ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్ బిన్ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”.
ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా? లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు? అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది?
ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్ ఫలాహ్‌ా- సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్ రూపంలో స్వయంగా అల్లాహ్‌ా మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ా అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒన
గూడుతుంది?అతనికి రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం! దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి.
ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ా ఆదేశం.అల్లాహ్ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా?
కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్ వాక్కును ధృవ పరుస్తాడు. నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు. (ఆలి ఇమ్రాన్: 39)
ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు పట్ల మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా?
నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.” (అల్ పతహ్: 29)
అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35)
”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47)
మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2)
అల్లాహ్ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు?
తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా?
మనం ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా?
ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్: 16)
చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో!
ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే.
ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు?
”అల్లాహ్ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి!
అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష చేసుకోవాలి.