దివ్య ఖుర్‌ఆన్‌అవతరించిన మాసం రమజాన్ మన నుండి సెలవు తీసుకోవటానికి సిద్ధంగా ఉంది. ఈ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ ఖుర్‌ఆన్‌ను పఠించినవారు, ఖుర్‌ఆన్ ఫఠనాన్ని శద్ధ్రతో ఆలకించిన వారు నిస్సందేహాంగా అదృష్టవంతులు. అలాగే దివ్య ఖుర్‌ఆన్‌ను తమ జీవన సంవిధానంగా నమ్ముతూ దాని సూక్తులపై చింతన చేసినవారు, దాని ఆజ్ఞలను శిరసావహించినవారు, దాని సందేశాన్ని ఇతరులకు చేరవేసినవారు కూడా ధన్యులే.
యదార్థమేమిటంటే మానవుడు ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ ఎన్నో విషయాలలో అతని బుద్ధి తికమక పడుతూ ఉంటుంది. తనకంటూ ఒక మార్గదర్శకుని కోసం అతని ఆంతర్యం ఆశగా ఎదురు చూస్తుంది. ఆ మార్గదర్శకుడు మానవ సహజమైన దౌర్బల్యాలన్నింటికీ అతీతుడై ఉండాలని కూడా అతని నైజం వాంఛిస్తుంది. సకల చరాచర లోకేశ్వరునికన్నా గొప్ప మార్గదర్శకుడు ఎవరు కాగలుగుతారు? ఆ లోకేశ్వరుడే మానవుని మార్గదర్శకత్వం నిమిత్తం తన గంథాలను అవతరింపజేశాడు. ఆ గంథాల సారాన్ని క్షుణ్ణంగా విడమరచి చెప్పే సందేశహరులను, పవ్రక్తలను పభ్రవింపజేశాడు. ఆ గంథ రాజాల పరంపరలోని చిట్టచివరి కృతియే దివ్యఖుర్‌ఆన్. ఆ ఉద్గంథంలోని పలు పథ్రానాంశాలలో అత్యంత కీలకమైనది ‘మానవ మార్గదర్శకత్వం’. ఇది ”మానవులందరికీ మార్గదర్శకం” అని ఒక చోటుంటే (2: 185), ”భయభక్తులు గలవారికి సన్మార్గ దర్శిని” అని మరొక చోట అనబడింది (2: 2). ఈ గంథం సార్వజనీనం మాతమ్రే కాదు, సర్వ కాలికం కూడా. నాటికీ, నేటికీ, మరెన్నటికీ ఇదే మానవతకు మోక్ష పద్రాయిని. ఈ గంథం గురించి అత్యంత సమగమ్రైన పరిచయ చేస్తూ మహనీయ ముహమ్మద్ (స) ఇలా అన్నారు:
”ఇది దైవ గంథం. ఇందులో గతించిన వారి నిజ గాథలున్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన వాణులున్నాయి. మీ జీవితాలకు సంబంధించిన ఆదేశాలున్నాయి. ఇదొక తిరుగులేని వాక్కు. ఇందులో వేళాకోళపు విషయాలు లేవు. అహంకారంతో దీన్ని విడనాడిన వానిని దేవుడు తొక్కేస్తాడు. ఈ గంథాన్ని వదలి పెట్టి వేరొక చోటి నుంచి సన్మార్గం పొందగోరినవానిని దేవుడు మార్గవిహీనుణ్ణి చేస్తాడు. ఇది దేవుని పటిష్టమైన తాడ్రు. ఇది ఉపదేశంతో, వివేకంతో నిండిన వాక్కు. ఇంకా ఇదే రుజుమార్గం. ఈ గంథాన్ని ఆశయ్రించిన వారి కోర్కెలు పెడతోవ్ర పట్టవు. దీని మూలముగా భాషలు మోసపుచ్చలేవు. దీన్ని ఆశయ్రించిన జ్ఞానుల, మేధావుల జ్ఞాన పిపాస ఎన్నటికీ తీరదు. మాటిమాటికీ పారాయణం చేసినప్పటికీ ఈ వాక్కు పాతది అనిపించదు. ఇందలి విలక్షణ విషయాలు ఎన్నటికీ తరిగిపోవు, కరిగిపోవు. ఈ వాక్కుయందలి విశిష్ఠత ఏమిటంటే జిన్నుల వర్గం ఒకసారి దానిని విన్నప్పుడు ‘సన్మార్గం వైపునకు దర్శకత్వం వహించే ఒక అద్భుతమైన వాణిని మేము విన్నాము. కనుక మేము దానిని విశ్వసిస్తున్నాము’ అని పక్రటించకుండా ఉండలేకపోయింది. ఖుర్‌ఆన్ పక్రారం మాట్లాడేవాడు సత్య వంతుడు. దీని పక్రారం ఆచరించేవాడు ఉత్తమ పత్రిఫలం పొందుతాడు. దీని పక్రారం తీర్పు ఇచ్చేవాడు న్యాయబద్ధమైన తీర్పరి అవుతాడు. దీని వైపునకు పిలిచినవాడు సన్మార్గం వైపునకు పిలిచిన వాడవుతాడు”. (తిర్మిజీ)
దివ్య ఖుర్‌ఆన్‌కి సంబంధించి ఇంతకన్నా గొప్ప పరిచయం మరొకటి ఉండబోదు. మానవతకు మార్గదర్శనంగా ఉన్న గంథం. మనిషి కోరిన దానినల్లా గుడ్డిగా ఒప్పుకోదు. పుత వాత్సల్యం గల ఒక తండి తన చిన్నారులను పాడు చేసే ఏ పనినీ చేయనివ్వడు. రోగి బాగోగులను దృష్టిలో పెట్టుకున్న ఒక డాక్టరు రోగిని అతని మానాన వదలి పెట్టడు. అతనికి మింగుడు పడని చేదు మాతల్రను మింగిస్తాడు. అలాగే మానవత పాలిట ఖుర్‌ఆన్ ఒక దివ్య ఔషధం. అది కోర్కెల పగ్గాలను మనిషి చేతికి ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకుంటుంది. అవసరమైన చోటల్లా బేక్రులు వేస్తుంది.
ఖుర్‌ఆన్ మనిషిని మనోవాంఛల దాసుడుగా వదలి పెట్టదు. పశువులు సయితం అతన్ని చూసి సిగ్గుపడే దుస్థితిని రానివ్వదు. అతను పచ్చి వ్యభిచారిగా మారి, దానికి ‘పేమ్ర’ పూత పట్టిస్తానంటే ఖుర్‌ఆన్ ఒప్పుకోదు. అతను హోమో సెక్సువల్‌గా మారిపోయి ‘ఇది నా ఇష్టం. నా స్వేచ్ఛ’ అంటే ఖుర్‌ఆన్ ముమ్మాటికి అంగీకరించదు. అతడు తన ఆరోగ్యాన్ని, నైతికతను సర్వనాశనం చేసే మత్తు పదార్థాలకు బానిసనవుతానంటే ఖుర్‌ఆన్ అడ్డు చెప్పకుండా ఉండదు. అతడు అడ్డగోలుగా పేద పజ్రలను దోచుకుని, షావుకార్లను గుడ్డిగా సమర్థిస్తానంటే ఖుర్‌ఆన్ సమ్మతించి ఆమోదించదు. ఖుర్‌ఆన్ జీవితపు పత్రి రంగంలోనూ మానవతకు శేయ్రోదాయకమైన వాటిని మాతమ్రే సమ్మతిస్తుంది. అటువంటి దివ్య ఔషధాన్ని మనం మన వరకే ఉంచుకుంటే సరిపోతుందా? దాన్ని మన పరిసరాల్లోని వారికి అందజేయాల్సిన బాధ్యత మనపై లేదా? ఆలోచించండి!