హారూన్ యహ్యా
(ఈ పృధ్వి ఆయనది. ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది. ఉభయ సాగరాలు ఆయనవి. అయినా ఆయన్ను చిన్న నీటి చెలమల్తో కూడా తెలుసుకోవచ్చు. ఆయన ఇలా పబ్రోధించాడు: ”నమ్మేవారికి భూమిలో అనేక నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా”? (జారియాత్: 21) అని. మనం మన పూర్తి శరీర నిర్మాణం గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే మనకు కొన్ని వందల వేల పుస్తకాల అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టు సమయమూ కావాలి. ఎందుకంటే మనపై ఉన్న అల్లాహ్ అనుగహ్రాలు లెక్కింపసాధ్యం కానివి. ఆయన అనుగహ్రాల్లోని ఓ అనుగహ్రం – నేతం (సర్వేందియ్రానం నయనం పధ్రానం) గురించి మానవ మేధకు అందిన కొన్ని యదార్థాల్ని తెలుసుకునేందుకు పయ్రత్నిద్దాం. హారూన్ యహ్యా గారి విలువైన ఆర్టికల్‌ని అనువదించి తనదైన పంథాలో పచ్రురించిన శాంతి బాట టీమ్ వారికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. – ఎడిటర్)
ఈ క్షణం భూమి మీద గొప్ప అద్భుతాల్లోని ఓ అద్భుతం జరు గుతూ ఉంది. అదేమంటే – మీరు ఈ వ్యాసం చదువుతున్నారు. కాగితంపై నల్లటి అక్షరాలు, మీ చుట్టూ వస్తువులు, పరిసరాలు, మీరు చూస్తున్న వాటి రంగులు, దగ్గర-దూరం, ప్రకృతి సౌందర్యం, సుకుమారతలు – అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా! ఇది ఎలా సాధ్యం అయింది? అని ఎప్పుడైనా ఆలోచించారా?
మీ మెదడులో ఉండే కటిక చీకటిలో ఇవన్నీ రూపుదిద్దుకోవడం వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి. మీకు కళ్ళతో పాటు చూసే చక్కటి శక్తి ఉంది కాబట్టి మీరు సృష్టి సౌందర్యాన్ని చూడగలుగు తున్నారు. మీ కుటుంబం, మీ ఇల్లు, మీ ఆఫీసు, మీ ఆప్తులు, మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దాన్ని మీరు ఇట్టే పసిగట్ట గలుగు తున్నారంటే కారణం మీ చూపు. కళ్ళు లేకుండా మీ చుట్టూ ఉండే దేని గురించైనా కరెక్ట్‌గా సెన్స్ చేయలేరు కదా! కళ్ళు లేకుండా రంగులు, రూపాలు, రమణీయ దృశ్యాలను ఒక్కసారి ఊహించుకోండి!
సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువు ఫోటో తీయాలంటే, ఆ వస్తువు దూరంగా ఉంటే ఫోకస్ ఎడ్జస్ట్ చేసుకోవాలి. అది దగ్గరగా ఉంటే క్లోజ్‌అఫ్ సెలక్ట్ చేసుకోవాలి. కాని మన కళ్ళల్లో ఉండే లెన్స్‌లు అటువంటి ఆప్టికల్ కొలతలు తీసుకోకుండానే వెంటనే ఫోకస్ చేెసుకుంటాయి. అంటే మనం ఓ వస్తువును చూడాలనుకుంటే చాలు, క్షణంకంటే తక్కువ సమయంలోనే, మన కళ్ళు ఫొకస్ చేెసుకోవడం, మెదడుకి అందించడం, మన కు ఆ వస్తువు గురించి తెలియడం వెంటవెంటనే జరిగి పోతాయి.
మరి ఈ మహిమ నేత్రాలదో, మెదడు, మేధకి సమబంధించి నదో కాదు; ఇది సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు అయిన అల్లాహ్‌ాది. ఆయనే మనల్ని శూన్యం నుండి సృష్టిం చింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి బయటకి తీశాడు (పుట్టించాడు). అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడిని, కళ్ళనీ ఇంకా హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని”. (16: 78)
కంటి యొక్క ఖచ్చితమైన నిర్మాణం
గడిచిన కొన్ని సెకన్లలో, మన కళ్ళల్లో సుమారు వంద బిలి యన్ల చర్యలు పూర్తి అయి ఉంటాయన్న విషయం మీకు తెలుసా? విశ్వం యొక్క టెక్నాలజీకి సంబంధించిన ఓ ఉదా హరణ కన్ను రూపంలో మన దగ్గరే ఉందంటే అశ్చర్యమేస్తుంది కదూ! ఈ విశ్వ కర్త టెక్నాలజీని అంచనా వేయడం విషయం అలా ఉంచితే దాని దరిదాపులకు కూడా ఏ సైంటిస్టు చేరుకోలే డన్నది కఠోర సత్యం. దానిని పోలినది మనిషేదైనా కని పెట్ట వచ్చు అంతే.
కళ్ళ యొక్క నిర్మాణం మరియు వాటి పనిని బట్టి అవి మన శరీరంలోని చిన్న ప్రదేశాన్ని మాత్రమే ఆక్రమించాయి. కళ్ళు ఉండే ప్రదేశం కరెక్టుగా – మన శరీరవయాలన్నింటిని సరైన విధంగా కంట్రోల్ చేసే సూచనలిచ్చే వీలు కల్పిస్తుంది అంటే ఆశ్చర్యం వేయకమానదు. ఒక్క నిమిషం ఆలోచించండి! ఒకవేళ మన కళ్ళు మేకాళ్ళ దగ్గరనో. లేక చీలమండల దగ్గరనో ఉండి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు మనం నడుస్తున్నప్పుడు మన క్రింది దారి కనబడుతుందేగాని, పైన ఏముందో కనబడదు. అలానే మనం నడిచి వెళితే ఏదోకదాన్ని వెళ్ళి ఢీకొనడం ఖాయం. అటువంటి పొందిక లేని శరిర నిర్మాణమే గనక మనం కలిగి ఉంటే, మామూలుగా చేసే చాలా పనులు – తినడం, త్రాగడం, పరికరాలను ఉపయోగించడం మొదలైనవి చాలా కష్టమయ్యెది. దీనికి భిన్నంగా మన కళ్ళు సరైన చోట
ఉండటమే కాక, మన ముఖంలో అవి చాలా ఖచ్చితమైన స్థానంలో అందంగా అమర్చబడి ఉన్నాయి. సుబ్హానల్లాహ్‌ా!
మరో ఉదాహరణ – మన కళ్ళు ఒకవేళ ముఖం మీదే ముక్కు క్రింద ఉండి ఉంటే చూడటానికి వికారంగా ఉండటమేకాక, సురక్షితమైన కోణంలో (సేఫ్ ఎంగిల్) చూడటం మనకు సాధ్య మయ్యేది కాదు. కాబట్టి సుందరాంగుడైన ఆ సృజనశీలుడు అవి ఉండాల్సిన స్థానంలోనే వాటి అందంగా అమర్చాడు. ఇదొక్కటే కాదు కనుబొమ్మల నుండి కార్నియా వరకు, కన్నీళ్ళు ఏర్పడ టం నుండి కనురెప్పలు వాల్చడం వరకూ ప్రతిదానిలోనూ ఓ ప్రత్యేకమైన అద్భుతం, ప్రబల నిదర్శనం ఉంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఇదీ అల్లాహ్‌ా సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి?” (లుఖ్మాన్: 11)
నిజంగా మనిషి సృష్టించిందంటూ ఏది లేదు. ఉన్న వాటికి కొత్త రూపం ఇచ్చాడు అంతే. శూన్యం నుండి ఏ ఒక్క వస్తు వును సృష్టించడం ఎవరి తరమూ కాదు.
కనురెప్పలు
మనకు తెలియకుండానే రోజుకి వేల సార్లు మనం మన కళ్ళ ను బ్లింక్ చేస్తుంటాము. ఇలా మన ప్రమేయం లేకుండానే జరిగే కదిలికలు చాలా వరకు తీవ్రమైన వెలుగు నుండి, బాహ్య ధూళి కణాల నుండి, కళ్ళు తమను తాము భద్రంగా ఉంచుకోవ డానికి దోహదపడుతుంటాయి. ఇలా మనం తెరుస్తూ మూస్తూ ఉన్నప్పుడు, కనురెప్పలు కన్ను యొక్క ఉబ్బెత్తుగా ఉండే ఆకా రానికి సరిపోతాయి. అందువలన కంటి యొక్క ఉపరితలాన్ని కనురెప్ప పూర్తిగా కప్పకలుగుతుంది.
కనుగుడ్డు వంపుకు అంత ఖచ్చితంగా కనురెప్ప ఫిట్ కాకపోతే, చేరుకోలేని కంటి మూలల నుండి ధూళి కణాలను తొలగిం చడం అసాధ్యమయ్యేది. మనకు తెలియకుండా జరుగుతున్న ఈ ప్రక్రియ నిజానికి మనకు పోల్చసాధ్యం కాని ఓ వరమే. ఖచ్చితమైన ఈ నిర్మాణం గురించి ఖుర్‌ఆన్ ఇలా చెబుతుంది:
”నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) విధి ప్రకారమ సృష్టించాము”. (ఖమర్: 49)
ఒకవేళ పైన పేర్కొన్న విధంగా ఆటోమెటిగ్ బ్లింకింగ్ జరగకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే – కళ్ళల్లో దుమ్ము బాగా ఎక్కువ చేరినప్పుడు మాత్రమే మనురెప్పలు ఆడించాలని మనకు జ్ఞాపకమొస్తుంది. ఫలితంగా, అతి చిన్న ధూళి కణం కూడా చివరికి పెద్ద సమస్యే సృష్టిస్తుంది. అది ఇన్ఫెక్షన్‌కి దారి తిస్తుంది.
ఇలా సగం మాత్రమే కళ్ళు శుభ్రమయితే, చూపు కూడా మందగిస్తుంది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే బ్లింకింగ్ (కను రెప్పవాల్చడం) మధ్యనున్న కాలవ్యవధి. ఎటువంటి అవరో ధాలు లేకుండా మనిషికి తన చుట్టూ మారుతున్న పరిశరాలు తెలియజేస్తూ ఉండాలి. ఉదాహరణకు మనం కారులో వెళు తుంటే మన చుట్టూ ఉండే ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి కదా! అందుకని మనం చూస్తున్న వస్తువు నిరంతరం కన్పించ డానికి ఈ బ్లింకింగ్ చాలా తక్కు సమయంలోనే జరగాలి. ఒక వేళ ఈ బ్లింకింగ్ వెంటవెంటనే జరగకుండా ఎక్కువ సమ యాన్ని తీసుకుంటే తీవ్ర ప్రమాదాలకి కారణం అవుతుంది. హైవే మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. రెప్పలు మూసుకుని వెంటనే తెరుచుకోకుండా కాసేపాగాక తెరుచుకుంటే భయకర మైన యాక్సిడెంట్‌కి దారి తీస్తుంది. ఇక్కడ మనం గమనించా ల్సిన విషయం ఏమిటంటే – మన కనురెప్పల బ్లింకింగ్ మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది. బ్లింకింగ్ కావడంలోని ఈ సున్నితమైన బ్యాలెన్స్ మనం పుట్టినప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఇది పోల్చ శక్యం కాని దైవ సృష్టికి ప్రతక్ష్య సాక్ష్యం! మరి ఇంత తెలిసిన, తెలుసుకుంటున్న మనషి ఆ పరమ దాత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు? ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్ ఇలా ప్రశ్నిస్తుంది:
”ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? (యదార్థానికి) ఆయనే నిన్ను సృష్టించాడు. నఖశిఖపర్యంతం ఎలాంటి లోపం లేకుండా నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. ఆపైన నిన్ను తగు రితిలో పొందికగా మలిచాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (82: 6-8)
కన్నీరు – ఖచ్ఛితమైన కన్నీటి బొట్టు
కన్నీటి బొట్టు చాలా అసాధారణమైన ద్రవం. ఇది విభిన్న అంశాలను కలిగి, వివిధ ప్రత్యేకమైన పనులకు ఉపయోగ పడుతుంది. ప్రాథమికంగా కన్నీటి బొట్టు కంటిని క్రిముల నుండి కాపాడుతుంది. కన్నీటిలో లైసోజైమ్ అను జెర్మిసైడల్ ఎంజైమ్ ఉంటుంది. ఇది కళ్ళలో క్రిములు లేకుండా చేస్తుంది. మైక్రోబ్‌ను చంపే సామర్థ్యం ఈ ఎంజైమ్‌కి ఉంది. చాలా రకాల బాక్టీరియాను చిదిమి వేస్తుంది. శక్తివంతమైన లైసోజైమ్ వాస్తవానికి, మన ఇళ్ళలోని క్రిములను చంపడానికి వాడే కొన్ని రసాయనాల (కెమికల్స్) కంటే కూడా బలమైనది. ఇటువంటి ప్రభావాల ను కలిగి ఉండి, మన కళ్ళకు పూయ కలిగే కృత్రిమమైన క్రిమి సంహారి లేనే లేదు. అంతే కాకుండా మరో అద్భుతం ఏమిటంటే, అలాంటి బలమైన పదార్థం అయి ఉండి కూడా మన కళ్ళకు స్వల్ప మైన ప్రమాదాన్ని కూడా కలుగజేయదు. ఇంత సున్నితంగా ఖచ్చితమైన లెక్క ప్రకారం ఏర్పాటు చేసిన వ్యవస్థను మన కంటిలో సృష్టించిందెవరు? సర్వ శక్తి మంతుడైన అల్లాహ్‌ా కాదా? ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”వాస్తవంగా మేము మానవుడిని సర్వ శ్రేష్టమైన ఆకారారంలో సృష్టించాము”. (అత్తీన్ :4)
చాలా దగ్గరగా పరీక్షిస్తే, ఈ కన్నీటి బొట్టు తయారీలో ఎలాంటి అద్భుతం దాగి ఉందో బాగా అర్థం చేసుకోగలుగుతాము కార్నియా తడిగా ఉండేలా, దానిని పొడి కాకుండా రక్షించడానికి మరియు కనుగ్రుడ్డు యొక్క జారే గుణాన్ని కొన సాగించడానికి కావలసినంత కన్నీరు మాత్రమే ఖచ్చితమైన పరిణామంలోనే విడుదల అవుతుంది. ఈ విధంగా కంటిల నీరు విడుదల అవడం వలన మనుగ్రడ్డు తిరుగుతున్నప్పుడు, దీని పై భాగానికి మరియు కనురెప్ప లోపలి భాగానికి మధ్య అసౌకర్యమైన ఘర్షణ లేకుండా ఉంటుంది.
ఒకవేళ కన్నీరు గనక కావాల్సిన మోతాదులో తయారు కాకపోతే, కనురెప్ప మరియు కనుగ్రుడ్డు మధ్య ఘర్షణ ఏర్పడి భరించరాని నొప్పి కలుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు మన కళ్ళల్లో ఇసుక ఉన్నట్లుగా నిరంతరం మండుతున్న అనుభూతి కలుగుతుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బుతాయి. మరీ ఎక్కువైతే గ్రుడ్డితనానికి దారి తీస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ధూళి కణంగాని మన కళ్ళల్లో పడి చికాకు పెడితే వెంటనే ఆటోమెటిక్‌గా కళ్ళలో నీరు ఎక్కువగా తయారవుతాయి.
మరోలా చెప్పాలంటే, ఖచ్ఛితమైన మరియు సరైన అవయవ నిర్మాణాన్ని కలిగి ఉండే కన్నీటి గ్రంధులు ఖచ్ఛితంగా కావలసిన పరిణామంలోనే కంటిలో నీటిని విడుదల చేసేలా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పూర్వ కాలంలో మనిషికి కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడూ మనిషికి కన్నీరు వస్తుంది. అవి మనిషి నుండి మనిషికి మారవు. ఖురాన్‌లో ఇలా ఉంది:
”ఆయన (అల్లాహ్‌ా) తన ఇష్టాను సారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చిదిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సర్వ శక్తి మంతుడు, మహా వివేెకవంతుడు”. (ఆలి ఇమ్రాన్: 6)
చూపు ఎలా కూర్చబడుతుంది?
పుట్టనప్పటి నుంచి మనిషి చూసే ప్రతీ దృశ్యం కూడా మెదడులో కొన్ని ఘనపు సెంటీ మీటర్ల పరిమాణంలో ఉండి, కంటి చీకటి మరియు తేమగా ఉండే వాతావర ణంలో ఉండే ‘దృశ్య కేంద్రం’గా పిలువబడే ప్రదేశంలో కూర్చబడుతుంది.చిన్న గదియొక్క దృశ్యాలే కాకుండా సువిశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఏర్పడేవి మెదడులోని ఈ చిన్న ప్రదేశం లోనే. మన సొంతమైనవి, మన బాల్యం, మనం వెళ్ళిన స్కూలు, మన ఇండ్లు, పని, కుటుంబం, దేశం, క్లుప్తంగా మనం చూసిన ప్రతీ చిన్న వివరం-అన్నీ కూడా మెదడులోని చిన్ని భాగంలోనే ఉంటాయి.
మన చూపులో మొదటి
కాంతి కిరణాలు మన కళ్ళల్లోకి ప్రవేశించి కార్నియా, కనుపాప మరియు లెన్స్ (కటకాల) ద్వారా కంటి లోపలికి ప్రయాణిస్తాయి. రెటీనాలోని కాంతికి ప్రభావితమయ్యే కణాలు, ఆ కాంతిని ఎలక్ట్రికల్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపుతాయి. రెటీనా నుంచి వచ్చే దృశ్యం తలక్రిందులుగా ఉంటుంది. కాని మెదడు ఈ దృశ్యాన్ని సరియైన విధంగా తిరగ వేస్తుంది. ప్రతీ కన్ను నుండి వచ్చే సంకే తాలలో వస్తువుకు సంబంధించి గ్రహించిన దృశ్య వివరాలు ఉంటాయి.
రెండు కళ్ళ నుండి వచ్చిన దృశ్యాలను ‘మెదడు’ (ఔజీబిరిదీ) కలిపి, ఒకే త్రీ డైమన్షనల్ దృశ్యాన్ని తయారు చేస్తుంది. టూ డైమన్ష నల్ దృశ్యానికి ఉదాహరణ ఫోటో అయితే, త్రీ డైమన్షనల్ దృశ్యానికి ఉదాహరణ వీడియో. అంతే కాకుండా ఆ దృశ్యానికి సంబంధించిన రంగులు మరియు అది మనకు ఎంత దూరంలో ఉందో మొదలైన విషయాలను మెదడు నిర్థారిస్తుంది. ఈ మొత్తం పని అంతా మెదడులో ఒక సెకనులో పదవ వంతు కంటే తక్కువ సమయంలోనే జరుగు తుంది. సుబ్హానల్లాహ్‌ా!
మన కన్ను లెక్కలేనన్ని రకరకాల భాగాల తో మరియు పొరలతో తయారైంది. వీటిలో కొన్ని: కార్నియా (కంటి గుడ్డు మీద ముందు ఉండే పారదర్శకమైన గట్టి భాగం). ఐరిస్ (కంటిపాపకు చుట్టూ ఉండే నల్లని పొర). పుపిల్ (కనుపాప). లెన్స్ (కనురెప్ప), రెటీనాను మెదడుకు కలిపే నరాలు మరియు లెక్కలేనన్ని ఇతర నిర్మాణాలు. ఇవన్నీ కలిసి ఒకేసారి మొత్తంగా మాత్రమే పని చేస్తాయి. కళ్ళు వేటినైనా చూడాలంటే, పై నిర్మాణాలను మరియు అదే సమయంలో టిష్యూలను కూడా కలిగి ఉండాలి. అవి ఖచ్ఛితంగా మరియు సంపూర్ణంగా ఏక కాలంలో ఒకేసారి పని చేయాలి. ఈ వ్యవస్థలన్నిం టిని సృష్టించి, వాటి మధ్య గొప్ప సామర్థ్యాన్ని ఏర్పాటు చేసిన అల్లాహ్‌ా సర్వ శక్తిమంతుడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏమీ లేని శూన్యం నుండి సృష్టించినవాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణ యించుకున్నప్పుడు దానికి కేవలం – ‘అయిపో!’ అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది”. (బఖరా: 117)
మనం ఏమైతే చూస్తున్నామో వాటి గురించి తెలుసుకోవడం
మానవుని మెదడులో తను చూసే దృశ్యాలు దాచ బడతాయి. ఈ విధంగా మెదడులో దాచబడిన సమాచారాన్ని మరలా ఉపయోగించుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మనం ఏదైనా ఓ వస్తువుని గాని, ఓ వ్యక్తిని గాని మొదటి సారి చూసినప్పుడు ఉదాహరణకు ఆ వస్తువు లేదా వ్యక్తి కొరకు మన మెమోరీ (జ్ఞాపక శక్తి)లో ఓ కొత్త ఫైల్ ఓపెన్ అవు తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అదే
దృశ్యాన్ని మరలా మనం చూసినప్పుడు మన జ్ఞాపక పొరలలోనున్న ఫైల్ తిరిగి తెరచుకుని, ఆ ఫైల్‌లో భద్రపరచబడిన దృశ్యంతో, ఈ దృశ్యాన్ని పోల్చి చూసుకుం టుంది.
ఉదాహరణకు మన్‌మోహన్‌సింగ్ గారిని మొదటిసారి చూసినప్పుడు ఆయన యొక్క ఫోటో మన మెదడులో మన్‌మోహన్‌సింగ్ గారి పేరు మీద రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత మరెప్పుడైనా ఆయనను చూసి నపుడు మన మెదడులోని ఫైల్‌లో ఉన్న మన్ మోహన్‌సింగ్ గారి ఫోటోతో పోల్చు కోవడం జరుగుతుంది. పోలిక సరిపోతే మనం చూసే వ్యక్తి మన్‌మోహన్ సింగ్ అని మనకు తెలుస్తుంది.
ఈ విధంగా మనం చూసే దృశ్యాలను మన మెదడు నిర్ధారిస్తుంది. ఈ విధంగా జరగడం మానవులందరిలోనూ ఆటో మెటిక్‌గా జరిగిపోతుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ ఈ వ్యవస్థ అందరి మెదళ్ళలోనూ ఒకే విధంగా పని చేస్తూ ఉంటుంది.
మనకు తెలియకుండా జరుగుతున్న ఇటు వంటి పనుల గురించి మనకు ఎప్పుడు స్పష్టంగా తెలుస్తుంది? మన మెదడులోని ఈ వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోయి నప్పుడు మాత్రమే తెలుస్తుంది.
(ఈ విషయం అర్థం కావడానికి వీడియోలో చూపబడిన ఓ సన్నివేశం గురించి ఇక్కడ వర్ణిస్తున్నాము.)
డాక్టర్ చూపిస్తున్న ఫోటోలను గుర్తు పట్టడానికి ఓ ముసలాయన ప్రయత్నిస్తు న్నాడు. ఈయన కొద్ది క్షణాల క్రితం చూసిన దృశ్యాలు కూడా అతని మెదడు లోని జ్ఞాపకాల నుండి మాయమవుతు న్నాయి. అంటే కాసేపటి క్రితం చూసిన వాటిని కూడా మర్చిపోతున్నాడు.
”ఈ ఫోటోలలో కన్పిస్తున్న వ్యక్తి తెలిసిన వాడులా అనిపిస్తున్నా సరే, ఆయనెవరో నాకు తెలియదు. ఆనెవరో నేను చెప్ప లేను.”
ఆ విధంగా ఆయన గుర్తు పట్టని వ్యక్తు లలో ఆయన భార్య కూడా ఉంది. ఆమె అతనితో 48 సంవత్సరాలుగా కాపురం చేసింది కూడా. అలాగే కొద్ది సేపటి క్రితం తన చేతిలో చేతినుంచుకుని నడి పించుకుని తీసుకుని వెళ్ళిన తన మను మడిని కూడా అతను గుర్తుపట్ట లేడు. ఇంతకీ జరిగిందేమిటి? అంటే,
మనుష్యుల ముఖాలను కనుగొనే శక్తిని, తనకు జరిగిన బ్రెయిన్ ఆపరేషన్ ఫలి తంగా ఈయన కోల్పోయాడు.ఆయన యొక్క ఈ పరిస్థితిని స్వయంగా ఆయన యొక్క మాటలలోనే తెలుసుకుందాం.
”ఒక షాపు ముందు ఇద్దరు స్నేహితుల తో నా కుమారుడు నిలుచున్నప్పుడు, వారి ముఖాలను నేను గుర్తు పట్టలేక పోతున్నాని నేను గ్రహించడమే మొదటి ఉదాహరణ.”ఆ ముగ్గురిలో కనీసం ఒక్కరి గురించి నేను తెలుసుకోవాలి. అందుకోసం వారివైపు నడచివెళ్తూ వారి ముఖాలను అధ్యయనం చేస్తున్నాను. వారి మధ్యలోని ఒకరు ‘హాయ్ డాడ్’ అని పిలిచే వరకూ, వారిలో ఎవరు నా కొడుకో నాకు ఐడియా లేకుండా పోయింది”.
ఎవరినైనా కనుగొనడానికి ప్రయత్నించ డం పెద్ద విషయం కాకపోయినా, వారు నాకు ఎంత బాగా తెలుసు అనే విషయం తెలియడం నాకు అసాధ్యమైన పని అయి పోయింది. నేను పిల్లల కోసం బీచ్‌కి వెళ్ళ వలసి వస్తుంది. అంతవరకూ బాగా నే ఉంటుంది. ఆ బీచ్‌లోని అంతమంది లో నా పిల్లలిద్దరినీ కనుగొనడం ఎలా?
ఇతని కొడుకు తన తండ్రి యొక్క ఆరోగ్యలోపాన్ని ఈ విధంగా వర్ణించాడు. ”మీరు నా ముఖాన్ని చూసినప్పుడు, నా మొత్తం ముఖాన్ని ఒకే పిక్చర్‌గా చూడగలుగుతారు.(అలా చూడటంలో) నా చెవులు చిన్నవా? పెద్దవా? చిన్న ముక్కా? లేదా నా కళ్ళ యొక్క రంగు ఏమిటో మీరు చూడగలరు.(కాని) ఈయన మిమ్మల్ని చాలా దగ్గరగా చూడ వలసి వస్తుంది. ఈయన మీ ఎడమ కన్నును చూడగలడు, ఆ తర్వాత మీ ముక్కును చూడగలడు, మీ పెదవులను మరియు మీ నోటిని చూడగలడు. కాని ఈయన సమస్య ఏమిటంటే, ఇలా విడి విడిగా చూసిన వీటన్నింటినీ ఒకేసారి ఒకే పిక్చర్‌లో పెట్టలేడు.” అంటే మీ ముఖంలో భాగాలను చూడగలడు గాని ఒకేసారి మీ
ఇక్కడ స్పష్టంగా తెలిసేది ఏమిటంటే, మన మెదడులో జరగవలసిన అవసరమైన పనులు నిరంతరం ఆగకుండా జరుగకపోతే, మనం ఏ ఎన్విరాన్‌మెంట్‌లో నివసిస్తున్నామో, ఆ ఎన్విరాన్‌మెంట్‌లోని మనచుట్టూ ఉన్నవాటినీ, మనకు ప్రియమైన వారిని గుర్తుపట్టలేం! పైన చెప్పిన ముసలాయన మాటలు మరొక సారి మనకు ఓ వాస్తవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
”ముఖాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో, దానిని పోగొట్టుకునే వరకూ నేను ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయాను.”
ప్రతీ రోజూ మరలా మరలా మనం ఉపయో గించుకోవడానికి వీలుగా మన మెదడు కొన్నింటిని రికార్డ్ చేసుకుని భద్ర పరచుకుం టుంది. కాని ఈ దృశ్యాలు ఎక్కడ రికార్డ్ చేయ బడతాయి? ఎలా రికార్డ్ చేయబడ తాయి? ఏ విధంగా మరియు ఎవరిచే అవి రీకవర్ చేయబడతాయి? ఉదాహరణకు కం ప్యూటర్‌లో సమాచారాన్ని హార్డ్ డిస్క్‌లోగాని, సీడీలలోగాని, డివిడీలలోగాని స్టోర్ చేస్తారు. అయితే వాటియొక్క కెపాసిటీ చాలా తక్కువ. కంప్యూటర్ గురించి తెలియని వారికి చాలా స్పష్టంగా అర్థం కావడానికి ఓ ఉదాహరణ ఇక్కడ అందిస్తున్నాము.
ఒక వ్యక్తి తన గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రతీ పనిని ఓ వీడియోలో రికార్డ్ చేయించుకుంటున్నాడు అనుకుందాం. అంటే 20þ365 రోజులు = 7,300 రోజులు. రోజుకి 24 గంటలు కాబట్టి ఒక రోజును పూర్తిగా మంచి క్వాలిటీలో రికార్డ్ చేయడానికి 6 డివిడీలు అవసరం అనుకుందాం. మరి 7,300 రోజులను పూర్తిగా రికార్డ్ చేయడాని కి 7,300þ6 = 43,800 డివిడీలు కావాలి. పోనీ 40,000 డివిడీలు అవసరం అనుకుం దాం. ఈ 40 వేల డివిడీలలో ఆ వ్యక్తి యొక్క గడచిన 20 సంవత్సరాల జీవిత విష యాలున్నాయన్న మాట.
ఆ వ్యక్తి ఓ పది సంవత్సరాల క్రితం అంటే 2001 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున జరిగిన ఓ ముఖ్య సంఘటనను గుర్తు చేసు కున్నాడు. ఆ సంఘటన గురించి అతనికి ఆలోచన వచ్చిన మరుక్షణమే ఆతని మెదడు లో అప్పటి ఆ సంఘటన కదలాడింది.
మరలా ఆ సంఘటన తన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక సెకను కంటే అతి తక్కువ కాలంలో ఇది జరిగింది. మరి ఇదే సంఘటనను ఆ 40వేల డివిడిలలో వెతకడానికి మీకు ఎంత సమయం పడు తుంది? ఆ 40వేల డివిడిలను ఉంచడా నికి ఎంత స్థలం కావాలి? కాని ఇన్ని వేల డివిడీ లలో పట్టే సమాచారమంతా, మెదడులోని ఓ అతి చిన్న ప్రదేశంలో నిక్షిప్తమయి ఉందంటే, అది ఎంత అద్భుతం!
”మరి ఆయన (అల్లాహ్‌ా) మీరు అడిగిన (అవసరమైన) దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లాహ్‌ా చేసిన మేళ్లను- అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించ లేరు”. (ఇబ్రాహీమ్: 34)
అల్లాహ్‌ా అనుగ్రహాలు అగణ్యమైనవి. వాటి ని ఎవరయినా ఎంచదలిస్తే లెక్కించ లేరు. ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుకో దలిస్తే అది మన వల్ల కాదు కూడా. ఒక ‘అసర్’ ఉల్లేఖనంలో హజ్రత్ దావూద్ (అ) గారి మాట ఇలా ఉంది:’ఓ అల్లాహ్‌ా! కృతజ్ఞత తెలుపుకోవడం అనేది కూడా నీ తరఫున ప్రసాదించబడిన ఒక వరమే అయినప్పుడు, ఏ రీతిన నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోను స్వామీ!?’ అన్నారు. దానికి సమాధానంగా అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”దావూద్! ఇప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లిం చావు. ఎందుకంటే నాకు కృతజ్ఞతలు చెల్లించ గలిగే శక్తి లేదని నువ్వు అంగీకరించావు. అదే నీలోని కృతజ్ఞతాభావానికి ప్రతీక”. (తఫ్సీర్ ఇబ్నె కసీర్)
మన కనులకుండే లెన్స్‌ల ద్వారా మనం చూస్తున్న ప్రతీ విషయం రికార్డ్ అవుతుందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకొక్కసారి మనం ఏదో ఆలోచనలో ఉన్న ప్పుడు మన ముందు జరగుచున్న విషయం (లేదా) మన కనులు చూడగలిగేంత దూరం లో జరగుచున్న విషయాలను మనం గమనిం చం.కాని ఎవరైనా హిప్నాటిస్ట్, మనల్ని హిప్న టైజ్ చేసి, ఫలానా రోజు మీరు నడుస్తూ వెళు తున్నప్పుడు, మీ ముందు వెళుతున్న కారు నంబర్ చెప్పండి అని అడిగినప్పుడు, చెప్ప గలుగుతాము.ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్య మైంది అంటే మనం పట్టించుకోని చాలా విష యాలు కూడా మన మెదడులో రికార్డ్ అవు తున్నాయని తెలుస్తుంది.
పైన చెప్పుకున్నట్లు, ప్రస్తుతం అందుబాటు లోనున్న టెక్నాలజీ ద్వారా 20 సంవత్సరాల జీవితాన్ని రికార్డ్ చేయడానికి 40వేల డివి డిలు కావాలి. సైన్స్ లేదా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, పై విషయాలు చదివి డివిడీల కంటే ఎక్కువ సమాచారాన్ని రికార్డ్ చేసుకునే
పరికరాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కాని పెద్దగా చదువుకోలేని వారికి కూడా ఈ వ్యాసం అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ డివిడీల గురించి చెప్పడం జరిగింది. డివి డీిలు మాత్రమే కాకుండా ఏ మెమోరీ డివైస్ ను మీరు తీసుకున్నా సరే, ఈ వ్యాసంలో చెప్పబడిన విషయాలకు సరిపోతుంది.
కళ్ళతో చూసే ఈ చూపుకు సంబంధించిన ఇంద్రియ జ్ఞానం మరియు అందులో దోషం లేని ఆ వ్యవస్థలు, అల్లాహ్‌ా యొక్క అంతు లేని శక్తిని మనకు తెలియజేస్తున్నాయి.
”కనుక మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు?” (అర్రహ్మాన్:13)
సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మానవ శరీర లోతులలో, కంటికి కనిపించని చిన్న ప్రదే శాలలో కూడా అద్భుతాలను ఉంచాడు. అవి మానవుడు అర్థం చేసుకోవడానికి అతీతంగా ఉన్నాయి.
కళ్ళతో చూసే ఈ చూపుకు సంబంధించిన ఇంద్రియ జ్ఞానం మరియు అందులో దోషం లేని ఆ వ్యవస్థలు, అల్ల్లాహ్‌ా యొక్క అంతు లేని శక్తిని మనకు తెలియజేస్తున్నాయి. ప్రతీ క్షణం, మనం గ్రహించే ప్రతీ దృశ్యం, అల్లాహ్‌ా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ కారణం చేతే, ప్రతీ క్షణం మనం చూసేది మన కోసం విడిగా ఓ పరిక్షే! ఈ వాస్తవం ఖుర్‌ఆన్‌లో తెలియజేయబడింది.
”నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ బిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము.” (దివ్యఖుర్‌ఆన్ 76:2)
రెండు కళ్ళు – ఒకటే చూపు
మనం రెండు కళ్ళతో పుట్టామని తెలుసు కాని, ఒకే చూపుకు రెండు కళ్ళు ఎందుకు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? వాస్తవానికి ప్రతీ కన్ను దానికంటూ విడిగా ఓ దృష్యాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతీ కన్ను విడివిడిగా దృశ్యాలను ఏర్పరచుకుంటే, మరి రెండు కళ్ళు ఎందుకు? ఒకటి చాలు కదా! అని అనిపిస్తుంది. రెండు కళ్ళ మధ్య దూరం సుమారుగా 5 సెంటమీటర్లు ఉంటుంది. అలాగే బాహ్య ప్రపం చంతో ఒకొక్క కన్ను ఒకొక్క దృక్కోణాన్ని కలిగియుంటుంది.
2-డైమన్షన్‌లో ఒకొక్క కన్నుకు అందిన దృశ్యాన్ని మెదడు స్వీకరించి, ఈ రెండు కళ్ళ నుండి రెండు 2-డైమన్షన్ దృశ్యాలని కలిపి త్రీ డైమన్షన్ (త్రీడీ)లో దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఆ విధంగా రెండు కళ్ళ నుండి అందిన దృశ్యాల మధ్య ఉండే తేడాలను గమనించి, ఆ దృశ్యాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఏ డెప్త్‌లో ఉన్నాయనేది మెదడు నిర్ధారిస్తుంది. ఒకవేళ రెండు కళ్ళ నుండి అందిన రెండు దృశ్యాలను సరిగ్గా గనుక మెదడు కలపలేకపోతే, మనకు ఒకే దృశ్యం రెండుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అది టూ డైమన్షన్‌లోనే ఉంటుంది.
ఈ విషయం అర్థం కావడానికి ఓ ఉదాహరణ: ఏదైనా చెట్టు కొమ్మల ను రెండు కళ్ళతో చూడండి. కాస్సేపటి తరువాత ఒక కన్నును మూసు కుని, రెండవ కన్నుతో మీ దృష్టిని ఆ కొమ్మలపై సారించండి. ఒక నిమి షం తరువాత మీ కన్ను తెరవండి. ఆ కొమ్మలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రెండు విడివిడి దృశ్యాలు కలిసి ఒకే త్రీడీ దృశ్యంగా కనిపించాలంటే, ఎంత ఖచ్చితంగా మెదడు లెక్క గట్టాలో ఆలోచించండి. ఇది అర్థం కావాలంటే మరొక సింపుల్ ఉదాహరణ చెప్పాలి. మీరు కలర్ వాల్ పోస్టర్లను చాలాసార్లు చూసే ఉంటారు. ఒకొక్క సారి వాల్‌పోస్టర్‌పై ఒకే బొమ్మ, రెండింటిగా కొంచెం తేడాతో వేరే రంగులో కనిపిస్తుంది. బ్లర్‌గా కనిపిస్తుంది. సాధారణంగా పోస్టర్ ప్రింట్ చేసేటప్పుడు, 4 రంగులతో 4 ప్లేట్లు ఉపయోగించి ప్రింట్ చేస్తారు. అందులో ఏ ఒక్క ప్లేట్ కొంచెం ప్రక్కకి జరిగినా చాలు, ప్రింట్ అయిన బొమ్మ కదలి పోయినట్లు కనిపిస్తుంది. అందుకోసం ప్రెస్‌లో చాలా శ్రద్ధ తీసుకుని, జాగ్రత్తగా ప్లేట్ల స్థానాలను సరి చేస్తారు.మరి మన మెదడు ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఇప్పుడు మీకర్థమై ఉంటుంది. ఒక సెకనులో ఎన్నో దృశ్యాలను కళ్ళు మెదడుకు పంపుతూ ఉంటాయి. ఈ ఫ్రేమ్‌లన్నింటిని జాగ్రత్తగా, అతి తక్కువ సమయంలో కలిపి మనకు నిరంతరంగా మన ముందరి ప్రపంచం కనిపిస్తూ ఉండేలా చేస్తుంది మన మెదడు. ఒక నిమిషంలో మెదడు చేసే కాల్‌క్యులేషన్స్‌ని మనం కాల్‌క్యులేటర్ ఉప యోగించి చేస్తే, ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే ఆశ్చర్యమేయక మానదు. ఇలాంటి లోపం లేని వ్యవస్థను సృష్టించింది మరెవరో కాదు, సర్వమూ తెలిసిన సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ాయే. అల్లాహ్‌ా సృష్టిలో లోపం లేకపోవడాన్ని క్రింది ఖుర్‌ఆన్ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు.
”ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు! ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?” (ఖుర్‌ఆన్ -67:3)