మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ
అబ్దుల్ ముత్తలిబ్ తమ ముద్దుల మనవడిని తీసుకుని మక్కా చేరుకున్నారు. ముహమ్మద్ (స) అంటే ఆయనకు అమితమైన వాత్సల్యం. ఇప్పుడు కోడలు కూడా అసువులు బాసడం వల్ల అనాథ మనుమని పట్ల ఆయనకున్న వ్రేమ రెట్టింపయ్యింది. తన సంతానంలో అందరికన్నా ఈ మనవడికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కాబా నీడలో అబ్దుల్ ముత్తలిబ్ కోసమని ప్రత్యేకంగా పడక (సాప) వేయబడేది. ఆయన విల్లలందరూ ఆ సాప చుట్టు కూర్చునేవారు. తండ్రి పట్ల ఉన్న గౌరవం వల్ల దానివై కూర్చునే ధైర్యం చేసేవారు కాదు. అయితే ప్రవక్త (స) దానివై వచ్చి కూర్చునేవారు. ప్రవక్త (స) గారి బాబాయి లందరూ కలిసి ఆయన్ను ప్రక్కకు జరపాలని ప్రయత్నించేె వారు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ – ”నా బిడ్డను వదలండి. దైవ సాక్షిగా! ఇతని స్థానం మహోత్కృష్టమైనది” అంటూ తనతో కూర్చోబెట్టుకుని ఆయన వీపు తట్టేవారు. ప్రవక్త (స) గారి వయసు ఎనిమిది సంవత్సరాల రెండు నెలలకు చేరుకోగానే, తాత గారైన అబ్దుల్ ముత్తలిబ్ మక్కాలో తనువు చాలించారు. పోతూపోతూ మనవడి పోషణాభారం ప్రవక్త (స) గారి వెదనాన్న (ప్రవక్త గారి తండ్రి అబ్దుల్లాహ్‌ా మరియు అబూ తాలిబ్ ఒకే తల్లి బిడ్డలు) అబూ తాలిబ్‌కు అప్పగించి వెళ్ళారు.
మమతకు మారు వేరయిన వెదనాన్న సంరక్షణలో
అబూ తాలిబ్ తన భ్రాతృజుడ్ని అల్లారు ముద్దుగా వెంచారు. ప్రవక్త (స) గారి పట్ల ఈయనకు ప్రత్యేక వ్రేమాభిమానాలు, అవ్యాజానురాగాలుండేవి. ఒక్కోసారి తన కన్న కొడుకులవై కూడా ప్రవక్త (స) గారికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. అంతే కాదు, ప్రవక్త (స) గారి ద్వారా ప్రార్థన చేయిస్తే మేఘాలు వర్షించేవి. ప్రవక్త (స) గారి బాల్యంలో ఒకసారి మక్కాలో కరువు రక్కసి ఆవహించింది. తీవ్ర ఆందోళన చెందిన ఖురైషులంతా అబూ తాలిబ్ వద్దకు వచ్చి, ‘మీరు వర్షం కోసం దైవాన్ని ప్రార్థించండి’ అని విన్నవించుకున్నారు. ఆయన బయలుదేరారు. ఆయనతోపాటు బాల ముహమ్మద్ (స) కూడా ఉన్నారు. బాల ముహమ్మద్ (స)ను కాబా గోడకు ఆనిచ్చి కూర్చోబెట్టారు. తరువాత వర్షం కోసం ప్రార్థించగా కొన్ని క్షణాల్లో దట్టమైన మేఘాలు క్రమ్ముకున్నాయి. ఆకాశం నుండి వర్షం కురిసింది. వీధులన్నీ ఏరులై పారాయి.
బుహైరా – రాహిబ్ (సన్యాసి)
దైవ ప్రవక్త (స) గారికి పన్నెండు ఏండ్లు నిండగానే అబూ తాలిబ్ ఆయన్ని వెంటబెట్టుకొని వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళారు. చివరికి (ఈ వర్తక బృందం) బస్రా పట్టణం చేరుకుంది. ఈ పట్టణంలో బుహైరా వేరుతో విలువబడే ‘జర్‌జిస్’ అనేె ఓ సన్యాసి ఉండేవాడు. వర్తక బృందం సేద తీర్చుకోవడానికి అక్కడ ఆగింది. ఇది తెలుసుకున్న తను వెళ్ళి వారికి స్వాగతం పలికాడు. ఎంతో మర్యాదగా ప్రవర్తించాడు. వారందరికీ విందు ఇచ్చి తగురీతిలో సత్కరించాడు. తను గతంలో ఎన్నడూ వారి వద్దకు వచ్చిన దాఖలాలు లేవు. అతను ప్రవక్త (స) వారిని ఆయన గుణవిశేషాల ఆధారంగా పసిగట్టాడు. ప్రవక్త (స) గారి చెయ్యి పట్టుకుని ఇలా అభిప్రాయపడ్డాడు: ”ఈ అబ్బాయి విశ్వనాయకుడు, ఈ బాలుడ్ని అల్లాహ్‌ా సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాడు”. ఈ విషయం నీకెలా తెలుసు? అని అబూ తాలిబ్ ప్రశ్నించగా ”ఈ కనుమ గుండా మీరు ప్రవేశించి నప్పుడు ఇక్కడున్న ప్రతి రాయి, ప్రతి చెట్టు సాష్టాంగపడసాగాయి. అలా అవి కేవలం ఒక ప్రవక్తకు మాత్రమే సజ్దా చేస్తాయి. అలాగే రెండు భుజాల మధ్యనున్న ఆవిల్ లాంటి దైవ దౌత్య ముద్రతో ఆయన్ను గుర్తు పట్టాను. ఆయన ప్రస్తావన మా గ్రంథాల్లో సయితం వచ్చింది. ఇక ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఇంకెప్పుడూ ఈయన్ను ఇలా వెంటబెట్టుకుని సిరియా దేశానికి వెళ్ళకండి. బహుశా యూదులు ఇతనికి హాని తలవెట్టవచ్చు” అని హెచ్చరించాడు. ఆ తరువాత అబూతాలిబ్ కొందరు సేవకులను తోడు చేెసి ముహమ్మద్ (స)ను మక్కాకు వాపసు పంవించారు.