ్చి రమజాన్‌, ఖుర్బానీ పండుగలు జరుపుకునేవారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ తమ స్థోమతకు తగ్గట్టుగా కొత్త బట్టలు ధరించి, సువాసన పూసుకుని, తక్బీర్లు పలుకుతూ ఈద్‌గాహ్‌ా వైపు సాగిపోయేవారు. ఒక దారి గుండా వెళ్ళి, మరో దారి గుండా తిరిగి వచ్చేవారు.

హజ్రత్‌ అలీ (రజి) గారి పండుగ

ఖిలాఫత్‌ కాలంలో ప్రజలు పండుగ శుభాకాంక్షలు తెలియజేయటానికి హజ్రత్‌ అలీ (రజి) గారి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన (రజి) ఎండిన రొట్టె ముక్కలు ఆరగిస్తూ ఉండటం చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ”అమీరుల్‌ మోమినీన్‌! ఈ రోజు పర్వదినం కదా! తమరేమిటి ఇలా…..” అని ఏదో అనబోయారు. దానికి ఆయన (రజి) భారంగా ఒక నిట్టూర్పు విడిచి, ”ఈ రొట్టె ముక్కలు సయితం ప్రాప్తించని వారు లోకంలో ఎంతో మంది ఉండగా పండుగ పేరుతో స్వాదిష్టమైన ఆహారం ఆరగించే హక్కు మనకెక్కడుంది?” అన్నారు.

వికసించే మొగ్గల పండుగ

అది పండుగ రోజు…. నలువైపులా సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. చిన్నారి బాలబాలికలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. అదే సమయంలో ఆ బాలవనంలో ఓ బాలుడు ఉదాసీనంగా నిలబడి ఉన్నాడు.
”ఏం బాబు! అలా దిగులుగా ఉన్నావేం?” – ఆప్యాయంగా పలకరించారు ప్రవక్త ముహమ్మద్‌ (స) ఈద్‌గాహ్‌ా వైపు వెళుతూ. ‘నేను అనాథను. పండుగ చేసుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు” అన్నాడా పసివాడు నిరాశగా.
ఈ మాటలకు మానవ మహోపకారి (స) మనసు చలించింది. ఆ అబ్బాయి చేయి పట్టుకుని, తన ఇంటికి తీసుకెళ్ళారు. ”వీడికి స్నానం చేెయించి, కొత్త బట్టలు తొడిగించు” అని పురమాయించారు తన సతీమణి ఆయిషా (రజి) ను.
తరువాత ఆ అబ్బాయితో, ”ఈ రోజు నుంచి ముహమ్మద్‌ (స) నీ తండ్రి. ఆయిషా నీ తల్లి. ఫాతిమా నీ అక్క. హసన్‌ హుసైన్‌లు నీ సోదరులు” అని ధైర్యం చెప్పారు.ఈ మాటలు వినగానే ఆ పాలబుగ్గలు సంతోషంతో విప్పారాయి. అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. మదీనా వీధుల్లో ఎగిరి గంతులు వేస్తూ, ”నా నాన్న లాంటి నాన్న ఎవరికయినా ఉన్నారా?” అని సగర్వంగా చెప్పుకుంటూ తిరిగాడు.
పండుగ పూట అనాథల పట్ల ప్రవక్త (స) వారి ఈ సద్వ్యవహారం చాటి చెప్పేదేమి టంటే, ఆ సంతోష గడియల్లో మనం సమాజంలోని అవసరార్థులను, అనాథలను, అగత్యపరులను, అభాగ్యజీవులను ఉపేక్షించ కూడదు. వారిని కూడా ఈ సంబరాల్లో భాగస్థుల్ని చేయాలి. కానుకల ద్వారా, దానధర్మాల ద్వారా, ఫిత్రాల ద్వారా వారిని ఆదుకోవాలి.

Related Post