మార్పు – తీర్పు

ఈ కాలం; దేని అంచులపై మనం నేడు నిలబడి ఉన్నామో అది చరితల్రో ఎంతో కీలకమైన సందర్భం. గత ఏడాది చోటు చేసుకున్న పజ్రా విప్ల వాలు, నిరంకుశ పాలకుల నియంతణ్ర దీనికి పబ్రల కారణం. కాలం ఒక పవ్రాహం. ఇది పవ్రహిస్తూనే ఉంటుంది. ముహరం నుంచి ముహరం దాకా. కష్టాల్‌, నష్టాల్‌, సుఖాల్‌, దుఃఖాల్‌ మామూలే. వస్తుంటాయి..పోతుంటాయి. కాలం ఆగదనే విషయం మరచిపోకూడదు. జనం కూడా అంతే. వస్తుం టారు, పోతుంటారు. ఈ జగతిలో ఏదీ శాశ్వతం కాదు. జగత్పభ్రువైన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”మేము ఈ కాల చకాన్న్రి జనుల మధ్య తిప్ప్రుతూ ఉంటాము”. (దివ్య ఖుర్‌ఆన్‌-3: 140) మరో చోట ఇలా అన్నాడు: ”పోయే దానిపై మీరు దుఃఖించకుండా, పస్రాదించబడిన దానిపై మిడిసి పడ కుండా ఉండాలని (మేము ఈ ఏర్పాటు చేెశాము)”. (దివ్వఖుర్‌ఆన్‌-57: 23)

ఈ సంవత్సరం పోవటం, మరోకటి రావటం ఇదంతా మనుషులమైన మనం నియంతించలేని ఒక అద్భుత కాల చకం. నూతన హిజీ సంవత్సరం వస్తుందనగానే అదేదో నూతనత్వాన్ని తీసుకు వస్తుందనే భావనతో ఉండటం కాదు. గత సంవత్సరంలో అనుకున్నవి ఇప్పటి వరకూ శమ్రించి ఎంత వరకూ సాధించామో….ఆ విజయాలే మన జీవితంలో నూతనత్వాన్ని, నూతనోత్తేజాన్ని, ఆనందాన్ని నింపుతాయి…అంతేగానీ మారే అంకెలు కాదు. రాబోతున్న నూతన హిజీ సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానించినట్టే జీవితంలోకి నూతనత్వాన్ని తెచ్చే సరికొత్త ఆలోచనలను సయితం మనం మన మనసుల్లోకి ఆహ్వానించాలి.

సందర్భం ఏదైనా, హితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలనీ కోరుకోవడంలోనూ, అలా గడపటంలోనూ ఎలాంటి తప్పు లేదు. కానీ పవ్రక్త ముహమ్మద్‌ (స) గారి మనవడి వీర మరణాన్ని ముహరంతో ముడిపెట్టి, స్వర్గవాసుల్లో యువనాయకుడైన హజత్ర్‌ హుసైన్‌ (ర) గారి పేరుతో జరుగుతున్న కార్యకమ్రాలు చూస్తే…నేటి యువత ఎటువైపు పయనిస్తున్నదన్న ఆవేదన, ఆందోళన కలగక మానదు. అర్థ రాతి వేళ దాకా యువకులు, ధర్మాన్ని మరియు పవ్రక్త (స) వారి సంపద్రాయాన్ని మరచి, కర్బలా సంగామ్రం పేరుతో చితవ్రిచితాక్రారాలను భుజానెత్తుకొని నిప్పులు తొక్కుతూ, చేసే వెకిలి చేష్టలు, చూట్ట నిలబడి పజ్రలు కోట్టే చప్పట్లు వెరి తలలు వేస్తున్న విషసంస్కృతికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ఇంకా చావడీల ధగ్గర, గల్లీల్లో ఊరేగింపులు చేస్తూ, రోడ్డు మీద తప్పతాగి చిందులు తొక్కే వారి పరిస్థితి వర్ణించలేము. ఈ పది రోజులు రాతిళ్ల్రు మద్యం మత్తులో వారు చేెసే అల్లరి అంతా ఇంతా కాదు. పవితమ్రైన ఈ మాసంలోని పదవ తేది (ఆషూరా) విశిష్ఠత నేటి యువతకు తెలుసో తెలియదోగానీ ఈ పవిత మాసం స్వాగతం పేరుతో, హజత్ర్‌ హుసైన్‌ (ర) గారి విషాద గాధ సాకుతో పవ్రక్త (స) వారి కుటుంబమే సిగ్గు పడేలా వెరి గంతులు వేయటం ఎంతో అవమానకరం. అన్నీ తెలిసిన అల్లాహ్‌ా ఇలా విశద పరుస్తున్నాడు: ”దైవగృహం వద్ద ఈలలు వేయటం, చప్పట్లు కొట్టడం మినహా వారు చేసే పార్థ్రన మరేముంది? కనుక మీ సత్య తిరస్కారానికి పత్రిఫలంగా శిక్షను చవి చూడండి”. (దివ్యఖుర్‌ఆన్‌- 8: 35)

అంటే, ముస్లింలమైన మనం చేెసే పత్రి కార్యం శాంతితో కూడినదై ఉండాలి. విషాద సమయమైనా, సంతోష సందర్భమైనా సరే. కానీ నేడు ఓ పక్క్ర పాశ్చాత్య దుష్కృతికి బానిసలై యువతులు సయితం యువకులతో శుత్రి కలిపి చెట్టాపట్టాలేసుకు తిరగటానికి ఆరాట పడుతూ ఇస్లామీయ సంపద్రా యాలను కాలరాస్తుంటే, మరోవైపు విగహ్రారాధకుల ఆచారాలకు పభ్రావితులై ఇస్లామీయ మౌలిక సిద్ధాంతాలనే రక్తసిక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలిసిన పెద్దలు కూడా దీన్ని అరికట్టలేకపోతున్నారు. కాలంతో కలవకపోతే కాలదోషం పట్టినవారి కింద జమ కడతారేమోనని భయంతో వారు మౌనం వహిస్తు న్నారు. తత్ఫలితంగా- విగహ్రారాధకుల ఆచారాల హోరు, పాశ్చాత్య (అ) నాగరికత జోరు పభ్రావం కమ్రేణా ధార్మిక కుటుంబాలకు సయితం పాకుతున్నది. ఇస్లామీయ జన జీవన సవ్రంతిలో విలీనమై భాసిల్లుతున్న పవ్రక్తల సంస్కృతీసంపద్రాయాలు కమ్రేపీ ఈ రెండు అనాగరికతల వెల్లువలో కొట్టుకు పోతున్నాయి.

ఒకప్పుడు మనం వేసే పత్రి అడుగులోనూ ఇస్లామీయ సంస్కృతీ సంపద్రాయాల విశిష్టతాపరిమళాలు గుభాళిస్తుండేవి. మన పత్రి మాటలోనూ సభ్యత, సంస్కారం తొణికిసలాడుతుండేది. కాని ఇప్పుడో! కాలాన్ని క్యాలండర్‌తో కొలుస్తూ పీర్ల పండగలు, పూలదండలతో పవిత ముహరం మాసపు అత్యంత విలువైన ఘడియల్ని వృధా పరుస్తూ, ఆ తర్వాత పరస్పర అభినందనలతో మురుస్తూ, కాలాన్ని నిర్లజ్జగా ఖర్చు పెట్టేస్తున్నాము. గల్లీల్లో, చావడీల్లో, క్లబ్బుల్లో, ప్లబ్బుల్లో, సినిమా హాళ్ళల్లో విందులతో, చిందులతో మానవత్వాన్ని మరుస్తున్నాము. ఆయువు మాతం కొవ్వొత్తిలా కరుగుతూనే పోతూ ఉంది.

ఒకవైపు ఇస్లాం ధర్మం పట్ల అవగాహనలేమీ వల్ల ముస్లిమేతరులు అపార్థానికి గురవుతుంటే, మరోవైపు ముస్లింలు ధర్మం పట్ల పూర్తి నిర్లక్యంతో జీవిస్తున్నారు. వారు చేస్తున్నది తప్పు అన్న అవగాహన కలిగించే చెప్పుకోదగ్గ పయ్రత్నమూ జరగడం లేదు. నగరాల్లో అక్కడక్కడా ధార్మిక కార్యకమ్రాలు జరుగుతున్నప్పటికీ, గామ్రాల్లో, మారుమూల పాంతాల్లో నివసించే ముస్లింలకు అవి అందుబాటులో లేవు. ఇస్లాం గురించి అంతంత మాతమ్రే అవగా హన ఉన్న అలగాజనాలు అనేకం అక్కడి పజ్రల్ని అపమార్గం పాల్జేస్తూ పబ్బాలు గడుపుకుంటున్నారు. కనుక మంచి పండితులు చేసే పస్రంగాలను, వారు చెప్పే పవ్రక్తల గాధలను సిడి, డివిడి రూపంలోనూ, అక్షర రూపంలో నిరుపేద, మధ్య తరగతి, ధనిక గామ్రీణ పజ్రలకు అందేటట్టు చూడాలి. ముస్లిం సమాజంలో విపరీత ధోరణులు చూపుతున్న ఈ విష సంస్కృతికి చరమ గీతం పాడేందుకు ముస్లిం యువత కంకణం కట్టాలి.

ఈ పవిత మాసంలో సత్య ధర్మ రక్షణ కోసం పాణ్రాలర్పించిన హజత్ర్‌ హుసైన్‌ (ర) మన యువతరానికి ఇహపరాల్లో తిరుగు లేని నాయకుడు. మన రక్తం ఆయన రక్తంకంటే పవితమ్రైనదేమీ కాదు, మన పాణ్రం ఆయన పాణ్రంకంటే విలువైనదేమీ కాదు. కాని మన లక్ష్యం, ఆయన లక్ష్యం ఒక్కటే. కనుక అందరి కోసం కాకపొయినా కొందరి కోసమైనా ఆదర్శం కాగలిగేలా బత్రకాలి మనం. కాలగంథంలో తొలి పుటల్లో కాకపోయినా ఆఖరి పుటల్లో చివరి పదంగానైనా మిగిలాలి మనం. అనంతాకాశంలో సూర్యునిలా కాకపోయినా చిన్న తారగానైనా వెలిగాలి మనం.

Related Post