Originally posted 2013-02-07 07:41:23.
ముహమ్మద్ ఇక్బాల్ కీలాని
”మరి ఎవరయితే హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితా నికే ప్రాధాన్యమిచ్చారో వారికి నరకమే నివాసమవు తుంది”. (నాజిఆత్: 37-39)
మనిషి చనిపోతాడు. పాము కుబుసం వదలి ముందుకు సాగిపో యినట్టు ఎంతో నాజుకూగా పెంచుకున్న గారాల దేహాన్ని వీడి మనిషి ఆత్మ పరలోకానికి పయనమవుతుంది. దానికి భౌతిక నేత్రాలయితే లేవుగానీ అది చూడగలుగుతోంది. దానికి మనకులాగు వీనులు లేవు గానీ, అది వినగలుగుతుంది. నరకం ఉందంటే నరలోకాన్నే నాకంలా భావించే కొందరు భ్రమ జీవులు ఎగిరి గంతులేస్తారు. కోపంతో కారాలు మిరియాలు నూరుతారు. సమాధి చేయబడిన శవం మట్టిలో కలిసి మట్టయిపోతుందనుకుంటారు. కాల్చబడిన శవం బూడిదయి కాటి మట్టిలో కలిపోతుందనుకుంటారు. ఐహిక జీవితం తప్ప పర లోక జీవితం లేదన్నది వీరి బలమయిన వాదన. దేహంకన్నా ఆత్మ కున్న ప్రాముఖ్యతను వీరు గమనించేందుకు సుముఖంగా ఉండరు. శరీరానికి మెరుగులు దిద్దుకుంటారేగానీ, ఆత్మను ప్రక్షాళనం చేసుకు నేందుకు ప్రయత్నించరు. దాని గురించి ఆలోచించనన్నా ఆలోచిం చరు. సమాధి యాతన అనేది ఎంత నికృష్టమయినదో, అక్కడికి చేరిన ఆత్మలు ఎంతగా అల్లాడిపోతాయో, సమాధిలో పుణ్యాత్మలకు లభించే ఫలం ఎంత