ముహమ్మద్జ మీల్ జీనో
ప్రశ్న: అల్లాహ్ పేర్లను, గుణాలను తెలుసు కోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జ: అల్లాహ్‌కు సంబంధించి ప్రజల ప్రథమ కర్తవ్యం ఆయన గురించి తెలుసుకోవటం. తాము ఆరాధించే దైవాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడే వారు సిసలైన ఆరాధన చేయగలుగుతారు. ఆరాధనలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. అందుకే సృష్టికర్త ఇలా ఆదేశించాడు: ”కనుక ఓ ప్రవక్తా! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో”.(ముహమ్మద్-19)
అందుకే దైవ కారుణ్య వైశాల్యాన్ని మననం చేసుకోవాలి, దేవునిపై ఆశలు పెట్టుకోవాలి, ఆయన శిక్షలోని తీవ్రతను విడమరచి చెప్పాలి -తద్వారా ఆయన పట్ల భక్తి, భయము జని స్తాయి. అలాగే సత్కరించే, సన్మానించే విష యంలో అల్లాహ్‌ను ఒకే ఒక్కడిగా ఒప్పుకో వాలి-తత్కారణంగా ఆయన యెడల కృతజ్ఞతా భావం పెంపొందుతుంది. అల్లాహ్‌ా నామాలు, ఆయన గుణగణాల ద్వారా ఆయన్ని సేవించ టంలోని భావార్థం ఏమిటంటే వాటి యదార్థ జ్ఞానాన్ని ఆర్జించాలి. వాటి అర్థాన్ని గ్రహిం చాలి. తదనుగుణంగా ఆచరించాలి. అల్లాహ్‌ా కు చెందిన కొన్ని నామాలు, కొన్ని గుణాలు దాసుల్లో గనక వస్తే ప్రశంసనీయమే. ఉదాహ రణకు- జ్ఞానం, దయ, జాలి, కరుణ, న్యాయం మొదలగునవి. దేవుని మరి కొన్ని పేర్లు లక్షణాలున్నాయి. అవి గనక దాసుల్లో అభివ్యక్తమవుతే అవి అవాంఛనీయం, నిందార్హ మవుతాయి. ఉదాహరణకు:-గర్వం, అహంకా రం, బడాయి, బలాత్కారం, ప్రచండత మొదల గునవి. అలాగే దాసుల్లో ఉండాల్సిన గుణాలు దాసుల్లో ఉంటేనే అందం, ఆనందకరం కూడా. ఆ గుణాలు దైవానికి మాత్రం సరి పడవు, శోభించవు. ఉదాహరణకు- దాస్య భావం, నిస్సహాయత, అక్కర అభ్యర్తన, పరా భవం పరాధీనత ఇత్యాదివి. అల్లాహ్‌ా ఇలా ఉపదేశించాడు: ”అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయన్ని పిలవండి”. (అల్ ఆరాఫ్- 180)
ప్రవక్త మహనీయుల (స) ప్రవచనం ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతోంది. ఆయన(స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా అల్లాహ్‌కు 99 పేర్లున్నాయి. అంటే నూటికి ఒకటి తక్కువ. వీటిని గణిం చిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.” (బుఖారీ,ముస్లిం)
ఈ హదీసులో వచ్చిన ‘ఇహ్‌సా’ అనే పదానికి అర్థం లెక్కించటం. అయితే దాసుడు ఆ పేర్లకు తగినట్లుగా ఆచరించాలి. దాసుడు దైవాన్ని ‘అల్ హకీమ్’ అన్నాడంటే అతను తన వ్యవహారాలన్నింటినీ అల్లాహ్‌కు అప్పగిం చాలి. ఎందుకంటే దాసుని పనులన్నీ యుక్తినీ, విజ్ఞతా వివేచనలను వాంఛిస్తున్నాయి. ‘ఖుద్దూస్’ అని నోటితో అన్నప్పుడు అల్లాహ్ అన్ని రకాల లోపాలకు అతీతుడు, పవిత్రుడు అన్న విషయం మదిలో తళుక్కున మొరవాలి. అల్లాహ్ యొక్క ఈ రకమైన పేర్ల పట్ల భక్తీ ప్రపత్తులు కలిగి ఉండాలి. వాటి ఆధారంగా అల్లాహ్‌ాను వేడుకోవాలి.
ప్రశ్న: అల్లాహ్ పేర్లలోనూ, గుణాలలోనూ ఉన్న తేడా ఏమిటి?
జ: అల్లాహ్‌ా పేర్ల ఆధారంగా గుణగణాల ఆధారంగా శరణు వేడటం కూడా ధర్మసమ్మ తమే. వాటి ఆధారంగా ప్రమాణం చేయటం కూడా సమ్మతమే. ఈ రెండు విషయాలలోనూ అల్లాహ్ పేర్లు, గుణగణాలు సంయుక్తమే. అయితే రెండింటిలో కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. గమనార్హమైన విషయాలు కొన్నింటి ని చూడండి:- (1) పేరు పెట్టేటప్పుడు ‘దాస్య భావం’ వచ్చేలా జాగ్రత్త పడాలి. మొరపెట్టు కునేటప్పుడు అల్లాహ్‌ా పేర్లతో మొరపెట్టుకో వాలి-ఇది మాత్రం సమ్మతమే. కాని గుణగణా లను ఆశ్రయించకూడదు. ఉదాహరణకు:- అబ్దుల్‌కరీమ్ (ఉదాత్తుని దాసుడు) అనే పేరు పెట్టడం సరైనదే. కాని అబ్దుల్ కరం(ఉదారం యొక్క దాసుడు) అని నామకరణం చేయటం మాత్రం సరైనది కాదు. అలాగే దుఆ చేసే సమయంలో ‘యా కరీమ్’ అని సంబోధించ టం సరైనదే కాని ‘యా కరమల్లాహ్’ అని చెప్పడం సరైనది కాదు. (2) అల్లాహ్ పేర్లతో గుణగణాలు జోడించబడ వచ్చు గాని గుణగణాలతో పాటు పేర్లు వచ్చి చేరవు. ఉదాహరణకు- అల్లాహ్ పేర్లలో ఒకటి అర్రహ్మాన్ (కరుణామయుడు) ఈ పేరు తో రహ్మత్(కారుణ్యం) అనే గుణం వచ్చి చేరు తుంది.
(3) అల్లాహ్ చేసే పనులతో ఆయన పేర్లు వచ్చి చేరవు. ఉదాహరణకు:- అల్లాహ్‌ా పనులలో ఒకటి కోపగించుకోవటం. అయితే ఈ క్రియ ఆధారంగా ఆయన ‘కోపిష్టి’ అని అనటం సమంజసం కాదు.
ప్రశ్న: దైవదూతలను విశ్వసించటం అంటే భావం ఏమిటి?
జ: దైవ దూతలను విశ్వసించటమంటే భావం దైవదూతల ఉనికిని అంగీకరించటం, వారు అల్లాహ్‌ాచే సృష్టించబడిన జీవరాసులనీ, అల్లాహ్‌ా తన ఆరాధన నిమిత్తం, తన కార్య క్రమాలను అమలు పరిచే నిమిత్తం వారిని పుట్టించాడని గట్టిగా నమ్మటం. ఉదాహరణకు – ఈ సూక్తులను గమనించండి:
”వారంతా గౌరవించబడిన దాసులు, ఏ విష యంలోనూ వారు ఆయనకంటే ముందు మాట్లాడరు. పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు.” (అల్ అంబియా – 26,27)
దైవ దూతలను విశ్వసించటంలో నాలుగు విషయాలు చేరి ఉన్నాయి:
(1) దైవదూతలనేవారు ఉన్నారు అనే విష యాన్ని నమ్మటం.(2)వారిలో ఎవరి పేరన్నా తెలిసివుంటే ఆ పేరు తదితర వివరాలతో నమ్మాలి. ఉదాహరణకు- హజ్రత్ జిబ్ర యీల్. (3) ఆ దైవదూతను గురించి మనకు తెలిసిన విధంగా నమ్మాలి. ఆయన శరీరం చాలా పెద్దది అనేది వాటిలో ఒకటి. (4) ఆ దైవదూతలు చేసే ప్రత్యేక పనులను గురించి మనకు తెలిసి ఉన్నప్పుడు, అవి నిజమని నమ్మాలి. ఉదాహరణకు- మృత్యు దూత చేసే పని.