– అల్లామా ముహమ్మద్ సాలెహ్ అల్ ఉసైమిన్
ప్రశ్న: ప్రపంచపు అన్నీ చంద్రోదయ సమయాల్ని మక్కా చంద్రో దయ సమయంతో ముడి పెట్టితే రమాజన్ ఉపవాసాలు, మరియు ఇతరత్రా పండుగలు ముస్లింలందరూ కలిసి ఒకే దినం జరుపుకోవచ్చు. అలా ముస్లిం సమైక్యతను చాటినట్టు కూడా అవుతుంది కదా! అన్నది కొందరి అభిప్రాయం. మరి తమరి సలహా ఏమిటి?
జ: ఈ ఆలోచన ఖగోళ శాస్త్రం ప్రకారం అసంభవం. విశ్వ విఖ్యాత షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్ను తైమియా (ర) ఈ విషయమై స్పందిస్తూ… శాస్త్రవేత్తలందరూ చంద్రోదయ సమ యాలు, స్థలాలు పూర్తి ప్రపంచంలో వేర్వేరుగా ఉన్నాయన్న విష యంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. చంద్రోదయ సమ యాలు, స్థలాల విషయమై బాహ్యాధారాలు, ఆధ్యాత్మిక ఆధారాల ప్రకారం సయితం ఆయా దేశాల్లో గలవారికి నెలవంక ను చూసే ప్రత్యేక విధానం ఉండటమే సమంజసం అన్పిస్తుంది అని అన్నారు.
ఉదాహరణకు: ”ఫ మన్ షహిద మిన్‌కుముష్ షహ్‌ార ఫల్ యసుమ్‌హు” (బఖర: 185) (ఇక నుండి రమజాను నెలను పొందిన వ్యక్తి ఆ మాసమంతా విధిగా ఉపవాసం ఉండాలి.
దూరపు భూభాగాల్లో నివసించే వారు నెలవంకను చూడలేదు, కేవలం మక్కా వాసులు మాత్రమే నెలవంకను చూసినట్లయితే, నెలవంక చూడని వారిపై, పై ఆయతులోని దైవాదేశం ఎలా వర్తిస్తుంది?
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”సూమూ లి రూయతిహి వ అఫ్‌తిరూ లి రూయతిహి” – నెలవంకను చూసి ఉపవాసా లుండటం ప్రారంభించండి. మరియు నెలవంకను చూసి ఉపాసాలను విరమించండి. (బుఖారీ)
సపోజ్ ఒక వేళ మక్కా వాసులు నెలవంకను చూశారు కానీ; భారత దేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఇతరత్రా పొరుగు దేశాల వారు నెలవంకను చూడనప్పుడు ఆ దేశ ప్రజలను మీరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండి తిరాల్సిందేనని ఎలా పురమాయిం చగలం? ఆయా దేశాలకు సంబందించిన ఆకాశంపై ఇంకా నెలవంక ఉదయించనే లేదని మనకు తెలుసు. నెలవంకను చూసిన ప్రాంత ప్రజలు మాత్రమే ఉపవాసాలు ప్రారంభించాలి అని ప్రవక్త (స) ఆదేశించారన్న విషయం తెలిసి కూడా నెలవంక ను చూడని వారిని ఉపవా సాలుండమనడం ఎంత వరకు సమం జసం?
ఇక బాహ్యాధారాల్ని అన్వేెషించినట్లయితే – ప్రతి దేశస్తుడు తన ప్రాంతంలో నెలవంకను చూసి ఉపవాసాలు ఉండటమే సరైనది. ఎందుకంటే-, 1) భూమికి తూర్పు దిశన ఫజర్ (ఉషోదయం) భూమికి పడ మర దిశన ఉన్న వారికంటే ముందు జరుగుతుంది. (ఫజ్ర్ సాదిఖ్ అవగానే ఉపవాసం ఉండదలుచుకున్నవారు అన్న పానీ యాలు మానేయాలన్న ఆదేశం ఉంది కదా!) అదే సమయంలో భూమికి పడమర దిశన ఉన్నవారికి ఇంకా రాత్రి సమయమే నడుస్తూ ఉంటుంది. మరి భూమికి తూర్పు దిశన ఉన్న ఉషో దయం అయిందని పడమర దిశన ఉన్నవారు కూడా అన్నపానీ యాలు సేవించడం మానేయాలా? కాదు కదా!
2) భూమికి తూర్పు దిశన ఉన్నవారికి సూర్యాస్తమయం పడమర దిక్కున ఉన్నవారికంటే ముందు జరిగిపోతుంది. ఆ సమయంలో పడమర దిక్కున ఉన్నవారికి ఇంకా ఎండ కాస్తూనే ఉంటుంది. మరి తూర్పు దిక్కున ఉన్నవారికి సూర్యాస్తమయం అయిపోయిం దని పడమర దిక్కున ఉన్న వారు ఉపవాసం విరమించుకోవాలా? లేదు కుదరదు కదా!
నెలవంక విషయము సూర్యుడి వంటిదే. కాకపోతే చంద్ర్రుని ప్రయాణం ఒక నెలలో పూర్తవుతుంది. సూర్యుని ప్రయాణం ఒక రోజులో పూర్తవుతుంది.
”ఉపవాస కాలంలో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీ కొరకు ధర్మ సమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు. మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మ ద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్‌ాకు తెలుసు. అయి నప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు. మిమ్మల్ని మన్ని ంచాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మ సమ్మతం చేెసిన సుఖానుభవాన్ని పొం దండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్పుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి. ఆ తర్వాత వీటన్నింటిని త్యజించి చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి. కాని మసీదులలో ఏతికాఫ్ పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్‌ా ఏర్పరచిన హద్దులు. వీటి దరిదాపులకు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్‌ా తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది”. (బఖరా:187) అని ఆదేశించిన అల్లాహ్‌యే ఈ నియమాన్ని కూడా ఎరుక పర్చాడు: ”ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి”. (బఖర: 185)
పై రెండువిధాల ప్రమాణాల దృష్ట్యా ఉపవాసం ఎప్పుడుండాలి, ఎప్పుడు విరమించాలన్న నిర్ణయం ఆయా ప్రాంత ప్రజల నెల వంక దర్శనాన్ని బట్టి ఉంటుంది. ఏది ఎమైనా మనం చేపట్టే ప్రతి కార్యం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) వారి ఆజ్ఞ పరిధిలో ఉండేటట్లు జాగ్రత్త పడాలి.