సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం

ప్రామాణిక హదీసుల సంకలనాలలో సాటిలేని మేటి గ్రంథం సహీహ్‌ బుఖారీ. 'సహీహ్‌' అంటే అత్యంత ప్రామాణిక మైనది, ఖచ్చితమైనది, తిరుగులేనిది అని అర్థం. హదీసు విద్యలో నిష్ణాతులైన ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ - రహ్మ.లై - (జననం: హి.శ. 194 - మరణం: హి.శ. 256) అపూర్వ కృషి ఫలితమే ఈ 'సహీహ్‌ బుఖారీ'. దివ్య ఖుర్‌ఆన్‌ తర్వాత భూమండలంలో అత్యంత ప్రామాణికమైన, నిజమైన గ్రంథ మేదైనా ఉందంటే అది 'సహీహ్‌ బుఖారీ' మాత్రమే నన్న విషయంతో హదీసు వేత్తలు, పండితులు, ఇమాములంతా ఏకీ భవిస్తారు.

ప్రామాణిక హదీసుల సంకలనాలలో సాటిలేని మేటి గ్రంథం సహీహ్‌ బుఖారీ. ‘సహీహ్‌’ అంటే అత్యంత ప్రామాణిక మైనది, ఖచ్చితమైనది, తిరుగులేనిది అని అర్థం. హదీసు విద్యలో నిష్ణాతులైన ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ – రహ్మ.లై – (జననం: హి.శ. 194 – మరణం: హి.శ. 256) అపూర్వ కృషి ఫలితమే ఈ ‘సహీహ్‌ బుఖారీ’. దివ్య ఖుర్‌ఆన్‌ తర్వాత భూమండలంలో అత్యంత ప్రామాణికమైన, నిజమైన గ్రంథ మేదైనా ఉందంటే అది ‘సహీహ్‌ బుఖారీ’ మాత్రమే నన్న విషయంతో హదీసు వేత్తలు, పండితులు, ఇమాములంతా ఏకీ భవిస్తారు.

నెలవంక సౌజన్యంతో

మహా ప్రవక్త (స) వారి మహితోక్తులు (హదీసులు) దివ్య ఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటివి, విశదీకరణ లాంటివి. హదీసుల ను ఉపేక్షించి ఖుర్‌ఆన్‌ సందేశాన్ని అవగాహన చేసుకోగలమని అనటం అర్థరహితం. అసంభవం కూడా. సృష్టికర్త అవతరింపజేసిన అంతిమ దైవగ్రంథంతో పాటు, అంతిమ దైవప్రవక్త (స) వారి హదీసులు కూడా నేడు ప్రపంచంలో సురక్షితంగా, యథాతథంగా ఉన్నాయి. ఈ సౌభాగ్యం పొందినందుకు ముస్లిం సముదాయం ఒకింత గర్వపడాలి. ప్రియ ప్రవక్త (స) నోట జాలువారిన ఒక్కో మహితోక్తిని ఎంతో జాగ్రత్తగా, మరెంతో నిజాయితీగా – ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా – గ్రంథస్థం చేసి మన వరకూ చేర్చిన మహనీయ హదీసువేత్తల అణువణువుకూ స్వర్గ సౌఖ్యాలను ఆస్వాదించే భాగ్యాన్ని అల్లాహ్‌ా ప్రసాదించుగాక! మీ ముందున్న ఈ వ్యాసంలో ఆ హదీసువేత్తలు సంకలనం చేసిన ఉద్గ్రంథాల గురించి సంక్షిప్తంగా పరిచయం చేయటం జరిగింది. సహీహ్‌ా బుఖారీ

ప్రామాణిక హదీసుల సంకలనాలలో సాటిలేని మేటి గ్రంథం సహీహ్‌ా బుఖారీ. ‘సహీహ్‌ా’ అంటే అత్యంత ప్రామాణిక మైనది, ఖచ్చితమైనది, తిరుగులేనిది అని అర్థం. హదీసు విద్యలో నిష్ణాతులైన ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ – రహ్మ.లై – (జననం: హి.శ. 194 – మరణం: హి.శ. 256) అపూర్వ కృషి ఫలితమే ఈ ‘సహీహ్‌ బుఖారీ’. దివ్య ఖుర్‌ఆన్‌ తర్వాత భూమండలంలో అత్యంత ప్రామాణికమైన, నిజమైన గ్రంథ మేదైనా ఉందంటే అది ‘సహీహ్‌ా బుఖారీ’ మాత్రమే నన్న విషయంతో హదీసు వేత్తలు, పండితులు, ఇమాములంతా ఏకీ భవిస్తారు. అసలిలాంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేయాలన్న ఆలోచన ఇమామ్‌ బుఖారీ (రహ్మ.అలైహి,) గారికి ఎందు కొచ్చింది? దీని గురించి ముహమ్మద్‌ బిన్‌ సులైమాన్‌ బిన్‌ ఫారిస్‌ ఇలా అంటున్నారు – ఇమామ్‌ బుఖారీ (రహ్మ.అలైహి,) చెబుతూ ఉండగా నేను విన్నాను: ”ఒక రోజు రాత్రి నేను మహా ప్రవక్త (స)ను కలలో చూశాను. ఆయన (స) ఒక సదనంతో ఆసీనులై ఉన్నారు. నా చేతిలో విసనకర్ర ఉంది. దాంతో నేను విసురుతూ ఆయన (స) ముఖార విందంపై వాలే ఈగలను తోలుతున్నాను. తెల్లవారాక నేను ఈ కల భావార్థం గురించి నిపుణులను సంప్రదించాను. దైవప్రవక్త (స) వైపు ఆపాదించబడే కట్టు కథలను, కాల్పనిక హదీసులను తొల గించే మహా కార్యం నీ వల్ల జరిగే అవకాశముందని వారు నాకు శుభవార్త విన్పించారు. నిజమైన, ప్రామాణికమైనహదీసులను సంకలనం చేసే గొప్ప కార్యానికి పూనుకోవాలన్న ఆలోచన ఆనాడే నాలో మొగ్గ తొడిగింది.

అంతే. పదహారేళ్ళ కఠోర పరిశ్రమ తర్వాత ‘సహీహ్‌ా బుఖారీ’ పేరుతో ఓ అపురూపమైన హదీసు గ్రంథం రూపు దిద్దుకుంది. (సహీహ్‌ా బుఖారీ వ్యాఖ్యాన గ్రంథమైన ‘ఫత్హుల్‌ బారీ’లో వ్యాఖ్యాత హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ అస్ఖలానీ (రహ్మ.అలైహి,) వ్రాసిన పీఠిక ఆధారంగా)

ఆ రోజులల్లోనే ఆయన గురువర్యులైన ఇమామ్‌ ఇస్‌హాఖ్‌ (రహ్మ.అలైహి,) ఆయనతో మాట్లాడుతూ, ‘దైవదాసుల్లో ఏ ఒక్కడైనా ముందుకు వచ్చి కేవలం అత్యంత ప్రామాణికమైన హదీసుల కూర్పు చేసి నట్లయితే ఎంత బాగుండేది!’ అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాట ఇమామ్‌ బుఖారీ (రహ్మ.అలైహి,) గారి మనసులో గట్టిగా నాటుకుపోయింది. గురువు అభిలాషకు క్రియాత్మక రూపమిస్తూ ఇమామ్‌ బుఖారీ తన గ్రంథంలోని 6 లక్షల హదీసుల్లోంచి అత్యంత ప్రామాణిక మైన హదీసులను మాత్రమే ఎంపిక చేశారు. ఆయన స్వయంగా ఇలా అన్నారు: ”నేనీ తుది సంకలనంలో కేవలం ప్రామాణిక హదీసులనే తీసు కున్నాను. సుదీర్ఘ పరంపర ఉందన్న భావంతో ఎన్నో హదీసులను వదలి వేశాను”. (తారీఖె బుగ్దాద్‌: 9/2)
”స్నానం చేసి, రెండు రకాతుల (నఫిల్‌) నమాజ్‌ చేసుకోనంతవరకూ నేను ఏ ఒక్క హదీసునూ ఈ పుస్తకంలో పొందుపరచ లేద”ని ఇమామ్‌ బుఖారీ (రహ్మ.అలైహి,) చెబు తుండగా తాను విన్నానని ముహమ్మద్‌ బిన్‌ యూసుఫ్‌ ఫర్బరీ అనేవారు.

సహీహ్‌ బుఖారీలోని ఉల్లేఖనాలన్నీ ప్రమాణబద్ధమైనవే. ఇందులో ఏ ఒక్క బలహీన హదీసుగానీ, కాల్పనిక ఉల్లేఖనం గానీ లేదు. ఈ సంకలనంలో మొత్తం 7275 హదీసులున్నాయి.

 

సహీహ్‌ ముస్లిం

ఇది ఇమామ్‌ అబుల్‌ హుసైన్‌ ముస్లిం బిన్‌ హిజాజ్‌ నీసాపూరి (జననం: హి.శ. 206 – మరణం: హి.శ. 261) గారి లలిత లావణ్య సంకలనం. ప్రామాణికత రీత్యా ఈ గ్రంథం సహీహ్‌ బుఖారీ తరువాత స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ గ్రంథంలో నమోదై ఉన్న హదీసులన్నీ ప్రామాణికమైనవే. ఉల్లేఖకులను పరికించి, విశ్లేషించే విషయంలో ‘ముస్లిం’ కన్నా ‘బుఖారీయే’ మిన్న అని పండితులంటారు. అయితే విషయాను క్రమం ప్రకారం హదీసులను క్రోడీకరించ టంలో ఇమామ్‌ ముస్లిందే పైచేయి అని వారంతా కితాబు ఇచ్చారు. సహీహ్‌ బుఖారీ మాదిరిగానే ‘సహీహ్‌ా ముస్లిం’లో కూడా సరిగ్గా 7275 హదీసులున్నాయి.

ఒకవేళ ఏదేని ఉల్లేఖనంపై బుఖారీ, ముస్లింలు ఉభయులూ ఏకీభవించి, దానికి ఇరువురూ తమ సంకలన గ్రంథాలలో చోటిచ్చి ఉంటే అట్టి హదీసుకు ఇక తిరుగు లేదన్న మాటే. ఇలాంటి ”ఉభయేకీభవిత” ఉల్లేఖనాలనే ‘ముత్తఫఖున్‌ అలైహి’ లేదా ‘అఖ్రజహుష్‌ షైఖాన్‌’గా వ్యవహరిస్తారు. హదీసువేత్తల ”స్నానం చేసి, రెండు రకాతుల (నఫిల్‌) నమాజ్‌ చేసుకోనంత వరకూ నేను ఏ ఒక్క హదీసునూ ఈ పుస్తకంలో పొందుపరచ లేద”ని ఇమామ్‌బుఖారీ (రహ్మ.అలైహి,) చెబుతుండ గా తాను విన్నానని ముహమ్మద్‌ బిన్‌ యూసుఫ్‌ ఫర్బరీ అనేవారు.
పరిభాషలో ‘షైఖాన్‌’ అనగానే ఇమామ్‌ బుఖారీ, ఇమామ్‌ ముస్లింలు స్ఫురిస్తారు. ఆ విధంగా ఊభయ గ్రంథాలలోనూ నమోదై ఉన్న హదీసులను అల్లామా ముహమ్మద్‌ ఫవ్వాద్‌ అబ్దుల్‌ బాఖీ (రహ్మ.అలైహి,) సంగ్రహించి ”అల్లూలూ వల్‌ మర్జాన్‌” అనే పేరుతో పుస్తక రూపం ఇచ్చారు. (ఈ పుస్తకం తెలుగులో ‘మహా ప్రవక్త (స) మహితోక్తులు’ పేరుతో ప్రాచుర్యం లో ఉంది).

ఇక ”సిహా సిత్తా” (షడ్నిజాలు) అంటే ఆరుగురు విశ్వ విఖ్యాత హదీసు ఇమాములు సేకరించిన ఆరు ప్రామాణిక హదీసు గ్రంథాలు. అవి వరుసగా ఇవి.
1- సహీహ్‌ బుఖారీ
2-సహీహ్‌ ముస్లిం
(ఈ రెండు గ్రంథాలలోని హదీసులన్నీ ప్రమాణబద్ధమైనవి. వీటిలో ఏ ఒక్కటీ బలహీనం (జయీఫ్‌)గానీ, కాల్పనికం (మౌజూ)గానీ కాదు.
3- తిర్మిజీ
4- అబూ దావూద్‌
5- నసాయీ
6- ఇబ్ను మాజా
పై నాలుగు హదీసు గ్రంథాలలో ప్రామాణిక హదీసులతోపాటు కొన్ని బలహీన, కాల్పనిక ఉల్లేఖనాలు కూడా గ్రంథస్థమై ఉన్నప్పటికీ అధికాంశం ప్రామాణికమే అవటం చేత అవన్నీ కూడా ‘సిహా సిత్తా’ (ఆరు ప్రామాణిక సంకలనాలు)గా ప్రసిద్ధి చెంచాయి.

 

సుననె తిర్మిజీ

ఇది ఇమామ్‌ అబూ ఈసా ముహమ్మద్‌ బిన్‌ సూరతు తిర్మిజీ (జననం: హి.శ. 200 మరణం: హి.శ. 279)చే విరచితమైన మరో హదీసు గ్రంథం. ఇందులో మొత్తం 3963 హదీసు లున్నాయి. వీటిలో 80 శాతం కన్నా ఎక్కువ హదీసులు ప్రామాణికమైనవే – అంటే ప్రామాణిక ఉల్లేఖనాల సంఖ్య 3402. బలహీన (జయీఫ్‌) ఉల్లేఖనాలు 815 ఉండగా, 17 కాల్పనిక హదీసులు కూడా చోటు చేసుకున్నాయి. ఇమామ్‌ తిర్మిజీ (రహ్మ.అలైహి,) ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రామాణిక హదీసులతోపాటు హసన్‌, జయీఫ్‌ కోవకు చెందిన హదీసులను కూడా సంకలనం చేసిన ప్పటికీ ప్రతి హదీసు యొక్క ‘స్థాయి’ని విశదీకరిం చారు. ఒక హదీసు ఎందుచేత బలహీనం (జయీఫ్‌) అన బడిందో కూడా వివరించారు. అంతే కాదు, దానికి సంబంధించి ప్రవక్త సహచరుల (గి), తాబయీల, ఇమాముల, ధర్మవేత్తల, షరీయతు నిపుణుల వ్యాఖ్యానాలను, తీర్పులను కూడా ఉటంకించారు.

 

సుననె అబూ దావూద్‌

ఇమామ్‌ అబూ దావూద్‌ సులైమాన్‌ బిన్‌ అష్‌ఆత్‌ అల్‌ సిజ్‌తానీ (జననం: హి.శ. 202 మరణం: హి.శ. 275)చే సంకలనం చేయబడిన గ్రంథమిది. ధర్మ శాస్త్రానికి, చట్టాలు, శిక్షాస్మృతికి సంబం ధించిన ఎన్నో అంశాలకు మాతృక వంటిది ఈ గ్రంథం. ఇందులో మొత్తం 5182 హదీసులున్నాయి. వీటిలో ప్రామాణిక హదీసులు 4147. బలహీన ఉల్లేఖనాలు 1125, కాల్పనిక ఉల్లేఖనాలు 2. మొత్తానికి 78 శాతం కన్నా ఎక్కువ హదీసులు ప్రామాణికమైనవే.

 

సునన్‌ నసాయీ

ఇది ఇమామ్‌ అబూ అబ్దుర్రహ్మాన్‌ అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ నసాయీచే విరచితం. ఇందులో మొత్తం 5658 హదీసులుండగా, వాటిలో 92 శాతం హదీసులు ప్రామాణికమైనవే. అంటే ప్రామాణికమైన ఉల్లేఖనాలు 5296 ఉండగా, బలహీన ఉల్లేఖనాలు 447 వరకూ ఉన్నాయి. ఈ గ్రంథంలో కాల్పనిక ఉల్లేఖనం అనదగ్గదేదీ లేదు.

సుననె ఇబ్నె మాజా

ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ మాజాచే సంకలనం చేయబడిన హదీసు గ్రంథమిది. ఇందులో మొత్తం 4418 హదీసులుండగా, వాటిలో 3542 హదీసులు ప్రామాణికమైనవి. 835 హదీసులు బలహీన (జయీఫ్‌) కోవకు చెందినవి, 41 హదీసులు కల్పితమైనవి. అంటే 80 శాతానికి పైగా హదీసులు ప్రామాణికమైనవే.

”సిహా సిత్తా” గాకుండా మరి కొన్ని సుప్రసిద్ధ హదీసు సంకలనాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాము-

ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌ 

ఈ పుస్తకం మదీనాకు చెందిన విఖ్యాత ఇమామ్‌ సయ్యిదినా మాలిక్‌ బిన్‌ అనస్‌ -రహ్మ. (జననం: హి.శ. 82. మరణం: హి.శ. 170) చే సేకరించబడినది.
ప్రజలు పదే పదే త్రొక్కి, నలిపి సుగమం చేసిన మార్గాన్ని ‘ముఅత్తా’ అంటారు. దైవప్రవక్త (స) మొదలుకుని, తాబయీలు, ఆ తరువాతి తరాల వారు క్రియాత్మకంగా పాటించిన హదీసులను ఇమామ్‌ మాలిక్‌ (ర) క్రోడీకరించటం వల్ల ఈ సంకలనానికి ”ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌” అనే పేరు వచ్చింది. హి.శ. 140 కన్నా ముందు సేకరించ బడిన హదీసులివి. ఇందులో మొత్తం 1720 హదీసులుండగా, వాటిలో 600 ‘మర్ఫూ’ ఉల్లేఖనాలు న్నాయి. (అంటే వాటి సనదు పరంపర దైవప్రవక్త – స- వరకూ చేరుతుంది). 617 హదీసులు ‘మౌఖూఫ్‌’గా పరిగణించబడ్డాయి (అంటే వాటి సనదు పరంపర సహబీల వరకే చేరుతుంది). 222 హదీసులు ‘ముర్సల్‌’ వాటి సనదు పరంపర సహబీల వరకే చేరుతుంది). 222 హదీసులు ‘ముర్సల్‌’ కోవకు చెందినవి (ఏ హదీసుల సనదు తాబయీల వరకు మాత్రమే చేరుతుందో వాటిని మర్సల్‌గా పేర్కొంటారు). 275 హదీసులు తాబయీలచే ఉటంకించబడి నవి కూడా ఉన్నాయి.

ఇమామ్‌ మాలిక్‌ (ర) తన ‘ముఅత్తా’ను సంకలనం చేసే నాటికి పండితులు వ్రాసిన మరెన్నో ముఅత్తాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ”అయ్యా! ఈ ‘ముఅత్తాల’ మహా సముద్రంలో మీ ముఅత్తా నిండా మునిగిపోయేట్టు ఉంది కదా!” అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేసినపుడు, ”ఏది దైవ ప్రీతి కోసం జరిగిందో అది మిగిలి ఉంటుంది. మరేది దైవం కోసం జరగలేదో అది మిగలదు” అని ఇమామ్‌ మాలిక్‌ (ర) వ్యాఖ్యానించారు. యదార్థమేమిటంటే నేడు ఇమామ్‌ మాలిక్‌ గారి ‘ముఅత్తా’, ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ హసన్‌ షేబానీ గారీ ‘ముఅత్తా’ తప్ప మరే ఇతర ముఅత్తా కూడా మిగల్లేదు, అన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి.

ఈ గ్రంథంలో ప్రవక్త (స) వారి ప్రవచ నాలతోపాటు సహాబీల, తాబయీల ఫత్వాలు (తీర్పులు) కూడా పొందుపరచ బడ్డాయి. ఈ గ్రంథం కేవలం హదీసుల గ్రంథం కాదు కాబట్టి, ఇది ”సిహా సిత్తా” లో చేర్చబడలేదు.

మస్నదె అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర)

ఇది ప్రఖ్యాత ఇమామ్‌ హజ్రత్‌ ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ – రహ్మ.లై – (జననం: హి.శ. 164 మరణంహి.శ. 241)గారి అపురూప హదీసు సంకలనం ఇందులో మొత్తం 40 వేల హదీసులు ఉన్నాయి. దైవప్రవక్త (స) వారి మహితోక్తుల నిధిలో ఇది కూడా ఎంతో ముఖ్యమైనది. ఇందులో పునరావృతమైన హదీసులను తొలగిస్తే మొత్తం 28 వేల హదీసులు మిగులుతాయి.

మిష్కాత్‌

వివిధ హదీసు గ్రంథాలలో నుంచి గ్రహించి, ప్రత్యేకంగా రూపొందించిన గ్రంథమిది. తొలుత ఈ మిష్కాత్‌ గ్రంథాన్ని ఇమామ్‌ హుసైన్‌ బిన్‌ మస్‌వూద్‌ బగ్వీ (ర) (మరణం: హి.శ. 516) క్రోడీకరించారు. గ్రంథంలో ప్రతి అధ్యాయాన్ని రెండేసి తరగతులుగా విభజించి మొదటి తరగతిలో బుఖారీ, ముస్లింలలోని హదీసులు తీసుకున్నారు. రెండవ తరగతిలో నసాయీ, తిర్మిజీ, అబూ దావూద్‌, ఇబ్నె మాజాల హదీసులను సేకరించారు. ఈ హదీసు లన్నీ ప్రామాణికమైన హదీసులుగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఈ కృషి జరిగిన రెండు శతాబ్దాల తర్వాత ఇమామ్‌ వలీయుద్ధీన్‌ ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ ఖతీబ్‌ ఉమ్‌రీ (మరణం: హి.శ. 743) ప్రతి అధ్యాయంలోనూ మూడవ తరగతిని కూడా చేర్చి దానికి ”మిష్కాతుల్‌ మసాబీహ్‌
” అని నామకరణం చేశారు. ఈ మూడవ తరగతిలో సహీహ్‌ాతో పాటు హసన్‌, జయీఫ్‌, మౌజూ కోవలకు చెందిన ఉల్లేఖనాలకు కూడా చోటు కల్పించటం జరిగింది. మొత్తం మీద ఈ ”మిష్కాతుల్‌ మసాబీహ్‌ా” గ్రంథంలో 6285 హదీసులున్నాయి.

 

Related Post