మనిషిగా మారిన ఒక దేవుడు

 from darkness to light

బుద్ధ భగవానుని అవతారంగా రూపొందిన నేను 45 సంవత్సరాల పాటు సుఖ భోగాలలో జీవితం గడిపాను. ప్రజలు నాకు సాష్టాంగపడేవారు. అలాగే వారు ‘నేను దేవుడిని’ అని నమ్మేవారు. అలాగే నేను కూడా నమ్మాను. నా జీవితంలోని 45 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని దైవత్వపు ముసుగు ధరించి బుద్ధ భగవానుని అవతారంగా, బుద్ధుడు 7 పర్యాయాలు తిరిగి జన్మించాడని, నేనూ వారిలోని ఒకడిగా ప్రకటించుకొని గడిపాను. ‘నేను ఏదైతే పలుకుతానో అది దేవుని వాక్కు’ అని ప్రకటించి ఉన్నాను. ఆ విషయం పట్ల నాకు విశ్వాసం కూడా ఉండేది. నేనే కాకుండా పసుపు పచ్చని దుస్తులు ధరించిన బౌద్ధ భిక్షువులందరూ అదే విధంగా విశ్వసించే వారు.

 (ఇస్లామిక్‌ గైడెన్స్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో)

 

బుద్ధ  భగవానుని అవతారంగా రూపొందిన నేను 45 సంవత్సరాల పాటు సుఖ భోగాలలో జీవితం గడిపాను. ప్రజలు నాకు సాష్టాంగపడేవారు. అలాగే వారు ‘నేను దేవుడిని’ అని నమ్మేవారు. అలాగే నేను కూడా నమ్మాను. నా జీవితంలోని 45 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని దైవత్వపు ముసుగు ధరించి బుద్ధ భగవానుని అవతారంగా, బుద్ధుడు 7 పర్యాయాలు తిరిగి జన్మించాడని, నేనూ వారిలోని ఒకడిగా ప్రకటించుకొని గడిపాను. ‘నేను ఏదైతే పలుకుతానో అది దేవుని వాక్కు’ అని ప్రకటించి ఉన్నాను. ఆ విషయం పట్ల నాకు విశ్వాసం కూడా ఉండేది. నేనే కాకుండా పసుపు పచ్చని దుస్తులు ధరించిన బౌద్ధ భిక్షువులందరూ అదే విధంగా విశ్వసించే వారు.

 

  ప్రపంచంలోకెల్లా బౌద్ధమతం సర్వోత్కృష్ట మైనదని నేను విశ్వసించేవాడిని. ఆ విశ్వాసంతోనే నేను ప్రపంచంలోని వివిధ దేశాలలో దానిని ప్రచారం చేశాను. తత్ఫలితంగా వందలాది దేశాల్లో నాకు శిష్యులు, సహాయకులు రూపొందారు.   నాస్వంత సోదరుడు నేటికీ ప్రపంచ  వ్యాప్తంగా ప్రసిద్ధుడైన బౌద్ధ సన్యాసి. అతడు అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌  నగరంలో ఉంటాడు. నేను దైవత్వపు వేషంలో కొనసాగుతూ ఉండిన కాలంలో ఒక ముస్లిం సోదరుడు, చెన్నయ్‌లో నివసించే నా శిష్యుడైన డాక్టర్‌ చయ్యప్పన్‌ అనే బౌద్ధ మతానుయాయి ద్వారా నాకు ఇస్ల్లాం ధర్మంతో పరిచయం కలిగింది.  అలాగే నాకు ఇస్లాంకు చెందిన కొన్ని పుస్తకాలు ఇవ్వబడ్డాయి. కానీ నేను వాటిని నిర్లక్ష్య ధోరణితో అధ్యయనం చేశాను. అయితే ఆ తర్వాత ఖుర్‌ఆన్‌, దైవ ప్రవక్త హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్రల అధ్యయనాన్ని నిరంతరాయంగా కొన సాగించాను. ఆ సమయంలో నా హృద యాంతరాలలో నా పాపాల పట్ల  పశ్చాత్తాప

 

 భావన చెలరేగింది. తత్ఫలితంగా దైవత్వపు ముసుగులో జీవితం గడుపుతున్న ‘నేను’ క్రమక్రమంగా ఒక మానవుని రూపంలోకి మారిపోయాను. బ్రహ్మచారి జీవితం గడుపుతూ ఉండిన నేను ఒక భర్తగా మారాను. ఒంటరిగా ఒకే శరీరాన్ని కలిగిన నేను ఒక తండ్రిగా మారాను. ఇతరులకు శ్రేయస్కర మార్గాన్ని చూపుతూ ఉండిన నేను  స్వయంగా శ్రేయస్కర మార్గాన్ని అన్వేషించే వాడిగా మారాను. బౌద్ధ సన్యాసులను, జంతువులను దైవాలుగా విశ్వసించే నేను ఒక్కడైన అల్లాహ్‌ాను నిజమైన ఆరాధ్యునిగా, దేవునిగా అంగీకరించి విశ్వసించాను.

 

 క్లుప్తంగా చెప్పాలంటే నేను పూర్వం దేవుడిగా ఉండేవాడిని. (ఆ విధంగా నేనూ భావించేవాడిని, ప్రజలూ విశ్వసించేవారు).  నేను మానవుడిగా మారిపోయాను. ప్రారంభం నుంచి చివరివరకు నా జీవితానికి సంబంధించిన పరిస్థితులను క్లుప్తంగా మీ ముందు పొందుపరుస్తాను.

 

      బుద్ధం శరణం గచ్ఛామి

 

      ధర్మం శరణం గచ్ఛామి

 

      సంఘం శరణం గచ్ఛామి

 

ఈ సూత్రాలకు అనుగుణంగా జీవితం గడుపుతూ ఉండిన నా నోటి నుంచి ఈ పలుకులు, నినాదాలు వెలువడుతూ ఉండేవి. నేను బోధి వృక్షం క్రింద కూర్చుని జ్ఞానాన్ని ఆర్జించాను, బౌద్ధ సన్యాసి నయ్యాను, ప్రపంచంలో బౌద్ధ మత ప్రచారకునిగా కొనసాగాను.

 

గౌతమ బుద్ధుడు:

 

  మానవుడిని మానవుడి దాస్యం నుంచి వెలికి తీసిన, అజ్ఞానాన్ని అంతమొందించిన, ఆర్య జాతి హింసాదౌర్జన్యాలను తుద ముట్టించిన, మానవునికి శాంతి శ్రేయాల మార్గాన్ని చూపిన వ్యక్తి గౌతమ బుద్ధుడు.

 

బ్రహ్మచారులు:

 

  బౌద్ధ విశ్వాసాన్ని భువిలో ప్రచారం చేసే మేము, లౌకిక వాంఛలను కలిగి ఉండని బ్రహ్మచారులమైన మేము, రాజ   దర్బారుల  లో వలె బౌద్ధ విహారాలలో సుఖవంతమైన జీవితం గడిపే మేము ఆర్య వర్ణ వ్యవస్థ (కుల వ్యవస్థ)కు వ్యతిరేకంగా కరవాలమెత్తి బయలుదేరినవారము.

 

మానవుడెవరు?

 

మానవుడు స్వయంగా జన్మించాడా? లేక ఏ దేవుడయినా అతడిని పుట్టించాడా? మరణం ఎందుకు సంభవిస్తుంది? మరణించిన తర్వాత మానవుడేమవుతాడు?

 

  నా అంతరాత్మ నన్ను ఇటువంటి పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేది. నా మనో మస్తిష్కాలలో ఇటువంటి ప్రశ్నల తుఫాను చెలరేగేది. పోగొట్టుకునే వస్తువును వెతుక్కునే వ్యక్తి వలె వాటికి సమాధానాలను అన్వేషించసాగాను. తత్కారణంగా నాలో క్రమక్రమంగా మనో వాంఛల పట్ల ఏహ్య భావం జనించసాగింది. నేెను సత్యా న్వేషణలో నిమగ్నుడయ్యాను. తత్కారణంగా నా హృదయంలో ఒక కాంతి కిరణం ప్రసరించింది. డబ్బు వెచ్చించడం వల్ల లభ్యం కాజాలని ప్రేమ, కారుణ్యం, అణుకువలు నా హృదయంలో జనించాయి. నేను పయనిస్తున్న మార్గం సరైనదో   కాదో తెలుసుకోవాలనే తపన నాలో జనించింది. అదే విధంగా ఇతర మతాలను పరికించే కోరిక కూడా నాలో జనించింది. నడి వయస్సులో నాలో జనించిన చింతన నా పూర్వపు జీవితాన్ని స్వయంగా సమీక్షించు కునేందుకై అత్యుత్తమ అవకాశాన్ని ప్రసాదించింది. యాదవ కులంలో పుట్టిన నేను ‘స్వామీ ఆనంద్‌ జీ” గా ప్రసిద్ధు డయ్యాను. పట్టు పీఠం మీద కూర్చుండబెట్టి దర్బారు సేవకులు నన్ను ఒక చోటి నుంచి మరొక చోటికి తీసుకెళ్తూ ఉండేవారు. ఇదీ నా పూర్వ స్థితి.

 

నా పూర్వీకులు తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం  జిల్లాలో పరమక్కుడికు సమీపంలో ఆలకన్‌ కులమ్‌  గ్రామంలో స్థిర పడ్డారు. ఆ తర్వాత సిద్దార్‌ కొట్టాయ్‌  ఓడ రేవు నుంచి వారు ఓడలో  బర్మాకు  పయన

 

మయ్యారు. బర్మాలో నా తాతగారు తన కుటుంబంతో సహా సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉండేవారు.

 

  నేను   యాదవ కులంలో పుట్టాను. నా పూర్వీకులు పశువుల కాపరులుగా జీవనం కొనసాగించేవారు. కానీ  నేను ఈ రోజు బౌద్ధ గురువయిన స్వామి ఆనందుడిగా పిలువబడుతున్నాను. ఆర్థికాభివృద్ధికై నా వంశస్థులు బర్మాకు వలస పోయారు. అయితే వారు తమిళ భాషను మాతృ భాషగా గుర్తుంచుకున్నారు.

 

  నా తండ్రి బాల్యం నుంచే నిబద్ధుడైన బౌద్ధుడిగా ఉండేవారు. అందుకే నన్ను కూడా ఆయన బౌద్ధ మతానుసారం పోషించారు. పలు బౌద్ధ మందిరాలలో నా విద్యాభ్యాసం కొనసాగింది. నన్ను ఒక బౌద్ధ భిక్షువుగా రూపొందించాలని నా తండ్రి ఎంతగానో కోరుకునేవారు. అందుకే ఆయన నాకు తత్సంబంధిత విద్యలన్నింటినీ నేర్పారు. రంగూన్‌, టిబెట్‌, చైనా , గోర్బా, కంబోడియా, జపాన్‌ తదితర దేశాలలోని గురువుల వద్ద నేను విద్యనభ్యసించాను. 19 సంవత్సరాల వయసుకు చేరుకునేలోగా నేను సంపూర్ణంగా విద్యలనభ్యసించాను. బర్మాకు చెందిన రెండవ రాజధాని అయిన మండలాలో బౌద్ధ మత గురువైన చానీషరా ఆసియా ఖండంలోని ఐదుగురు మహా బౌద్ధ గురువులలో ఒకడిగా నన్ను గుర్తిస్తూ ఆమోదించారు. అలాగే నాకు పసుపు పచ్చని వస్త్రాలు కూడా తొడగబడ్డాయి. ఆ విధంగా బౌద్ధ భిక్షువులలో నాకు మహోన్నత స్థాయి ప్రాప్తమయింది. నన్ను జపాన్‌లోని టోక్యో నగరానికి చెందిన ‘బోది దాసోవాసో’ అనే పేరు గల బౌద్ధ మత గురువు నాగసాకి నగరంలో నన్ను   నియమించారు.  అలాగే ప్రపంచమంతటా బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి వ్యాపింపజేయడానికి సంబంధించిన మహా బాధ్యత నాపై మోపబడింది. అలాగే 101 గురువులకు అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించింది. ఆ తర్వాత నేను ప్రపంచమంతటా పర్యటిస్తూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయనారంభించాను. బౌద్ధులు ఉండే నైరుతి ఆసియాలోని 17 దేశాలలోనే కాకుండా యూరప్‌లోనూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయసాగాను.

 

 బౌద్ధ మత ప్రపంచంలో నాకు సర్వోన్నత స్థాయి ప్రాప్తమయింది. ప్రపంచమంతటా పర్యటించేందుకై నాకు ప్రభుత్వం తరఫున గ్రీన్‌ కార్డులు లభ్యమయ్యాయి. వాటి ద్వారా నేను  అరబ్‌ దేశాలు తప్ప  ప్రపంచ మంతటా పర్యటిస్తూ   బౌద్ధ మతాన్ని ప్రచారం చేయసాగాను.

 

  నా సొంత సోదరుడైన స్వామి నందాచార్య నేటికీ అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌  నగరంలో 67 అంతస్థుల బౌద్ధ ఆశ్రమంలో మఠాధిపతిగా కొనసాగుతూ ఉన్నాడు. నేను కూడా అక్కడ మూడున్నర సంవత్సరాల పాటు మఠాధిపతిగా కొనసాగాను.

 

చేెతబడులు, మహిమలు:

 

  చైనా, టిబెట్‌, జపాన్‌ మొదలయిన దేశాల్లో చేతబడి ద్వారా,  క్షుద్రవిద్యల ద్వారా నాకు ఎన్నో మహిమలు చేకూరాయి. ఆ కాలంలో నేను చేతబడి ద్వారా ఆత్మలను ఆహ్వానిస్తూ వాటిచే భవిష్యవాణి పలికించే కార్యకలాపాల్లో నిమగ్నుడయి ఉండేవాడిని. ‘కాళి’, ‘కాడి’, ‘కలకత్తా కాళి’, ‘కేరళ దేవి’లను పూజించి రాగి రేకుల మీద లేదా రాగి దారాల మీద ఊది  ప్రజలకు   ఇస్తూ ఉండేవాడిని. అలాగే దేవతలను 101 వెండి పాత్రల్లో బంధించేవాడిని. నాకు ఏమీ తోచకపోతే ఆ పాత్రల్లోని దేవతలను బైటికి తీసి అంధకారంలో వాటితో మాట్లాడుతూ ఉండేవాడిని.

 

  ఆ తర్వాత నేను నన్ను కలుసుకునేందుకు వచ్చినవారిలోనూ, ప్రపంచంలోని బౌద్ధు లందరిలోనూ దేవతల భాష పట్ల, వారి భవిష్యవాణుల పట్ల అవగాహన గలవాడిగా, వాటితో మాట్లాడే ‘మహా గురువుగా ఆనంద్‌ జీ’గా సుప్రసిద్ధుడినయ్యాను.

 

ఆశీర్వాదం:

 

పలువురు నాయకులు, ప్రభుత్వాధినేతలు తమ తలల మీద నా పాదాన్ని ఉంచి ఆశీర్వాదం పొందడాన్ని మహాభాగ్యంగా భావించేవారు. సింగపూర్‌కు చెందిన మొదటి రాజు తల మీద నా పాదాన్ని ఉంచి మూడు పర్యాయాలు నేను అతడ్ని ఆశీర్వదించాను. అదే విధంగా థాయ్‌లాండ్‌ రాజైన బర్మాపూజో చీనిస్వీన్‌ తల మీద కూడా నా పాదముంచి ఆశీర్వదించాను. అదే విధంగా మన మాజీ ప్రధాన మంత్రి అయిన రాజీవ్‌ గాంధీ, జపాన్‌ ఉపాథ్యక్షుల తలల మీద పాదముంచి ఆశీర్వదించాను. శుక్రవారం నాడు, మంగళవారం నాడు నన్ను బంగారు సింహాసనం మీద నిల్చుండ బెట్టి ఒక నీటి కుండలోని నీటి ద్వారా నా పాదాలను కడగాలంటే ఒక లక్షా  ఒక రూపాయిగా నిర్ణయించబడింది. ఆ నీటిని ఐదుగురు వ్యక్తులు తాగుతారు. మరి నేను దేవుని అవతారాన్ని కానా? (అని ఆనాడు భావిస్తూ ఉండేవాడిని).

 

  బుద్ధుని మరొక జన్మలో రూపంగా, దేవతల అధ్యక్షునిగా, దేవుళ్ళతో మాట్లాడే సామర్ధ్యాన్ని కలిగి ఉన్న దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పర్యటించేవానిగా నేను సుప్రసిద్ధుడినయ్యాను.

 

  చికిత్స లేని వ్యాధులకు గురయిన ఎందరో వ్యాధిగ్రస్తులు నా మూత్రాన్ని త్రాగేవారు. తద్వారా వారికి ఆరోగ్యం చేకూరేది (అని వారు భావించేవారు). ‘నా మూత్రాన్ని వారు త్రాగడంలో తప్పెేముంది? ఎందుకంటే నేను దేవుడిని గదా!’ (అని ఆనాడు భావిస్తూ ఉండేవాడిని.

 

మానవుడు దేవుడా? 

నేను బోధి వృక్షం క్రింద వెండి సింహాసనం మీద కూర్చుండేవాడిని. బంగారాన్ని, సంపదను ఆ సింహాసనం ముందు ఉంచి వారు నా కాళ్ళ మీద పడి వేడుకునే నా భక్తులను నేను ఆశీర్వదిస్తూ  ఉండేవాడిని. వారు నా  ఆశీర్వాదాన్ని పొందేందుకై నన్ను అన్వేషిస్తూ బయలుదేరేవారు. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఈ విధంగా అర్థించాడు: ”గురూజీ! నేను దేవుడిని చూడలేదు. మీరే ఆ సర్వోత్కృష్ట సజీవ దైవం. నాకు ప్రపంచంలోని సర్వ  సుఖాలూ ప్రాప్తమాయ్యయి. కాని నాకు వివాహమై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం కలుగలేదు. గురూజీ! మీరు నాకు సంతానం కలిగేలా అత్యుత్తమ రీతిలో నన్ను ఆశీర్వదించండి”. ఆ విధంగా పలికిన ఆ వ్యక్తి నా పాదాల మీద తన చేతిని ఉంచి ఆ చేతిని తన కళ్ళకు అద్దుకోసాగాడు. సరిగ్గా అక్కడి నుంచే సమస్య మొదలయింది. నన్ను వెదుక్కుంటూ నా ఆశ్రమానికి వచ్చిన ఆ భక్తుడు కోటీశ్వరుడు. దానితో అతన్ని మోసపుచ్చాలనే ఆలోచన నాలో పురివిప్పింది.  నేను అతనితో ఈ విధంగా పలికాను: ”ఈ రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత నీకు తాయెత్తు ఇస్తాను. పడుకునే  ముందు   దానిని

 నీవు నీ దిండు క్రింద పెట్టుకో. ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతాడు. రేపు వచ్చి దేవుడు నీతో మాట్లాడాడో లేదో నాకు తెలుపు” యాదృచ్ఛికంగా ఆ వ్యక్తి మరుసటి రోజు నా ఇంటి తలుపు తట్టాడు. ఆ సమయంలో నా శిష్యుడు ఆదరాబాదరాగా నా దగ్గరికి వచ్చి ‘గురూజీ! ఆ కోటీశ్వరుడొచ్చాడు’ అని సమాచారమందించాడు. ”ఏ కోటీశ్వరుడు?” అని నేను శిష్యుడును ప్రశ్నించాను. ”సంతానం కోసం అర్థిస్తూ మీ దగ్గరకొచ్చి తాయెత్తు తీసుకెళ్ళిన కోటీశ్వరుడే” అని శిష్యుడు సమాధానమిచ్చాడు. నేను వెంటనే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి పట్టు విసన కర్ర చేతబూని భిక్షాపాత్రను పట్టుకొని అప్పుడే బుద్ధుడు అవతరించినట్లుగా అభినయిస్తూ ఆ వ్యక్తి వద్ద్దకు చేరుకున్నాను. ఆ కోటీశ్వరుడు వెంటనే నా కాళ్ళ మీద పడిపోయాడు. ”దేవుడు నాతో మాట్లాడాడు” అని పలికి ఏడ్వనారం భించాడు!    నేను స్వయంగా దేవుడిని చూడలేదు. కానీ నా బూటకపు తాయెత్తు ధరించిన ఈ మూర్ఖుడు దేవుడు తనతో మాట్లాడాడని పలుకుతున్నాడు. అతడి మాటలు వినగానే నేను విభ్రాంతి చెందాను. నేను ఏం వింటున్నాను?! 45 సంవత్సరాలుగా తల గొరిగించుకొని, తాయెత్తులు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బ్రహ్మచారి జీవితాన్ని గడిపి, అన్ని కోరికలను త్యజించి, సన్యాసిగా రూపొంది, బోధి వృక్షం క్రింద నిత్యం ‘బుద్ధా….బుద్ధా’ అని బిగ్గరగా జపిస్తూ ఉండే నన్ను, ప్రజలకు తాయెత్తులిచ్చే నన్ను విస్మరించి దేవుడు అతడితో మాట్లాడాడా?! ఇది న్యాయమేనా?! ఒకవేళ దేవుడు నిజంగానే మాట్లాడదలుచుకుంటే నాతో మాట్లాడి ఉండవలసింది. 45 సంవత్సరాలుగా నా బుద్ధుడు నాతో మాట్లాడలేదు. కానీ నేనిచ్చిన తాయెత్తు ధరించిన నా శిష్యునితో దేవుడు ఎలా మాట్లాడాడు? మోసపుచ్చేవాడున్నంత వరకు మోసపోయేవాడు కూడా ఉంటాడు!!

  స్వాముల పరిస్థితి ఏమిటంటే పసుపు పచ్చని వస్త్రాలలో పవిత్రతా ముసుగు ధరించి మహాత్ములుగా చలామణీ అవుతారు. ఒకవేళ పోలీసులు వారిని పట్టుకుంటే మహా పాపాత్ములుగా బహిర్గతమవుతారు. అటువంటి స్వాములలో బ్రహ్మానంద స్వామి,  చంద్ర స్వామి  

మార్తాండతం, జాన్‌ జోసెఫ్‌ మొదలైనవారు ప్రసిద్ధులు.

ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతూ ఉంటారనే విషయాన్ని నా పూర్వీకులు నా మనో మస్తిష్కాలలో బలంగా నాటారు. నా పూర్వీకులు యాదవ కులస్థులు. వారు పశువులను పోషించే వృత్తిలో కొనసాగేవారు. అలాగే వారు ఆవును దేవతగా కొలిచేవారు కూడా. నేను బాల్యంలో బౌద్ధ గురువుగా కొనసాగేవాడిని. అయినప్పటికీ నా తల్లి ఆవును పూజించి దానిని దేవతగా విశ్వసించేది. అలాగే నన్ను కూడా ఆ విధంగా చేసేలా ప్రేరేపించేది. అయితే ముస్లిం అటువంటి దేవుడిని (ఆవును) కోసి బిరియానీ చేసుకుంటాడు. నేను ఒక బౌద్ధ గురువయిన కారణంగా ఇస్లాంను అధ్యయనం చేయడం నా కొరకు సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అదే సమయంలో కొంత మంది ముస్లింలతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి.  

 ఇస్లాం నన్ను ఆవరించింది:

  కొన్ని రోజలు గడిచిన తర్వాత ముస్లిలతో నా సంబంధాలు బలపడసాగాయి. అలాగే  ఇస్లాంను అవగాహన చేసుకోవడానికి దోహదపడే సౌలభ్యాలు నాకు ప్రాప్తమవ సాగాయి. ఇస్లాంకు సంబంధించి వ్రాయబడిన చిన్న చిన్న పుస్తకాలు అధ్యయనం చేయడాన్ని ప్రారంభించాను. దైవ ప్రవక్త హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్రను అధ్యయనం చేయడం వల్ల ఖుర్‌ఆన్‌ను అధ్యయనం చేయాలనే ఆసక్తి నాలో కలిగింది. దానితో నేను ఖుర్‌ఆన్‌ అధ్యయనాన్ని కొనసాగించాను, ”ఈ ప్రపంచాన్ని, సమస్త జీవరాసులను ఒకే సృష్టికర్త సృష్టించాడు” దీనిని బట్టి నాకు తెలిసిన విషయమేమిటంటే సూర్యుడు ఉదయం పూట ఉదయించడం, సాయంత్రం వేళ అస్తమించడం మొదలయిన చర్యలన్నీ సృష్టికర్త ఆజ్ఞ ద్వారానే జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయనచే సృష్టించబడిన అత్యుత్తమ జీవరాసులను పరిశీలించి నేను ఆశ్చర్యంలో మునిగి పోయాను. చివరకు ఇస్లామీయ చింతన నా హృదయంలో నిబిడీకృతం కాసాగింది. అలాగే ఈ భావనలు నా మస్తిష్కంలో తుఫాను రేపసాగాయి. అలాగే   ఇస్లాంను   అవగాహన తుఫాను రేపసాగాయి. అలాగే ఇస్లాంను అవగాహన      చేసుకోవలసిందిగా,    దానిని స్వీకరించవలసిందిగా నన్ను కుదిపి వేయసాగాయి. దానితో మరొక పర్యాయం ఖుర్‌ఆన్‌ను అధ్యయనం చేసి చూడాలనే ఆలోచన నా మదిలో చెలరేగింది. ఆ ఆసక్తి నాలో తిరిగి మొలకెత్తింది. నేను ఏకాగ్రచిత్తుడినై ఖుర్‌ఆన్‌ అధ్యయనంలో మునిగిపోయాను. దానితో పాటు ఆశ్రమానికి సంబంధించిన నా దైనందిన కార్యకలాపాల విషయంలో అనాసక్తత పెరుగుతూ పోయింది. ఉదయం పూట, సాయంత్రం వేళ అగరుబత్తిని, కొవ్వొత్తిని వెలిగించి, నీటిలో పూలు వేసి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అని జపించే కార్యం నిలిచిపోయింది. 

మార్పుకు నాంది: 

ఖుర్‌ఆన్‌ను రెండు పర్యాయాలు అధ్యయనం చేసిన తర్వాత నా మనో కవాటాలు తెరుచుకున్నాయి. దానితో నేను గత 35 సంవత్సరాలుగా మార్గభ్రష్ఠత్వంలో    ఉన్నాననే విషయం నాకు అర్థం అయింది. అన్ని వస్తువులు సృష్టికర్త ఆధీనంలోనే ఉన్నాయి.  ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా సుఖబోగాలకు అలవాటు పడిన స్వామి (అంటే నేను) సుఖవంతమైన జీవితాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. అలాగే నా శరీరం అందుకు సుముఖత చూపలేక పోయింది. ఆ కాలంలో ఒక దళిత నాయకుడు నా నుంచి ఆశీర్వాదం పొందే ఉద్దేశ్యంతో నా దగ్గరికి వచ్చాడు. నేను అతడి తల మీద నా పాదముంచి ‘మీరు 120 సంవత్సరాలు బ్రతుకుతారు’ అని ఆశీర్వదించాను. అయితే నా ఆశీర్వాదాన్ని పొందిన 90 రోజులకే ఆ వ్యక్తి మరణించాడు. ఆ ఉదంతం నా అంతరాత్మను నిలదీసింది. కుదిపివేసింది. నా సరికొత్త జీవితానికి, మార్పుకు నాంది ఆ సంఘటనే. అదేవిధంగా మరొక సంఘటన కూడా జరిగింది. 

1991లో భారత దేశ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో మాజీ ప్రధాన మంత్రి అయిన రాజీవ్‌ గాంధీ కంచి శంకరాచార్య వారి ఆశీర్వాదం పొందేందుకై వచ్చారు. రాజీవ్‌ గాంధీ తలమీద తన పాదం ఉంచి శంకరాచార్య ఈ విధంగా పలికారు: ”101 సంవత్సరాల పాటు మీరు జీవిస్తారు. భారతదేశానికి మీరే ఎల్లప్పుడూ ప్రధాన మంత్రిగా కొనసాగుతారు”. ఆ విధంగా కంచి పీఠాధిపతి అయిన శంకరాచార్య ఆశీర్వదించిన తర్వాత 27వ రోజున రాజీవ్‌ గాంధీ సిరి పెరంబుదూర్‌లో మానవ బాంబు ద్వారా హతులయ్యారు. 

  ఈ రెండు సంఘటనలు నా అంతరాత్మను నిత్యం నిలదీస్తూ ఉండేవి. ఒక బౌద్ధ స్వామి అయిన నేను ఎవరినయితే     ఆశీర్వదించానో అతను 90 రోజుల్లోనే చనిపోయాడు. అలాగే హిందువుల గురువైన శంకరాచార్య   ఎవరినైతే ఆశీర్వదించారో అతడు 27వ రోజే చనిపోయాడు. దానితో ఆవిధంగా ఆశీర్వదించిన శంకరాచార్య, బౌద్ధ భిక్షువు అయిన ఇద్దరూ బూటకపు దేవుళ్ళనే విషయం నాకు స్పష్టంగా తెలిసింది. ఇంతకు మించిన అప్రతిష్ట మరేముంటుంది? దీనిని బట్టి మానవుడు ఏ శక్తికీ అధిపతి కాడనే విషయం తేట తెల్లమైంది. భువిలో కేవలం అల్ల్లాహ్‌ా ఆజ్ఞ మాత్రమే నడుస్తుంది. ఆ వాస్తవం నా మదిలో దేవుని పట్ల విశ్వాసాన్ని జనింపజేసింది.  అలాగే నా వంటి నీచునికి, అల్పునికి ఆశీర్వదించే అర్హత ఏ మాత్రం లేదని తెలియజేస్తూ నా కనులు తెరిపించింది. ఆ విధంగా నేను సత్యం వైపునకు మేల్కొన్న తర్వాత సుదీర్ఘ కాలంగా నేను ధరిస్తూ వస్తున్న పసుపు పచ్చని వస్త్రాలను పరిత్యజించాను. అలాగే ఆల్లాహ్‌ా తప్ప నిజమైన ఆరాధ్యుడు లేడనే విషయం పట్ల ప్రగాఢ విశ్వాసం నాలో జనించింది.

మానవుడు దేవుడా?

‘నేను దేవుడినా?’ ఇస్లాం నన్ను ఈ విషయం గురించి ఆలోచించేలా చేసింది. మానవుడు మానవుడిగా జీవించాలి. అదే అతడి ఆరోహణం. మానవుడు అన్ని విషయాల నుంచి విముక్తి పొందగలడు గానీ వైవాహిక జీవితం నుండి విముక్తి పొందినట్లయితే అతడు కుళ్ళిపోతాడు. ఒక మానవునికి నలుగురు భార్యలతో కలిసి జీవించే హక్కుంది. వైవాహిక జీవితాన్ని త్యజించి సన్యాసులుగా మారి వందలాది ఆడపిల్లలతో వ్యభిచరించి వారి జీవితాలను నాశనం చేయడానికి (తిరుచ్చిలో ‘ప్రేమానంద’ అనే పేరుతో పిలువబడే హిందూ సన్యాసి 100 మందికి మించిన ఆడపిల్లలపై అత్యాచారం చేశాడనే అభియోగం మీద జైలుకు పంపబడ్డాడు. ఈ  వాక్యం     వాస్తవానికి   ఆ సంఘటనను సూచిస్తుంది.) సంబంధించిన ఇటువంటి మహా పాపం (వ్యభిచారం) నుంచి, దౌర్జన్యం నుంచి ఇస్లాం నన్ను రక్షించింది. నేను నా తల మీద నుంచి పసుపు పచ్చని వస్త్రాలను తొలగించి మానవుడినయ్యాను.

గురువు, ఆయన శాపం:

నేను ఇస్లాం స్వీకరించిన విషయం దావానలంలా బౌద్ధమత ప్రపంచమంతటా వ్యాపించింది. అప్పటి బౌద్ధ మహా గురువయిన, టిబెట్‌ స్వామికి కూడా ఈ విషయం తెలిసింది. ఆయన నిత్యం నన్ను ప్రశంసిస్తూ ఉండేవారు. నేను ఇస్లాం స్వీకరించిన విషయం తెలియగానే ఆయన నన్ను పిలిపించారు. ఆయన ఒక స్వామి మాత్రమే కాకుండా నిపుణుడయిన మాంత్రికుడు కూడా. నేను కూడా సంతోషంగా ఆయన్ను కలుసుకునేందుకు వెళ్ళాను. నేను నా స్థితిగతుల గురించి ఆయనకు తెలియజేశాను. ఆయన ఈ విధంగా పలికారు: ”మీరు ఇస్లాం స్వీకరించడం వల్ల బౌద్ధమతానికి కేవలం నష్టం కలగటం మాత్రమే కాకుండా బౌద్ధ మతంలో చేరే సామాన్య జనుల శాతం బాగా క్ష్షీణిస్తుంది. కనుక మీరు ఈ విషయం గురించి ఆలోచించండి”. నేను ఈ విధంగా సమాధాన మిచ్చాను: ”నా నిర్ణయం విషయంలో పునరాలోచనకు ఏ మాత్రం అవకాశం లేదు” నేను ఆ విధంగా సమాధానమివ్వగలనని స్వయంగా నేనే ఊహించలేదు. ఒకప్పుడు నా గురువు కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయంటే నేను కళ్ళు మూసుకుని ‘అవును, నిజమే. కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయి’ అంటూ ధృవీకరించేవాడిని. నా సమాధానం విని ఆయన ఎంతగానో నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహోదగ్రులయ్యారు. అలాగే ఆయన నన్ను శపించారు. అంతకు ముందు నేను ఆయన శాపాన్ని విన్నంతనే కంపించిపోయేవాడిని. కానీ ఈ పర్యాయం ఆయన నన్ను శపించినప్పటికీ నేను ఏ మాత్రం ఆందోళనకు లోనుకాలేదు. ఆయన నన్ను ఈ విధంగా శపించారు: ”నా మాటలను ధిక్కరించి ఇస్లాంను విడనాడనట్లయితే 150 రోజుల లోపల నీ చేయి ఒకటి, కాలు ఒకటి పక్షవాతానికి గురవుతాయి”. 

  ఇటువంటి వ్యర్థ విషయాలకు, అసంబద్ధ విషయాలకు ఇస్లాంలో ఎంత మాత్రం అవకాశం లేదనే విషయం నాకు తెలిసింది. అయినప్పటికీ ఆ శాపం యొక్క దుష్ప్రభావం ఏమయినా పడుతుందేమోననే దుష్ట ప్రేరణలను షైతాన్‌ నా మదిలో కలిగించసాగాడు. కానీ నేను ఆ దుష్ట ప్రేరణలను పట్టించుకోకుండా అల్లాహ్ పై నమ్మకం ఉంచి  అక్కడ నుంచి వెనుదిరిగాను. ఆ తర్వాత నేను ప్రతి రోజూ ఎంతో జాగ్రత్తగా గడపసాగాను. ఎందుకంటే రేపు నేను ఏదయినా ఆపదలో చిక్కుకున్నట్లయితే అది ఆ శాప ప్రభావమేనని ప్రజలు వదంతులను వ్యాపింపజేస్తారేమోనని నేను భయపడ్డాను. ఆ ఆలోచనతోనే నేను ఆందోళనతో గడపసాగాను. అయితే అల్లాహ్  అనుగ్రహం వలన 150 రోజులు శ్రేయస్కరంగా, ఎటువంటి ఆపదలోనూ నేను చిక్కుకోకుండా  గడచిపోయాయి. 150 రోజులు గడవటానికి ముందు పవిత్ర మక్కా నగరానికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అల్‌హమ్దులిల్లాహ్  (అల్లాహ్ కు స్తోత్రములు).

   ఆయన నన్ను శపించిన తర్వాత నేను నా జీవితంలో ఎన్నో మహిమలకు ఆనందానుభూతులను పొందాను. అటువంటి శాపాన్ని పొందిన తర్వాత ప్రజలు తరచుగా చింతాగ్రస్తులై తమ జీవితాను పాడు చేసుకుంటారు. అయితే అల్లాహ్‌ా తన అనుగ్రహంతో అటువంటి అపాయకరమైన పరిస్థితిలోనూ నన్ను సురక్షితంగా ఉంచాడు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మానవుని జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ఇతరులను మోసం చేయకుండా ఉండటమనేది కూడా ఒకటి.

  గడచిన 45 సంవత్సరాల కాలంలో ఒక బౌద్ధ బిక్షువు రూపంలో ‘నేను’ వందలాది మందిని మోసం చేశాను. కానీ నేడు ఆ దుష్కార్యాన్ని పూర్తిగా మరచిపోయాను. అలాగే నా కంటే ఉన్నత స్థాయిలో ఉండే గురువుల ద్వారా నేను కూడా మోసపోవలసి వచ్చింది. నా సరికొత్త జీవితంలో ఈ రెండు చెడుగులూ అంతరించిపోయాయి. పసుపుపచ్చటి వస్త్రాలు ధరించిన కాలంలో నా నైజంలో కాఠిన్యం ఉండేది. అయితే దేవుని ఏకత్వపు విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత ఒక మృదువైన హృదయం గల మానవునిగా మారిపోయాను. ఇస్లాం కారణంగా నా జీవితంలో సరికొత్త మార్పులు సంభవించాయి. దేవుని ఏకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ నేను ఇస్లాం స్వీకరించడం 

  3,అక్టొబర్‌, 1993లో చెన్నయిలోని ‘మస్జిదె మామూర్‌’లో దేవుని ఏకత్వం (తౌహీద్‌) పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇస్లాం కలిమా పఠిస్తూ ఇస్లాంను స్వీకరించి ఇస్లామీయ సమాజంలోకి చేరిపోయాను. ఆ విధంగా ‘స్వామి ఆనంద’గా కొనసాగిన నేను ‘ముహిబ్బుల్లాహ్ ‘  (అల్లాహ్ ను ప్రేమించేవాడు)గా మారిపోయాను. నవజాత శిశువు (”ఇస్లాం స్వీకరణ పూర్వపు పాపాలన్నింటినీ కడిగివేస్తుంది” అనే హదీసును ఇది సూచిస్తుంది.)గా మారిపోయాను. అల్లాహ్‌ా దృష్టిలో మానవులందరూ సమానులే.  ఈ మౌలిక సూత్రం రుచిని నాలో నేనే ఆస్వాదించాను. నేటి నుంచి నాకు కూడా ప్రపంచంలోని మస్జిదు లన్నింటిలోనూ హక్కు ఉంది. నేను కూడా ముస్లింలందరితో కలిసి నమాజు చదివే విషయంలో సమానమైన హక్కును కలిగి ఉన్నాను. ఇన్షాఅల్లాహ్‌ా నేటి నుంచి ఒకవేళ నేను ప్రపంచంలోని ఏదైనా మస్జిద్‌లో నమాజు  చదివే ఉద్దేశ్యంతో వెళ్ళాలని నిర్ణయించు కున్నట్లయితే ప్రపంలోని ఏ శక్తీ నన్ను నిలువరించ జాలదు. నేను ఇస్లాంను స్వీకరించినప్పుడు ప్రజలతో ప్రేమానురాగాలతో వ్యవహరించాలని, ఈ సోదరభావం గురించి, ప్రేమానురాగాల గురించి ప్రకటించాలనే కోరిక నాలో జనించింది. ఈ భావనతో నేను ఇస్లాంను గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకై ముస్లింలు నివసించే కాయీల్‌ పట్నం జిల్లాలోని చదమ్‌ బర్నాద్‌ వైపునకు పయనించాను. అక్కడ నేను ఇస్లాంను మరింతగా అర్థం చేసుకునేందుకై ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడం, ఇస్లాంను ప్రచారం చేయడం, ప్రజలకు సమానత్వానికి సంబంధించిన నిజమైన భావనను పరిచయం చేయడమే నా జీవిత లక్ష్యమ్.

  ఇస్లాం స్వీకరించడానికి ముందు ఇస్లాం విషయంలో నేను ఎన్నో అపోహలకు గురయ్యాను. అటువంటి అపోహలకు గురయినవారు నేడు కోట్లమంది ఉన్నారు. వాస్తవానికి వారందరూ ఇస్లాం యొక్క సర్వోత్కృష్ట వరానుగ్రహానికి దూరమయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఇస్లాం సుగుణాలకు, ఇస్లామీయ సోదరభావానికి సంబంధించిన సందేశాన్ని అందజేసి   ఇస్లాంకు   చెందిన   మంచి  మార్గంలో పయనింపజేయటం, ఇస్లాం వాస్తవికత పట్ల వారికి అవగాహన కలుగజేయడం, వారి అపోహలను దూరం చేయడం, వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించడం మొదలయినవి ముస్లింల బాధ్యత.

  ”కున్‌తుమ్‌ ఖైర ఉమ్మతిన్‌ ఉఖ్‌రిజత్‌ లిన్నాసి తఅమురూన బిల్‌ మాఅరూఫి వ తన్‌హౌన అనిల్‌ మున్‌కరి వ తుఅమినూన బిల్లాహ్ ” (ఆలి ఇమ్రాన్‌: 110) (ప్రపంచంలో మానవులకు మార్గం చూపేందుకు, సంస్కరించేందుకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. అల్లాహ్ను విశ్వసిస్తారు.)

హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్ర

  మానవ చరిత్రలో విస్మరించరాని అసాధారణ వ్యక్తి ఎవరయినా ఉన్నట్లయితే అది కేవలం హజ్రత్‌ ముహమ్మద్‌ (స) మాత్రమే.  ఆయన జీవిత చరిత్రను చదివేందుకై నేను ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేశాను. అప్పుడు నా జీవితంలో విప్లవం చోటు చేసుకుంది. క్రీ.శ. 571లో జన్మించిన హజ్రత్‌ ముహమ్మద్‌ (స) పవిత్ర జీవిత చరిత్రను ఒకవేళ ఎవరైనా లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఆయన (స) విశిష్ఠతలన్నీ అవగతమయిపోతాయి. ఆయన వలే జీవితం గడిపిన వ్యక్తి ఎవరూ ఈ భూప్రపంచంలో పుట్టనేలేదు. అంతే కాకుండా ఇంకా ఎన్నో విశిష్ఠతలను ఆయనలో మనం కనుగొనగలము. ఆయన విశ్వాస బలం, సంకల్పశుద్ధి, పరస్పర సంబంధాలు, పరస్పర వ్యవహారాలు, ఇతరుల పట్ల శ్రేయోభిలాష, అత్యుత్తమ వ్యయవహార సరళి, ఇతరుల మంచితనానికి, గౌరవానికి పూర్తిగా విలువ ఇవ్వడం, అతిథి సత్కారం పట్ల ఆసక్తి, ఇతరుల పట్ల కారుణ్యం, సానుభూతి మొదలైన విశిష్ఠతలను ఆయన కలిగి ఉన్న కారణంగా నేటి ఆధునిక ప్రపంచం సైతం ఆయనను కొనియాడుతోంది. 

  మానవుని జీవితం కొరకు ఒక సులభమైన విధానం ఆయన జీవితంలో మనకు లభిస్తుంది. ఆ విధంగా నమూనా కాగల మరొక వ్యక్తి ఎవరూ లేరు. మానవ చరిత్రలో ఒక మహోత్కృష్టమైన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడపడం జరిగింది? ఇతరులతో ఏ విధంగా వ్యవహరించడం జరిగింది? అనే విషయాలను ఆధారాలతో సహా నేను అధ్యయనం చేశాను.   

  హజ్రత్‌ ముహమ్మద్‌ (స)కు దైవప్రవక్త పదవి దైవం తరపు నుంచి ప్రాప్తం కావడానికి ముందు 40 సంవత్సరాలపాటు ఆయన (స) అత్యుత్తమమైన, ఆదర్శనీయమైన జీవితం గడిపారు. ఆ కాలంలోని సమాజంలో ఆయన (స) ఒక ఆదర్శనీయుడిగా శోభించారు. ప్రతి మానవునిలోనూ కొన్ని సుగుణాలు ఉంటాయి. అయితే అన్నిరకాల సుగుణాలను కలిగిన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే అది హజ్రత్‌ ముహమ్మద్‌ (స) మాత్రమే.

  ఆంగ్లేయులు ‘ఇస్లాం కరవాలం ద్వారా వ్యాపించింది’ అనే అపనిందను ఇస్లాం మీద మోపారు. వాస్తవానికి ఇది ఒక మహా అపనింద. దీనికి జవాబుగా సరోజినీ నాయుడు లండన్‌లో  ప్రసంగిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు: ”ఇస్లామీయ ఔన్నత్యం ఇతర మతానుయాయుల పట్ల విద్వేషాన్ని జనింపజేయదు. ముహమ్మద్‌ (స), ఆయన సహచరులు, వారి శిష్యులు వంటి దేశాలను సైతం పరపాలించారు. అలాగే 800 సంవత్సరాలపాటు   క్రైస్తవుల భూభాగమైన స్పెయిన్‌ను ముస్లింలు పరిపాలించారు. కానీ వారు ఏనాడూ ప్రజల ఆరాధనాలయాల విషయంలో ఎటువంటి జోక్యానికి పాల్పడలేదు. అనగా క్రైస్తవులకు వారి స్థాయిని ప్రసాదించారు. వారితో అత్యుత్తమ రీతిలో వ్యవహరించారు, గౌరవమర్యాదలతో వ్యవహరించారు, మంచి సంబంధాలను వారితో నెలకొల్పుకున్నారు. దీనికి కారణం బహుశా ఖుర్‌ఆన్‌ వారికి సహనాన్ని నేర్పడమేనేమో”.

థామస్‌ ఆర్నాల్డ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు: ”ప్రపంచంలోని మతాలన్నింటిలో కేవలం ఇస్లాం మాత్రమే అన్ని రకాల విశిష్ఠతలనూ కలిగి ఉంది. సామాన్య జనుల ద్వారా ఇస్లాం వ్యాపించింది. ఆర్థిక సహాయం లభించిన కారణంగా ధర్మప్రచారం చేసేవారు, డబ్బు కోసం ధార్మిక సేవ చేసేవారు ఇస్లామీయ చరిత్రలో మనకు కన్పించరు. వందలాది  వ్యాపారుల ద్వారా ఇస్లాం వ్యాపించింది. ఆఫ్రికా, చైనాలలో ఇస్లాం వ్యాపించడానికి మూల కారణం ఖుర్‌ఆన్‌ వైజ్ఞానిక కాంతే! ఆ కాంతిని వ్యాపింపజేసేవారు అక్కడి ముస్లిం వ్యాపారస్తులే.

  పండిత్‌ సుందర్‌ లాల్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ”ముహమ్మద్‌ (స ) మక్కా విజయం సందర్భంలో ఎటువంటి మహత్తరమైన పని చేశారంటే మానవ చరిత్ర ఎన్నటికీ దానిని విస్మరించజాలదు. జీవితమంతా తనను వేధించిన, కష్టాలకు గురి చేసిన, హింసాదౌర్జన్యాలకు పాల్పడిన, అవమానించిన, ప్రాణశత్రువులాగ మసలినవారందరినీ ఆయన క్షమించివేశారు. ప్రపంచంలోని సైనిక కార్యకలాపాలలో అది ఒక ఆదర్శనీయమైన ఘటన”. 

   భారత దేశానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడైన లాలా ఈశ్వరీప్రసాద్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ”ముస్లింలు విశాల దృక్పథం కలవారు. ఒకవేళ వారు నిజంగానే దౌర్జన్యపరులయినట్లయితే సుదీర్ఘ కాలంపాటు భారత దేశాన్ని పరిపాలించడం వారికి సాధ్యమయ్యేది కాదు. ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ ప్రజలకు వారి విశ్వాసాల ప్రకారం ఉపదేశించేవారుగా ఉన్నారు.

  హిందువుల మతపరమైన అంశాలలో వారెన్నడూ అడ్డంకి కాలేదు. మతపరమైన ఏ విషయంలోనయినా వారు ఏ హిందువు మీదా దౌర్జన్యానికి పాల్పడలేదు. ముస్లిమేతరులతో సైతం కరుణాంతరంగులై సహకరించేవారు”. 

నా హృదయాన్ని మార్చివేసిన ఖుర్‌ఆన్‌

  నేను ఖుర్‌ఆన్‌ అధ్యయనాన్ని నిరంతరాయంగా కొనసాగించాను. తత్కారణంగా నా ఆత్మ జాగృతమయింది. ఖుర్‌ఆన్‌ ఎటువంటి దివ్యగ్రంథమంటే అందులో మానవ జీవితానికి సంబంధించిన ప్రతి వ్యవహారం కొరకు మథ్యస్థ స్థాయి మార్గదర్శకత్వం ప్రాప్తమవుతుంది. ఖుర్‌ఆన్‌కు చెందిన వైజ్ఞానిక ఆధారాలు నాలో నమ్మకాన్ని ప్రోది చేయసాగాయి. సన్యాసినయిన కారణంగా ఆ అనుభూతి నా హృదయాంతరాలలోకి చొచ్చుకుపోయింది. నేను ఇప్పుడు నా పూర్వగాథను, అనగా ఏ మతాన్నయితే నేను పూర్వం స్వీకరించానో ఆ మతం (బౌద్ధ మతం) యాథార్థ్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.    

               (ఇస్లామిక్‌ గైడెన్స్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో)

 

Related Post