ఖుర్‌ఆన్‌ హక్కులు

 మనపై ఖుర్‌ఆన్‌కు గల మొదటి హక్కు దానిని మనం విశ్వసించాలి. ఖుర్‌ఆన్‌ను విశ్వసించటమంటే ఈ గ్రంథం జిబ్రయీల్‌ దైవ దూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరించిందని నోటితో అంగీకరించి, మనస్పూర్తిగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.  అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ''నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకు వచ్చాడు. (ఓ ముహమ్మద్‌!) నువ్వు హెచ్చరించేవారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) స్పష్టమైన అరబీ భాషలో ఉంది''. (అష్‌ షుఅరా: 192-195)

మనపై ఖుర్‌ఆన్‌కు గల మొదటి హక్కు దానిని మనం విశ్వసించాలి. ఖుర్‌ఆన్‌ను విశ్వసించటమంటే ఈ గ్రంథం జిబ్రయీల్‌ దైవ దూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరించిందని నోటితో అంగీకరించి, మనస్పూర్తిగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:
”నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకు వచ్చాడు. (ఓ ముహమ్మద్‌!) నువ్వు హెచ్చరించేవారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) స్పష్టమైన అరబీ భాషలో ఉంది”. (అష్‌ షుఅరా: 192-195)

షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ”ఖుర్‌ఆన్‌” గ్రంథం ప్రధానమైనది. ఇది పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌ాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు. ఆ వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్‌ఆన్‌. ఈ గంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేెర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం.
మానవులు మరచిపోయిన అసలు ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్‌ఆన్‌ అవతరించింది. ఖుర్‌ఆన్‌ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ ఒక్క వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక దీనిని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే. మనపై ఖుర్‌ఆన్‌ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో తెలుసు కుందాం.

1. ఖుర్‌ఆన్‌పై విశ్వాసం:

మనపై ఖుర్‌ఆన్‌కు గల మొదటి హక్కు దానిని మనం విశ్వసించాలి. ఖుర్‌ఆన్‌ను విశ్వసించటమంటే ఈ గ్రంథం జిబ్రయీల్‌ దైవ దూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరించిందని నోటితో అంగీకరించి, మనస్పూర్తిగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు:
”నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకు వచ్చాడు. (ఓ ముహమ్మద్‌!) నువ్వు హెచ్చరించేవారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) స్పష్టమైన అరబీ భాషలో ఉంది”. (అష్‌ షుఅరా: 192-195)
అంటే, ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్‌ా తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్‌ తీసుకువచ్చారు.
ఖుర్‌ఆన్‌ను విశ్వసించడమంటే ఎటువంటి మార్పుచేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”. (అల్‌ హిజ్ర్‌: 9)
అంటే, దివ్య ఖుర్‌ఆన్‌ను స్వార్థపరుల కుయుక్తుల నుండి, ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నాము అని దేవుడంటున్నాడు. దేవుని ఈ వాక్కు సత్యమని గత 1400 సంవత్సరాలుగా రూఢీ అవుతూనే ఉంది. (అహ్సనుల్‌ బయాన్‌)

2. ఖుర్‌ఆన్‌ను పఠించడం:

ఖుర్‌ఆన్‌ యొక్క రెండవ హక్కు ఏమిటంటే, మనం ఖుర్‌ఆన్‌ను పఠిస్తూ ఉండాలి. ఖుర్‌ఆన్‌ పఠించడం వలన ఒక అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని దైవప్రవక్త (స) చెప్పారు. ఇంకా ఇలా ప్రవచించారు: ”ఖుర్‌ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసుదారునిగా వస్తుంది”. (ముస్లిం)
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు”. (అల్‌ కహఫ్‌: 27)
ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే విధానం కూడా బోధించబడింది. అల్లాహ్‌ా ఒక చోట ఇలా ఆజ్ఞాపించాడు: ”మేము ఎవరికి గ్రంథం ఒసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతే కాదు) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది”. (అల్‌ బఖర: 128)
ఈ ఆయతులో ”హక్క తిలావతిహి” గురించి ఫత్హుల్‌ ఖదీర్‌ ఆధారంగా అహ్సనుల్‌ బయాన్‌లో ఇలా ఉంది: ”పఠించవలసిన విధంగా పఠిస్తారు” అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి. 1) బాగా చదువుతారు. శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే స్వర్గంలో ప్రవేశం కల్పించమని ప్రభువును వేడుకుంటారు. నరక ప్రస్తావన వస్తే దాని బారి నుంచి రక్షించమని ప్రార్థిస్తారు. 2) అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వాటిని ధర్మసమ్మతాలుగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని (యూదుల మాదిరిగా) ప్రక్షిప్తాలకు పాల్పడటం కానీ, తప్పుడు అన్వయింపులు చేయటంగానీ చేయరు.
3) అందులో పొందు పరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు. వాటిని దాచి ఉంచరు.
4) అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని (ముహ్కమాత్‌ను) చేస్తారు. అస్పష్టంగా ఉన్న (ముతషాబిహాత్‌) విషయాలను విశ్వసిస్తారు, అర్థం కాని విషయాలను గురించి విద్వాంసులను అడిగి తెలుసుకుంటారు.
5) అందలి ఒక్కొక్క విషయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. పఠించవలసిన రీతిలో పఠిస్తారన్న వాక్యంలో ఇన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. వీటన్నింటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నవారికే దేవుని మార్గదర్శకత్వం ప్రాప్తిస్తుంది”.

3. అర్థం చేసుకోవటం:

ఖుర్‌ఆన్‌ యొక్క మూడవ హక్కు ఏమిటంటే మనం ఖుర్‌ఆన్‌ను ఎంతో శ్రద్ధతో అధ్యయనం చేయాలి. దీని వాక్యాలపై మనం చింతన చేయాలి. ఈ అధ్యయనం కూడా మంచి సంకల్పంతో, ఏ విధంగా సహాబాలు దైవ ప్రవక్తల (అ) ప్రవచనాల ఆధారంగా చేశారో అదే విధంగా చేయాలి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి ధరావగాహనను పెంపొందించుకోవాలి”. (తౌబా: 122)
ధర్మజ్ఞానాన్ని ఆర్జించాలని ఈ ఆయతు నొక్కి చెబుతోంది. దాని పద్ధతిని గురించి వివరిస్తోంది. అదేమిటంటే, ధర్మ విద్య కోసం ప్రతి పెద్ద జన సమూహం నుంచి, ప్రతి తెగ నుంచి కొంత మంది ఇల్లూవాకిలిని వదలి జ్ఞాన పీఠాలకు, ధార్మిక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి. ధర్మజ్ఞానానికి సంబంధించిన వివిధ విభాగాలలో పాండిత్యాన్ని సంపాదించుకోవాలి.
సృష్టికర్త అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”(మేము వారిని) స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ, (పంపి ఉన్నాము. అలాగే) ప్రజల వరకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము”. (అన్‌ నహ్ల్‌ా: 44)
”ఏమిటీ, వారు ఖుర్‌ఆన్‌ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్‌ా తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనబడేది”. (అన్నిసా: 84) ”ఏమిటి, వారు ఈ ఖుర్‌ఆన్‌ గురించి లోతుగా ఆలోచించరా? లేదా వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?”(ముహమ్మద్‌: 24)

4. ఆచరించటం:

ఖుర్‌ఆన్‌ను విశ్వసించి, అధ్యయనం చేసిన తరువాత దాని ప్రకారం ఆచరించాలి. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌ను కేవలం పఠించడానికే పంపలేదు. గతంలో అల్లాహ్‌ా యూదులపై తౌరాత్‌ గ్రంథాన్ని అవతరింపజేశాడు. కాని వారు తదనుగుణంగా ఆచరించలేదు. వారు ఆ గ్రంథాన్ని తాము చదివినట్లు, కంఠస్థం చేసుకున్నట్లు లోకాన్ని నమ్మబలికారు. దాన్ని అర్థం చేసుకోవడంగానీ, దానికనుగుణంగా ఆచరించటంగానీ చేయలేదు. ప్రస్తుతం ముస్లింలు
చేసేదీ అదే. కొన్ని విషయాలలో వారికంటే మించిపోయారు. కొందరు ఖుర్‌ఆన్‌ను కేవలం పఠిస్తున్నారు. కొందరు దీన్ని మహిమాన్వితంగా, సమృద్ధి ఒసగేదిగా భావించి పట్టు వస్త్రాల్లో చుట్టి ఎత్తైన అటకలపై భద్రపరుస్తున్నారే తప్ప దాన్ని అర్థం చేసుకునేందుకుగానీ, అమలుపర్చెందుకుగానీ ప్రయత్నించడం లేదు.

మరికొందరైతే తమ పిల్లల్ని ఖుర్‌ఆన్‌ చూచి చదవడం నేర్పించి, ఇక తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. కొందరైతే ఈ పవిత్ర గ్రంథాన్ని ముట్టనయినా ముట్టరు. కిరాయి జనాన్ని పిలిపించి ఇండ్లలో, దుకాణాలలో ‘బర్‌కత్‌’ (శుభం) కోసం డబ్బిచ్చి చదివిస్తున్నారు. కొందరు ఖుర్‌ఆన్‌ ఆయతులను తాయత్తులుగా కట్టి మెడలో వేసుకుంటున్నారు. కొందరు ఈ పవిత్ర గ్రంథాన్ని తమ వ్యక్తిగత తగాదాలలో ‘ప్రమాణం’ లేక ‘సాక్ష్యం’ కొరకు ఉపయోగిస్తున్నారు.
తౌరాత్‌ గ్రంథాన్ని ఆచరించని యూదుల గురించి అల్లాహ్‌ా ఇలా తెలియజేశాడు: ”తౌరాత్‌ గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ, దానికి అనుగుణంగా ఆచరించనివారి ఉపమానం ఎన్నో గ్రంథాలు (వీపుపై) మోపబడిన గాడిద లాంటిది. అల్ల్లాహ్‌ా వాక్యాలను ధిక్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గ జనులకు అల్లాహ్‌ా సన్మార్గం చూపడు”. (అల్‌ జుముఅహ్‌ా: 5)

ఆచరణ లోపించిన యూదులను పుస్తకాలు మోసే గాడిదతో పోల్చడం జరిగింది. అయితే ఈ ఉపమానం దివ్య ఖుర్‌ఆన్‌ను చదివి, దాన్ని కంఠస్థం చేసుకుని, దాని అర్థాన్ని ఆకళింపు చేసుకుని తదనుగుణంగా ఆచరించని ముస్లింలకు కూడా వర్తిస్తుంది.

అనారోగ్యానికి గురి అయిన వారు డాక్టరు దగ్గరకు పోయి చెకప్‌ చేయించుకుంటారు. డాక్టరు చెకప్‌ చేసి చీటిలో మందులు రాసిస్తాడు. మందులు తీసుకోకుండా కేవలం ఆ మందుల చీటిని పఠిస్తే రోగం నయం అవుతుందా? కాదు కదా! లక్ష సార్లు పఠించినా ప్రయోజనం ఉండదు. మందుల షాపుకు పోయి మందులు కొని డాక్టరు సూచించిన విధంగా మందు వాడనంతవరకు జబ్బు నయం కాదు. అదే విధంగా ఇహలోకంలో మనశ్శాంతి, తృప్తి, సుఖం, సంపాదనలో శుభం, జీవితంలో సంతోషం, పరలోకంలో శాశ్వత సాఫల్యం లభించాలంటే ఆచరణా సంకల్పంతో ఖుర్‌ఆన్‌ని పఠించాలి. అప్పుడే దాని ద్వారా మనం ప్రయోజనం పొందగలం.
5. ఖుర్‌ఆన్‌ సందేశాన్ని అందజేయటం:
ఖుర్‌ఆన్‌ ఆజ్ఞల్ని దైవ దాసులందరికీ అందించాలి. ఇది ముస్లింల ముఖ్య కర్తవ్యం. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవవుతావు. అల్ల్లాహ్‌ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ా తిరస్కారులకు సన్మార్గం చూపడు”. (అల్‌ మాయిదా: 67)
అంతిమ దైవప్రవక్త (స) తర్వాత ఈ బాధ్యత మనపై ఉంది. ”బల్లిగూ అన్నీ వలౌ ఆయహ్‌”’ (నా తరఫు నుంచి మీకు ఒక్క ఆయత్‌ తెలిసినా దాన్ని మీరు వేరే వారి వరకు అందజేయండి” అని దైవప్రవక్త (స) ప్రవచించారు.

 

Related Post