రమజాను ఉపవాసాలు ఆదేశాలు, నియమ నిబంధనలు

మజాను నెలలోగాని, మరేతర నెలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే,హృద యాన్ని నాస్త్తికత్వం, బహుదైవ భావన,విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపా డుకోవాలి.మనసు నిండా తౌహీద్‌ సుగం ధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలో చనలకు మన మది సుమవనంగా మారాలి. అందులో ప్రేమ పూలు, మానవత్వపు మం దారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్‌ా నామస్మరణతో అది నిత్య చైతన్యధాత్రిగా విరాజిల్లాలి.

రమజాను నెలలోగాని, మరేతర నెలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే,హృద యాన్ని నాస్త్తికత్వం, బహుదైవ భావన,విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపా డుకోవాలి.మనసు నిండా తౌహీద్‌ సుగం ధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలో చనలకు మన మది సుమవనంగా మారాలి. అందులో ప్రేమ పూలు, మానవత్వపు మందారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్‌ా నామస్మరణతో అది నిత్య చైతన్యధాత్రిగా విరాజిల్లాలి.

నెలవంక సౌజన్యంతో

రోజా: ఫర్జ్‌

రోజా(ఉపవాసం) ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై, ప్రాజ్ఞ వయస్సు వచ్చినవారిపై, ఆరోగ్యవంతులపై తప్పనిసరి చేయబడింది. ఈ రోజాలను తిరస్కరించినవాడు దైవధిక్కారి(కాఫిర్‌) అవుతాడు. ఏ కారణమూ లేకుండా రమజాన్‌ ఉపవాసాలను వదలివేసినవాడు ఘోర అపరాధానికి గురవుతాడు.
నాబాలిగ్‌ (చిన్న పిల్లల) పై ఉపవాసం తప్పనిసరికాదు. అయితే ఉపవాసం ఉండేందుకు చిన్న నాటి నుండే అలవాటు చేసుకోవటంలో తప్పు లేదు. పిల్లవాడికి 7 ఏండ్లు నిండితే నమాజ్‌ కోసం ఆజ్ఞాపించమనీ, 10 ఏండ్లు నిండిన మీదట కూడా పిల్లోడు నమాజ్‌ చేయకపోతే దండించి మరీ నమాజ్‌ చేయించాలని హదీసుల ద్వారా తెలుస్తోంది. చిన్న పిల్లల్లో ఎన్ని ఉపవాసాలు పాటించగల శక్తి ఉంటుందో అన్ని ఉపవాసాలు పాటించటం ఉత్తమం.

రోజా నుండి మినహాయింపు ఎవరికి?

ఈ క్రింద పేర్కొనబడిన వారికి ఉపవాసం నుండి మినహాయింపు లేక రాయితీ ఉంది:
(1) చిన్న పిల్లలు, బాట సారులు. అయితే ప్రయాణం వల్ల తమకు ఎలాంటి కష్టం, బాధ ఉండదు అని ప్రయాణీకులు తలపోసినప్పుడు ఉపవాసం ఉండటమే ఉత్తమం. అయితే వదలి వేయబడిన ఉపవాసాలను వారు రమజాన్‌ నెల అనంతరం పూర్తి చేసుకోవాలి.
(2) ఉపవాసం ఉండటానికి వీలుపడనంతగా వ్యాధిగ్రస్తులయినపుడు, ఉపవాసం పాటించటం వలన వ్యాధి మరింత తీవ్రతరమవుతుందన్న భయం ఉన్నప్పుడు. అయితే ఆరోగ్యం చేకూరిన తరువాత వీరు వదలి వేయబడిన ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి.
(3) వృద్ధాప్యం మరీ ఎక్కువయినప్పుడు, అయితే ఇలాంటి వారు స్తోమత ఉంటే ‘ఫిదియా'(పరిహారం) ఇవ్వాలి. అంటే; ఒక ఉపవాసానికి బదులుగా ఉదయం, సాయంత్రం ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి.
(4) గర్భవతులకు ఉపవాసం నుండి మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండటం మూలాన తనకు ప్రమాదం ఉందని ఆ గర్భవతి తలపోసినపుడు ఉపవాసం వదలివేయవచ్చు.
(5) బాలింతలు- ఉపవాసం పాటించటం వలన తనకు, తన పసికందుకు నష్టం వాటిల్లుతుందని భావించినప్పుడు. అయితే రమజాన్‌ తర్వాత ఆమె ఆ ఉపవాసాలను ఖజా చేసుకోవాలి.
(6) తాము ఇక ఉపవాసాన్ని కొనసాగిస్తే ఆకలి దప్పులకు తాళలేక చనిపోతాం అన్న సందేహం వచ్చేసినపుడు.
(7) మతి స్థిమితం లేనపుడు.
(8) రుతుస్రావం (హైజ్‌), పురిటి రక్త స్రావం(నిఫాస్‌)కు లోనై వున్న స్త్రీలు ఉపవాసం పాటించరాదు.

ఉపవాస సంకల్పం

ఉపవాసం కోసం సంకల్పం చేసుకోవటం అవసరం. సంకల్పం చేసుకోకుండా వేకువ జాము మొదలుకుని సూర్యాస్తమయం వరకు ఆకలి దప్పులతో బాధపడినంత మాత్రాన ఉపవాస వ్రతం పూర్తి కానేరాదు. రాత్రి గాని, ఉషోదయానికి ముందుగాని సంకల్పం చేసుకోవాలి. ఒక వేళ మరచిపోతే ఉదయం 11 గంటలలోపు తప్పకుండా సంకల్పం చేసుకోవచ్చు. సంకల్పం అంటే మనసులో తలచుకోవటమే. నోటితో పలకాలన్న నిబంధన ఏదీ లేదు.

ఇఫ్తార్‌ : దుఆ

”అల్లాహుమ్మ లక సుమ్తు వఅలా రిజ్ఖిక అఫ్‌తర్‌తు”
( ఓ అల్లాహ్‌! నేను నీ కోసం ఉపవాసం పాటించాను. నీవిచ్చిన ఆహారంతోనే ఇఫ్తార్‌ చేస్తున్నాను.)
రోజా: పుణ్యప్రదమయిన అంశాలు
(1) ఉపవాసులు ”సహ్‌రీ” భుజించటం అవసరం. అంటే తెల్లవారు జామున ఏదన్నా తినాలి. ఆకలి లేకపోతే కొద్దిగానయినా తినాలి, త్రాగాలి.
(2) ఉపవాసం పాటించబోతున్నానని రాత్రి నుండే సంకల్పం చేసుకోవటం మంచిది.
(3) సహ్‌ారీ చేయటంలో నింపాదిగా వ్యవహరించాలి. ఆఖరి
క్షణం వరకు సహ్‌ారీ భుజించాలి. అయితే ఉషోదయానికి పూర్వమే
సహ్‌రీని ముగించాలి.
(4) ఇఫ్తార్‌ చేయటంలో (ఉపవాసం విరమించటంలో) త్వరపడాలి. అంటే సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఆలస్యం చేయరాదు.
(5) ఉపవాసి చాడీలు, అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త పడాలి, బూతుమాటలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలి.
(6) దానధర్మాలు విస్త ృతంగా చేయాలి. రోజేదార్‌లు దివ్యఖుర్‌ఆన్‌ను వీలయినంత ఎక్కువగా పారాయణం చేయాలనీ, దైవాన్ని సాధ్యమయినంత అధికంగా స్మరించాలని, దరూద్‌ పంపుతూ ఉండాలనీ, హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.
(7) ఖర్జూరంతో ఇఫ్తార్‌ చేయటం, ఖర్జూరం లేని పక్షంలో మంచి నీళ్ళతో ఇఫ్తార్‌ చేయటం పుణ్యప్రదం.

ఉపవాసంలో మక్రూహ్‌లు (అయిష్టకరమైన అంశాలు)

ఉపవాసం పాటించేవారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. వీటికి వారు దూరంగా ఉండకపోతే రోజా(ఉపవాసం) మక్రూహ్‌ అవుతుంది. అంటే; పుణ్యఫలం కొంత తగ్గిపోతుంది. అవి ఏమంటే;
(1) ఏదయినా నోటిలో వేసుకుని నమలటం.
(2) ఏదయినా వస్తువు రుచి చూడటం (అయితే ఒక వేళ భర్త కోపిష్టి అయినపుడు, తాను వండిన కూరలో ఉప్పు లేదన్న సాకుతో భర్త హింసిస్తాడన్న భయం ఉన్నప్పుడు, నాలుక కొనతో కూర రుచి చూడటానికి భార్యకు అనుమతి ఉంది.)
(3) మల మూత్ర విసర్జన సమయంలో కాళ్ళను మరీ ఎక్కువగా చాపి కూర్చోవటం.
(4) వుజూ చేసేటప్పుడు-ముఖ్యంగా పుక్కిలించేటప్పుడు, ముక్కులో నీటిని పీల్చేటప్పుడు మితిమీరి వ్యవహరించటం.
(5) చాడీలు చెప్పటం, అబద్ధాలు పలకటం, తిట్టడం మొదలగు చేష్టలవలన.
(6) ఉపవాసం వలన బాధ కలిగిందన్న భావాన్ని ప్రదర్శించటం.
(7) స్నానం (గుసుల్‌) చేయవలసిన అనివార్య పరిస్థితి గనక ఏర్పడితే, తెల్లవారాక చేద్దామని ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేయటం.

 

ఎట్టి పరిస్థితుల్లో రోజా మక్రూహ్‌ కాదు?

క్రింద పేర్కొనబడిన పనుల వలన రోజేదారు (ఉపవాసి) ‘రోజా’కు
ఎలాంటి దోషం గాని, లోపంగానీ రాదు. ‘రోజా’ భంగం అయ్యే ప్రశ్నే తలెత్తలేదు అవి ఏమిటంటే;
(1) సుర్మా (ఇది కంటి చలువకోసం పూసుకునే ఒక ప్రత్యేకమయిన పొడి) పూసుకోవటం వలన,
(2) వంటిపై నూనె రాసి తోముకోవటం వలన,
(3) చల్లదనం కోసం స్నానం చేయటం వలన, తలపై నీళ్ళు పోసుకోవటం వలన,
(4) మిస్వాక్‌ చేయటం వలన,
(5) సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం లేక వాసన చూడటం వలన,
(6) మరచిపోయి-పొరబాటున-ఏదన్నా తినటం, త్రాగటం వలన
(7) మన ప్రమేయం లేకుండా- దానంతట అదే వాంతి అయిపోవటం వలన.
(8) నోటిలోని ఉమ్మి గొంతులోకి దిగిపోవటం వలన.
(9) ఉపవాసం ఉన్నప్పుడు, భార్యను ముద్దు పెట్టుకునే అనుమతి కూడా ఉంది. అయితే కోర్కెలు, భావోద్రేకాలను రెచ్చగొట్టరాదన్నది షరతు.
(10) ఉపవాస స్థితిలో వైద్య అవసరాల దృష్ట్యా శరీరం నుండి రక్తం తీయటానికి కూడా అనుమతి ఉంది.
(11) పగటి పూట, ఎలాంటి ఉద్రేకం లేకుండానే వీర్యస్ఖలనం
జరిగితే ఉపవాసానికి ఎలాంటి ప్రమాదం లేదు.

ఉపవాసం భంగమయ్యే పరిస్థితులు

తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే తప్ప ఉపవాసాన్ని భంగపరచటం మహాపాపం. ఉపవాసం భంగమయ్యే పరిస్థితులు రెండు: (1) కొన్ని పరిస్థితుల్లో భంగమయిన ఉపవాసానికి బదులుగా మరో ఉపవాసం ఉంటే (అంటే, ఖజా రోజాను పాటిస్తే) సరిపోతుంది. (2) కొన్ని పరిస్థితుల్లోనయితే, ఉపవాసాన్ని భంగపరచినందుకుగాను ఆ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవటంతో పాటు కఫ్ఫారా కూడా చెల్లించవలసి ఉంటుంది. పరిహారంగా 2 నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసం పాటించాలి. అలా కాకపోతే 60 మంది బీదవారికి 2 పూటలు కడుపునిండా అన్నం పెట్టాలి. లేక ఒక బానిసకు విముక్తి నొసగాలి.

ఖజా మరియు మూల్యం చెల్లించవలసిన పరిస్థితులు:

1. ఉపవాసం ఉండీ ఉద్దేశ్యపూర్వకంగా ఆహారం లేక పానీయాన్ని సేవించటం వలన.
(2) తెలిసీ సంభోగం చేయటం వలన.

Related Post