ఖుర్‌ఆన్‌ భావ సిరులు

ఖుర్‌ఆన్‌ భావ సిరులు

ఖుర్‌ఆన్‌ ఆవగాహనం నుండి

”ఆయనే అల్లాహ్ , మీ కొరక మీ రాశిలోనే జతలను సృష్టించినవాడు, మరాయనే మీ భార్యల ద్వారా మీకు కొడుకులను, మనుమలను ప్రసాదించాడు, ఉత్కృష్ఠ మైన వస్తువులు మీ ఉపాధికి అనుగ్రహించాడు. మరయితే వీరు (ఇదంతా చూసీ తెలుసుకుని కూడా) మిథ్యనే నమ్ముకుంటున్నారా? అల్లాహ్  చేెసిన మేళ్ళను కాదంటున్నారా?”. (దివ్యఖుర్‌ఆన్‌ – 16: 72) ”మిథ్య నమ్ముతున్నారు” అంటే, నిరాధారమయిన, అవాస్త వమయిన విశ్వాసం కలిగి ఉన్నారు. వారి సౌభాగ్య దౌర్భాగ్యాలను విధించడం, వారి మనోకాంక్షల్ని నెరవేర్చడం, మొరలాలకించడం, సంతానాన్నివ్వ డం, ఉపాధి మార్గాలను చూపెట్టడం, వారి వాజ్యాలను గెలిపించడం, వారిని వ్యాధుల నుండి రక్షించడం కొందరు దేవీదేవతలు, జిన్నులు, పూర్వపు మహనీయుల అధికారంలో గలదని నమ్మేవారన్న మాట.

”అల్లాహ్  చేెసిన మేళ్ళను కాదంటున్నారు” అంటే, వారు (మక్కా బహు దైవారాధకులు) ఈ అనుగ్రహాలకుగాను అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు కోవడంతోపాటు అనేక అస్తిత్వాలను సయితం నోటితోనూ, క్రియా రూపంలోను కృతజ్ఞతలు అర్పించుకునేవారు. ఎలాంటి నిరూపణ, ప్రామాణిక ఆధారం లేనిదే ఈ అస్తత్వాలను వారు అల్లాహ్  అనుగ్రహంలో భాగీదారులుగా పరిగణించేవారు. ఈ విషయాన్నే ఖుర్‌ఆన్‌ ”అల్లాహ్  మహోపకారాన్ని తిరస్క రించడం” గా అభివర్ణించింది

ఉదాహరణకు – మీరు ఒక అవసరమున్న వానికి దయ దలచి ఏదో సహాయం అందజేస్తారు. అతని వెంటనే లేచి మీ ముందరే ఈ సహాయ పడటంలో ఎలాంటి పాత్రా లేని మరో వ్యక్తికి కృతజ్ఞతలర్పించుకుంటాడు. మీరు మీ విశాల హృదయత కారణంగా అతని ఈ హేయమైన చర్యను చూపోపు వహించి వదిలి వేయడం సాధ్యమే, ఆ పైన కూడా మీ సహాయాన్ని కొన సాగించడం కూడా సాధ్యమే. కాని మీ మనసులో, అతను అత్యంత మర్యాద హీనుడని, కృతఘ్నుడని తప్పక అనుకుంటారు. అల్లాహ్‌ా తోపాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజించడం ఇటువంటి కృతఘ్నతే; మహాపరాధమే.

Related Post