Originally posted 2013-04-24 09:45:27.
ముందు మాట
పూజా పురస్కారాలకు, దాస్యానికి తగినవాడు, మన అందరి ఆరాధ్యదైవం, స్తుతి స్తోత్రానికి అర్హుడు అల్లాహ్ మాత్రమే. మనందరి ప్రియ ప్రవక్త, సకల జీవరాసు ల్లోకెల్లా శ్రేష్ఠులు ముహమ్మద్ స) వారిపై, ఆయన వంశీయులు ఆయన అనుచరుల పై వారిని అభిమానించే వారందరిపై అల్లాహ్ కృపాకటాక్షాలు కురియుగాక!
తాము అవలంబించే ధర్మం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆసక్తి గలవారి ప్రయోజనార్థం ప్రార్థనల విషయంలో వారిని మరింత విజ్ఞానవంతు లుగా తీర్చిదిద్దడం కోసం ఈ పుస్తకాన్ని ప్రవేశ పెడుతున్నాము. ఇందులో ముఖ్యంగా శుచీశుభ్రతల ప్రస్తావనతో పాటు ప్రార్థనల వివరాలున్నాయి. ఈ పుస్తకాన్ని షాఫయీ ఫిఖహ్‌ను అనుసరించి అనేక గ్రంథాల ఆధారంగా తయారు చేయడం జరిగింది. సులభ శైలిలో అందరికి అర్థమయ్యేలా ప్రార్థనల సమాచారం అందజేయాలన్నదే ఈ పుస్తక ముఖ్య ఉద్దేశ్యం. ముస్లిములకు, న్యూముస్లిములకు అందరికీ అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని సులభమయినా పాఠ్యాంశం (సిలబస్)గా చేశాము. ఈ పుస్తకంలో ప్రతి పాఠం చివర్లో విద్యార్థి ఆలోచనను పదనుపెట్టే ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. తద్వారా తానెంత వరకు గ్రహించాడో తనకే బోధపడుతుంది.
చదువరుల కోసం అనేక భాషల్లో అత్యుత్తమ సాహిత్యాన్ని అందజేసే కృషి చేస్తోంది ఐపిసి. అదే కోవకు చెందిన ఈ పుస్తకం అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మా ఈ చిరు ప్రయత్నాన్ని అల్లాహ్ స్వీకరించి ఆమోదముద్ర వేసి ఈ పుస్తక ప్రచురణలో తోడ్పడిన వారందరికి మంచి ప్రతిఫలం ప్రసాదించాలని కోరు కుంటున్నాము.
వ సల్లల్లాహుమ్మ వ సల్లిమ్ వ బారిక్ అలా అష్‌రఫి ఖల్‌ఖిల్లాహి సయ్యిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్‌బిహి వ మన్ వాలాహు, వ ఆఖిరు దావానా అనిల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్!
మొదటి చాప్టర్-1 ఫిఖహ్‌ా పాక్షికాలు
నిశ్చయంగా ఇస్లామీయ ఫిఖహ్‌ా మనిషి సంఘసమాజానికి అవసరమైన సకల విధమైనటువంటి ఆదేశాలు కలిగి ఉండటం మనం గమనించగలం
1.6 ఫిఖహ్ పారిభాషికాలు
1. ఫర్జ్: ఖచ్చితంగా చేయవలసిందిగా షరీయతు ఆదేశం. దీన్ని చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, వీటిని విడనాడటం
వల్ల పాపం కలుగుతుంది.
2. ఫర్జె ఐన్: యుక్తవయసుకు చేరిన ప్రతివ్యక్తి ద్వారా ఖచ్చితంగా కోరబడే ఆదేశాలు. ఉదాహరణకు నమాజు.రోజ,
హజ్ స్తోమత గలవారి కోసం. ఈ ఆరాధనల్ని ప్రతి వ్యక్తి పాటించి తీరాల్సిందే. కొందరు పాటించి కొందరు వదిలేస్తే
విధి నెరవేరదు.
3. ఫర్జె కిఫాయా: ముస్లింల ఒక సమూహంతో కోరబడే ఆదేశాలు.ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదు. అంటే
కొందరు ఈ విధిని నిర్వర్తిస్తే మిగతా వారు మినహాయించబడతారు. ఏ ఒక్కరూ పాటించకపోతే అందరూ
పాపాత్ములవుతారు. ఉదాహరణకు: జనాజా నమాజు, శవ సంస్కారాలు వగైరా.
4. సున్నతు: సున్నత్ లేదా మన్దూబ్, చేయమని షరీయతు కోరిందేగాని ఖచ్చితంగా చేయాలని ఖరారు చేయని కార్యాలు వాటిని పాటించడం వల్ల పుణ్య లభిస్తుంది, వదలడం వల్ల ఎలాంటి పాపం ఉండదు.
5. సున్నతె ముఅక్కదా: ఏ క్రియల్నయితే దైవప్రవక్త(స) జీవితమంతా క్రమం తప్పకుండా పాటించారో ఒకటి రెండు
సార్లు తప్ప అవి.
6. సున్నతె ముస్తహబ్బహ్: ఏ కార్యాల్నయితే దైవప్రవక్త(స) కొన్నిసార్లు చేశారో,మరి కొన్ని సార్లు వదిలేసారో అవి.
7. ముబాహ్: వీటిని చేయడం విడనాడటం రెండూ సమానమే. వీటిని చేయాలనిగాని, విడనాడమనిగాని షరీయతు
ఆదేశం లేదు గనక వీటి చేయడం చేయకపోవడం వల్ల ఎలాంటి పుణ్యము పాపము లభించదు.
8. మక్రూహ్: విడనాడమని ఖచ్చితంగా కోరని విషయాలు.
9. హరామ్: షరీయతు ఖచ్చితంగా అధర్మంగా ఖరారు చేసినది. వీటిని విడనాడటం వల్ల దైవవిధేయత, మరియు
చేయటం వల్ల పాపం, శిక్ష పడుతుంది.
10. ఇజ్మా: ఏకాలమందైననూ ధర్మపండితులందరూ కలిసి ఏదేని విషయంలో ఏకగ్రీవంగా అంగీకారం తెలుపడం,
అలా అంగీకరించబడిన విషయాన్ని అమలు పర్చడం తప్పనిసరి అయిపోతుంది.
11. ఖియాస్: షరీయతు పరమయిన ఆదేశాలు లేని, దొరకని విషయంలో కారకాలు, అవసరాలను బట్టి మానవ
మేధననుసరించి తీర్మానించే విషయాలు. అయితే ఈ విషయంలో ముందు ఖుర్‌ఆన్,హదీసులను, తర్వాత ఇజ్మాను
సంప్రదించాల్సి ఉంటుంది.
1.7 ఫిఖహ్ అభివృద్ధి
1.ప్రవక్త(స) వారి కాలంలో ఫిఖహ్
2.సహాబాల కాలంలో ఫిఖహ్
3. నాలుగు మస్లక్‌ల ఆధారంగా ఫిఖహ్
– ఇమామ్ అబుహనీఫా నొమాన్ బిన్ సాబిత్ కూఫీ. (హిజ్రి శకం 80 – 150)
– ఇమామ్ అబూ అబ్దుల్లా మాలిక్ బిన్ అనస్ (హిజ్రి శకం 93 – 179)
– ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయీ (హిజ్రి శకం 150-204)
– ఇమామ్ అబూ అబ్దుల్లా అహ్మద్ బిన్ హంబల్ షైబానీ (హిజ్రి శకం 164-241)
పరీక్ష 1
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) త్రాగటం (ఆ) ఫర్జ్ (ఇ) సున్నత్ (ఈ) షాఫయీ (ఉ) నిద్ర
1.ఖుర్‌ఆన్ మరియు……………… ఇస్లాం షరీయతు మూలాలు.
2. ………………….మరియు………………… ఇస్లాంలో ముబాహ్‌ా క్రిందికి వస్తాయి.
3. చేయడం వల్ల పుణ్యం, చేయకపోవడం వల్ల పాపం దాన్ని…………… అంటారు.
సరైన సమాధానం ఎన్నుకోండి:
4.ముస్లింలలో నాలుగు మస్లక్‌లు ఉన్నాయి. మీరు ఈ పుస్తకంలో చదివే మస్లక్:
(ఎ) హంబలీ
(బి) షాఫయీ
(సి) మాలికీ
5. సువార్త ఇస్లామీయ షరీయతు మూలాల్లోని ఒక మూలం
(ఎ) అవును
(బి) కాదు
క్రింద ఇవ్వబడిన పారభాషికాలకు సరైన అర్థం ఎన్నుకోండి
(ఎ) ఖుర్‌ఆన్ 6.చేస్తే పుణ్యం చేయకపోతే పాపం లేదు
(బి) ఇజ్మా 7. చేస్తే పాపం, వదిలితే పుణ్యం
(సి) ఖియాస్ 8. ఇస్లామీ షరీయతుకి ప్రథమ మూలం
(డి) ఫర్జ్ 9. వదిలితే పుణ్యం లేదు చేస్తే పాపం ఉండదు
(ఇ) సున్నత్ 10. చేస్తే పుణ్యం లేదు,వదిలితే పాపం
(ఎఫ్) హరామ్ 11. చేయడం చేయకపోవడం రెండు సమానమే
(జి) మక్రూహ్‌ా 12.ఏకాలమందైననూ ధర్మపండితులందరి ఏకగ్రీవ అభిప్రాయం
(ఎచ్) ముబాహ్‌ా 13.షరీయత్ ఆదేశంలేని విషయంలో కొన్ని ఆధారల రీత్యా ఏర్పరచుకొనే అభిప్రాయం.