చేపలు ఘాటైన వాసన వస్తుంటాయి ఎందుకు?

చేపలు ఘాటైన వాసన వస్తుంటాయి ఎందుకు?

 

సముద్రాలలోనూ, ఉప్పు నీటిలోనూ ఉండే చేపలు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకుగాను’ట్రై మిథైల్‌ ఎమైన్‌ ఆక్సైడ్‌’ తోడ్పడుతుంది. ఇది సముద్ర చేపలలో ఉండి ‘డీహైడ్రేషన్‌’ కాకుండా తోడ్పడుతుంది. ఈ బ్యాక్టరీయా చేపల శరీరం మీద, పొట్ట లోపలా ఉంటుంది. ఎప్పుడ యితే మనం చేపలను నీటిలోంచి బయటకు తీస్తామో అప్పుడు ఈ బ్యాక్టరీయా ట్రైమిథైల్‌ ఎమైన్‌ ఆక్సైడ్‌ను విభజిస్తాయి. ఫలితంగా చేపలు బయటకు తీయగానే వెలువడిన ట్రైమిథైల్‌ ఎమైన్‌ అనే పదార్థం కార ణంగా చేపలు ఘాటైన వాసన వస్తుంటాయి.

ఈ టైమిథైల్‌ ఎమైన్‌ ద్వారా చేపలు తాజానా? నిల్వనా అన్న విష యాన్ని తెలుసుకోవచ్చు. ఏ విధంగానంటే, అవి మరింత ఘాటయిన వాసన వస్తుంటాయి. ఎందుకంటే, నీళ్ళలో నుంచి తీసి చాలా సేపు అయితే వాటి మీద అత్యధిక పరిమాణంలో ట్రైమిథైల్‌ ఏర్పడి ఉం టుంది. అందువల్ల మరింత ఘాటైన వాసన వస్తుంది. చేపలు తాజా అయినప్పుడు వాటిని అప్పుడే నీళ్ళలోంచి బయటకు తీసి ఉంటే అంత ఘాటైన వాసన ఉండదు. కాబట్టి చేపల వాసన బట్టి అవి తాజా చేపలా? నిల్వ చేపలా అన్న సంగతి తెలుసుకోవచ్చు.

ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆయనే సముద్రాన్ని మీకు వశ పర్చాడు – మీరు అందులోంచి తాజా మాంసాన్ని తినటానికి, మీరు తొడిగే ఆభ రణాలను అందులోంచి వెలికి తీయడానికి. నీవు చూస్తావు! ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్ర హాన్ని  అన్వేషించటానికి, కృతజ్ఞతా పూర్వకంగా మసలుకోవడానికి (ఈ ఏర్పాటు చేయబడింది)”. (అన్నహ్ల్ : 14)

Related Post