మానవ సృష్టి ఒక అద్భుత ప్రక్రియ

మానవ సృష్టి ప్రక్రియ

మేము మిమ్మల్ని మట్టితో, ఆ తర్వాత నెత్తుటి గడ్డతో, ఆపైన మాంసపు కండతో, అది రూపం కలదిగానూ, రూపం లేనిదిగానూ ఉంటుంది. మీకు యదార్ధమేమిటో స్పష్టం చేయాలని (మేము ఈ విషయాన్ని తెలుపుతున్నాము). మేము కోరిన దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము.

అనంతకాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? మేము మానవుణ్ణి పరీక్షించటాన్ని అతనికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. (76:1,2)
మేము మానవుణ్ణి కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాము. దీనికి పూర్వం జిన్నాతులను మేము తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించి ఉన్నాము. నీ ప్రభువు దైవ దూతలతో  ఇలా అన్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో: ”నేను కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో ఒక మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతణ్ణి పూర్తిగా తయారు చేసి, అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊదినప్పుడు, మీరంతా అతని ముందు సాష్టాంగ పడాలి”. (15: 26-29)
మేము ఆదం సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాము. వారికి నేలపై, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అనుగ్రహం. (17: 70)
ఓ మానవులారా! ఒకవేళ మీకు మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే, మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి – (అదేమంటే) మేము మిమ్మల్ని మట్టితో, ఆ తర్వాత నెత్తుటి గడ్డతో, ఆపైన మాంసపు కండతో, అది రూపం కలదిగానూ, రూపం లేనిదిగానూ ఉంటుంది. మీకు యదార్ధమేమిటో స్పష్టం చేయాలని (మేము ఈ విషయాన్ని తెలుపుతున్నాము). మేము కోరిన దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము.  తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము – మీరు నిండు యౌవన థకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు. మరొకడు అతి నికృష్టమైన  వయస్సు వైపునకు మరలింపబడతాడు – అంతా తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి. ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు. తర్వాత మేము దానిపై వర్షం కురిపించగానే అకస్మాత్తుగా అది పులకిస్తుంది, ఉబుకుతుంది. ఇంకా అది   అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించటం ప్రారంభిస్తుంది.   (22:5)
మేము మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించాము. తరువాత మేమతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడిగా మార్చివేశాము. అయితే విశ్వసించి, మంచి పనులు చేసిన వారు మాత్రం అలాంటి వారు కారు. వారికి ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. (95: 4-6)

Related Post