Originally posted 2013-02-07 08:18:01.
సమాజానికి వ్యక్తులే పునాది రాళ్ళు. వ్యక్తులు సౌశీలవంతులు కానంతవరకు, వారి భావాలు, విలువలు ఉన్నత సిద్ధాంతాలతో ప్రభావితం కానంతవరకు సంక్షోభిత సమాజానికి చల్లటి వీచికలు ప్రాప్తంకావు. ఎలాంటి వ్యక్తులో, అలాంటి సమాజమే, ఎలాంటి సమాజమో అలాంటి ప్రభుత్వమే ప్రాప్తిస్తాయి. అందువల్ల సమాజంలో విలువలను, ప్రమాణాలను, సచ్ఛీలాన్ని, దైవభక్తి, దైవభీతిని సృజించడానికి ప్రారంభం నుంచి ఇస్లాం చేసిన ఉపదేశాలు, చూపిన నీతి నియమాలు పలువురి ప్రశంసలు పొందాయి. ఇక మీదట కూడా సుమనసుల, సమాలోచనా పరుల ఆదరణను పొందుతూనే ఉంటాయి.
ఇస్లాం శిక్షణ