చరిత్ర పుటల్లో మద్రసా

చరిత్ర జాతుల ప్రగతి, వికాస మార్గంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తి జీవితంలో అతని జ్ఞాపక శక్తి చాలా ముఖ్యమయినది. ఒకవేళ జ్ఞాపక శక్తి సన్నగిల్లినా, పూర్తిగా నశించినా అతని జీవితం అర్థరహితమయి పోతుంది. అలాగే ఒక జాతి, సముదాయ అభివృద్ధిలో దాని చరిత్ర చాలా ముఖ్యమయినది. ఒకవేళ ఆ జాతి, ఆ సముదాయం తన చరిత్రను విస్మరించినా, మరచిపోయినా దాని ఉనికి అర్థరహితమయి పోతుంది. అది నశించడంలో పెద్ద సమయమేమీ పట్టదు. ఒక సమయంలో ప్రపపంచ వేదిక మీద తమ తమ ఘనకీర్తిని చాటుకొని తర్వాత అనతి కాలంలోనే నశించిన జాతులు, తెగలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాలే దీనికి గొప్ప ఉదాహరణ. జాతి మరచిన చరిత్రను మళ్ళి జాతికి ప్రబోధించే మద్రసాల గురించి సంక్షిప్త సమాచారం అందజేయాలన్న చిరు ప్రయత్నమే ఈ వ్యాసం. అపోహాల పొరలు తొలగి అవగాహన చేసుకుాంరని ఆశిస్తూ…!!

అభ్యసన జరిగే, బోధన జరిగే చోటును మద్రసా అంటారు. అరబ్బీతో పాటు, ఫారసీ, ఉర్దూ, హిందీ, తుర్కీ, కుర్దీ, ఇండోనేషియా, మలేషియా, బోస్నియా భాషలలో కూడా మద్రసా అన్న పదం సర్వ సాధారణంగా పాఠశాల కోసం ఉపయోగించ బడుతోంది.

మద్రసా అరబ్బీ పదం. అర్థం పాఠశాల. ప్రాపంచిక విద్యకు సంబంధించిన పాఠశాల అయినా, ధార్మిక విద్యకు సంబంధించిన పాఠశాల అయినా అరబ్బీలో దాన్ని మద్రసా అంటారు. పాఠం చెప్పడాన్ని తద్రీస్‌, పాఠం చెప్పే అధ్యాపకుణ్ణి ముదర్రిస్‌, పాఠం నేర్చుకునే విధ్వార్థిని ముతదర్రిస్‌, ముతఅల్లిమ్‌, తాలిబ్‌ అనంటారు. దీని మూలం దరస, దర్స్‌ అనగా – ‘అభ్యసనం’ లేదా ‘బోధన’. అభ్యసన జరిగే, బోధన జరిగే చోటును మద్రసా అంటారు. అరబ్బీతో పాటు, ఫారసీ, ఉర్దూ, హిందీ, తుర్కీ, కుర్దీ, ఇండోనేషియా, మలేషియా, బోస్నియా భాషలలో కూడా మద్రసా అన్న పదం సర్వ సాధారణంగా పాఠశాల కోసం ఉపయోగించ బడుతోంది. భారత దేశంలో దాదాపు 30 వేల మదర్సాలు ఉంటాయన్నది ఒక అంచనా. అందులో కొన్ని ప్రసిద్ధమయినవైతే, అధిక శాతం పెద్దగా గుర్తింపు లేని ప్రాంతీయ పరమైన మద్రసాలే అని చెప్పొచ్చు.

ఇస్లాం విశ్వ జనీన ధర్మం, సంపూర్ణ జీవన విధానం. మనిషి జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో, అన్ని అంగాల్లోనూ అది మార్గదర్శకత్వం వహిస్తుంది. విషయావగాహనే సమసమ్య పరిష్కారానికి తొలి మెట్టు అంటుంది. ఈ కారణంగానే ”విద్యను అర్థించడం ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని)పై తప్పనిసరి విధి (ఫర్జ్‌)” అని నొక్కి వక్కాణించారు విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స). (ఇబ్ను మాజహ్‌)

ప్రవక్త (స) మక్కాలో ఉన్నప్పుడు దార్‌ అర్ఖమ్‌ మద్రసాగా ఉండేది. మదీనా వచ్చాక మస్జిదె నబవీ మద్రసాగా కొనసాగింది. మస్జిదె నబవీలో ఒక అరుగు ఉండేది దానిపై ఖర్జూరపు ఆకుల కప్పు ఉండేది. సుదూర ప్రాంతం నుండి ప్రజలు విధ్యార్జన నిమిత్తం ఇక్కడికి విచ్చేసే వారు. అలా వచ్చి అక్కడే ఉండి పోయిన వారిని అస్హాబె సుప్ఫహ్‌ అని చెప్పేవారు. సాధారణంగా వారి సంఖ్య 60 – 70కి ఇటు అటుగా ఉండేది. తర్వాత వారి సంఖ్య 400కు చేరుకుంది. హజ్రత్‌ అబూ హురైరా, హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ మస్‌వూద్‌, హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ, హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌, హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర.అ) వంటి మహా ఉద్ధండులయిన ప్రసిద్ధ హథీసు ఉల్లేఖకులు ఈ పాఠశాల, ప్రవక్త పాఠశాల నుండి పట్టా భద్రులయివారే.
ఓ సారి ‘మస్జిద్‌లో నేర్చుకునే, నేర్పించే వ్యక్తుల సమావేశంలో పాల్గొంటూ ప్రవక్త (స) అన్న మాట – ”నిశ్చయంగా నేను బోధకుని గా, ఉపాధ్యాయునిగా చేసి పంప బడ్డాను”. (ఇబ్ను మాజహ్‌)

ప్రవక్త (స) వారిపై అవతరించి తొలి వాణి ”చదువు” అన్నది. ఆయన తన సహచరులకు విద్యాబోధన చెయ్యడమే కాక, అవసరం ఉన్న చోటుకి ఉత్తీర్ణులయిన తన సహచరులను బోధకులుగా చేసి పంపేవారు కూడా. హజ్రత్‌ ముస్‌అబ్‌ బిన్‌ ఉమర్‌, హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమ్మె మక్తూమ్‌, హజ్రత్‌ మఆజ్‌ బిన్‌ జబల్‌ (ర.అ) మొదలయిన వారు ప్రవక్త (స) వారు నియమించి తొలి బోధ గురువులు. అలాగే అమ్మాన్‌ దేశానికి హజ్రత్‌ అలా హజ్రమీని, యమన్‌ వైపునకు హజ్రత్‌ అలీ (ర) గారిని ఆయన పంపారు. ప్రవక్త (స) వారి మరణానంతరం సహాబా (ర) ఆయన ఆదేశానికి కట్టుబడి ప్రపంచ నలుమూలల చేరు కొని విద్యా బోధనా బాధ్యతలు నిర్వర్తించారు. మక్కా, మదీనా, కూఫా, బస్రా, బాగ్దాద్‌, షామ్‌, మసర్‌ మొదలయి ప్రదేశాలకు వెళ్ళి విద్యా బోధన చేశారు. వారి ఆ నిశ్వార్థ, నిజాయితీ భరిత సేవల ఫలితంగా అరబ్బేతర భూభాగం నుండి ఇమామ్‌ అబూ హనీఫా, ఇమామ్‌ బుఖారీ, హసన్‌ బస్రీ (రహ్మ) విం మహా పండితులు వచ్చారు. ఈ మొత్తం థలో పాఠశాలగా మస్జిద్‌ ఉండేది. ప్రత్యేకత పాఠశాల భవనం ఉండేది కాదు. మస్జిద్‌ పాఠశాల నుండి వెలుగులోకి వచ్చిన తల పండిన పండితులు – ఇమామ్‌ మాలిక్‌, ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌, ఇమామ్‌ బుఖారీ, ఇమామ్‌ అబూ హనీఫా, ఇమామ్‌ షాఫయీ (రహ్మ) మొదలయిన వారు. పై పేర్కొన బడిన పండితులం దరి అధిక శాతం విద్యా బోధన మస్జిద్‌ మాధ్యమంగానే జరిగేది. ఆ తర్వాత సాంస్కృతిక విభాగం అన్న పేరుతో ప్రత్యేకంగా భవన నిర్మా ణం చోటు చేసుకుంది. అలా హిజ్రీ శకం 400లో నేసాపూర్‌లో తొలి సారి మద్రసా పేరుతో ఒక భవన నిర్మాణం అమలులోకి వచ్చింది. ‘మద్రసా బైహఖియ్యా’ దాని పేరు. ఆ తర్వాత హిజ్రీ శకం 500 మధ్య కాలంలో ఒక కళాశాలను స్థాపించారు. అది ‘జామియా నిజామియ్య బాగ్దాద్‌’గా ప్రసిద్ధి చెందింది.

సుబ్హుల్‌ అఅషా గ్రంథం ప్రకారం స్వయంగా మన దేశంలో ముస్లింల పరిపాలనా కాలంలో ఒక్క ఢిల్లీలో మాత్రమే 1000 మద్రసాలు ఉండేవి. హెమెల్టన్‌ మాట ప్రకారం – ఔరంగ జేబు పాలనా కాలంలో వివిధ విద్యలు సంబంధించిన పాఠశాలలు (మద్ర సాలు) ఠఠ్ఠా అనే పట్టణంలో 400కు పై చిలుకు ఉండేవి. ‘బీజా పూర్‌’లో మహ్‌మూద్‌ గావాఁ నిర్మించిన విద్యాలయం ఎంతి అస మానమయినదో నేడు మిగిలున్న దాని శిథిలాల్ని చూస్తే తెలిసి పోతుంది. భారత దేశం రాజుల్లో ఆదిల్‌ షాహ్‌ా అనే రాజుకి విద్యా బోధన పట్ల ఎంత శ్రద్ధ ఉండే దంటే, ప్రతి పాఠశాల (మద్రసా)

పాకశాలలో రోజూ ముప్పూటలా బిర్యానీ వడ్డించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. ప్రతి విద్యార్థికి ఒక ‘హూన్‌’ (అప్పి కరెన్సీ) ఇవ్వ బడేది. మన పూర్వీకులు స్థాపించిన ఈ విద్యాలయాలు ఎర్ర కోటకన్నా దృఢ మయినవి, చార్‌ మీనార్‌ కన్నా ఎత్తయినవి, తాజ్‌ మహల్‌ కన్నా అందమైనవి.

భారత దేశంలో ప్రవక్త (స) సందేశం:

భారత దేశంలో దైవ ప్రవక్తల సందేశం ఎప్పుడో వచ్చినప్పికీ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రబోధనా పరిమళాలు మాత్రం ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి హయాంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఇస్లాం కాంతి చేరుకుంది. భారత దేశంలో దాదాపు 800 సంవత్సరాలు ముస్లిం పరిపాలన సాగింది. ప్రపంచంలోకెల్లా భారత ప్రజల్లో గల ఆధ్యాత్మిక భావాలు పూర్తి భిన్నమయినవి. మస్జిద్‌ల నిర్మాణం, మద్ర సాల స్థాపన, రమజాన్‌ ధర్మ నిష్ఠ, జకాత్‌ చెల్లింపు, హజ్జ్‌, ఉమ్రాల కోసం తపన వారిలో ఆధ్యాత్మిక చింతనకు ఆనవాలు.

మద్రసాలలో ఏం చదివిస్తారు?

ఇస్లామీయ విద్య: ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానం, హథీసు ప్రబోధనం, అఖీదా, ఇస్లామీ ఫిఖహ్‌, పిఖహ్‌ మూలాలు, హథీస్‌ మూలాలు, వారసత్వ హక్కుల చట్టం, ప్రవక్త ముహమ్మద్‌ (స) మరియు ఇతర దైవ ప్రవక్తల జీవిత గాథలు, ఇస్లామీయ చరిత్ర.
అరబీ భాష: నహూ, సర్ఫ్‌, అరబ్బీ వ్రాయడం, చదవడం.
ఇతర విద్యలు: తత్వ శాస్త్రం, తర్క శాస్త్రం, ఆంగ్లం, ప్రాంతీయ భాష, సైన్స్‌, గణితం, భారత దేశ చరిత్ర, ఫారసీ మొదలయినవి.

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ మేళవించాలి అన్న ప్రతి పాదన ఎంత అసంబద్ధమో, ప్రాపంచిక విద్యను ధార్మిక విద్యను మేళవించాలి అన్న ప్రతిపాదన కూడా అంతే ఆసంబద్ధం. చాలా మంది ప్రాపంచిక విద్యను అర్జించిన ముస్లిములే ధార్మిక పాఠశాలలలో విద్యనభ్యసించిన వారిని చిన్న చూపు చూస్తారు. వారేదో చీకటి యుగానికి చెందిన వారుగా తల పోస్తుాంరు. వారి వల్లనే ముస్లిం సమాజం అధోగతి పాలయ్యిందని బలంగా నమ్ముతుంటారు. సరే ఒకవేళ ఆ విధ్యార్థి తన వృత్తి పరంగా ఒక ఎలక్ట్రిషన్‌, ప్లంబర్‌, మెకానిక్‌ అయితే వీరు అతని మాట అంతే శ్రద్ధగా వింటారా? లేదా ఒక మస్జిద్‌ ఇమామ్‌, లేదా ఒక మద్రసా పండితుని మాట వింటారా? నేటికీ చిన్న చిన్న జీతాలు తీసుకుంటూ చింత లేకుండా అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సేవలందించే వారి లో ముందు వరుసలో మద్రసాల విద్యార్థులే మనకు కన బడతారు అంటే కొందరికి అతిశయోక్తి అన్పించవచ్చు, కానీ ఇదే నిజం! అలాగే ముస్లిం సముదాయానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య ఎదుర యినా వీరే ముందున్నారు, ముందుంటారు కూడా.

వివరాల్లోకి వెళితే,
1937లో అబుల్‌ మహాసిన్‌ ముహమ్మద్‌ సజ్జాద్‌, ముఫ్తీ కిఫాయతుల్లాహ్‌ వంటి పండితుల కృషితో షరీయత్‌ అప్లికేషన్‌ ఆక్ట్‌ తయారయ్యింది. స్వాతంత్ర అనంతరం కామన్‌ సివిల్‌ కోడ్‌ తేవాలన్న ప్రతి పాదన చాలా బలంగానే వేదిక మీదకు తీసుకు రావడం జరిగింది.1972లో లేపాలక్‌ సమస్యను తీసుకొని ఈ ప్రతిపాదన మరింత తీవ్ర తరమయ్యింది కూడా. అలాంటి తరుణంలో సయ్యిద్‌ మిన్నతుల్లాహ్‌ రహ్మానీ, ఖారీ ముహమ్మద్‌ తయ్యిబ్‌, ముఫ్తీ బుర్హానుద్దీన్‌, మౌలానా అబుల్‌ లైస్‌ ఇస్లాహీ, అహ్మద్‌ రజా ఖాన్‌ బరేల్వీ (రహ్మ) మొదలయిన పండితుల సమిష్టి కృషితో ‘ముస్లిం పర్సనల్‌ లా’ బోర్డు అముల్లోకి వచ్చింది. ఖాదియానీ ఉపద్రవం ఊపందుకున్న విపత్కర సమయం. జవాహర్‌ లాల్‌ నెహ్రూ కూడా మద్దతు తెలిపిన సమయం అది. అలాంటి ప్రమాదకర సమయంలో అల్లామా నూర్‌ షాహ్‌ కష్‌మీరీ, సయ్యిద్‌ ముహమ్మద్‌ అలీ మోంగీరీ, నూరుల్లాహ్‌ సాహెబ్‌ హైదరా బాదీ, సనావుల్లాహ్‌ అమ్రత్‌సరీ, ముహమ్మద్‌ హుసైన్‌ బాలవీ, సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూదీ మొదలయిన ఉద్దండుల అవిరళ కృషితో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేక గళం విన్పించింది. వారిని అందరి ఏకాభిప్రాయంతో ఇస్లాం నుండి వెలివేయడం జరిగింది.

భారత స్వాతంత్ర పోరాటంలో పండితుల పాత్ర:

ఇమ్దాదుల్లాః మక్కీ అందరి వద్ద ఏకగ్రీవ పండితులు. ఆయన సలాహతో మద్రసాల సంస్థాపన ప్రారంభమయ్యింది. దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌ బంద్‌, బాఖియాతుస్సాలిహాత్‌, జామియా నిజామియా, మద్రసా ఇమ్దా దియా వంటి ధార్మిక పాఠశాలల నుండి స్వాతంత్ర పోరాటం చెయ్యాల్సిందిగా ఫత్వాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అమరగతులయిన పండితుల సంఖ్య వేలల్లో ఉంటుంది. మచ్చుకు కొందరు – షా వలియుల్లాహ్‌ ముహద్దిస్‌ దెహ్లవీ, మౌలానా అబ్దుల్లాహ్‌ అహీమాబాదీ, మౌలానా అహ్మదుల్లాహ్‌ సాదిఖ్‌ పూరీ, కాకా ముహమ్మద్‌ ఉమర్‌ మద్రాసీ, మౌలాన అబ్దుల్‌ జలీల్‌ అలీ గడ్‌, డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌ బిహారీ, మౌలనా రజుయుద్దీన్‌ బదాయూనీ (ర.అ).

నేడు పండితుల అవసరం

మదీనాలో 80 మంది ఇస్లాం స్వీకరిస్తే వారి శిక్షణార్థం ప్రవక్త (స) ముస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌ (రజి) గారిని మక్కా నుండి మదీనాకు బోధకునిగా చేసి పంపారు. అంటే ప్రతి 80-100 మందికి ఒక బోధకుని అవ సరం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే మొత్తం భారత దేశంలో ధార్మిక పండితుల సంఖ్య ఒక్క శాతం కూడా లేదు. 20-25 కోట్ల ముస్లిం జనాభాకి ఒక్క శాతం పండితులు అంటే, 20 లక్షల మంది పండితులు ఉండాలి. వాస్తవం ఏమిటంటే పూర్తి దేశంలో ప్రస్తుతం 2 లక్షల మంది కూడా పండితులనబడేవారు లేరు. ఆ రకంగా ప్రతి వెయ్యి మందికి ఒక్క పండితుడు కూడా లేడు. ఉన్నా ఆ 2 లక్షల మందిలో అందరూ విద్యాబోధ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు అని చెప్ప లేము. ఒకవేళ చేస్తున్నా వారు తమ విద్యా బోధనా బాధ్యతను సజావుగా, నిజాయితీగా చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. అంటే ముస్లిం జన సామాన్యం ధార్మికంగా ఎంత దీన స్థితిలో ఉందో ఊహించవచ్చు. విద్యా బోధ అంటే స్వచ్ఛమైన తౌహీద్‌ హితబోధ. ఏ సముదాయ విషయం ఎలా ఉన్నా, ముస్లిం సముదాయానికి సంబం ధించిన విజయం మాత్రం కేవలం స్వచ్ఛమైన తౌహీద్‌ పైనే ఆధార పడి ఉంది. ముస్లిం మనుగడకు మార్గం అయిన స్వచ్ఛమయిన తౌహీద్‌ బోధన కేవలం మద్రసాలలో మాత్రమే బోధించడం జరుగుతుంది. అలాిం మద్రసాలు మూత బడితే తౌహీద్‌ భావనకు ముస్లిం సమాజం దూరం అవుతుంది. తౌహిద్‌కి దూరమయిన ముస్లిం సముదాయనికి మనుగడ లేదు, ఉండదు.

”విశ్వాసులందరూ బయలు దేరవలసిన అవసరం లేదు. వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలు దేరితే చాలు. మిగిలినవారు ధర్మ అవగాహనను పెంచుకుని, వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవర్చుకునేందుకు గాను, వారికి భయ బోధ చేయాల్సింది. కాని ఇలా ఎందుకు జరగ లేదు?” (అత్తౌబహ్‌ా: 122) అని అల్లాహ్‌ ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పుకోవ డానికి మనం సిద్ధంగా ఉన్నామా?

Related Post