New Muslims APP

మత సామరస్యం మరియు ఇస్లాం

మత సామరస్యానికి మచ్చుతునకగా చెప్పుకోదగ్గ సంఘటన - మహనీయ ముహమ్మద్‌ (స) ఒక అవిశ్వాసి జనాజా వెళుతుంటే, ప్రవక్త (స) వారు లేచి నిలబడ్డారు. ఏమిటి? అతను అవిశ్వాసి కదా! అని అక్కడున్న వారు అభ్యంతరం చెప్పగా - 'తనూ మనిషేగా' అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ)

మత సామరస్యానికి మచ్చుతునకగా చెప్పుకోదగ్గ సంఘటన – మహనీయ ముహమ్మద్‌ (స) ఒక అవిశ్వాసి జనాజా వెళుతుంటే, ప్రవక్త (స) వారు లేచి నిలబడ్డారు. ఏమిటి? అతను అవిశ్వాసి కదా! అని అక్కడున్న వారు అభ్యంతరం చెప్పగా – ‘తనూ మనిషేగా’ అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ)

కడువెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు, ప్రాణం పొసే మతాన్ని ‘కొందరి ఛాందసం’ ప్రమాదంగా మార్చి వేస్తున్న రోజులివి. నేడు మత దువ్వినియోగం, మత ఛాందసం, మత దురభిమానం, మతమౌఢ్యం, మతోన్మాదం సమాజాన్ని చిందరవందర చేస్తోంది. మత ధర్మాన్ని మనిషి సమాజ హితం కోరేదిగా భావించాల్సింది పోయి, దాన్ని సమాజం పాలిట ఓ గండంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. విశ్వాసాల పేరిట వినాశాలు సృష్టిస్తున్నాడు. అమృతం కావాల్సిన మతాన్ని హాలహలంగా మారుస్తున్నాడు. ‘రామ్‌కి ఔలాద్‌ లేదా హరామ్‌కి ఔలాద్‌’ అంటూ వెర్రి నినాదాలతో పెట్రేగి పోతున్నాడు. స్వమత విజ్ఞాన శూన్యతే అన్య మత ద్వేషానికి కారణం అన్న యాదా ర్థం గ్రహించ లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మతమనేది వ్యక్తి వికాసాన్ని, దృక్పథాన్ని ప్రభావితం చేయాలి. అది మనిషిలో సాత్విక చింతనను పెంపొందించగలగాలి. విశ్వకర్తను మాత్రమే ఆరాధిస్తూ విశ్వం మొత్తాన్ని ప్రేమించేలా చేయాలి. అలా చేసేదే నిజమయిన మతధర్మం. మనిషి దృక్పథంలో, నడకలో, నడవడికలో మార్పు రానంత వరకు ఎన్ని మతముల పట్టున చేరిన వృధాయే! దాన్ని మతి పరిధిలో నిలుపుకున్న నమ్మకాలకు పెట్టుకున్న పేరుగా చూడాలే గానీ, అది నిజమయి మతధర్మం కాజాలదు. నిజధర్మం కేవలం దైవం సమ్మ తించి ఆమోదించినదే. అదే కాలాతీతం, సర్వజనీనం. సర్వ జనులకు ఆచరణీయం. మిగతావన్నీ దాన్నుండి చీలి పడ్డ వక్ర మార్గాలే! ప్రక్క త్రోవలే!!
ఏ విధంగా చూసుకున్నా విశ్వం మొత్తంలో చెల్లుబాటయ్యే ధర్మం ఇస్లాం మాత్రమే. అదే ఇహలోక విజయానికి పరలోక మోక్షానికి రాచ బాట. ఈ విషయంలో ఎలాంటి సర్దుబాటుకి ఆస్కారం లేదు. అంటే, దీనర్థం ఇస్లాం తన సిద్ధాంతాల్ని బలవంతాన ప్రజల మీద రుద్దు తుంది అని అపార్థం చేసుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే! ఇస్లాం అన్య మతస్థులతో సయితం ఉత్తమంగా వ్యహరించాలని హితవు పలు కుతుంది. ”ప్రజలతో మీరు మంచి మాటలే మాట్లాడండి”. (అల్‌ బఖరా:83) అలా చేయ నిరాకరించే వారిని అది గట్టిగానే మందలి స్తుంది కూడా: ”నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే- ఏమిటి, నువ్వు ప్రజలు విశ్వసించ నంత వరకూ వారిని బలవంతం చేస్తూనే ఉంటావా”? (యూనుస్‌: 99)
బలవంతంగా ప్రజలు మెడలు వంచే అధికారం అల్లాహ్‌ా ఏ వ్యక్తికి ఇవ్వ లేదు. చివరికి ప్రవక్తలకు కూడా ఆ అనుమతి లేదు. వారి కర్త వ్యం హితబోధ చేయడం వరకే. ఒకరికి సన్మార్గం చూపడం, చూపక పోవడం అనేది కేవలం అల్లాహ్‌ాకు సంబంధించిన విషయం. ఈ కార ణంగానే – ప్రవక్తల్ని, వారి సందేశాన్ని తిరస్కరించిన వారిలో వారి భార్యలను, వారి సంతానాన్ని, వారి బంధువులను మనం చూస్తాము.
ఇస్లాం అన్య మతస్థుల పట్ల సమసర భావం కలిగి ఉండమని చెప్పడంతోనే సరిపెట్టుకోదు, ఎదుటి వారి మత పీష్వాలను, వారి ఆరాధ్య దైవాలను తూలనాడకండి అని హెచ్చరిస్తుంది: ”వారు (నిజ ఆరాధ్యుడయిన) అల్లాహ్‌ాను నదలి ఆరాధిస్తున్న వారిని తూలనాడ కండి, దూషించకండి”. (అన్‌ఆమ్‌:108) ఇస్లాం ధర్మం తన సిద్ధాంతాన్నయితే ఎలాంటి అరమరికలు లేకుండా స్పష్టంగా, సూటిగా చెబుతుంది. దాంతోపాటు అంగీకరిచడం, అంగీకరించకపోవడం అనే స్వేచ్ఛను ఏదయితే అల్లాహ్‌ా తన దాసులకు ఇచ్చాడో దాన్ని కూడా అది గౌరవిస్తుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మరియి ఇలా అను- (అసాంతం)సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ అందరి ప్రభువు తరఫు నుంచి వచ్చింది. ఇక కోరిన వారు దీన్ని నమ్మొచ్చు. కోరిన వారు దీన్ని తిరస్కరించవచ్చు”. (కహఫ్‌: 29)
అంటే ఇస్లాం ఎంపిక అధికారం మాత్రం మనిషి హేతువు, బుద్ధికే వదలి పెడుతుంది. అనగా ఇస్లాం బై ఛాయిజ్‌ ధర్మమే కానీ, బై ఛాన్స్‌ ధర్మం కాదు. అవును ”ధర్మం విషయంలో ఎలాంటి బలాత్కారం, బల వంతం లేదు. సత్యం-సన్మార్గం, అసత్యం-అపమార్గం నుండి స్పష్టం గా వేరు పర్చబడింది.” (అల్‌ బఖరా:256)
మహనీయ ముహమ్మద్‌ (స) మదీనా వెళ్లి అక్కడ సత్సమాజాన్ని స్థాపించనప్పుడు మదీనా చుట్టుప్రక్కల నివసించే అన్య మతస్థులతో, తెగలతో శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వారి ప్రాణాలకు, మానాలు, ధనాలకు రక్షణ కల్పిస్తామని, వారిని సమాన స్థాయి పౌరు లుగా గౌరవిస్తామని, వారి ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ హక్కులకు వారికి పూర్తిగా ఇస్తామని, అందరూ కలిసికట్టుగా శత్రు సైన్యాల నుండి స్వప్రాంతం అయిన మదీనాను కాపాడుకోవాలని అందులో పేర్కొనడం జరిగింది. అప్పటి ఆ ఒడంబడికలో దాదాపు 52 సెక్షన్లు ఉండేవి. అది మదీనా ఒప్పందంగా ఖ్యాతి కెక్కింది. అంతే కాదు, ఇస్లాం ముస్లిమేత రుల మనోభావాలను సయితం గౌరవ పరిగణలోకి తీసుకుంది. వారికి దక్కాల్సిన సర్వ హక్కులను ఇస్లాం వారికి ఎటువంటి డిమాండ్‌ లేకుండానే ప్రసాదించింది. దీనికి మించి-మక్కా విజయం సందర్భంగా బద్ధ శత్రువులకు ప్రాణభిక్ష పెట్టి మానవ చరిత్రలోనే కని, విని, ఎరు గని రీతిలో గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పింది. అల్లాహ్‌ా అటువంటి ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండమనే చెబుతున్నాడు: ”మంచీ-చెడులు (ఎట్టి పరిస్థి తిలోను) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొల గించు. ఆ తర్వాత (నువ్వే చేద్దువుగాని), నీకు-తనకూ బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణస్నేహితుడై పోతాడు”. (హామీమ్‌ అస్సజ్దా: 34)
ఆ తర్వాత చెడును మంచి ద్వారా తొలగించే ఈ బృహత్కార్యం అందరి వల్ల అయ్యేది కాదని, దాని కోసం గుండె దిటవు అవసరమని, సహనస్థయిర్యాలు అవసరమని, కోపాన్ని దిగమింగే గుణం అవసర మని, అలాంటి సహనమూర్తులకే ఈ భాగ్యం దక్కుతుందని తెలియ జేశాడు: ”అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు”. (హామీమ్‌ అస్సజ్దా: 35)
మత సామరస్యానికి మచ్చుతునకగా చెప్పుకోదగ్గ సంఘటన – మహనీయ ముహమ్మద్‌ (స) ఒక అవిశ్వాసి జనాజా వెళుతుంటే, ప్రవక్త (స) వారు లేచి నిలబడ్డారు. ఏమిటి? అతను అవిశ్వాసి కదా! అని అక్కడున్న వారు అభ్యంతరం చెప్పగా – ‘తనూ మనిషేగా’ అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ)
ఇస్లాం – వ్యవహార విషయంలో తన, పర అన్న వివక్షను పాటించదు. ప్రవక్త (స) మదీనాకు హిజ్రత్‌ చేసి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకు మక్కా లో భీకర కరువు ఏర్పడింది. ప్రవక్త (స), ఇస్లాంకు బద్ధ శత్రువయిన అబూ సుఫ్యాన్‌, మరియు సఫ్యాన్‌ బిన్‌ ఉమయ్యా వద్దకు ఐదు వందల దిర్హిమ్‌లు పంపి వాటిని అవసరార్థులలో, నిరుపేదలలో పంచవలసిం దిగా కోరారు. స్వయంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స) ఎందరో ముస్లిమేతర సోదరుల్ని తన ఇంటికి విందుకి ఆహ్వానించేవారు. అలాగే ముస్లిమేతర సోదరులు ఇచ్చే విందు ఆహ్వానాన్ని స్వీకరించేవారు కూడా. అలా స్వీకరించిన ఓ విందులో ఆయనకు విషం కలిపిన ఆహా రం ఇవ్వబడినా ఆయన ముస్లిమేతరులు ఇచ్చే విందుకి వెళ్ళడం మాను కోలేదు. అంతే కాదు మహనీయ ముహమ్మద్‌ (స) ముస్లిమేతరులతో ఎంతో స్నేహపూరితంగా, వ్యవహరించేవారు. ”నేను మీ ఇంటికి విందు కి రానా?” అనేవారు.అది విన్న ముస్లిమేతర సోదరులు ఆయన రాకను శుభప్రదంగా, మహా భాగ్యంగా తలంచి ఆయన్ను తమ ఇంటికి తీసు కెళ్ళేవారు. అలాగే ఇంట్లో ఏదయినా మంచి కూర వండితే దాన్ని కాస్త పలుచ చేసి ఇరుగుపొరుగున ఉన్న ముస్లిమేతర సోదరుల ఇళ్ళకు పంపమని సతీమణులను పురమాయించేవారు. అలాగే సమయం. సందర్భాన్ని బట్టి వారికి బహుమతులు కూడా పంపుతూ ఉండేవారు. ఇదే మత సామరస్యానికి ఆయన (స) తర్వాత అయన సహచరుల యిన నలుగురు ధర్మఖలీఫాలు సయితం కట్టుబడి నడుచుకున్నారు.
ముస్లింలు బైతుల్‌ మఖ్దుస్‌ను జయించిన సందర్భంగా ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) జెరూషలెమ్‌ చేరుకుని అక్కడి ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.”ఈ ఒడంబడిక పత్రాన్ని అల్లాహ్‌ా దాసు డయిన ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (ర), ఏలియా ప్రజలకు ఇస్తున్నాడు. ఇది వారి ధన, మాన, ప్రాణ, చర్చీ, శిలువ, అరోగ్యవంతులు, రోగగస్త్రుల తోపాటు అన్ని మతాల ప్రజల రక్షణకు సంబంధించి ఇవ్వబడుతున్న హామీ పత్రం. వారి ప్రార్థనా మందిరాలను కూలదోయరాదు. – వారి చర్చీలను నివాస స్థలాలుగా మార్చ రాదు. వారి ధనాన్ని దోచుకో కూడదు. మతావలంబన విషయంలో వారిపై ఎలాంటి బలవంతం, బలాత్కారం ఉండదు. వారిలో ఏ ఒక్కరిని కూడా నష్ట పర్చడం, కష్ట పెట్టడం జరుగదు”. అని అందులో పేర్కొన్నారు. ఇవి ఇలాంటి లెక్క లేనన్ని సజీవ సాక్ష్యాల కారణంగానే అనేక మంది ముస్లిమేతర సోద రులు చరిత్రలో ముస్లిం నాయకులు కనబరచిన మత సామరస్యాన్ని ప్రశంసిమచకుండా ఉండలేక పోయారు. ప్రాన్స్‌కి చెందిన ప్రముఖ స్కాలర్‌ -ఫ్రాన్సిసీ గొస్తాఫ్‌ లీబోన్‌ – ”అరబ్బుల వంటి మత సామరస్యం గల ప్రజల్ని లోకం చూడలేదు. ఇస్లాం వంటి మత సమ రస భావాన్ని పాటించే ధర్మాన్ని లోకులు కనలేదు”. అన్నాడు.
ఇస్లాం కనబర్చే మతసామరస్యానికి మరో మచ్చుతునక కాగల సంఘట – వలీద్‌ బిన్‌ అబ్దుల్‌ మలిక్‌ రాజు హయాంలో డెమాస్కస్‌ లోని పెద్ద మస్జిద్‌ను విస్తీర్ణ పరుస్తూ చర్చీకి సంబంధించిన కొంత భాగాన్ని మస్జిద్‌లో కలుపుకున్నారు. అయితే ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ (ర) గారు ఖలీఫాగా ఎన్నుకోబడిన వెంటనే ఆయన మస్జిద్‌ ఆ బాగాన్ని పడగొట్టి చర్చీ అధికారులకు అప్పగించాడు.
అలెగ్జాండ్రియాను ముస్లింల కైవసం చేసుకున్నప్పుడు ఓ ముస్లిం యోధుడు ప్రవక్త ఈసా (అ)కు సంబంధించిన ఒక కన్నును పగుల గొట్టాడు. ఈ సంఘటన వివరాలు మసర్‌ గవర్నర్‌ అయిన అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) వద్దకు చేరగా ఆయన క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి – ”మీరే చెప్పండి ఈ నేరానికి ఏం శిక్ష విధించాలో? ఈ సమస్యకు పరిష్కారం ఏం కాగలదో?”. దానికి వారు ‘మీరు మీ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఓ చిత్రపటాన్ని తయారు చేసి ఇవ్వండి. మేమూ ఆయన కన్నును పగులగొడతాము’ అన్నారు. అది విన్న ముస్లిం గవర్నర్‌ – ”మా ప్రవక్త (స) వారి చిత్రపటాన్ని మేమే తయారు చేయము. అలాంటిది మీకెలా తయారు చేసి ఇవ్వగలము చెప్పండి. హాఁ! ఓ పరిష్కారం ఉంది. నా ఈ రెండు కళ్ళున్నాయి, కావాలంటే మీరు వీటిని పగులగొట్టచ్చు” అన్నారు.ఎంతో న్యాయబద్ధమయిన గవర్నర్‌ తీర్పుని విన్న వారు ప్రతీకార నిర్ణయాన్ని మానుకున్నారు.
చివరిగా ఒక మాట – మత సామరస్యం అంటే, మనిషి తన వ్యక్తి త్యాన్ని, తన మత ధర్మాన్ని, తన విశ్వాసాన్ని తిలోదకాలిచ్చి ఇష్ట మొచ్చి నట్టు వ్యవహరిస్తూ నేనో గొప్ప లౌకిక వాదిననో, మానవతావాదిననో భజనప్రియుల్ని ప్రోగు చేసుకోవడం కాదు. తను నమ్మే నిజాన్ని పాటిస్తూ, అన్యులు పాటించేది అసత్యమయినా వారికి సత్యావగాహన కలిగించే ప్రయత్నం చేస్తూనే వారి మాటల్ని, చేతల్ని సహించడం. ఒక వేళ వారు హింసా మార్గాన్ని ఎంచుకున్నా, తాను మాత్రం శాంతిని ఆశ్రయించి అందరి మేలును మనస్ఫూర్తిగా కోరడం. అయితే,
అత్యంత శోచనీయమయిన విషయం ఏమిటంటే, ముస్లింలుగా పిలవబడుతున్న అనేకుల ప్రవర్తన అల్లాహ్‌ా ఏకత్వాని (తౌహీద్‌)కే మచ్చ తెచ్చేదిగా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుసైన్‌ మరియు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీర్జా అనబడే ముస్లింలు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ ”స్వర్ణపుష్పార్చన” లేదా ”అష్టదళ పాద పద్మా రాధన” చేస్తారట. శబరిమలై అయ్యప్పకు వావర్‌ అనే ముస్లిం మిత్రుడున్నాడట. అక్కడికెళ్ళేవారు వావర్‌ స్వామి కోసం కూడా ప్రత్యే కంగా మిరియాల పొట్లం ఇరుముడిలో పెట్టుకుని వెళతారట. అయ్యప్పే అలా ఆదేశించాడని స్థల పురాణం చెబుతొందట. మంళగిరి మిద్ది సెంటర్లో ముస్లింలు నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారట. గుంటూరులో ముస్లిం యువకులు ఐదేళ్ళుగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారట. ఔరంగాబాదులో దర్గామసీదులో 35 సంవత్స రాలుగా గణపతి ఉత్సవాలు ముస్లింలు చేస్తున్నారట. హైదరాబాదుకి చెందిన జఫరుల్లాహ్‌ా ఖాన్‌ వేలంలో లక్షా రెండు వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకుని మత సామరస్యాన్ని చాటాడట. బీహార్‌ లో ముస్లింలు మహావీర్‌ మందిర నిర్మాణానికి భూమి విరాళం మత సామరస్యాన్ని ఘనంగా చాటారట. ఇవి ఇలాంటి అనేక వార్తలతో (అవి వాస్తవాలు కూడా) ముస్లింలు తౌహీద్‌ను పాటిస్తూనే షిర్క్‌ (బహు దైవారాధన)కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అని ప్రచారం చేయడం జరుగుతోంది.

ఏది ఏమయినా, కొందరి ప్రవర్తన ధర్మానికి గీటురాయి కాదు, ధర్మమే అన్నింటికీ గీటురాయి. వాస్తవం ఏమిటంటే, తౌహీద్‌ మరియు షిర్క్‌ పర్సపరం పూర్తి విరుద్ధమయిన భావాలు. ఏక సమయంలో ఓ వ్యక్తి తౌహీద్‌ని కూడా నమ్ముతున్నాడు, షిర్క్‌ని కూడా పాటిస్తున్నాడు అంటే దానికి మించిన ఆత్మవంచన, ధర్మద్రోహం మరొకటి కాజాలదు. షిర్క్‌ చేసే వాడు ముస్లిం కాడు. ఉంటే ముస్లింగానయినా ఉండాలి, లేదా బహుదైవారధకుడిగానయినా ఉండాలి, లేదా నాకు మతంతో సంబంధమే లేదు అనే వర్గంలోనయినా చేరాలి. అన్యదా నష్టపోయేది వీరో వారో కాదు, అలా నడుచుకునే వ్యక్తి, వర్గం మాత్రమే. నేడు భారత ముస్లింలలో కనబడే ఇదే ధోరణి ఎండ గడుతూ అల్లాహ్‌ా చెప్పిన మాట:

”వారిలో చాలా మంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరుల్ని సాటి కల్పింస్తున్నారు (షిర్క్‌కి ఒడిగడుతున్నారు). ఏమిటి? అల్లాహ్‌ శిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదనీ, అకస్మాత్తుగా – తమకు తెలియకుండానే-ప్రళయం విరుచుకు పడదని వారి నిశ్చింతగా ఉన్నారా?”. (యూసుఫ్‌: 106, 107)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.