మీరూ విజేత కాగలరు!

'మీరన్నది సరైంది కాదు. పిల్లల్ని బాగా చదివించాలి. దానికి డబ్బు కావాలి. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయించడానికి మంచి సంబంధం రావాలంటే ఏదో అంతో ఇంతో ఇచ్చుకునే స్థోమత, హోదా ఉం డాలి కదా! ఇందులో తప్పేముంది?' అని మీరు అనొచ్చు. సరే మీ మాటను కాదన టం లేదు. కాని 'ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా సాగిపోతే చాలు' అన్న మామూలు స్థాయి నుంచి 'ఇహ పరలోకం లో మనక్కావాల్సిందేదో మనం సాధించి తీరాలి' అన్న అత్యుత్తమ ఆలోచనాస్థాయికి వెళ్ళడం ఆరోహణ! అసలు సిసలైన కీర్తి శిఖర అధిరోహణ!! ఎందుకంటే, దేవుడు చేసిన ప్రకృతి నియమం అది.

‘మీరన్నది సరైంది కాదు. పిల్లల్ని బాగా చదివించాలి. దానికి డబ్బు కావాలి. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయించడానికి మంచి సంబంధం రావాలంటే ఏదో అంతో ఇంతో ఇచ్చుకునే స్థోమత, హోదా ఉం డాలి కదా! ఇందులో తప్పేముంది?’ అని మీరు అనొచ్చు. సరే మీ మాటను కాదన టం లేదు. కాని ‘ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా సాగిపోతే చాలు’ అన్న మామూలు స్థాయి నుంచి ‘ఇహ పరలోకం లో మనక్కావాల్సిందేదో మనం సాధించి తీరాలి’ అన్న అత్యుత్తమ ఆలోచనాస్థాయికి వెళ్ళడం ఆరోహణ! అసలు సిసలైన కీర్తి శిఖర అధిరోహణ!! ఎందుకంటే, దేవుడు చేసిన ప్రకృతి నియమం అది.

జీవితంలో అప్పుడప్పుడే అడుగు పెడు తున్న వ్యక్తికి ‘నీకు ఏం కావాలి? భవి ష్యత్తుల్లో నువ్వు ఏం సాధించదలచుకు న్నావు?’ అని అడిగితే చాలా మంది దగ్గర నుంచి సమాధానం ”నేను బాగా చదువు కొని, నా కాళ్ళ మీద నేను నిలబడగల గాలి. చక్కటి సంసారం, అందమైన ఇల్లు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండి, మిగతా జీవితం విశ్రాంతి తీసుకుంటూ, మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకుంటూ జీవితం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి” అంటారు. మరి కొంత మంది అయితే ఇంకాస్త ముందుకెళ్ళి-ఏ అమేరి కాకో, దుబాయ్‌కో వెళ్ళి అక్కడ కొంత కాలం (ఇష్టం లేకపోయినా) కష్టపడి అక్కడి నుంచి మా ఇంటికి డబ్బు పంపిస్తూ, పొదుపు చేసుకుంటూ తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడి ఒక ఇల్లు కట్టుకుని….. (ఇక్కడి నుంచి మళ్ళి మామూలు సమాధా నమే) చెప్తారు.
‘నాకు అనిల్‌ అంబానీలకున్నంత ఆస్తి ఉంటేనా -దర్జాగా కొంతకాలం బ్రతికి ఆ తర్వాత హాయిగా చచ్చిపోతాను’ అనుకునే వాళ్ళకూ కొదువ లేదు. అలాగే ‘నేను ఏమవ్వాలో, ఏం అవ్వకూడదో విధే నిర్ణయి స్తుంది’ అని సంతాప పడేవారూ ఉంటారు.

అందచందాలతో అలరారుతూన్న ఈ వింత విచిత్ర లోకాన్ని చూసి నేడే కాదు నాడు సైతం అనేకులు ఈ విధంగా ఆశించారన్నది గమనార్హం. ఓ రోజు అతను (ఖారూన్‌) పూర్తి ఠీవి దర్పాలతో ప్రజల ముందుకు వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక వ్యామోహపరులు కొందరు అతడ్ని చూసి ‘ఖారూన్‌కు లభిం చిన సిరిసంపదలు మనకూ లభించుంటే ఎంత బావుండు! ఖారూన్‌ ఎంతో అదృష్ట వంతుడు’ అన్నారు. అయితే జ్ఞానం కల వారు (వారి ఆలోచనా ధోరణిని విమ ర్శిస్తూ) ”మీ వైఖరి చాలా విచారకరం” అన్నారు. (ఖసస్‌:79)

‘మీరన్నది సరైంది కాదు. పిల్లల్ని బాగా చదివించాలి. దానికి డబ్బు కావాలి. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయించడానికి మంచి సంబంధం రావాలంటే ఏదో అంతో ఇంతో ఇచ్చుకునే స్థోమత, హోదా ఉం డాలి కదా! ఇందులో తప్పేముంది?’ అని మీరు అనొచ్చు. సరే మీ మాటను కాదన టం లేదు. కాని ‘ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా సాగిపోతే చాలు’ అన్న మామూలు స్థాయి నుంచి ‘ఇహ పరలోకం లో మనక్కావాల్సిందేదో మనం సాధించి తీరాలి’ అన్న అత్యుత్తమ ఆలోచనాస్థాయికి వెళ్ళడం ఆరోహణ! అసలు సిసలైన కీర్తి శిఖర అధిరోహణ!! ఎందుకంటే, దేవుడు చేసిన ప్రకృతి నియమం అది.

”ఏ జాతి అయినా తనను తాను సంస్క రించుకోనంత వరకూ అల్లాహ్‌ కూడా నిశ్చయంగా దాని పరిస్థితిని మార్చడు, ఇదొక యదార్థం”. (రాద్‌:11) తుమ్మ విత్తనం నాటి నిమ్మ చెట్టు మొల కెత్తాలని కోరుకోవడం అత్యాశ, పేరాశే కావచ్చు. కాని మామిడి విత్తనం నాటి మామిడి చెట్టే మొలకెత్తాలని, వివిధ మామిడి అంట్లు కట్టి రకరకాల మామిడి ఫలాల్ని పండించాలని కోరుకోవడంలో అత్యాశ ఏమీ లేదు. అసహజత ఎంత మాత్రం కాదు. అది మానవ సహజంతో పాటు మానవలోకాన్ని ప్రగతి పథంలో నడిపించే గొప్ప అభియోగం.

మనిషి కృషి చేసిన ప్రతి రంగంలో ఫలం పొందుతున్నాడు. అయితే ఎవరి కార్య దృష్టి ఎన్ని దూరాల వరకు వెళ్ళగలుగు తుందో ప్రతిఫలమూ అంత దీర్ఘమయినదే ప్రాప్తిస్తుంది. ఈ క్షణం కష్టపడితే మరు క్షణం ఫలం దక్కాలని కోరుకునేవారొకర యితే, యౌవనంలో పడిన శ్రమకు బదులు వృద్ధాప్యం హాయిగా గడపాలని ఆశించే వారు మరొకరు. ఇంకా కొందరయితే తాము కృషి సలిపిన దానికి తమ తర్వాతి తరాల వారు సుఖ పడితే చాలనుకుం టారు. అలాగే బ్రతికుండి కూడా మరణిం చిన వారు కొందరైతే… తమ కృషి కార్య దీక్ష, దక్షతల మూలంగా మరణించి కూడా ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నవారు. శాశ్వత పేరు ప్రఖ్యాతలతో వర్థిల్లుతున్న వారు ఎందరో మహానుభావులు!

దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: ”స్వర్గం మనసుకి నచ్చని విషయాలతో కప్పబడి ఉంది. నరకం చుట్టూ మనో (తుచ్ఛ) కోరికలు అల్లుకొని వున్నాయి.” కనుక ఏది నాటుతామో దాన్నే కోస్తాము. ”జైసి కర్నీ వైసి భర్నీ – కమా తుదీను తుదాను” మనం కోరుకునే ప్రతి వస్తు వును (స్వర్గంతో సహా) తీవ్ర తపన, శ్రమ వల్ల పొందగలం. లోకులు చూసే బాహ్య శక్తి మనలో వున్నట్లే, మనలోని అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం కూడా విజయం కోసం అంతే అవసరం. మనతో మనం తరచు వేసుకోవాల్సిన ప్రశ్న ”నిన్ను నీవు ఎలా భావిస్తున్నావు ?” అన్నదే కాని నిన్ను లోకులు ఏ దృష్టితో చూస్తున్నారన్నది కాదు. పూర్వం గొప్ప ప్రసిద్ధి గాంచిన నానుడి ఒకటుండేది. ప్రజలు మూడు రకాలు.
1) లోక చరిత్రతో వీరికి ఎటువంటి సం బంధం ఉండదు.
2) లోకంలో జరిగే సంఘటనలను ప్రేక్ష క పాత్రతో చూస్తుండిపోయేవారు.
3) కొత్త చరిత్రకు నాంది పలికేవారు.

మరో విధంగా చెప్పాలంటే, గొప్పవాళ్ళు వ్యూహల గురించి, మధ్యములు సంఘట నల గురించి, అధములు వ్యక్తుల గురించి మాట్లాడుతారు. ఈ ముగ్గురిలో ఎవరు కాదల్చుకుంటున్నామో? మనమే నిర్ణయిం చుకోవాలి.
కొందరి సంభాషణల్లో ఎక్కువ ఇతరుల గురించే ఉంటుంది. అందులో ఎక్కువ చెడే ఉంటుంది. తమకు తెలియని (ఆ వ్యక్తుల వ్యక్తిగత) విషయాలు కూడా తాము కళ్ళతో చూచినట్టుగా రెచ్చిపోయి మరీ చెప్పేస్తుంటారు. వీరే అధములు.

కాశ్మీర్‌ నుంచి కాల్ఫోర్నియా వరకూ వీరు చర్చిస్తుంటారు. అందులో వాస్తవం కన్నా కల్పన, అభిప్రాయమూ ఎక్కువ వుంటుం ది. వీరే మధ్యములు.  అదే గొప్పవారు, అనవసర విషయాలకి తమ సంభాషనాల్లో అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు. వారి దృష్టిలో-1) అక్కడ లేని వ్యక్తి గురించి కానీ, 2) తమకు సంబం ధం లేనీ సంఘట గురించి గాని, 3) తమ లో లేని గొప్పల గురించిగాని చర్చించట మంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. సంభాషణ వల్ల తాము నేర్చుకుంటారు. లేదా, ఇతరులకి నేర్పుతారు.

జీవితంలో అది దేనికి సంబంధించిన దైనా పైకి రావాలంటే మూడు ప్రశ్నలు తప్పని సరి! 1) మన తప్పు ఎంత తొంద రగా సరిదిద్దుకుంటాము? 2) ఇతరుల తప్పుల్నుంచి (గుణపాఠం) ఎంత తొందరగా గ్రహిస్తాము? 3) మన బలహీనతల్నుంచి ఎంత తొందరగా బయట పడతాము? అందుకే పెద్దల న్నారు: ”ఇతరుల తప్పుల్నుంచి నేర్చుకోక తప్పదు. ఎందుకంటే, అన్ని తప్పులూ మనమే చేయటానికి సమయం సరిపోదు కాబట్టి”. మన జీవిత గృహాల్లోకి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. కొందరే తమ ప్రభావితపు ప్రతిభ పరిమళాల్ని వదిలి వెళ్తారు. అలాంటి వారి సహచర్యమే మన తదుపరి కర్తవ్యం.

ఈ జీవితం నిరంతర సమర క్షేత్రం. మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవు తుంది. మళ్ళీ కళ్ళు మూసుకునే వరకు సాగుతుంది. మనిషి తన ఆత్మ చక్షువుల్ని తెరువగలిగే క్షణం మహత్తరమయినది. అది జీవన సంగ్రామానికి శంఖారావం. సంఘర్షణ సంరంభానికి ప్రారంభం.
మన అంతర్‌చ్చక్షువుల్ని తెరిచే రెండు పరీక్షలు…..!

1 – మిమ్మల్ని మీరు పరీక్షంచుకోండి…..!
1) మీరు మానసిక వ్యధ, అలజడితో సతమతమౌతున్నారా? అయితే మీ విజయాన్ని గూర్చి పునరాలోచించుకోండి.
2) ఇతరులతో మీకు గల ప్రతి సంబంధం తెగిపోయిందని ఫీలవుతున్నారా? అయితే మీ విజయాన్ని గూర్చి పునరాలోచించుకోండి.
3) ఈ లక్ష్య సాధన కోసం ఇన్ని త్యాగాలు అవసరమా? అన్న ప్రశ్న మిమ్మల్ని కలచి వేస్తూందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
4) మీరు విజేతలయి, ఇతరులు సాధించే విజయాల పట్ల అసూయ చెందుతున్నారా?
అయితే మీ విజయాన్ని పరిశీలించుకోండి.
5) ‘నేను చెయ్యగలను’ అన్న ఆత్మవిశ్వాసం గాక ‘నేను మాత్రమే చెయ్యగలను’ అన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఇతరుల సలహాలను పట్టించుకోవటం లేదా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
6) పడకపై మేను వాల్చి – లోకమంతా ప్రశాంతంగా నిద్రిస్తుంటే నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు, అన్న ఆలోచనతో మీ బుర్ర వేడెక్కుతుందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.

గుర్తుంచుకోండి! కోపం ద్వేషం – రెండింటి చివరి అక్షరమూ ఒకటే. వాటి వల్ల మిగిలేది కూడా అదే!…..”సున్నా” !!
ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు…..!
”నేను నిజంగానే విజేతనా ?” 2 – మీరు విజేతలేనా…..?

ఇది ఒక పరీక్షకన్నా ఘనపాటిది. జవాబివ్వక ముందు బాగా చదివి అర్థం చేసుకోండి. జవాబిచ్చే విషయంలో మీ ఆత్మే మీకు ప్రత్యక్ష సాక్షి! ఏది వ్రాసినా ఆత్మ సాక్షితోటి వ్రాయండి.

రంగం          ప్రవర్తన     ఎల్లప్పుడు / అప్పుడప్పుడు / ఎప్పుడూ లేదు.

అల్లాహ్‌తో

 

(అ) గుర్తు చేసుకుంటాను

(ఆ) మరువను
(ఇ) కలవాలన్న కుతుహాలం

ఆత్మతో (అ)ఆందోళన లేకుండా
(ఆ)విమర్శ పరశీలన
(ఇ) ఆత్మ పరిశీలన సమర్థించుకోవటం.

తల్లిదండ్రులతో

(అ) విధి నిర్వాహణ
(ఆ) సత్ప్రవర్తన
(ఇ) ఉపకారం

దాంపత్యం

(అ) ఏదో తోసుకెళ్తున్నాం
(ఆ) పరస్పర కరుణ,దయ,జాలి.
(ఇ) పరస్పర ప్రేమాభిమానాలు.

సంతానంతో

(అ) సపోర్ట్‌ సమర్థించుట
(ఆ) దిశా నిర్దేశం.
(ఇ) గాలికి వదిలెయ్యడం.శిక్షణారాహిత్యం.

బంధువులతో

(అ) కేవలం గుర్తు చేసుకుంటాను.
(ఆ) కేవలం వారితో కలిసి వుంటాను.
(ఇ) వారితో మంచిగా ప్రవర్తిస్తాను.

స్నేహితులతో

(అ) స్వార్థం
(ఆ) పరస్పర సహకారం శ్రేయం
(ఇ) జస్ట్‌ టైమ్‌ పాస్‌

పనితో

(అ) కర్తవ్యాన్ని నెరవేరుస్తాను.
(ఆ) పనీ చేస్తాను. సహాయపడతానుకూడా
(ఇ) పనిలో ఆనందాన్ని ఆస్వాదిస్తాను

తోటి కార్మికులతో

(అ) రస్సా కషీ
(ఆ) ఏదో కలిసి వున్నాం
(ఇ) నిజమైన మిత్రుత్వం

అధికారులతో

(అ) నాపనేదో నేను చేసుకుంటాను.
(ఆ) అవసరం అన్పిస్తే సలహా ఇస్తాను. హితవూ చెప్తాను.
(ఇ) వారితో కలిసి వుంటాను.

ప్రతిభావంతులతో

(అ) మంచిగా వ్యవహరిస్తాను
(ఆ) ఆదర్శంగా తీసుకుంటాను
(ఇ) శ్రేయోభిలాషిగా మసలుకుంటాను.

సమయంతో

(అ) తప్పించుకు తిరిగే యత్నం
(ఆ) మధ్యే మార్గం
(ఇ) అత్యవసరమైన వాటికి ప్రాధాన్యత

Related Post