Originally posted 2013-03-07 17:34:17.
సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ
పొయ్యి మీద పాలు పట్టి కాస్తాము. కాసేపటికి అవి పొంగు వస్తాయి. పాలు పొంగు వచ్చాక మనం పొయ్యి మంట ఆర్పేస్తాము. పాలు పొంగితేనే అవి కాగినట్టు. అసలు పాలు ఎందుకు పొంగుతాయి?
పాలు కాచినప్పుడు పాలల్లో ఉండే కొవ్వు పొర మీగడ రూపంలో పాల పైబాగంలో ఏర్పడుతుంది. అలాగే పాలల్లో ఉన్న నీరు కూడా నీటి ఆవిరిగా రూపాంతరం చెందుతుంది. అయితే పైన పాల పొర అడ్డుగా ఉన్నందు వలన నీటి ఆవిరి పైకి వెళ్ళడానికి వీలు కాదు. నీటి ఆవిరిని పైకి వెళ్ళనీయకుండా మీగడ పొర అడ్డుకుంటుంది. ఇంకా ఇంకా మనం పాలను వేడి చేస్తూ పోతే నీటి ఆవిరి వ్యాకోచం చెందుతుంది. తాను బయటకు పోకుండా అడ్డుపడుతున్న మీగడ పొరను నెట్టుకుం టూ వ్యాకోచం చెందిన నీటి ఆవిరి పైపైకి వస్తుంది. ఈ థలో కూడా మనం పాలు వేడి చేయడం ఆపకపోతే నీటి ఆవిరి పాలను పైకి నెట్టి వేయడంతో పాలు బయటకు పొంగుతుంది.
ఇదిలా ఉంటే ఒక్కసారి పాలిచ్చే పశువు గురించి, ఆ పశువును పుట్టిం చిన ప్రభువు గురించి ఆలోచించండి. పాలిచ్చే పశువులు తినే గడ్డి, ఆకులు తదితర వస్తువులు వాటి కడుపులోకి పోయి రక్తం, పేడ, మూత్రం, పాలుగా మారతాయి. రక్తం నరాలలోకి వెళ్ళగా, పేడ, మూత్రం వంటి వ్యర్థాలు బయటికి విసర్జించబడతాయి. వాటి మధ్యలో నుంచే తయారైన పాలు పొదుగులలోకి వెళతాయి. కాని ఆశ్చర్యకర మైన విషయం ఏమిటంటే ఆ పాలలో ఒక్క బొట్టు రక్తంగానీ, ఒక చుక్క వ్యర్థ పదార్థంగానీ కలవదు. పాలు ఎంతో స్వచ్ఛంగా, తెల్లగా ఉంటా యి. కమ్మగా, రుచికరంగా ఉంటాయి. శరీరానకి శక్తినిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. మనసుకు, మస్తిష్కానికి తృప్తినీ, హాయిని ఇస్తాయి. ఇదే విషయాన్ని విశదపరుస్తూ సర్వోన్నతుడయిన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ”నిశ్చయంగా మీ కోసం పశువులలో గొప్ప గుణపాఠం ఉంది. వాటి కడుపులో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది”. (అన్నహ్ల్ : 66)