Originally posted 2013-03-25 22:03:49.
ఇస్లాం హౌస్
క్రింద తెలుప బడిన అతి ఘోరమైన ఈ పది కార్యములు మానవుణ్ణి ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింపచేయును.
1. అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు ముస్లింలు కాజాలరు.
అన్నిసా 4:116 :- “అల్లాహ్‌కు సాటి (భాగస్వామ్యం) కల్పించు వారిని అల్లాహ్ అస్సలు క్షమించడు. షిర్క్ తప్ప వేరే పాపములను అల్లాహ్ తన ఇష్టానుసారం క్షమిస్తాడు”
అల్ మాయిద 5:72:- “నిశ్చయంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించువారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు అతని నివాసము నరకమే, పాపాత్ములకు సహాయం చేయువారు ఎవ్వరూ లేరు”. అంటే అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు అవిశ్వాసులు. చనిపోయిన వారిని వేడుకొనుట, సమాధులకు మొక్కుట, అల్లాహ్ పేరుమీద కాకుండా వేరేవాని పేరుమీద బలి ఇచ్చుట..మొదలైనవన్నీ షిర్క్‌లోని విధానములు.
2. తమకి మరియు అల్లాహ్‌కి మధ్య ఎవరినైనా మధ్యవర్తి (సిఫార్సు చేసేవాడు)గా చేసి వేడుకొనుట, మరియు వారిని నమ్ముట వారి సిఫారసుపై నమ్మకం ఉంచుట అవిశ్వాసమే అవుతుందని ఇస్లామీయ పండితులందరి అభిప్రాయం.
3. ఎవరైనా, అవిశ్వాసిని, లేదా బహుదైవారాధకుడిని, అవిశ్వాసి అని నమ్మనివారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే, వారు కూడా అవిశ్వాసులుగా భావించబడతారు.
4. ఎవరైనా వేరే విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లమ్ తెచ్చిన నిబంధనల (షరిఅహ్) కంటే ఉత్తమమైన విధానమని అనుకుంటే వారు అవిశ్వాసులు. వేరే వారి మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ మాటపై ప్రాముఖ్యత ఇచ్చువారు అవిశ్వాసులు.
5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క షరిఅహ్ (నియమనిబంధనల) ను హృదయపూర్వకంగా స్వీకరించకపోవుట అవిశ్వాసము. అతను దానిపై అమలు చేస్తున్నా మనస్సు దానికి వ్యతిరేకంగా నిర్ణయించిన ఎడల అతను అవిశ్వాసి అగును.
ముహమ్మద్ 47:9:- “ఎందుకంటే వారు అల్లాహ్ అవతరించిన షరియత్‌ను అంగీకరించలేదు. అందుచే అల్లాహ్ వారి కార్యములను వ్యర్ధము చేసేను.”
6. అల్లాహ్ గురించి గాని ప్రవక్త గురించి గాని లేదా షరిఅహ్ ను ఎగతాళి చేసినవారు అవిశ్వాసులు.
అత్తౌబా 9:65–66:- “ప్రకటించండి! ఏమిటీ, అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయటానికా? మరియు ఆ ప్రవక్తతో ఎగతాళియా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”
7. జాదు (చేతబడి) చేయుట మరియు చేయించుట కూడా అవిశ్వాసుల పని.
అల్ బఖర 2:102 :- “వారిద్దరూ అప్పుడు వరకూ ఎవ్వరికీ జాదు నేర్పించేవారు కాదు. ఇలా అనే వరకూ మేము ఒక పరీక్ష నీవు అవిశ్వాసానికి పాల్పడకు”
8. విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు.
అల్ మాయిద 5:51:- “మీలో ఎవరైనా వారితో (అవిశ్వాసులతో) స్నేహం చేసిన యెడల నిశ్చయంగా వారు వారిలో వారే. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ ఋజుమార్గం చూపడు.”
9. ఇస్లామీయ షరిఅహ్‌లో కొన్నింటిని విడిచిపెట్టే సదుపాయం కొందరికుందని భావించువారు అవిశ్వాసులు. ఆలె ఈమ్రాన్ 3:85 :- “ఎవరైనా విధేయతా ధర్మం (ఇస్లాం) కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల, వారి విధానం స్వీకరించబడదు. ప్రళయదినం రోజున అతడు నష్టపోయేవారిలోని వాడగును.”
10. అల్లాహ్ యొక్క దీన్ (ధర్మం)తో సంబంధం లేకుండా జీవించువారు, ఇస్లాం గురించి నేర్చుకోనివారు, ఆచరించనివారు అవిశ్వాసులు.
అస్సజ్దా 32:22:- “తన ప్రభువు వాక్యాల ద్వారా బోధించబడినపుడు, వాటి పట్ల విముఖుడయ్యే వానికంటే దుర్మార్గుడెవరు? అటువంటి అపరాధులతో మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాము.”
పైన తెలుపబడిన అవిశ్వాసకార్యముల నుండి మేము చాలా జాగ్రత్త వహించాలి. అల్లాహ్ యొక్క భయంకర శిక్షల నుండి భయపడుతూ, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకుంటుండాలి మరియు అల్లాహ్ ఈ పాపాల నుండి మమ్మల్ని రక్షించమని, కాపాడమని వేడుకుంటుండాలి. యా అల్లాహ్! మమ్మల్ని అవిశ్వాసం నుంచి కాపాడు. ఆమీన్.