మన సఫప్రదాయాలను మళ్ళీ వికసించనిద్ధాం!

''నిశ్చ యంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్‌ా పట్ల అంతిమదినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ాను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు''. (దివ్య ఖుర్‌ఆన్‌-33;21)

”నిశ్చ యంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్‌ా పట్ల అంతిమదినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ాను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు”. (దివ్య ఖుర్‌ఆన్‌-33;21)

ముహమ్మద్ ఆయిజ్ అబ్దుల్లాహ్ అల్ఖర్నీ

శుభకరాల మాసమయిన రమజాను మన ఆంతర్యాల్లో, మన గృహా ల్లో మన సమాజంలో స్వచ్చమయిన ఇస్లామీయ సంప్రదాయా లను పెంపొందించుకునే సువర్ణావకాశం.
ఇస్లామీయ రాజ్యానికి తిరుగు లేని నాయకులు, ఆదర్శమూర్తి, సర్వ జన ఆదరణీయులు అంతి దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారే. ఆయన్ను అనుసరిస్తేనే మనకు సుఖశాంతులు ప్రాప్తమవుతాయి. ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే మనకు ఇహపరాల సాపల్యాలు కలు గుతాయి. పరమ ప్రభువు అయిన అల్లాహ్‌ా దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: ”ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించ బడతారు). అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇన్జీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చేఎమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుండి వారి స్తాడు. పరిశుద్ధమయిన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమయిన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరు వులను దించుతాడు. వారికి వేయబడి ఉన్న సంకెళ్ళను (విప్పుతాడు). కనుక ఎవరు ఈ ప్రవక్తని విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతిని అను సరిస్తారో వారే సాఫల్యం పొందేవారు”. (దివ్యఖుర్‌ఆన్‌-7;157)
ఈ పుడమిపై ప్రవక్త (స) వారి ప్రభవనం తర్వాత ఇక ఆయన్ను అనుసరించిన వారు మాత్రమే స్వర్గంలో ప్రవేశించగలరు. ఆయన సంప్రదాయాలు ప్రపంచ ప్రజల కొరకు నూహ్‌ా పడవ లాంటివి. తెలుసు కదా! నూహ్‌ా ప్రవక్త కాలంలో యావత్‌ ప్రపంచంలో విజృంభి ంచిన జలప్రళయం నుంచి కేవలం పడవలోకి ఎక్కినవారు మాత్రమే బతికి బట్టకట్ట గలిగారు. అలాగే ఈ రోజు ప్రపంచ మానవులందరికీ అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) బోధనలు, ఆయన సంప్రదా యాలే శరణ్యం. ఆయన సంప్రదాయాల నావను ఆశ్రయించిన వారు మాత్రమే ఇహపరాల్లో సఫలీకృతులు కాగలరు. ఒక్క ప్రవక్త (స) జీవి తమే లోకులందరికీ ఆదర్శం. అల్లాహ్‌ా ఇలా ప్రకటించాడు: ”నిశ్చ యంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్‌ా పట్ల అంతిమదినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ాను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు”. (దివ్య ఖుర్‌ఆన్‌-33;21)
దైనందిన జీవితానికి సంబంధించి ప్రవక్త (స) బోధించిన పనులు ముస్లింలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. శుభప్రదమయిన రమజాన్‌ మాసంలో వాటిని ఇంకా శ్రద్ధగా పాటించాలి. అటువంటి దైనందిన సంప్రదాయాల కోవకు చెందిన కొన్ని కార్యాలు ఇక్కడ పొందు పరుస్తున్నాము.
సదైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”పది విషయాలు మానవ సహజమయినవి. 1) మీసాలు కత్తింరించడం, 2) గడ్డం పెంచడం, 3) మిస్వాక్‌ చేయటం 4) ముక్కుని నీటితో శుభ్ర పర్చుకోవడం, 5) గోళ్ళు కత్తిరించడం, 6) మెటికలు కడగటం (శరీరంలోని ఇతర జోళ్ళను కడగటం) 7) వ్రేళ్ల మధ్య భాగాలను కడుక్కోవడం, 8) చంకలోని వెంట్రుకల్ని తొలగించటం, 9) నాభి క్రింది వెంట్రుకలు తీసి వేయటం, 10) నీటిని పొదుపుగా ఉపయోగించటం”. (ముస్లిం)
సదైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”గర్వం కొద్ది తన క్రింది వస్త్రాన్ని నేల మీద ఈడ్చుకుంటూ తిరిగేవాని వంక అల్లాహ్‌ా (కారుణ్య దృష్టితో) చూడడు”. ఇంకో సందర్భంగా – ”గిలకల క్రిందికి వ్రేలాడేది నరకానికి వెళ్తుంది” అని కూడా హెచ్చరించి ఉన్నారు. (ముస్లిం)
సపానీయం త్రాగే పాత్రలోకి శ్వాస విడవటాన్ని దైవ ప్రవక్త (స) వారించారు. (తబ్రానీ)
సవెండి బంగారు పాత్రల్లో తినటాన్ని, త్రాగటాన్ని దైవప్రవక్త (స) వారించారు. (నసాయీ)
సబంగారాన్ని, పట్టును ధరించడం పురుషుల కొరకు నిషిద్ధంగా, స్త్రీల కొరకు ధర్మసమ్మతంగా ఖరారు చేెశారు ప్రవక్త (స).
(ముస్నద్‌ అహ్మద్‌)
సరాత్రి వేళ చేసే ఇషా నమాజుకు ముందు పడుకోవటాన్ని సయితం దైవప్రవక్త (స) వారించారు.
సమరణించినవారిపై ఏడ్చి పెడబొబ్బలు పెట్టటం అవాంఛనీయం (అబూ దావూద్‌)
సతలలోని తెల్ల వెంట్రుకలు పీకేయరాదు. (తిర్మిజీ)
సప్రత్యేకించి శుక్రవారమే ఉపవాసం పాటించరాదు.(బుఖారీ, ముస్లిం)
సమిగులు జలాలను అమ్ముకోకూడదు. (ముస్లిం)
సపచ్చబొట్లు పొడిపించుకోరాదు. (ముస్నద్‌ అహ్మద్‌)
సప్రవక్త (స) మస్జిద్‌లోకి ప్రవేశించినప్పుడు మస్జిద్‌ గౌరవార్థం రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్‌ మస్జిద్‌) చేసేవారు. అలాగే మస్జిద్‌లో ప్రవేశించేటప్పుడు కుడి కాలు పెట్టి ప్రవేశించేవారు. అలాగే ప్రతి కార్యంలోను కుడిని ఆయన ఇష్టపడేవారు.
సఎవరి ఇంటికయినా వెళితే మూడు సార్లు సలామ్‌ చేసి ఇంటి యజమాని అనుమతి గ్రహించాలని, అనుమతి లభించని పక్షంలో లోనికి ప్రవేశించరాదని, తిరిగి వెళ్ళి పోవాలని ప్రవక్త (స) వారు సెల విచ్చారు.
సఇతరుల ఇళ్ళల్లోకి తొంగి చూడటం చేయకూడదు అన్నారు ప్రవక్త.
స”మీరు ఒండొకరి పట్ల అసూయాద్వేషాలకు, రంధ్రాన్వేషణకు, గొడవకు గురి కాకండి. అల్లాహ్‌ా దాసులవలే పరస్పరం సోదరులుగా మెలగండి” అన్నారు ప్రవక్త (స).

Related Post