అయిదవ ఆశయం విశ్వాస బలం:
ఆత్మ పవిత్రతకు, అంతరాత్మ పరివర్తనకు, హృదయ ప్రక్షాళనకు, మనో నిగ్రహానికి, గుండె నిబ్బరానికి, అవయవ క్రమశిక్షణకు హజ్జ్ గొప్ప సాధనం. హజ్జ్ మహారాధనను నిర్వర్తిస్తూ ఒక హాజీ కనే చారిత్రక దృశ్యాలెన్నో, వినే వీర గాథలెన్నో! ఫలితంగా అతని ఆంతర్యం అల్లాహ్‌ా భీతితో, ఆయన కరుణ యెడల ఆశతో నిండుతుంది. విశ్వాసిలోని విశ్వాసం వికసిస్తుంది. అల్లాహ్‌ా నామాల పట్ల, ఆయన గుణగణాల పట్ల, ఆయన శక్తిసామర్థ్యాల పట్ల పూర్తి ఎరుకతో కూడిన జ్ఞానం అతని ప్రాపిస్తుంది. తద్వారా అతనిలోని విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. హజ్జ్ చేసే స్త్రీపరుషులు సకల విధమయినట ువిం చెడులకు, అశ్లీల చేష్డలకు, కామకలాపాలకు దూరంగా ఉంారు. అల్లాహ్‌ా వారికి అత్యంత పవిత్రమయిన, ఉన్నతమయి జీవితాన్ని ప్రసాదించ డమే కాక, వారి ఆత్మలను నిత్యం జాగృతావస్థలో ఉంచుతాడు. ఒక హాజీలు విశ్వాస వికాసానికి తోడ్పడే, అల్ల్లాహ్‌ా నామస్మరణ, ఖుర్ఆన్ పారాయణం, సత్కర్మలు, సృష్టి గురించి చింతనలోనే ఉంటారు గనక హజ్జ్ వారి విశ్వాసాన్నిరెట్టింపు చేసే గొప్ప సాధనంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పా లంటే, సామాన్యులు ఎప్పుడోకప్పుడు, ఎక్కడోక చోట కరుణామయుని సదనా లలో పాల్లొంటూ ఉంటే, హాజీలు మాత్రం భూమ్యాకాశాల నిర్మాణం జరిగిన నాి నుండే పవిత్ర క్షేత్రంగా ఖరారు చేయబడిన మక్కా నగరంలో, ఒకే మైదానంలో లక్షలాది మంది హాజీల మధ్య రేయింబవళ్లు గడుపుతూ, ప్రాపం చిక తళుకుబెళుకులకు దూరంగా, పరలోక చింతనలో, ప్రభువు స్మరణలో లీనమయి ఉంారు. మనసును చెడు తలంపుల నుండి, మెదడును చెడు ఆలోచనల నుండి, దేహాన్ని చెడు ప్రవర్తన నుండి దూరంగా ఉంచుకుం ారు గనక అల్లాహ్ వారికి వివేకాన్ని, విజ్ఞానాన్ని, విశ్వాస మాధుర్యాన్ని, ఆత్మ స్థయిర్యాన్ని, గుండె ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
ఆరవ ఆశయం – ఆదేశ పాలన:
ప్రవక్త ఇబ్రాహీమ్ (అ) వారిని ఉద్దేశించి ”ఆత్మ సమర్పణ చేసుకో” అని అల్లాహ్ ఆదేశించినప్పుడల్లా ‘సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను బేషరతుగా సమర్పించుకుంటున్నాను’ అని ఆయన సమాధానం ఇచ్చారు. (అల్ బఖరహ్: 131)
హాజీ హజ్జ్ చేస్తూ అడుగడునా ఇబ్రాహీమ్ (అ) వారి ఆదర్శాన్ని, నిరుప మాన త్యాగాన్ని నెమరు వేసుకుంటూ గడుపుతాడు గనక అతనిలో సయితం బేషరతు ఆదేశ పాలన, సంపూర్ణ విధేయత భావం వెల్లివిరుస్తుంది. హజ్జ్ సంకల్పం బూనింది మొదలు హజ్జ్ పూర్తయ్యే వరకూ ‘తల్బియా’ పలుకులు హాజీ నాలుక మీద నానుతూనే ఉంాయి. ‘ఎక్కడ, ఎప్పుడు, ఏ అవస్థలో అల్లాహ్ ఆదేశం అందినా పాటించడానికి నేను సిద్ధం’ అంటూ ప్రతీన బూను తాడు. ‘నమాజును స్థాపించు’ అన్న ఆదేశానికి ఒక విశ్వాసి లబ్బయిక్ అంటాడు. ‘జకాతు చెల్లించు’ అన్న ఆదేశానికి ఒక విశ్వాసి లబ్బయిక్ అంటాడు. ‘ఉపవాసం మీపై విధి’ అన్న ఆదేశానికి ఒక విశ్వాసి లబ్బయిక్ అంటాడు.
‘స్థోమత గలవారిపై హజ్జ్ తప్పనిసరి’ అన్న ఆదేశానికి ఒక విశ్వాసి లబ్బ యిక్ అంాడు. ‘మీ ధన ప్రాణాలతో దైవ మార్గంలో పోరాడండి’ అన్న ఆదే శానికి ఒక విశ్వాసి లబ్బయిక్ అంాడు. ఇలా జీవితపు అన్ని అంగా ల్లోనూ, అన్ని రంగాల్లోనూ సదా దైవాదేశాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే. ”నిశ్చయంగా నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు, నా జీవితం, నా మరణం సకల లోకాలకు ప్రభువయిన అల్లాహ్‌కే అంకితం” (అన్ఆమ్:163) అని సవినయంగా తెలియజేసుకుాండు.
దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”నా వద్దకు జిబ్రయీల్ (అ) వచ్చి ఇలా ఉపదేశించారు: ”నువ్వు నీ సహచరుల్ని, నీతో ఉన్న వారిని తల్బియా పలుకుల్ని హెచ్చు స్వరంతో పలకాల్సింగా పురమాయించు”. (దారమీ)
ప్రవక్త (స) వారిని హజ్జ్ అంటే ఏమి? అని అడగ్గా ‘అల్ అజ్జు వస్సజ్జు’ అన్నారు. అంటే, బిగ్గరగా తల్బియా పలకడం (అల్ అజ్జు), ఖుర్బానీ ఇవ్వడం (అస్సజ్జు). (ఇబ్ను మాజహ్)
ఒక విశ్వాసి – ”ఇంకా మేము దావూదుకు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ‘ఓ పర్వతాల్లారా! అతనితో కలిసి స్తోత్రగానం (తస్బీహ్) చేయండి’ అని ఆజ్ఞాపించాము. పక్షులకు కూడా (ఇదే విధంగా) ఆదేశించాము”. (అస్సబా: 10) అన్న ఖుర్ఆన్ వచనాలు విని – ప్రవక్త దావూద్ అల్లాహ్‌ా స్తోత్రగానం చేయసాగినప్పుడు పర్వతాల్లాంటి నిశ్చలమైన వస్తువులు సయితం ముగ్దులయి ఆయనతో స్తోత్రగానం చేయడానికి స్వరం కలిపేవి. ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా పల్లవించేవి – అని తెలుసుకున్న ప్పుడు ఓ వినూత్న అనుభూతికి లోనవుతాడు. ఆహా! ఏమి భాగ్యం దావూద్ ప్రవక్తది! అని ఒకింత ఈర్ష్యానందానికి గురవుతాడు.. అలాిం భాగ్యమే తనకు దక్కితే ఎంత బావుండు! అని ఆరాట పడతాడు. విశ్వాసి ఆంతర్యంలో చోటు చేసుకునే ఈ పవిత్ర భావన దాహార్తిని తీర్చే గొప్ప సాధనం హజ్జ్. హజ్జ్‌లో పలుకబడే తల్బియా పలుకులు గురించి ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఒక విశ్వాసి నోట తల్బియా పలుకులు వెలువడటమే ఆలస్యం, అతని కుడి ఎడమల ఉన్న చెట్లు, చేమలు, రాళ్లు, రప్పలు, ధూళి రేణువులు తల్బియా స్తోత్రగానం చేయనారంభిస్తాయి. చివరికి భూమి థ దిశల తల్బియా పలు కుల ధ్వనులు ప్రతిధ్వనిస్తాయి” అని. (తిర్మిజీ)
ఏడవ ఆశయం – లాభాల పంట హాజీల ఇంట:
”హజ్జ్‌కై ప్రజల్లో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సదూర మార్గాల నుంచి కాలి నడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు….. వారు వారి కోసం సిద్ధపరచ బడిన ప్రయోజనాలు పొందడానికయినా తప్పక హాజరు కావాలి”. (అల్ హజ్జ్: 27,28)
పై ఆయతులో పేర్కొనబడిన ‘సిద్ధపరచబడిన ప్రయోజనాలు’ అంటే, హాజీ హజ్జ్కెళ్లి పొందే లాభాలు ప్రాపంచికమయినవి, పారలౌకికమయినవి కూడా. హాజీ మస్జిదె హారమ్లో చేసే ఒక్క పూట నమాజు లక్ష పూటల నమాజులతో సమానం, కాబా ప్రదక్షిణ, తవాఫ్, సఫామర్వాల మధ్య సయీ, జమ్జమ్ జల సేవనం, మీనాలో బస, అరఫాలో విడది, ముజ్దలిఫాలో రాత్రి గడప టం, జమరాత్‌లపై కంకర్రాళ్లు రువ్వడం, ఖుర్బానీ ఇవ్వడం, తలనీలాలు సమర్పించుకోవడం విం హజ్జ్ సంబంధిత క్రియల ద్వారా హాజీలకు అపారమయిన ధార్మిక, పారలౌకిక లాభాలు, శుభాలు కలుగుతాయి. మరో వైపు క్రయవిక్రయాల ద్వారా ప్రాపంచిక ప్రయోజనం కూడా ప్రాప్తమవు తుంది. కాబ్టి స్థోమత ఉన్న ప్రతి వ్యక్తి వెంటనే హజ్జ్ విధి నిర్వర్తించేందుకు కంకణం కట్టుకోవాలని, బలంగా సంకల్పించుకోవాలి అన్నారు ప్రవక్త (స). ”వీలైనంత త్వరగా హజ్జ్ చేసుకోఖడి. ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం ఏర్పడు తుందో ఎవరికీ తెలియదు. హజ్జ్ చెయ్యాలి అని సంకల్పించుకున్న వ్యక్తి త్వర పడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారిన పడవచ్చు. లేదా వాహనా న్నయినా పోగోట్టుకోవచ్చులేదా ఇంకా ఏదయినా ఆటంకం ఏర్పడవచ్చు” అన్నారు. (బైహఖీ)
ఎనిమిదవ ఆశయం – ప్రవక్తల ఆదర్శస్మరణ:
ప్రవక్తల జీవితాలు సమస్త మానవాళికి నిత్య ఆదర్శాలు. అన్యాయాన్ని సహించని శౌర్యం ప్రవక్తలది. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం ప్రవక్తలది. షైతాన్ మూకలతో పోరాడే సైన్యానికి సేనాధిపతులు ప్రవక్తలు.శాంతిని కాపాడే ఉత్తమ గణానికి దిశా నిర్దేశక శిఖామణులు ప్రవక్తలు. అల్లాహ్‌ా మెచ్చిన మహోన్నత గణం ప్రవక్తలు. అలాిం అనేక మంది ప్రవక్తల జీవిత ఘ్టాలను హాజీ హజ్జ్ మద్య దర్శిం చుకుాండు. మక్కా పుణ్యభూమిలో ఒక చోటు నుండి మరో చోటుకి, ఒక మష్‌అర్ నుండి మరో మష్‌అర్‌కి తరలి వెళితూ తనకన్నా ముందు ఆయా స్థలాలలో అనేక మంది ప్రవక్తలు బస చేసి ఉంారు అన్న ఆలోచన అతన్ని అనంతానంత ఆనందానికి లోను చేస్తుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మస్జిద్ ఖైఫ్లో 70 మంది ప్రవక్తలు నమాజు చేశారు”. (హాకిమ్)
”మేము గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవినీ ప్రసాదించినది వీరికే… అల్లాహ్ సన్మార్గం చూపించినటువిం వారు వీరే. కనుక మీరు కూడా వారి మార్గాన్నే అనుసరించండి”. (అన్ఆమ్: 90) అని అల్లాహ్ సెలవిచ్చిన సత్య ప్రవక్తలు శ్వాస పీల్చిన స్థలంలో కొన్ని ఘడియలు గడిపే అవకాశం దొరి కినా గొప్ప అదృష్టం. అటువింది దాదాపు వారం రోజుల పాటు ఆదే పవిత్ర వాతావరణంలో జీవించడం ఎంత భాగ్యం! ఎంత భాగ్యం!!
హాజీ మస్జిదె హరామ్లో అడుగు ప్ట్టిె కాబాపై దృష్టి పడగానే ఈ గృహాన్ని నిర్మించిన ఇద్దరు ప్రవక్తలు – ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ (అ) గుర్తుకొస్తారు. వారు ఈ గృహ గోడలను ఎత్తుతూ ఇలా ప్రార్థించారు: ”మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సమస్తం తెలిసిన వాడవు” (అల్ బఖరహ్: 127) ఆ వచనంతో స్ఫూర్తి పొందిన హాజీ భక్తి నిండిన హృదయంతో ఇలా వేడుకుాండు. ”మా ప్రభూ! మమ్మల్ని (కూడా) నీ విధేయులుగా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టు బడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి. మాకు నీ ఆరాధనా రీతులను నేర్పు స్వామీ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు. అపారంగా కరుణించేవాడవు”. (అల్ బఖరహ్‌ా: 128) ఈ ప్రార్థనా పలుకుల్ని తొలూత పలికిన వారు తండ్రికుమారులయిన ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ (అ) అని తెలిసి తన్మయనికి లోనవుతాడు. ఇలా అడుగడునా ఆశయాల అడుగుజాడలు అగుపిస్తూనే, అలరిస్తూనే ఉంటాయి.
తొమ్మిదవ ఆశయం – ప్రవక్త (స) వారి అనుసరణ:
హజ్రత్ ఉమర్ (ర) హజ్రె అస్వద్‌ను ముద్దాడుతూ – ”అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నువ్వు ఒక రాయివి మాత్రమే. ఎలాంటి లాభంగానీ, నష్టంగానీ కలిగించలేవు. ఒక వేళ నేనే గనక అల్లాహ్ ప్రవక్త (స) వారిని నిన్ను ముద్దాడుతూ చూసి ఉండకపోతే నిన్నెన్నికీ ముద్దాడేవాడను కాను” అన్నారు. (ముస్నద్ అహ్మద్)
యాలా బిన్ ఉమయ్యహ్ (ర) అంటున్నారు – నేను హజ్రత్ ఉమర్ (ర)తో కలిసి తవాఫ్ చేశాను. ఆయన హజ్రె అస్వద్‌ను ముట్టుకున్నారు. నేను కాబా వైపు దగ్గరగా ఉన్నాను. హజ్రె అస్వద్ ఉన్న మూల తర్వాత ఉన్న మూలకు చేరుకుని దాన్ని ముట్టుకుదాం అని చేయి చాచాను. అది చూసిన ఆయన (ర) ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. అందుకు నేను ‘ఏమి మీరు ఈ మూలను తాకరా?’ అని ఆరా తీశాను. ”ఏమి, నువ్వు ప్రవక్త (స) వారితో కలిసి తవాఫ్ చెయ్య లేదా?” అన్నారాయన. ‘చేశానన్నాను’ నేను. ”మరయితే ప్రవక్త (స) దక్షిణ ఈ రెండు మూలలను తాకుతూ నువ్వు చూశావా?” అని అడిగారు. ‘లేదు’ అన్నాను. ”ఇది నిజమయితే ఆయన జీవితంలోనే కదా నీకు ఉత్తమ ఆదర్శం ఉన్నది?” అన్నారు. ‘ముమ్మాికి అదే నిజం’ అన్నాను. ”అలాగయితే ఆయన చెయ్యని ఏ కార్యం నువ్వు కూడా చెయ్యకు. ఆయన (స) ప్రవర్తనకు అద్దం పట్టే పనులు తప్ప” అని హితోపదేశం చేశారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, మనం చేసే ఏ ఆరాధన, మరే సత్కార్యమయినా సరే రెండు షరతులు ఉన్నప్పుడే అంగీకృతం అవుతుంది. అన్యదా త్రోసి పుచ్చ బడుతుంది. 1) సంకల్పం శుద్ధి – అంటే, మనం చేసే ఏ కార్యమయినా అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అయి ఉండాలి. అందులో షిర్క్ భావాల కు, చేష్టలకు తావుండకూడదు. 2) మనం శ్రీకారం చుట్టబోయే పని దైవ అంతిమ ప్రవక్త (స) వారి ఆచరణకు ప్రతిబింబంగా ఉండాలి.
పదవ ఆశయం – అవిశ్వాసుల వ్యతిరేకత:
ప్రవక్త (స) వారి కాలం నాటికి బహు దైవారాధకులు మక్కాకు వెళ్లి హజ్జ్ చేసేవారు. అరఫాలో, ముజ్దలిఫా లో విడది కూడా చేసేవారు. కానీ, వారి సకల క్రియలు అజ్ఞానం, మూఢ నమ్మకాలతో, అహంభావంతో కూడుకున్నవే. తల్బియా పలుకుల్ని వారూ పలికేవారు కానీ మార్పుచేర్పులతో-లబ్బయిక్ అల్లాహుమ్మ లబ్బయిక్ లబ్బయిక లా షరీక లక లబ్బయిక్. (ఇల్లా షరీకన్ హువ లక్ తమ్‌లికుహు వమా మలక్) అంటే తల్బియా భావంతో చెలగాటమాడేవారు. అల్లాహ్‌ాకు అన్య భాగస్తుల్ని కల్పించే దుస్సాహసం చేసేవారు. ప్రవక్త (స) ఆ పలుకుల్ని విన్నప్పుడల్లా – ”మీ పాడుగాను! (లబ్బయిక లా షరీక లక్) ఇక్కడితో ఆగిపోండి” అని అంటూ ఉండేవారు. ఆయన మనకు నేర్పిన తల్బియా స్వచ్ఛమయిన తౌహీద్ భావంతో కూడినది. వీరినుద్దేశించి అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వారిలో చాలా మంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయన తోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు”. (యూసుఫ్: 106)
పూర్వం విగ్రహారాధకులు, బహుదైవారాధకులు చేసే హజ్జ్‌లో అరఫా నుండి సూర్యాస్తమయం కాక ముందే బయలు దేరి వెళ్ళి పోయేవారు. ప్రవక్త (స) వారి ఆ నూతన పోకడను నిర్మూలిమచి సూర్యాస్తమయం తార్వత బయలు దేరాల్సిందిగా ఆదేశించారు. అలాగే ముజ్దలీపా నుండి అవిశ్వాసులు సూర్యోదయం తర్వాత బయలుదేరేవారు. వారి ఆ కొత్త పోకడను నిర్మూ లించి సూర్యోదయానికి ముందు బయలు దేరాల్సిందిగా ఉపదేశించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నాడు అవిశ్వాసుల్లో చోటు చేెెసుకున్న దుర్లక్షణాలే నేడు ముస్లింలు అనబడుతున్న అనేకుల్లో మనకు దర్శనమిస్తాయి.దూరంగా చూసే ఓ వ్యక్తికి మూఢభక్తుల్లో, నిజ భక్తి పరుల్లోనూ ఒకే విధమయినటువిం నిష్ఠ, విధేయతలు కనబడతాయి. అయితే విశ్వాస గణాన్ని అవిశ్వాస జనం నుండి వేరు పర్చేది బాహ్యంగా చోటు చేసుకునే ఆచరణ కాదు, అంతరంగిక భావన; అదే తౌహీద్. ఒక ముస్లిం తౌహీద్ భావనతో భక్తిప్రపత్తులను ప్రదర్శిస్తాడు. అదే కాఫిర్ – అవిశ్వాసి షిర్క్ సహిత భావాలతో తన భక్తిని కలుషితం చేసి తన ఆత్మకు అన్యాయం చేస్తాడు. అవిశ్వాసుల్లో కనబడే భక్తి రాళ్ళు, రప్పలు, జాతి పెద్దలు, నాయకుల కొరకయితే, ముస్లిం భక్తి కేవలం ఒక్క అల్లాహ్‌ాకు మాత్రమే సొంతం. ఈ యదార్థాన్ని తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అజ్ఞాన కాలం నాి సకల ఆచార వ్యవహారాలు, రాతారీతులు నా పాదాల క్రింద ఉంచ బడ్డాయి. అజ్ఞాన కాలపు రక్త పరిహారం రద్దు చేయబడింది. మాకు సంబందించిన రక్తంలో ఇబ్ను రబీఅ బిన్ హారిస్ రక్తాన్ని రద్దు చేస్తు న్నాను. తను బనూ సఅద్‌లో పాలు త్రాగే పసికందునిగా ఉన్నప్పుడు అతన్ని హజైత్ అనే తెగ వారు హత్య చేయడం జరిగింది. అజ్ఞాన కాలపు వడ్డీని రద్దు చేస్తున్నాను. మాకు సంబంధించిన వడ్డీలో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారిది. దాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నాను”. (ముస్లిం)
బద్ర్, ఉహద్, మక్కా విజయంలో ముస్లింలకు ప్రత్యర్థులుగా ఉన్నవారు ఎవరంటే వారి రక్త సంబంధీకులే. అయితే వారు అవిశ్వాసులు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: ”అల్లాహ్‌ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్‌ా పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు గాని నీవు ఎక్కడా చూడవు.ఆఖరికి వారు (సొంత) తండ్రులయినా సరే, తమ కొడుకుల యినా సరే, తన అన్నదమ్ములయినా సరే, తమ పరివార జనమయినా సరే. అల్లాహ్ విశ్వాసాన్ని రాసి ప్టిెంది ఇలాిం వారి హృదయాలలోనే”. (ముజాదలహ్: 22)
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్ దృష్టిలో అత్యంత అయిష్టులయినవారు ముగ్గురు-1) హరమ్ మక్కీ, మదనీలో నివశించే నాస్తికుడు. 2) ఇస్లాంలో అజ్ఞాన కాలపు ఆచారాల్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించే వ్యక్తి. 3) అన్యాయంగా ఒకరి రక్తాన్ని చిందించాలని, అతన్ని హతమార్చలని డిమాండ్ చేసే వ్యక్తి”. (బుఖారీ)