సామ,దాన, భేద, దండోపాయం

ముహమ్మద్‌ (స):  ఖూలూ లా  ఇలాహ ఇల్లల్లాహ్‌ తుఫ్లిహూ' -   కేవలం అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని చెప్పండి. సాఫల్యం మీ సొంతం అవుతుంది. దైవప్రవక్త (స) వారి నోట ఈ మాట వినగానే అక్కడున్న వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. 'చూడు చివరికి నీ గతి ఏమవుతుందో' అంటూ లేచి చరచరా వెళ్ళిపోయారు.

ముహమ్మద్‌ (స): ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ తుఫ్లిహూ’ – కేవలం అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని చెప్పండి. సాఫల్యం మీ సొంతం అవుతుంది. దైవప్రవక్త (స) వారి నోట ఈ మాట వినగానే అక్కడున్న వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. ‘చూడు చివరికి నీ గతి ఏమవుతుందో’ అంటూ లేచి చరచరా వెళ్ళిపోయారు.

కెరటాల నురుగు చూసి, సాగర సామర్థ్యాన్ని అంచనా వేసి నట్లు, మక్కా ప్రజలు ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సందేశాన్ని చిన్న చూపు చూశారు. దాన్ని చాలా తేలికైన విషయంగా భావిం చారు. ఆయన (స) సందేశం సత్య సస్య విప్లవానికి నాంది అని వారు ఆ క్షణంలో గ్రహించలేకపోయారు. జీవిత వాస్తవమే సత్యం. దాని ఆది ఏ గర్భంలోనూ లేదు. దాని అంతం ఏ సమా ధిలోనూ లేదు. అది నిత్యం, నూతనం, నిర్మలం. అది నిజం- మారని ఇజం. ఇది గ్రహించే స్థితిలో లేని మక్కా అవిశ్వాసులు సత్య సస్య విప్లవ జ్యోతిని తమ నోళ్ళుతో ఊది అర్పివేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారు అవలంబించిన విధానం – సామ, దాన, భేద, దండోపాయం. అదేలాగంటే-,

‘ఒక సంవత్సరం కాలం పాటు నీవు మా దేవతలను పూజిస్తే, (ప్రతిగా) ఒక సంవత్సరం కాలం పాటు మేము నీ ఆరాధ్య దైవాన్ని పూజిస్తాము’ అని అవిశ్వాసులు మహా ప్రవక్త (స) వారి ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. అది విన్న మహా ప్రవక్త ముహ మ్మద్‌ (స) దివ్యావిష్కృతి ద్వారా అందిన సమాధానాన్ని వారికి విన్పించారు: ‘(ఓ అవిశ్వాసుల్లారా! మీరు మీ మిథ్యా దేవీదేవతల ను వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నేను నా నిజ దైవాన్ని ఎందుకు వదులుకోవాలి. నేను నా ధర్మంపై సంతోషంగా ఉన్నాను. మా కర్మలు మావి. మీ కర్మలు మీవి”. (అల్‌ ఖసస్‌: 55)

పరస్పర సలహాసంప్రదింపుల (సామ పద్ధతి) ద్వారా సమస్య తేలేటట్టు లేదని గ్రహించిన మక్కా అవిశ్వాసులు మరో కుయుక్తి సిద్ధమయ్యారు. అదే పని మీద ఉత్బా అను రాయబారిని మహా ప్రవక్త (స) వారి వద్దకు పంపారు.

ఉత్బా: నాయనా ముహమ్మద్‌! అనుభవంలోనూ, ఆయుష్షులోనూ నేను నీకన్నా పెద్దవాడను. నా మాట విను. నేను చెబుతున్నది నీ మేలు కోరే – నీ ఈ ప్రచారాన్ని మానుకో. ఒకవేళ నువ్వీ పని చేయడంలోని ఉద్దేశ్యం – సిరిసంపదలు కూడబెట్టుకోవడమే అయితే చెప్పు. మేమే స్వయంగా కనక సామగ్రినంతా నీ కాళ్ళ దగ్గర పడవేస్తాము. ఒకవేళ సమాజంలో గౌరవమర్యాదల కోసం నువ్వీ పని చేస్తున్నట్లయితే చెప్పు. మేము నిన్ను మా నాయకుని గా చేసుకుంటాము. ఒకవేళ నువ్వీ కార్యం వల్ల అధికారాన్నే కాంక్షిస్తున్నయితే చెప్పు. మేము నిన్ను పూర్తి అరబ్బు దేశానికే రాజుగా చేెసుకుంటాము. పోని నీ ఈ ప్రచారం వెనకాల స్త్రీ వ్యా మోహం పని చేస్తున్నట్లయితే ఫరవాలేదు చెప్పు. పూర్తి అరబ్బు దేశంలోని అందమైన స్త్రీని నీకిచ్చి పెళ్ళి చేస్తాము. లేదా నీ మెదడుకేమైనా రోగం సోకిందా, నీకేదైనా భూతం పట్టిందా చెప్పు. మంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేస్తాము. నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి, నీవు కోరిందల్లా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నీకేం కావాలో నిర్మోహమాటంగా అడుగు. కానీ నీ ఈ సందేశ ప్రచారాన్ని మానుకో’ అని (దాన పద్థని ముందుంచి) మాట పూర్తి చేశాడు ఉత్బా.

సాంతం విన్న మహా ప్రవక్త (స) అతనితో ”ఇప్పటి వరకూ నువ్వు నాతో అన్న మాటల్లో ఇసుమంతయినా నిజం లేదు. ఆ విషయం నీకు తెలియంది కాదు. ఈ కార్యం ద్వారా ఎలాంటి సిరిసంపదలు, పరువుప్రతిష్టలు నాకక్కరలేదు. నేను దీని ద్వారా అధికారాన్నిగానీ, ఆడదాన్నిగాన్నీ కోరుకోవడం లేదు. నా ఆరోగ్య స్థితి కూడా బాగానే ఉంది. నాపై అవతరించిన గ్రంథంలోని ఈ వాక్యాలు విను. నా సందేశంలోని వాస్తవికత ఏమిటో నీకే బోధ పడుతుంది” అంటూ పవిత్ర ఖుర్‌ఆన్‌ పారాయణం మొదలు పెట్టారు. హామీమ్‌ అస్సజ్దాలోని ప్రారంభ వాక్యాలను చదివి విన్పించారు.
అరచేతిని నేలకు ఆనించి తల భుజంపై వాల్చి మహా ప్రవక్త (స) వారి నోట నుండి వెలువడుతున్న దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్ని తన్మయుడై వినసాగాడు. అంతా విన్న తర్వాత మారు మాట్లాడ కుండా లేచి ఖురైషు దగ్గరకు చేరుకుని: ‘ఖురైషీయుల్లారా! నేనో అద్భుతమైన వాణిని విని వచ్చాను. అది కవిత్వం కాదు. చేతబడి అంతకన్నా కాదు. మంత్రజాలం అసలే కాదు. మీరు నా మాట వినండి! ముహమ్మద్‌ (స)ను అతని మానాన అతన్ని వదిలె య్యండి’ అన్నాడు. ఈ వైఫల్యం తర్వాత అవిశ్వాసులకు ఎటూ పాలుపోలేదు. చివరికి సర్దారులందరూ వెళ్లి ప్రవక్త (స) వారి బాబాయి అబూ తాలిబ్‌తో మాట్లాడాలన్న నిర్ణయానికి వచ్చారు. అంటే భేద పద్ధతికి ప్రారంభం అన్న మాట.

ఖురైషీయులు: ‘అబుతాలిబ్‌ మహాశయా! మీరు మా పెద్దలు. మీ పట్ల మా హృదయంలో ఎంత గౌరవం ఉందో మీకు తెలుసు. ముహమ్మద్‌ విషయంలో మాకు న్యాయం చేయండి. అతడ్ని కాస్త మందలించండి. మా మతాన్ని, మా ఆచార విధానాల్ని విమ ర్శించ వద్దని నచ్చజెప్పండి. లేదా మా దారి నుండి తప్పు కోండి’ అన్నారు. అది విన్న అబూతాలిబ్‌ ప్రవక్త(స)ను పిలిపించి బాబూ ముహమ్మద్‌! నీ పద్దతి మార్చుకో అన్నారు.
ముహమ్మద్‌ (స): ‘బాబాయీ! ఎందులో వారి శ్రేయస్సు, సంక్షే మాలు దాగి ఉన్నాయో దాని వైపు వారిని పిలవడం మానెయ్య మంటున్నారా?’.
అబూ తాలిబ్‌: ‘అదేమిటి? ఎందులో ఉంది వారి శ్రేయస్సు’?
ముహమ్మద్‌ (స): ఒక సద్వచనం. దీన్ని గనక వారు మనసా వాచ, కర్మణ-త్రికరణ శుద్ధితో అంగీకరిస్తే అరేబియా, అరబ్బే తర దేశాలు వారికి దాసోహం అంటాయి.
అబూ జహల్‌: ముహమ్మద్‌ నువ్వు విశ్వసించే ఆ దేవుని సాక్షి! ఆ మాటేమిటో చెప్పు, ఇప్పుడే అలాంటివి ఒకటేమిటి ఖర్మ, పాతిక మాటలు పలకటాని మేము సిద్దంగా ఉన్నాము అన్నాడు కుతుహా లంతో.
ముహమ్మద్‌ (స): ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ తుఫ్లిహూ’ – కేవలం అల్లాహ్‌ా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని చెప్పండి. సాఫల్యం మీ సొంతం అవుతుంది. దైవప్రవక్త (స) వారి నోట ఈ మాట వినగానే అక్కడున్న వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. ‘చూడు చివరికి నీ గతి ఏమవుతుందో’ అంటూ లేచి చరచరా వెళ్ళిపోయారు.

అయినా ఇస్లామీయ ఉద్యమం ఉధృతం అవుతూనే ఉంది. ఉమర్‌, హమ్జా లాంటి పరాక్రమవంతులు కూడా ఇస్లాం స్వీకరించారు. మరోవైపు నజాషీ రాజు ముస్ల్లింలను తన రాజ్యంలో రక్షణ కల్పించాడు. అది విస్తరించే కొద్దీ వారి మనోవేదన సయి తం అధికమవుతూ ఉంది. దినదిన ప్రవర్థమాన మవుతున్న ప్రవక్త (స) వారి సహచరుల సంఖ్యను చూసి వారు మరింత కలవర పడ్డారు. కొంగ్రొత్త వ్యూహలను రచిస్తూ, అలగా జనాలను ఉసి గోల్పారు. దాంతో వారు విశ్వాసులకు పెట్టే హింసలు మిన్నం టాయి. దైవ ప్రవక్త (స)ను, ఆయన వంశం వారిని సంఘం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారు జారీ చేసిన తీర్మాన పత్రం ప్రకారం – మక్కాలో ఎవరూ హాషిమ్‌ తెగవారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదు. వారితో ఎలాంటి లావాదే వీలు జరుపకూడదు. వారిని కలుసుకోకూడదు. వారికి అన్న పానీయాలు అందకుండా, కనీస అవసరాలు తీరకుండా గట్టి చర్యలు గైకొనాలి. ఈ దిగ్బంధం మూడేండ్ల పాటు సాగింది. ఈ మధ్య కాలంలో చెట్టు ఆకుల్ని తిని బ్రతికారు. ఎండు చర్మాన్ని నీళ్ళల్లో నానబెటుట్టుకుని కడుపు మంట చల్లార్చుకున్నారు. పసి పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. వారు ఆకలికి తాళలేక బోరున ఏడ్చేవారు. ఆ ఏడ్పుల శబ్దం విని మక్కా అవిశ్వాసులు పగలిబడి నవ్వి పైశాచికానందం పొందేవారు. అయినా ప్రవక్త (స) పోరాట పటిమను ఆపలేదు. చివరికి ఆ గడ్డు ఘడియలు కూడా ముగిశాయి. ధర్మపథంలో ఒకదాని వెంట మరొకటి చొప్పున ముందుకొస్తున్న అనేక సమస్యల్ని అధికమించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో ఓ ప్రతిపాదనకు బదులుగా ఆయన నోట ఈ మాటలు వెలు వడ్డాయి ”బాబాయి! దైవసాక్షి! వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతిలో చంద్రుడ్ని తెచ్చి పెట్టి ఈ మహా కార్యం మాను కోమన్నా అది జరిగే పని కాదు. వినండి, ఈ మహా కార్యం పూర్తయినా పూర్తి కావాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణమైనా పోవాలి”.

ఇది జరిగిన కొంత కాలానికి అడుగడుగునా సహా యం అందిస్తూ వచ్చిన అబూ తాలిబ్‌, తనను వెన్ను తట్టి ప్రోత్స హించిన ప్రియ సతీమణి ఖదీజా (ర) పరమపదించారు. దీంతో అవిశ్వాసుల భేధం, దండోపాయంగా రూపు దాల్చింది. వారి అసభ్య ప్రహేళికలు, తుంటరి చేష్టలు విపరీతమయ్యాయి. ఒకడు ఆయన (స) పై బురదపోసి, మరొకడు మెడలో త్రాడు వేసి బిగించి, ఇంకొ కడు దారిలో ముళ్లు పరచి, రాళ్ళతో కొట్టి శారీరకంగా వేధిస్త్తే, ఇంకొందరు ఆయన కుమార్తెలకు విడాకులిచ్చి మానసికంగా హింసించారు. అయినా ఆయన (స) ఏ మాత్రం నిరాశనిస్పృహ లకు లోను కాలేదు. ఆ రోజుల్లోనే తాయిఫ్‌ పట్టణానికి కూడా వెళ్ళి ధర్మప్రచారం చేసి వచ్చారు. ఆ కాలంలోనే మేరాజ్‌ సంఘ టన, మొదటి, రెండవ అఖ్బా ఒప్పం దాలు చోటు చేెసుకున్నాయి. ముస్లింలు మదీనాకు వెళ్లనారంభించింది కూడా ఆ రోజుల్లోనే.

ఇస్లాం మదీనాలో క్రమక్రమంగా నిలదొక్కుకోసాగింది. అక్కడ ఇస్లాం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటం చూసి మక్కా అవిశ్వాసులు జీర్ణించుకోలేకపోయారు. అందుచేత వారు పార్లమెంటులో ఓ సార్వ త్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి అందరు సర్దా రులతోపాటు షైతాను కుడా ఓ వృద్ధుని వేషంలో వచ్చాడు. చివరిగా ‘మన తెగల్లో ఒక్కో తెగ నుండి కనీసం ఒక వ్యక్తి ముందుకు రావాలి. ఆ తర్వాత అందరూ కలిసి ఒక్కసారిగా ఖడ్గాలతో దాడి చేసి ముహమ్మద్‌ (స)ను మట్టు బెట్టాలి’ అని తీర్మానించారు. తర్వాత కాలం ఇటువంటి కుయుక్తులు, కుట్రలు కోకొల్లలుగా సాగాయి. అయినా అంతిమ విజయం సత్యానికే వరించింది. సత్యప్రవక్త ముహమ్మద్‌ (స) హృదయాల విజేతగా మక్కాలో ప్రవేశించారు.

ముస్లింలు కొన్ని శతాబ్దులపాటు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత నేడు కాలం మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. ఇస్లాం ధర్మం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడం చూసి జీర్ణించుకోలేని కొన్ని రాజ్యాలు, వ్యక్తులు సత్య ధర్మ ప్రవాహాన్ని అడ్డు కోవాలని తిరిగి మళ్ళీ ఆ ప్రాచీన అస్త్రాలైన ‘సామ, దాన, భేద, దండోపాయా’ల ను ప్రయోగిస్తున్నారు. వారి కుయుక్తుల్ని, కుట్రల్ని నిశితంగా పరిశీలిస్తే ఇస్లాంను అనుమానాస్పదంగా చీత్రీకరించేందుకు వారు అవలంబిస్తున్న మార్గాలు ఇవి –

1) ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా అపోహాల్ని, అపార్థాల్ని సృష్టించడం. 2) విద్యా రంగంలో సిలబస్‌ మార్పుచేర్పుల ద్వారా ముస్లింల చరిత్రను వక్రీకరించడం. 3) దివ్యఖుర్‌ఆన్‌ వచనాల్ని, ప్రవక్త (స) వారి ప్రవచనాల్ని వాటి నిజ స్థానం నుండి వేరు పర్చి పెడర్థాలు కల్పించడం. 4) ఇస్లాం పారభాషికాలను తప్పుడు అర్థాలు ఇవ్వడం. ఉ: జిహాద్‌ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పడం. 5) అపనిందలు మోపడం. ఉ: ఇస్లాం కత్తి బలంతో వ్యాపించిందని నమ్మ బలకడం. 6) ఇస్లాం ఆదేశాల్ని ప్రగతికి ప్రతిబంధకాలుగా పేర్కొన డం. ఉ: పరదా విషయంలో చేయబడుతున్న దుష్ప్రచారం. 7) ముస్లింలలోని అతివాదులను ప్రోత్సహించి ఇస్లాంపై బురద జల్లేం దుకు ప్రయత్నించడం. ఉ: సల్మాన్‌ రష్దీ. 8) ఉగ్రవాద చర్యలు ఎక్కడ జరిగినా, ఎవరూ చేసినా ముందుగా ముస్లింలనే పేర్కొనడం. తర్వాత నిజానిజాలు తెలిసినా వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వక పోవడం. 9) దేశ ప్రగతి కోసం, స్వాతంత్య్రం కోసం ముస్లిం యోధులు సాగించిన పోరాటానికి పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించక పోవడం, ముస్లింల సేవల్ని విస్మరించి, ముస్లిం సైంటిస్టుల పేర్లు మార్చి ప్రచారం చేయ డం. ఉ: ఈసా అలీ బదులు జేసు హాలి అన డం. 10) కొత్త కొత్త పారభాషికాలను సృష్టించి ఇస్లాంను ఒక ఫోబియాగా చిత్రీకరించడం.
గత 11 సంవత్సరాలలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య అక్షరాల 2640 అంటే దుష్ప్రచారం ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించవచ్చు. ఎన్ని కుట్రలు పన్నినా, మరెన్ని ఎత్తుగడలు వేసినా ఇస్లాం మాత్రం దినదిన ప్రవర్థ మానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అని స్వయంగా అల్లాహ్‌ మాట ఇస్తున్నాడు: ”వారు అల్లాహ్‌ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్‌ – అవిశ్వాసులకు ఎంతగా సహించరాని దైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలి పెట్టడానికి అంగీకరించడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు. ముష్రికులకు ఎంత అయిష్టంగా ఉన్నా సరే, ఇతర జీవన విధానాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి”. (తౌబా: 33)
పై పేర్కొనబడిన థ కుయుక్తుల్లో అత్యధికంగా ప్రింటింగ్‌ మీడియా మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాతో ముడిపడి ఉన్నవే. ప్రతి మూడు రోజుల్లో రెండు పుస్తకాలు ఇస్లాంకు వ్యతిరేకంగా వ్రాయబడుతున్నా, ఇంత జరుగుతున్నా ముస్లిం ప్రపంచం నిద్ర మత్తులోనే ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఇస్లాం వాస్తవికతను తెలుయపర్చే పుస్తకం నెలకోక్కటి కూడా రాకపోవడం, దాని కోసం కట్టుదిట్టంగా పని చేసే ఒక వ్యవస్థ లేకపోవడం ముస్లిం సమాజ నిర్లక్ష్యానికి, ఏమరుపాటుకి ప్రబల తార్కాణం. ఇది చాలదన్నట్లు ఆధునిక రంగాల్లో ముందుకు దూసుకెళ్లే దమ్ము, ధైర్యమూ ఉన్న యువకుల్ని వ్యర్థ రాజకీయాల్లోకి లాగి, స్వార్థ, స్వల్ప ప్రయోజనాల కోసం తగువులాటల్లో, తగాదాల్లో వారి ప్రతిభాపాటవాలను దుర్వినియోగం చేయడం అత్యంత దారుణం! ‘అల్లాహ్‌ త్రాడును గట్టి పట్టుకోండి. విభేదాల్లో పడి చీలి పోకండి’ అని దేవుడు పదే పదే పిలుపునిస్తుంటే వ్యక్తిగత పగలు ప్రతీకారాలు పెంచుకొని బ్రతకడం మిక్కిలి విచారకరం! పతనంలో ముందున్న మన మిగతా అన్నింటిలోనూ వెనుకబడి ఉండ టానికి కారకులు ఎవరు?

ఇక వెబ్‌సైట్లు, బ్లాగర్ల విషయానికొస్తే జానాభా పరంగా ప్రపంచం లోనే రెండో అతి పెద్ద సంఖ్యలో ఉండి కూడా ఇక్కడ సయితం అన్ని మతాల వారికన్నా వెనుకబడి ఉన్నది మనమే. చూడండి –

గూగల్‌
యూదులు బౌద్ధులు క్రైస్తవులు ముస్లింలు
3098 3788 92883 1953

యాహు
యూదులు బౌద్ధులు క్రైస్తవులు ముస్లింలు
2961 594 25365 1418

అభిమాన సోదరులారా! ఆధారాల రీత్యా, ప్రమాణాల రీత్యా ‘ఆధిక్యత’ అనేది ఇస్లాంకు ఎప్పటికీ ఉంటుంది. అయితే ముస్లింలు ధర్మపరా యణులుగా, రుజువర్తనులుగా వ్యవహరించిన నాడు ప్రాపంచికంగా కూడా వారికి ఆధిక్యత ప్రాప్తించింది. ఇప్పటికయినా సరే ముస్లింలు తమ ఆశయాన్ని గుర్తించి, విద్యా-వైద్య-వైజ్ఞానిక-రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ, రుజుమార్గంలో పయనిస్తే ప్రాబల్యం ఖాయం. ఎందుకంటే ఏనాటికైనా అల్లాహ్‌ా పక్షం వారే విజయం సాదిస్తారని దేవుడు వాగ్దానం చేెసి ఉన్నాడు. ఇక అల్లాహ్‌ా తోడ్పాటుకు కావలసిన అర్హత ముస్లింలమైన మనం సంపాదించుకోవడమే ఆలస్యం.కారణం-
”ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకూ అల్లాహ్‌ా కూడా దాని స్థితిని మార్చడు”. (అర్రాద్‌: 11)

 

Related Post