మహిళా హక్కులు మరియు ఇస్లాం

ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.

ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.

పాశ్చాత్య ప్రపంచం ప్రకృతిపై తిరుగుబాటు చేసి సామాజిక వ్యవ స్థను ఛిన్నాభిన్నం చేసింది. ఫలితంగా కుటుంబ వ్యవస్థ అంతరించి పోతోంది. వ్యక్తికి తన వంశం ఏదో తెలియయని దౌర్భాగ్య స్థితి. ఈ వికృత పోకడ అందరికంటే అధికంగా అబలను అవమానం పాలు చేసింది. ఆమె బ్రతుకు తెరువు కోసం బయట వెళ్ళాల్సిన గత్యంత రానికి కారణం అయింది. తాను బైట పని, ఇంటి పని, వంట పని, భర్త ఒంటి పని కూడా చేయాలి. వాణిజ్య ప్రకటనల్లో తానే అంగడి బొమ్మనవ్వాలి. సిగ్గు, సిరిని వదిలేసి, మానం మర్యాదను తగలేసి వీరు చేసే ఈ వర్తకం పూర్తి మానవతకే కళంకం. పూర్వపరాల్లోకెళితే –

హిందూ మతంలో స్త్రీ

స్త్రీలకు తండ్రి ద్వారాగానీ, భర్త ద్వారాగానీ ఆస్తిలో హక్కు ఉండేది కాదు. జీవన వ్యవహారాల్లో స్త్రీ పరుషులు రెండు వ్యక్తిత్వాలుగా గుర్తించ బడేవారు కాదు. పురుషుడు యజమానిగాను, స్త్రీ అతని ఆస్తి గానూ పరగణించబడేది. ఈ కారణంగా భర్త నుండి విడాకులు పొంద డంగాని, వేరే వివాహం చేసుకోవడానికిగాని అనుమతి ఉండేది కాదు. ఒకవేళ భర్త మరణిస్తే పతితోపాటు సతిని కూడా చితిపై పేర్చి నిర్ధాక్షి ణ్యంగా కాల్చేసేవారు. ఒకవేళ ప్రాణాలు మిగిలినా వితంతువుగా మిగి లిపోయిన వనితామణులకు పునర్వివాహ అనుమతి అస్సలుండేది కాదు.ఇది సరిపోదన్నట్లు ‘నియోగం’అన్న ఆచారంతో ఆమెను మరింత కించపర్చడం జరిగేది. ‘నియోగం’ అంటే స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రాకాశికలో వివరించినట్లు – వితంతువు మహిళ తన మరిదితోగానీ, మరొక అపరిచిత పురుషునితోగాని వివాహం లేకుండా శారీరక సంబంధం కలిగి ఉండటం. అలాగే భర్త బ్రతికున్న స్త్రీలు కూడా అతని అనుమతితో సంతాన ప్రాప్తి కోసం పరపురుషునితో జత కట్టవచ్చు. ఇదిలా ఉంటే, నేటి హిందూ వివాహ చట్టాన్ని రూపొందిం చడంలో చాలా వరకు ఇస్లాంలోని సామాజిక చట్టాల ద్వారా ప్రయోజ నం పొందడం జరిగిందని డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో స్వయంగా నెహ్రూ గారే పేర్కొనడం గమనార్హం.

యూద మతంలో స్త్రీ

స్త్రీలు అత్యధికంగా అపరిశుభ్రంగా ఉంటారని యూదులు భావించ డమే కాక, బహిష్టు దినాల్లో వారిని అన్నింటికీ ఎడంగా ఉంచేవారు. అలాగే కుమారుడు లేని పక్షంలో మాత్రమే కూతురికి ఆస్తిలో హక్కుం టుంది. కూతుళ్లల్లో కూడా తర్వాతి వారికంటే మొదటి వారికే నాలుగు భాగాలంత వాటా ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ బైబిల్‌ ఇలా అంటోంది: ”స్త్రీ తరఫు నుండి అభ్యంతరం లేకపోతే విడాకుల పత్రం వ్రాసి ఆమె ఇచ్చి ఆమె తన ఇంటి నుండి బహిష్కరించాలి”.

క్రైస్తవ మతంలో స్త్రీ

క్రైస్తవులు తౌరాత్‌ ధర్మ శాస్రానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే క్రైస్తవంలో స్త్రీ యూదత్వంలోకంటే ఎక్కువగా అవమానించబడింది. ‘ఆది మానవుడు ఆదం (అ) స్త్రీయే ఆయన్ను మోస పుచ్చింది’ అని క్రైస్తవం సూచిస్తుంది. క్రైస్తవంలోని పాపం-పరిహారం అన్న విశ్వాసాని కి ఈ భావనే పునాది. అలాగే సెంట్‌ పౌలు ‘పురుషుడు స్త్రీని తాకక పోవడమే మేలు’ అన్న ప్రతిపాదననుసరించి క్రైస్తవ సమాజంలో ఒక సుదీర్ఘ కాలం వరకు సన్యాసత్వం అట్టహాసంగా అమలయింది. అప్ప ట్లో ఆడపడచు మానవ సమాజమ పాలిట వినాశకారిణిగా పరిగణించ బడేది. చివరి ఆమె రక్తం పంచుకు పుట్టిన పురుష పుంగవులు సయి తం ఆమెను ద్వేషించే దుస్థితి. అలాగే విడాకులు, పునర్వివాహ హక్కు స్త్రీకి ఉండేది కాదు.

ఈరాన్‌లో స్త్రీ

ఈరాన్‌ స్త్రీల విషయంలో విచిత్ర వాదానికి దిగింది. ‘మజ్‌దక్‌’ అన బడే వ్యక్తి ప్రతిపాదన మేరకు – స్త్రీలు పురుషుల ఉమ్మడి సొత్తు. తత్ఫ లితంగా వారిని ఆస్తిని పంచుకున్నట్లు పంచుకునేవారు. ఈ వికృతా చారం ఎంతగా ప్రబలిందంటే వావివరసులనేవి పూర్తి తుడిచి పెట్టుకు పోయాయి. ఈ పొకడకు వ్యతిరేకంగా మరొక సిద్ధాంతి ‘మాని’ పేరుతో ఒకఉద్యమం లేవదీశాడు.ఇది మరో అనర్థానికి దారి తీసింది. అతడు భార్యాభర్తల సంబంధాన్ని కూడా అధర్మమని ఖరారు చేశాడు. ఈ రెండు అతివాదాల నడుమ నలిగింది మాత్రం అతివలే.

రోము, గ్రీకు సమాజంలో స్త్రీ

గ్రీకులలో అడపడచులు అంగడి వస్తువులా అమ్మబడేవారు. నేటి కట్నం అనే రాక్షస ఆచారం కూడా వారినుండి సంక్రమించినదే.చట్టం రీత్యా ఒకే భార్య కలిగి ఉండే అనుమతి ఉండేది. కాని చట్ట విరుద్ధమ యిన అక్రమ సంబంధాలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ప్రొఫె సర్‌ ‘లీకి’ ప్రకారం-గ్రీకులో అశ్లీలత, నీతి బాహ్యత విడాకులు ఎంత గా ప్రబలాయంటే వేశ్యల వద్దకు వెళ్లడం వినా జాతి నాయకుల వంటి వారికి సయితం మార్గాంతరం ఉండేది కాదు. గ్రీకు సంస్కృతి నుండే రోము సంస్కృతి పుట్టుకు వచ్చింది. తత్కారణంగా ఇవే దురాచారాలు వారిలోనూ ఉండేవి.

అరేబియాలో స్త్రీ

ఏ భూభాగం నుండయితే ఇస్లాం కాంతి ప్రసరించిందో అక్కడ కూడా ఆడపిల్లల స్థితి చాలా దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడితే సజీ వంగా పాతి పెట్టేవారు. ఆస్తిలో స్త్రీకి ఎలాంటి వాటా ఉండేది కాదు. సవతి తల్లుల్ని వివాహమాడే దురాచారం ఉండేది. వితంవుల విషయం లో న్యాయసమ్మతమయిన చట్టంఉండేది కాదు.భారత దేశంలో పాండ వుల మాదిరిగానే ఏక సమయంలో ఒక స్త్రీకి నలుగురేసి భర్తలుండే వారు.

ఈ వివాహాన్ని ‘రహత్‌’ వివాహంగా పిలిచేవారు. ‘రవికల పండుగ’ మాదిరి భార్యలను మార్చుకునే నికృష్ట ఆచారం కూడా ఉండేది.
విటన్నింటికీ భిన్నంగా ఇస్లాం ప్రసాదించిన సామాజిక చట్టం అతివల ఆత్మ గౌరవానికి, మహిళల మానం, మర్యాదలకు పెద్ద పీట వేసింది. ఇస్లాం స్త్రీకి ప్రసాదించిన సామాజిక స్థాయిని సంక్షిప్తంగా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

ఇస్లాం ధర్మంలో స్త్రీ

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ప్రభవించిన సమయానికి నిస్స హాయులు, అణగారిన రెండు వర్గాలు ఉండేవి. ఒకటి స్త్రీల వర్గం, రెండవది బాలిసల వర్గం. మహనీయ ముహమ్మద్‌ (స) అన్ని వర్గాల ప్రజలతోపాటు ముఖ్యంగా ఈ ఇరు వర్గాల పట్ల మరింత కారుణ్యం తో వ్యవహరించారు. ఇస్లాం స్త్రీలకు గౌరవాన్నిచ్చింది అనడానికి నిద ర్శనం ఖుర్‌ఆన్‌లో 176 వాక్యాలు గల ఒక పూర్తి సూరా (అధ్యాయం) స్త్రీల కోసమే అవతరించింది. ఆ సూరా పేరు ‘అన్నిసా- స్త్రీలు’. ఖుర్‌ ఆన్‌లోని మరో సూరాకు పుణ్యస్త్రీ పేరయిన ‘మర్యం’అని పెట్టబడింది. అలాగే అల్లాహ్‌ా విశ్వాసుల కోసం ఆదర్శంగా తోటి విశ్వాసుల్ని పేర్కొ ంటూ ఇద్దరు స్త్రీలను-ప్రవక్త ఈసా (అ) గారి మాతృమూర్తి హజ్రత్‌ మర్యమ్‌ మరియు నియంత ఫిర్‌ఔన్‌ సతీమణి హజ్రత్‌ ఆసియా బిన్త్‌ ముజాహిమ్‌ (అ)ల పేర్లను ప్రస్తావించాడు అంటే అల్లాహ్‌ా స్త్రీలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చాడో ఇట్టే అర్థమవుతుంది. వివరాల్లోకెళితే –

సమానత్వంకన్నా న్యాయమే ప్రాధానం

ఇస్లాం స్త్రీపరుషుల మధ్య సమానత్వం, సమాన స్థాయి గురించి ఆదే శించిందని సాధారణంగా కొందరు అంటుంటారు. ఇది నిజం కాదు. ఇస్లాం ఇద్దరి మధ్య న్యాయం గురించి ఆజ్ఞాపించింది. న్యాయం అంద రికి వారి ప్రతిభాపాటవాలను పరిగణలోకి తీసుకోకుండా సమాన స్థాయిని కల్పించడం కాదు. అర్హతను బట్టి తగిన స్థానాన్ని ఇవ్వడం. స్త్రీ పురుషుల సామర్థ్యాలలో ప్రకృతి రీత్యా వ్యత్యాసం ఉంది. ఈ తేడా ను గమనించకుండా ఇద్దరిపై ఒకే విధమయినటువంటి బాధ్యతలను మోపడం ఎంత మాత్రం న్యాయం అన్పించుకోదు. అందరికీ అన్నీ ఇచ్చేయడం కాదు, ముందు వారి సామర్థ్యాలను చూడాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు,పెద్దలు,యువకులు, వృద్ధులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు-అందరిపై ఒకే విధమయినటువంటి బాధ్యత ల్ని మోపడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. కాబట్టి బాహ్య ప్రపంచానికి అనుకూలంగా పురుషుడి సృజన జరిగింది గనక ఇస్లాం బైటి వ్యవహారాలు పురుషునికి అప్పగించి, ఇంటి వ్యవహారాలు స్త్రీకి అప్పగిస్తోంది. దీనర్థం ఒకరి స్థాయి ఎక్కువ, మరొకరి స్థాయి తక్కువ అని ఎంత మాత్రం కాదు.

స్త్రీ, పురుషునిలో ఒకే ఆత్మ

పురుషులకంటే తక్కువ స్థాయి గల సృష్టిరాసిగా స్త్రీని భావించడాన్ని ఖుర్‌ఆన్‌ ఖండిస్తోంది: ”మానవులారా! మీ రపభువుకు భయ పడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఆదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-4:1)

స్తీ శాశ్వత వ్యక్తిత్వం గలది

స్త్రీని శాశ్వతమయిన  వ్యక్తిత్వం గలది ఇస్లాం పేర్కొంటుంది. ”మంచి పనులు చేసేవారు-పరుషులయినా, స్త్రీలయినా వారు విశ్వాసులయిన పక్షంలో స్వర్గంలో ప్రవేశిస్తారు”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 125)

యాజమాన్యపు హక్కు:

ఆమెకు షరీయతు సరిహద్దుల్లో ఉంటూ వ్యాపారం, ఉద్యోగం చేసు కునే అనుమతి ఉంది. తన సొమ్మును ధర్మం ఆమోదించిన ఏ విష యంలోనయినా ఖర్చు చెసుకునే హక్కు ఆమెకుంది. ఆమె భర్త అయినా సరే ఆమె అనుమతి లేనిదే ఆమె ఆస్తిని ముట్టుకునే అధి కారం, హక్కు అతనికి లేదు.
”ఒకవేళ స్త్రీలు సంతోషంతో తన మహర్‌ సొమ్ము నుండి కొంత భాగం ఇచ్చినట్లయితే దానిని మీరు ఖర్చు పెట్టుకోవడం ధర్మసమ్మ తమే”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 4)

విమర్శించే హక్కు:

పురుషుల వలే స్త్రీలకు సయితం ఇంటి వ్యవ హారాల్లో కాక, సామాజిక, ధార్మిక వ్యవహారాల్లోనూ విమర్శించే హక్కు ఉంది. కొన్ని విషయాలలో హజ్రత్‌ అలీ (ర) గారితో విశ్వా సుల మాత అయిన ఆయిషా (ర)గారు విభేదించడం, స్వయంగా అప్పటి ఖలీఫా అయిన హజ్రత్‌ ఉమర్‌ (ర) గారిని ఓ సాధారణ మహిళ ‘మహర్‌’ విషయమయి నిలదీయడం, ఆయన కూడా తన అభిప్రాయాన్ని విరమించుకుని ‘మదీనాలో ఉమర్‌కంటే తెలిసి వారున్నార’ని అంగీకరించడం వంటి సంఘటనలు దీనికి మచ్చు తునకలు.

నికాహ్‌ హక్కు:

ఇస్లాం పరిపూర్ణమవ్వక ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమ్మాయి అనుమతి ఆచారం ఉన్నట్లు కన బడదు. ”అవివాహిత వనితలతో వారి వివాహం గురించి అభిప్రా యం కోరాలి” అని, ”కన్నె పిల్లలతో వివాహం కోసం వారి అను మతి కోరాలి”అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స)వారు నొక్కి వక్కాణిం చడమే కాక, ‘తన తండ్రి తన అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించాడు’ అని ఓ అమ్మాయి దావా వేయగా, ప్రవక్త (స) ఆ పెళ్ళిని రద్దు చేయించారు. ”ఇస్లాంలో వివాహానికి ముందు అమ్మా యితో తప్పనిసరి అనుమతి పొందే విధానం నాకు ఎంతో నచ్చి ంది” అని ఓ సందర్భంలో భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయి అభిప్రాయ పడటం గమనార్హం!

స్త్రీలకు భద్రతా హక్కు:

ఇస్లాంలో ఒక ప్రధాన చట్టం ‘అమాన్‌’ చట్టం. అమాన్‌ అంటే రక్షణ కల్పించడం. ఈ హక్కును ఇస్లాం పురుషుల వలే స్త్రీలకు సయితం ఇచ్చింది. ఈ హక్కు గల వారు ఇతరులను రక్షణ కల్పించవచ్చు. అలా రక్షణ పొందిన వ్యక్తి మీద దాడికి దిగడానికి అనుమతి ఉండదు.”మీరు ఎవరికి రక్షణ కల్పిం చారో నేను కూడా వారికి రక్షణ ఇచ్చాను” అని ప్రవక్త (స) మక్కా విజయం సందర్భంగా హజ్రత్‌ ఉమ్మె హానీ(ర)గారితో అనడం దీనికి ప్రబల నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.

Related Post