సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (స)

Osteospermum_Flower_Power_Spider_Purple_2134px

మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ

 

ఫుజ్జార్‌ పోరాటం

ముహమ్మద్‌ (స) 15వ ఏట ఖురైషీలకు ఇతర అరబ్బు తెగలకు మధ్య ‘హర్బుల్‌ ఫుజ్జార్‌’ (ఫుజ్జార్‌ పోరాటం) జరిగింది. పవిత్ర మాసాల్లో, పవిత్ర స్థలాల్లో కొన్ని అఘా¦యిత్యాలకు పాల్పడటం వల్ల ఈ పోరాటాన్ని హర్బుల్‌ ఫుజ్జార్‌ (వాటి పవిత్రతను విచ్ఛిన్నపరచిన  పోరు)గా నామకరణం చేెశారు. ఖురైష్‌ పక్షాన న్యాయం ఉండటం మూలాన ప్రవక్త (స) కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. బాణాలను సేకరించి తన చిన్నాన్న, వెదనాన్నలకు అందించటం ఆయన పని.

ఫుజూల్‌ ఒప్పందం (హిల్ఫుల్‌ ఫుజూల్‌)

ఈ యుద్ధానంతరం ‘హిల్ఫుల్‌ ఫుజూల్‌’ జరిగింది. ఖురైష్‌ వంశానికి చెందిన బనూ హాషిమ్‌, బనూ అసద్‌, బనూ జుహ్రా మొదలగు తెగలవారు ఈ సందర్భంగా ఏక మయ్యారు. ”మక్కాలో ఎక్కడైనా, ఎవ్వరైనా బాధించబడితే మేము అతన్ని ఆదుకుంటాము. అతనికి చెందాల్సిన హక్కుని అతనికి ఇవ్పిస్తాము” అని వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒప్పందంలో ప్రవక్త (స) కూడా పాల్గొన్నారు. అల్లాహ్  తనకు దైవ దౌత్య సౌభాగ్యాన్ని ప్రసాదించిన తర్వాత కూడా తరచూ ఇలా అభిప్రాయపడుతుండేవారు: ”నేను అబ్దుల్లాహ్  బిన్‌ జద్‌ఆన్‌ ఇంట్లో ఓ ఒప్పందంలో పాల్గొన్నాను. ఆ ఒప్పందానికి బదులు నాకు (మేలు జాతి) ఎర్ర ఒంటెల్ని బహూకరించినా నేను ఇష్టపడేవాణ్ణి కాను, ఇప్పుడయినా (ఇస్లాంలో కూడా) ఇలాంటి ఒప్పందం కోసం విలిస్తే దానికి నేను సిద్ధమే”.  అజ్ఞాన కాలపు అహంభావాన్ని ఖండించి, ఆశ్రిత పక్షపాతానికి, వర్గ దురభిమానానికి స్వస్తి పలకటం ఈ ఒప్పందం సారాంశం.

సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (స)

శ్రమైక జీవనం

మహా ప్రవక్త (స)) యౌవనంలో బనూ సాద్‌ వారి మేకల్ని కొన్ని ఖీరాత్‌లకి బదులుగా  మేపేవారు. మహా ప్రవక్త (స) వారి సుశీలత, సౌజన్యతను గరించి తెలుసుకున్న హజ్రత్‌ ఖదీజా తన వర్తక సామగ్రిని సిరియాకు తీసుకు వెళ్ళవలసిందిగా కోరారు. మ్రహా ప్రవక్త (స) అంగీకారం తెలుసుకున్న తర్వాత తన బానిస మైసరాను తోడుగా పంపారు. మహా ప్రవక్త (స) మక్కా పట్టణానికి తిరిగి వచ్చాక ఖదీజా (ర) గారు మునువెన్నడూ చూడని అధిక లాభాన్ని, శుభాలను తన వర్తక సామగ్రిలో చూశారు. అలాగే తన బానిస ‘మైసరా’ కూడా వ్యాపారంలో ముహమ్మద్‌ (స) ప్రదర్శించిన నైపుణ్యం, తెలివి తేటలను గురించి, సత్యసంధత, నిజాయితీ తత్పరతల గురించి వివరించి చెప్పాడు. దాంతో మోడువారిన ఆమె జీవిత వృక్షం మళ్ళీ చిగురించటం మొదలెట్టింది. ఖురైష్‌ వంశంలోని గొప్పగొప్ప శ్రీమంతులు ఆమెకు వివాహ సందేశం పంపినా ఆమె నిరాకరించారు. కాని ఇప్పుడు ఆమె తన మనసులోని మాటను ‘నవ¦ీసా’ అనే చెలికత్తెకు తెలియజేశారు. ఆమె ముహమ్మద్‌ (స) దగ్గరకు పోయి హజ్రత్‌ ఖదీజా (ర) గారిని మనువాడమని కోరింది.

హజ్రత్‌ ఖదీజా (ర) గారితో వివాహం

ఆయన (స) తన చిన్నాన్న, వెదనాన్నలతో సంప్రదించి వివాహానికి అంగీకరిం చారు. అందరూ హజ్రత్‌ ఖదీజా (ర) గారి విన తండ్రి దగ్గరకు పోయి వెళ్ళి సంబంధం కుదుర్చుకున్నారు. వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆమె ఇరవై ఒంటెల్ని దానం చేశారు. అప్పుడు ఆమె వయసు 40 సంవత్సరాలు. ఆమె తన తెగలోని స్త్రీలందరిలో ధన పరంగానూ, వంశం రీత్యానూ, విజ్ఞతావివేచనల దృష్ట్యానూ  ఎంతో ఉత్తమురాలు. మహా ప్రవక్త (స)ను వివాహ మాడిన మొట్టమొదటి పుణ్య స్త్రీ ఆమె. ఆమె బ్రతికున్నంత కాలం ఆయన (స) మరో స్త్రీని వివాహమాడలేదు. కుమారుడు ఇబ్రాహీమ్‌ ను మినహాయించి మిగతా సంతాన మంతా ఆమె ద్వారా కలిగినవారే. ఆమె ద్వారా జన్మించిన కుమారుడు హజ్రత్‌ ఖాసిమ్‌. ఆ పేరుతోనే ప్రవక్త (స) ‘అబుల్‌ ఖాసిమ్‌’ (ఖాసిమ్‌ తండ్రి) అని విలవబడే వారు. ఆ తర్వాత హజ్రత్‌ జైనబ్‌,    రుఖయ్యా,

ఉమ్మె కుల్సూమ్‌, ఫాతిమా (ర) అను కుమార్తెలు, అబ్దుల్లాహ్‌ా అనే మరో అబ్బాయి జన్మించారు. ప్రవక్త (స) వారి మగ సంతానం బాల్యంలోనే కాలధర్మం చెందారు. కుమార్తెలు వెరిగి వెద్దవారయ్యారు.. ఇస్లాం స్వీకరించారు. హిజ్రత్‌ కూడా చేశారు. కాకపోతే హజ్రత్‌ ఫాతిమా (ర) గారు మినహా మిగతా వారందరూ ప్రవక్త (స) వారి జీవితకాలంలోనే తనువు చాలించారు. మహా ప్రవక్త (స) వారు మరణించిన 6 నెలలకు ఆమె కూడా ప్రవక్త (స)ను చేరు కున్నారు

Related Post