ఘోర పాపాలు

Originally posted 2013-02-07 08:23:09.

91412777

ఘోర పాపాలు

ఈవిధమైన మానవ దుస్థితికి కారణం మనిషి పాపం, అపరాధం. ఈ దుస్థితి నుండి మనలను ఎవరు రక్షిస్తారు? మతమా? మన మతాచారములా? మతగురువులా? పాలకులా? నాయకులా? ఎవరు రక్షిస్తారు?

ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
“మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయిఉండండి, తరు వాత మీకు ఎలాంటి సహాయం లభించదు. (జుమర్ : 53,54)

హజ్రత్ అబూ హురైరా (ర) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి,
”మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు –
(1) అల్లాహ్ కి సాటి కల్పించటం;
(2) చేతబడి చేయటం;
(3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం;
(4) వడ్డీ సొమ్ము తినడం;
(5) అనాధ సొమ్మును హరించి వేయడం;
(6) ధర్మయుద్దంలో వెన్నుజూపి పారిపోవడం;
(7) ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం.

[సహీహ్ బుఖారీ : 55 వ ప్రకరణం – అల్ వసాయా, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహ్ …. ఇన్నల్లజీనయాకులూన అమ్వాలల్ యతామాజుల్మా]

Related Post