అనుపమ మాస పత్రిక సౌజన్యంతో
సృష్టి మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల ఎన్నో లక్షల గ్రంథాలు లిఖించబడ్డాయి. కాని అన్ని గ్రంథాలు కూడా కొన్ని ప్రాంతాలనుబట్టో, భాషలనుబట్టో, మతాలనుబట్టో, కొన్ని వర్గాలకు అనుకూలంగానో ఉన్నాయి. ఇవి కొన్ని జాతులకు, తెగలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కాని ప్రపంచంలో కేవలం ఒకే ఒక గ్రంథం సర్వమానవాళి కోసం అవతరించి, అందరికీ ఆచరణప్రాయంగా, ప్రపంచం అన్ని దిశలలో ప్రతి క్షణం కూడా చదువబడుతున్న గ్రంథం దివ్య ఖుర్‌ఆన్ మాత్రమే.
ఎందరో తత్వవేత్తలు, చరిత్రకారులు, సామాజికవేత్తలు, ప్రముఖులు ఈ గ్రంథాన్ని అద్వితీయమైన గ్రంథంగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఈ గ్రంథాన్ని అత్యుత్తమంగా ప్రథమస్థానం ఇచ్చారు. సృష్టి ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసినట్లుగా ఏ గ్రంథం కూడా కంఠస్తం చేయబడలేదు. సృష్టి అంతం వరకు కూడా కంఠస్తం చేయబడుతూ ఉంటుంది.
ఖుర్‌ఆన్ దైవవాక్కు
దివ్య ఖుర్‌ఆన్ వివిధ రకాల అంశా లపై తనదంటూ విశిష్ఠ శైలి కలిగిన గొప్ప గ్రంథం. దీని మొట్ట మొదటి విశిష్ఠత ఇది సర్వేశ్వరుని వాక్కు కావడం. ‘‘ఇది సర్వలోకాల ప్రభువు తరఫున అవతరిం చింది.’’ (ఖుర్‌ఆన్ 56 : 80). ‘‘ఈ ఖుర్‌ఆన్ అల్లాప్‌ా వహీ ద్వారా కాకుండా ఇతరుల ప్రమేయంతో చేయ బడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్నవాటిని (అవతరించిన గ్రంథాలను) ధ్రువీకరించింది. ఇంకా ఈ గ్రంథం మౌలిక ఆదేశాలను విపులీకరిం చింది. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహా నికి ఆస్కారమే లేదు. (10 : 37)
ఖుర్‌ఆన్ గురించి అవిశ్వాసులు ఇది ప్రవక్త ముహమ్మద్ (స) వారి కవిత్వమే కాని దైవవాక్కు కాదు అన్నప్పుడు, దీని లాంటి ఒక్క ఆయతునైనా రాయగల రేమో ప్రయత్నించండి అని సవాలు విసరగల ధైర్యం విశ్వ ప్రభువునకు తప్ప ఎవరికి ఉంటుంది? ‘‘ఇతను దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) స్వయంగా కల్పించుకున్నా డని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, వీళ్ళు విశ్వసించటం లేదు. సరే, ఒకవేళ వారు (ఈ ఆరోపణలో) సత్య వంతులే అయితే దీన్ని పోలిన ఒక్క వాక్కునయినాసరే చేసి తీసుకురావాలి.’’ ఇలాంటి సవాలు విసరడం మానవ మాత్రులకు అసాధ్యం.
కేవలం దీని వాక్కులను గురించి కాకుండా దీని పరిరక్షణ బాధ్యత కూడా తనదేనని విశ్వ ప్రభువు ప్రకటించాడు. ‘‘మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింప జేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.’’ (15 : 9). ఇది పరాత్పరుని పరిరక్షణలో ఉందనడానికి సాక్ష్యం ఇది గత 1400 సంవత్సరాలుగా ఒక్క అక్షరం పొల్లు కూడా తప్పలేదు. ఎలా అయితే అవతరిం చబడిరదో అలాగే ఉండటం దీని మరొక విశిష్ఠత.
ఖుర్‌ఆన్ రచనా శైలి
ఖుర్‌ఆన్ అరబీ భాషలో ఆవిర్భవిం చింది. అరబీ భాష ప్రపంచంలోకెల్లా అత్యంత తేటమైన భాష. అదీగాక ఖుర్‌ఆన్ అరబ్ దేశంలో అవతరించడం వలన కూడా ఇది అరబీ భాషలోనే ఆవిర్భ వించింది. ప్రపంచంలో ఎన్నో భాషలు కాలాంతరంలో మార్పు చెందుతూ వచ్చాయి. కాని అరబీ భాషలో 1400 సంవత్సరాలుగా మార్పు రాలేదు. అంతేకాక ఖుర్‌ఆన్ రచన శైలి ఒక విశిష్ఠ తను కలిగి ఉంది. ఈ శైలి కూడా ఇది దైవవాణి అనడానికి ఒక ఉదాహరణ. ఖుర్‌ఆన్ మరియు హదీసు రెండు మనకు ముహమ్మద్ ప్రవక్త (స) నుండి లభించినవే. కాని ఖుర్‌ఆన్‌కు హదీసు రెంటి మధ్య వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. ఖుర్‌ఆన్ పద్యగద్యాల సమ్మే ళనం. దీనిని పఠించే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. పద్యరచన, కవితలలో ప్రత్యేకత కలిగిన అరబ్బులకు ఇది ఒక పెద్ద సవాలు కూడా. దీనిలాంటి శ్రావ్య మైన పద్యశైలి మళ్ళీ అంతలోనే గద్యం మేళవింపు వారిని ఒక ఆశ్చర్యకరమైన గ్రంథంగా ఆకట్టుకుంది. చదవడం, వ్రాయడం రాని నిరక్షరాస్యుడైన ప్రవక్తకు ఖుర్‌ఆన్ వంటి గ్రంథాన్ని లిఖించడం అసాధ్యం. ఇది దైవగ్రంథం అనడానికి ఇది కూడా ఒక నిదర్శనమే.
ఖుర్‌ఆన్ అవతరించిన విధానం
ఖుర్‌ఆన్ మొత్తం కొద్దికొద్దిగా 23 సంవత్స రాలలో అవతరించింది. ఇందులో ఎక్కువగా అంటే 2/3వ వంతు మక్కాలో అవతరించింది. 1/3వ వంతు మదీనాలో అవతరించింది. మనిషి అంతర్మథనానికి దేవుడి సమాధానంలాగా సందర్భోచితంగా దైవవాణి వచ్చింది. మొదట మక్కాలో అవతరించిన 2/3వ వంతు ఖుర్‌ఆన్‌లో దేవుని ఏకత్వం, నమాజ్, అగోచరమైన స్వర్గం, నరకం, ప్రళయదినం గురించి ఎక్కువగా వివరించడం జరిగింది. ఇంకా దేవుని అస్థిత్వం, విశ్వాసం, విశ్వాసి గుణ గణాలను చిన్న చిన్న సూరాలుగా అవత రించినవి. ఇంకా మక్కాలో ఆవిర్భవించిన సూరాలలో ఎక్కువగా సహన స్థైర్యాల గురించే నేర్పించడం జరిగింది. ఆ తరు వాత ఆవిర్భవించిన మదీనా సూరాలలో 1/3వ వంతు షరిఅత్ గురించి, ఇతర ఆరాధనలైన హజ్, ఉమ్‌రా, జిహాద్‌ల గురించి, గతంలోని గ్రంథవహుల గురించి వివరించడం జరిగింది. మదీనాలో అవతరించిన సూరాలు పెద్దవిగా ఉన్నాయి. ఈ సూరాలలో మనిషి సామాజిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన అన్ని అంశాలను ఈ గ్రంథం వివరిస్తుంది.
ఖుర్‌ఆన్ ఇతివృత్తం
సృష్టిలో అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దాని నిర్మాణంలో ఒక ఆశయం ఉంది. అలానే ఖుర్‌ఆన్‌కు కూడా ఇతివృత్తం ఉంది. దీని ఇతివృత్తం మానవుడు. మానవుణ్ణి తన ప్రతినిధిగా నియమించినప్పుడే అతడు తనతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో అతి స్పష్టంగా తెలియజేశాడు విశ్వప్రభువు. నేను మానవుల్ని, జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యం తోనూ పుట్టించలేదు (51 : 56, 58). ఈ ఆయత్ మానవ పుట్టుక లక్ష్యాన్ని, మాన వుని అసలు కర్తవ్యాన్ని వివరించింది. మనిషి పుట్టుక పరమార్థాన్ని తెలియ జేస్తుంది. అలా అని మనిషిని సన్యాసిలా కేవలం తనను ఆరాధించడమే జీవితంగా కూడా గడప కూడదని వివరించింది. మనిషి సంఘజీవిగా ఉంటూనే తన దైనం దిన జీవితంలో ఆ సర్వేశ్వరుణ్ణి అనుక్షణం ఆరాధిస్తూ, ధ్యానిస్తూ ఉండాలి. ఇదీ మనిషి జీవిత ఆశయం, లక్ష్యం, ఖుర్‌ఆన్ దాని ఇతివృత్తం నుండి, ఆశయం నుండి ఇసుమంతయినా తొలగలేదు. ఖుర్‌ఆన్ లోని అనేక ఉప విషయాలు తొలి నుంచి తుది వరకు దాని ప్రధాన విషయంతో పెనవేసుకుని ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మానవుణ్ణి సత్యమార్గంలో నడిపిస్తున్నాయి. మనిషిని తన లక్ష్యం వైపు మరలమని వేగిరపరుస్తున్నాయి కొన్ని విషయాలు.
ఖుర్‌ఆన్ ప్రస్తావించే ఉప విషయాలు
ఖుర్‌ఆన్ ఆధ్యాత్మికంగా ఆచరిం చవలసిన అంశాలను ఈ విషయాలతో వివరి స్తుంది. ఇస్లాం సనాతన ధర్మం, మరణా నంతర జీవితం, ప్రళయదినం, స్వర్గసీమ, నరకకూపం, మనిషి కర్మలు, పాప పుణ్యాలు, కష్టసుఖాలు, దైవ పరీక్షలు, మిథ్యా దైవాలు, ఆరాధనలు, దాన ధర్మాలు, ఉపవాస వ్రతాలు, హజ్ యాత్ర, మనిషి ధర్మసమ్మతమైనవి, ధర్మ సమ్మతం కానివి ఇలాంటి ఉపదేశాలు అన్నీ మనిషి ప్రత్యేకంగా ఆచరించి తన నిజదైవం వైపు మరలడానికి ఉపకరి స్తాయి. ఇక సామాజికంగా ఆచరించవలసి నవి ఖుర్‌ఆన్ విశదపరచిన అంశాలు చూద్దాం.
నీతి శాస్త్రం
దీనిలో అహంకారం, అసత్యం, వాగ్దానం, ఒప్పందం, ప్రతిజ్ఞ, ప్రమా ణాలు, న్యాయం, సాక్ష్యం, నిజా యితీ, అపనిందలు, చాడీలు, పనికి మాలిన మాటలు, దుబారా ఖర్చు, మద్యం, జూదం, అశ్లీలం, వ్యభిచారం, అసూయాద్వేషాలు, అనుమానాలు, వదం తులు, గుసగుసలు, హత్య, ప్రతీకారం, రక్తపరిహారం, క్షమాపణ, పశ్చాత్తాపం, క్షమావర్తనం, సేవాదృక్పథం, దైవభీతి, సహనం, స్థిరత్వం, దైవంపై భారం, మంచిని పెంపొందిచడం, చెడును త్రుంచివేయడం, ముస్లిమేతరుల పట్ల ప్రవర్తన, సమానత్వం వంటి అనేక విషయాలలో మనిషికి ఆమోదయోగ్య మైన విషయాలను వివరిస్తుంది.
‘‘విశ్వాసులారా! దేవుని కోసం నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటూ, న్యాయమైన సాక్ష్యం ఇవ్వండి. ఇతరుల పట్ల విరోధం ఉన్నాసరే, మీరు న్యాయా నికి తిలోదకాలు ఇవ్వకూడదు. ఎల్ల ప్పుడూ న్యాయంగానే వ్యవహరిం చాలి. దైవభీతి పరాయణత అంటే అదే. ప్రతి విషయంలోనూ దేవుని పట్ల భయ భక్తు లతో మసలుకోవాలి.’’ (5 : 8) ఆచరణ ఏదైనా అందులో కూడా దైవభీతి కలిగి ఉండటమే మనిషి జీవిత పరమార్థం.
సామాజిక జీవితం
రక్త సంబంధీకు లతో ఏర్పడే సహజ బాంధవ్యాలను ఏ విధంగా నెరవేర్చాలో, దీనివల్ల కూడా జీవితం ఏ విధంగా సాఫల్యం వైపు మరల్చుకోవాలో ఖుర్‌ఆన్‌లో విశ్వప్రభువు తెలియజేశాడు. దీనిలో వివాహబంధం, దాంపత్య జీవితం, పరదా వ్యవస్థ, సభ్యతా సంస్కృతులు, విడాకులు, తల్లిదండ్రుల హక్కులు, బంధువుల హక్కులు, స్త్రీల హక్కులు, బాధ్యతలు, దైవప్రవక్త (స) కుటుంబ జీవితం, ముస్లింల పరస్పర సంబంధాలను గురించి విశదపరుస్తుంది. సమాజంలో చట్టపరంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంతపటిష్ఠంగాఉంటాయో మనం నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాము. అందుకే బాంధవ్యాల వల్ల మనిషి తన సాఫల్యాన్ని మర్చిపోకూడదనే వాటిని నెరవేర్చే పద్ధతి కూడా మానవులకు తెలియజేశాడు.
‘‘తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి. మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని ‘ఉఫ్’ అని కూడా విసుక్కోకండి. కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి. వారితో గౌర వంగా మాట్లాడకండి. దయార్ద్ర హృద యంతో వినయంతో వారి ముందు తలవంచి ఉండండి. ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచిపోషించారో అలా నీవు వీరిని కరుణించు అని ప్రార్థించండి. (17 : 23, 24).
‘‘తల్లిదండ్రులు ఇతర బంధువులు వదలిన ఆస్తి కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా అందులో పురుషులకూ వాటా ఉంది. స్త్రీలకు వాటా ఉంది. ఇవి (దైవ) నిర్ణీత వాటాలు. వాటిని తగ్గించటానికి లేదా పెంచటానికి ఎవరికీ అధికారం లేదు. (4: 7). ఈ విధంగా మనిషికి బాంధ వ్యాల దగ్గర నుండి ఆస్తుల వరకు అన్నింట ఆచరణీయమైన పద్ధతులను, నిబంధనలను తెలియజేశాడు. వీటి హద్దులు మీరితే నష్టం మనిషికే.
ఆర్థిక విధానం
ఏ సమాజానికైనా ఆర్థిక వ్యవస్త వెన్నెముక లాంటిది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా లేకపోతే ఆ సమాజ మనుగడ కష్టం. అందువల్లనే ఖుర్‌ఆన్ ఉపాధి, జకాత్, ఆస్తి పంపకం, వీలునామా, స్త్రీధనం, అనాథల సొమ్ము, అక్రమ సంపాదన, వడ్డీ, అప్పు, వ్యాపారం, సమరసొత్తు, ధన వికేంద్రీకరణ, ఆర్థిక వనరుల వినియోగం, దానధర్మాలు, వ్యాపారం ధర్మబద్ధంగా ఉండాలని ఖుర్‌ఆన్ ఆంక్షలు పెట్టింది.
‘‘తూనికల్లో, కొలతల్లో న్యాయం పాటించండి. ఎవరికీ నష్టం కలిగించకండి. సరైన త్రాసుతో తూచివ్వండి. ప్రజలకు న్యాయంగా రావలసిన వస్తువులు తగ్గించి ఇవ్వకండి.’’ (26 : 181, 182)
‘‘దుబారా ఖర్చు చేయకండి. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులుగా పరిగణించబడతారు.’’ (17 : 26, 27) అంతేకాక దానధర్మాలను ప్రోత్సహించి, జకాత్ వల్ల పేదరికాన్ని అరికట్టే మార్గా లను ఖుర్‌ఆన్ సూచిస్తుంది. వడ్డీవలన ఆర్థిక విధానం కుంటుపడుతుందని 1400 సంవత్సరాలకు పూర్వం ఇస్లాం వివరించింది. దాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. కొన్ని ముస్లిమేతర దేశాలు కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అవలంబించడానికి సన్నాహాలు చేస్తు న్నాయి.
రాజకీయ విధానం
మనిషి వ్యక్తిగత జీవితం నుండి సామాజిక జీవితం తరు వాత రాజకీయ జీవితం ఇవన్నీ కూడా మనిషి కట్టు దిట్టంతో జీవితం సాగించ డానికి చాలా అవసరం. దేవుని సార్వ భౌమత్వం, పరిపాలన, సంస్కరణలు, రాజలక్ష్యం, మానవ ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ, మానవుని స్థాయి, తిరుగు లేని చట్టాలు, పాలకులు, అధికారులు, సలహా మండలి, విదేశాంగ నీతి గురించి కొన్ని ఆదేశాలను ఖుర్‌ఆన్ ఇచ్చింది. ‘‘విశ్వాసు లారా! ఇక నుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించ డానికి రంగంలోకి తీసుకు రాబడిన శ్రేష్ఠ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు.’’ (3 : 110)
విజ్ఞాన శాస్త్రం (సైన్స్)
మొదటి నుండి కూడా మానవులు జ్ఞానానికి తర్కానికి కాకుండా అద్భుతా లకు ఎక్కువ ప్రాము ఖ్యత నిచ్చారు. అందుకే మానవుని నాడి తెలిసిన విశ్వేశ్వరుడు, సకల చరాచర సృష్టికర్త అయిన విశ్వప్రభువు మనిషిని అబ్బుర పరిచే విధంగా ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌగోళికశాస్త్రం, భూ విజ్ఞాన శాస్త్రం, సాగర విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, పిండోత్పత్తిశాస్త్రం, సాధారణ విజ్ఞాన శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాల నుండి కూడా మానవ మేథకు తెలియని ఎన్నో విషయాలను బోధించింది ఖుర్‌ఆన్. అందువల్లనే ఇస్లాం ధర్మం ప్రబలిన తరువాతనే ప్రపంచంలో సైన్స్ మరియు ఫిజిక్స్ అభివృద్ధి చెందాయి. ఎన్నో రకాల పరిశోధనలకు ఖుర్‌ఆన్ దోహదపడిరది. ఖుర్‌ఆన్ సైన్స్ పుస్తకం కాదు. కాని సైన్స్ గురించి ఆయత్‌లున్న పుస్తకం. ఖుర్‌ఆన్‌లో 6000కు పైగా ఆయత్‌లు ఉంటే, అందులో వెయ్యికి పైగా ఆయత్‌లు సైన్స్‌కు సంబంధించినవే.
సృష్టి ఆవిర్భావానికి సంబంధించిన బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని ధ్రువపరుస్తుంది ఖుర్‌ఆన్. అలాగే భూమి యొక్క ఆకారం గురించి, చంద్రుని యొక్క పరావర్తన కాంతిని గురించి, సూర్యుని భ్రమణం గురించి, వాటర్ సైకిల్ గురించి, పర్వ తాలు భూమిలో నాటబడిన పద్ధతి గురించి, సాగరాల లోతు, వాటి స్వరూపం గురించి, వాటిలోని సంపద గురించి ఆధునిక ప్రపంచానికి అంతుచిక్కని ఎన్నో అంశాలను ఖుర్‌ఆన్ ధ్రువీకరిస్తుంది. మానవ పిండోత్పత్తి దశలకు సంబంధిం చిన విషయాలో ఎన్నో 1400 సంవత్స రాలకు క్రితమే ఖుర్‌ఆన్ వివరించింది. ప్రతి వ్యక్తి వేలిముద్రలు కూడా వేరుగా ఉంటాయని పేర్కొంది. శరీరంలోని భాగా లను చూడగలిగేంత టెక్నాలజీ లేని కాలంలో 1400 సంవత్సరాల క్రితమే మొదటి దశలో పిండోత్పత్తి ఏ రకంగా ఉంటుందనేది వివరించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఇంకా చర్మంలో నొప్పిని గ్రహించే భాగాలు ఉన్నాయని తెలియజేసింది. ఇలా ఎన్నో విషయాలను ఖుర్‌ఆన్ వివరిస్తుంది.
ఖుర్‌ఆన్‌లో సైంటిఫిక్ (శాస్త్రీయ) వాస్తవాలుండటాన్ని కాకతాళీయమే. అవి ఆపాదిస్తే అది లోకజ్ఞానానికి విరుద్ధమే కాకుండా, నిజమైన శాస్త్రీయ మార్గాన్ని కూడా వ్యతిరేకించినట్లే. భూమిపై మనిషి ఉనికియొక్క ఉద్దేశం మరియు ప్రకృతితో సామరస్యంగా జీవించవలసిన విషయాన్ని తెలుసుకోవడానికై ఖుర్‌ఆన్‌లోని సూచ నలు మనిషిని ఆహ్వానిస్తున్నాయి. సాహి త్యానికి, కవిత్వానికి మాత్రమే సమా జంలో ఉన్నత స్థానమిచ్చిన కాలంలో ఖుర్‌ఆన్ సాహిత్యకారులకు ఒక సవాలుగా మిగిలింది. నేడు అదే స్థానంలో సైన్స్ మరియు టెక్నాలజీ సమాజాన్ని శాసిస్తున్న ఈ రోజు కూడా ఖుర్‌ఆన్ మనిషి మస్తిష్కానికి అందని ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ప్రతి మనిషి కోసం అలాగే సంఘం కోసం, సంపూర్ణ జీవిత నియమావళిని ఖుర్‌ఆన్ కలిగి ఉంది. ఖుర్‌ఆన్ ఎన్నో విషయాలను చర్చించి నప్పటికీ దాని ప్రధాన ఇతివృత్తం అయిన మనిషి జీవితానికి పెనవేసుకున్నవే అన్ని అంశాలు. ఇవన్నీ కూడా మనిషి జీవన శైలిని తన నిజదైవం, సర్వేశ్వరుడైన అల్లాప్‌ా వైపు మరలడానికి అనుకూలించే విధంగా ఏర్పరచబడినవే. జీవితమనే ఈ పరీక్షలో విజయం సాధించాలంటే, సాఫల్యాన్ని పొందాలంటే, అల్లాప్‌ా ప్రసా దించిన ఖుర్‌ఆన్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి ఆచరించినప్పుడే మనిషి, దేవుని పరీక్షలో సఫలీకృతుడవుతాడు. మరి ఎందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకు పొందేందుకు ప్రయ త్నిద్దాం. అల్లాప్‌ాకు ప్రేమపాత్రులుగా మిగిలేందుకు ప్రయత్నిద్దాం.