చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం?

మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట 'బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్‌నష్‌ షైతాన వ జన్నిబిష్‌ షైతాన మా రజఖ్‌తనా'

మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట ‘బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్‌నష్‌ షైతాన వ జన్నిబిష్‌ షైతాన మా రజఖ్‌తనా’

నేటి పేరెంట్స్‌ ప్రవర్తనపై నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. తమ సంతానం ఐహికంగా గొప్ప హోదాలను పొందాలని, ఆర్థికంగా బిల్‌గేట్స్‌ను మించిపోవాలనీ ఆశిస్తున్నారు. తప్పులేదు. కానీ తమ సంతానం నైతికంగా ఎదగాలనీ, ధార్మికంగా వృద్ధి చెందాలనీ, సత్కార్యాలలో పోటీపడాలనీ, స్వర్గ హోదాలను అధిరోహించాలనీ, జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌ను తమ సొంతం చేెసుకోవాలనీ, అక్కడ ప్రియ ప్రవక్త(స) వారి సహచర్యం పొందాలనీ, దైవ దర్శనంతో పునీతులవ్వాలనీ మాత్రం కోరుకోవడం లేదు. ఇది కడు శోచనీయం. ఐహికంగా, ఆర్ధికంగా సంతానం ఎంతగా ఎదిగినా పేరెంట్స్‌ కంటి చలువ కానేరదు. వారి ద్వారా మనశ్శాంతి లభిస్తుందని ఆశించనూ లేము. తమ సంతానం బాగుండాలనీ, వారు గొప్ప ప్రయోజకు లవ్వాలనీ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మొక్కుకునే తల్లిదండ్రులకు తమ పిల్లల పరలోక సాఫల్యం, స్వర్గ ప్రాప్తి కొరకు దుఆ చేసే తీరిక ఎక్కడిది? అసలు తల్లిదండ్రుల కంటి చలువ పరలోక సాఫల్యం అన్న వాస్తవం ఎంత మంది పేరెంట్స్‌కి తెలుసని? పైగా మా పిల్లలు పాడైపోయారు ఒక్కడూ మా ముసలి బ్రతుకు గోడు పట్టించుకోవటం లేదు అని విచారించడం ఒకటి. అసలు మన సంతానాన్ని అలా పెంచింది ఎవరు? ఆనంద నిలయవు ఆ మల్లెల్ని మందారాల్ని ఫలాల్ని చెరపట్టింది ఎవరు? పేరెంట్స్‌ కారా? తల్లిదండ్రులు కారా?! అవును ఇందులో వారి ప్రమేయమే ఎక్కువగా ఉంది. దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”పుట్టే ప్రతి శిశువు ప్రకృతి (సహజ) ధర్మంపైనే జన్మిస్తాడు. కాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుడిగానో, క్రైస్తవునిగానో, మజూసిగా (అగ్ని ఆరాధకులు)నో మార్చివేస్తారు.
మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట ‘బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్‌నష్‌ షైతాన వ జన్నిబిష్‌ షైతాన మా రజఖ్‌తనా’ (అల్లాహ్‌ా పేరుతో, ఓ అల్లాహ్‌ా మమ్మల్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ కీడు నుండి కాపాడు. నీవు ప్రసాదించే మా సంతానాన్ని కూడా షైతాన్‌ బారి నుండి కాపాడు). (బుఖారీ) అన్న దుఆ చదవాలని  తెలిసినా చదివేవారు ఎంత మంది? సంతానం కలిగాక షైతాన్‌ బారి నుండి వారి రక్షణ కోసం ”ఉయీజుకుమ్‌ బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్‌ కుల్లి షైతానివ్‌ వ హామ్మతిన్‌ వమిన్‌ కుల్లి ఐనిల్‌ లామ్మతి” (నేను మిమ్మల్ని ప్రతి షైతాన్‌ మరియు విష జంతువుల బారి నుండి అన్ని రకాల చెడు దృష్టి నుండి అల్లాహ్‌ా సంపూర్ణ వచనాల రక్షణలో ఇస్తున్నాను.) అని చదివేవారు ఎందరు? ఏమిటి ఈ దుఆలదేముందంటారా? మీ దృష్టిలో ఈ ప్రార్థనల ప్రాముఖ్యత ఏమి లేదా?? అయితే దైవ ప్రవక్త(స) ఈ ప్రార్థలను తన అనుచరులకు ఎందుకు బోధించినట్టు? తాను స్వయంగా ఎందుకు చదివినట్టు? ఏమిటి, మన తల్లులు విశ్వాసుల మాతల కన్నా గొప్పవారా? మన సంతానం హసన్‌, హసైన్‌ల కన్నా ఉత్తములా?

నిజమైన దైవ దాసులు తమకు దేవుడు నేర్పించిన, దైవ ప్రవక్త(స) ప్రబోధించిన దుఆలను చదవడంతోపాటు ఖుర్‌ఆన్‌లోని ఈ దుఆను సైతం సదా చేస్తూ ఉంటారు. ”రబ్బనా హబ్‌లనా మిన్‌ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్‌ వజ్‌అల్‌నా లిల్‌ ముత్తఖీన ఇమామా”.                              (సూరా ఫుర్ఖాన్‌ : 74)
(వారు దైవ సన్నిధిలో చేతులు జోడించి) ప్రభూ! మా భార్యా పిల్లల ద్వారా మాకు కంటి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి అని ప్రార్థిస్తారు.)

ఈ దుఆకు భాష్యం చెబుతూ హసన్‌ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: దేవుడు దాసుడికి సంతానాన్ని ప్రసాదించడంతో పాటు వారి ద్వారా తల్లిదండ్రుల కంటి చలువను అనుగ్రహించడం అనేది గొప్ప వరం. నిజమైన విశ్వాసులు దైవాదేశాలకు కట్టుబడి జీవించే బిడ్డలను, మనవరాళ్ళను, బంధువుల్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా ఇహపరాల వారికి కంటి చలువ ప్రాప్తమవుతుంది. దీనికి ఇక్రమా (ర) వివరణ ఇస్తూ: ”ఈ దుఆ ముఖ్యోద్దేశం అందమైన శరీరాకృతి, సుందరమైన రూపకల్పన  గల సంతానం కాదు. దైవాదేశాలకు దైవప్రవక్త (స) వారి సంప్రదాయాలకు తలొగ్గించే సంతానం అన్నమాట” అన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రవక్తలందరి పితామహులు అయిన ఇబ్రాహీమ్‌(అలై) దైవాన్ని ”రబ్బి హబ్‌లీ మినస్సాలిహీన్‌” (ప్రభూ! నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు) అని ప్రార్థించారు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు కలుగుతాడని శుభవార్త తెలిపాము (సాఫ్ఫాత్‌ 100,101)అన్నాడు అల్లాహ్‌.
ఈ ఆశయంతోనే ప్రవక్త జకరియ్యా ‘రబ్బి హబ్‌లీ మిల్లదున్‌క జుర్రియతన్‌ తయ్యిబహ్‌ా. ఇన్నక సమీవుద్దుఆ’ (ప్రభూ! నీ వద్ద నుండి నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు. నిస్సందేహంగా నీవే నా మొరాలకించేవాడివి) అని వేడుకున్నారు.

ఆ తర్వాత ఏం జరిగింది?
అతనలా ప్రార్థన గదిలో నిలబడి ప్రార్థన చేస్తుండగానే దైవదూతలు వచ్చి అతని పిలిచారు: ”ఓ జకరియ్యా! నిశ్చయంగా అల్లాహ్‌ా నీకు యహ్యా పుడతాడన్న శుభవార్త తెలియజేస్తున్నాడు. అతను అల్లాహ్‌ా నుండి వెలువడే ఒక వాణిని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహ శక్తి గలవాడై ఉంటాడు. దైవ ప్రవక్త అవుతాడు; సజ్జనులలో పరిగణించబడతాడు” అని చెప్పారు వారు. (ఆలి ఇమ్రాన్‌ : 39)
ఇదే తపనతో హజ్రత్‌ మర్యం (అలై) గారి తల్లి దైవాన్ని ఇలా వేడుకొంది: ”ఇన్నీ ఉయీజుహా బిక వ జుర్రియ్యతహా మినష్‌ షైతానిర్రజీమ్‌” (నేనీ పాపకు మర్యం అని పేరు పెట్టాను) ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారిన పడకుండా నీ రక్షణ లో ఇస్తున్నాను) అన్నది ఆమె. (ఆలి ఇమ్రాన్‌ 36)

ఆ తర్వాత ఏం జరిగింది?
ఆ తర్వాత ఆమె ప్రభువు ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి, చక్కగా పెంచి పోషించాడు. కొన్నాళ్ళకు జకరియ్యాను ఆమెకు సంరక్ష కునిగా నియమించాడు. జకరియ్యా ఆమె ప్రార్థన గదిలో ప్రవేశించి నప్పుడల్లా అక్కడ ఆహారపదార్ధాలు ప్రత్యక్షమై ఉండేవి. అది చూసి ”ఓ మర్యమ్‌! నీకీ ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది?”
అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. దానికి ఆమె ”అల్లాహ్‌ దగ్గర్నుంచి వస్తోంది. నిశ్చయంగా అల్లాహ్‌ా తాను కోరిన వారికి ఇతోధికంగా ఆహారం ప్రసాదిస్తాడు” అని సమాధానమిచ్చింది. (ఆలి ఇమ్రాన్‌ : 37)

చూశారా! ప్రవక్తలు, పుణ్య స్త్రీలు తమ సంతానం ఉత్తమమైన సంతానం కావాలని దీనాతిదీనంగా దైవాన్ని వేడుకుంటుంటే మనం చేస్తున్నదేమిటి? నాకు పుట్టబోయే బిడ్డ ఇంజనీర్‌ కావాలనీ, డాక్టర్‌ కావాలనీ, కలెక్టర్‌ కావాలనీ ఇంకా ఏదేదో అవ్వాలని కోరుకుంటున్నామే గానీ, ధర్మపరాయణుడు, నీతి నిజాయితీపరుడు, ఉత్తమ పౌరుడ,ు మంచి సంతానం కావాలని కోరుకోవటం లేదు. అందుకే మన సంతానం ఇలా తగలడింది. తల్లిదండ్రుల మీద దయలేదు వారికి, డిగ్రీలున్నాయి. వారు మనకే పుట్టారు. కానీ పుట్టి వారు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. పుట్టలోని చెదలు పుట్టి గిట్టినట్లే వారు సైతం ——– తల్లిదండ్రుల్ని నానా యాతనలకి, ఇబ్బందులకి గురిచేస్తున్నారు. కారణం కొంత వరకు మనమైతే, కొంత వరకు వారు కూడా.

సంతానం ఎవరికి ప్రియం కాదు? కానీ ఉత్తమ లక్షణాలు, గొప్ప గుణాలు గల సంతానం కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరున్నారు? సంతాన లేమి అయితే మంచి వైద్యుడ్ని సంప్రదిస్తాం, పంటలేమి అయితే సూచనలు అనుభవజ్ఞులను కలిసి తీసుకుంటాం.మన ప్రయోజనాల కోసం ప్రాపంచిక విషయాలపై ఆధారపడే మనం ఎప్పుడైనా లోకకర్త సృష్టికర్త ముందు మన బాధల్ని చెప్పుకోవడానికి ప్రయత్నించామా? మీరు అడగండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు పదేపదే చెబుతుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది మన పరిస్థితి.
”ఏమైంది మీకు? అల్లాహ్‌ా ఔన్నత్యాన్ని నమ్మరెందుకు? ఆయనే కదా మిమ్మల్ని వివిధ ఘట్టాలలో రూపొందించినవాడు. ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు సృష్టించాడు. అందులో చంద్రుడ్ని (చల్లటి వెన్నెల్ని వెదజల్లే) జ్యోతిలా చేశాడు. సూర్యుడ్ని దేదీప్యమానంగా (ప్రకాశించే) దీపంగా సృజించాడు. ఇదంతా మీకు కన్పించడం లేదా? (నూహ్‌ :13-16)

Related Post