సంపూర్ణ స్వరాజ్యాన్ని కాపాడుకోవాలి!

గౌరవ భావం నుండి సదవగాహన, సద్భావన, ఆ సద్భావన నుండి సహిష్ణుత, సమరస భావం జనిస్తుంది. అది సాటి ప్రజల కోసం కుల మతాలకతీతంగా ఎలాంటి త్యాగానికయినా సిద్దమయ్యేలా మనల్ని తీర్చి దిద్దుతుంది.

గౌరవ భావం నుండి సదవగాహన, సద్భావన, ఆ సద్భావన నుండి సహిష్ణుత, సమరస భావం జనిస్తుంది. అది సాటి ప్రజల కోసం కుల మతాలకతీతంగా ఎలాంటి త్యాగానికయినా సిద్దమయ్యేలా మనల్ని తీర్చి దిద్దుతుంది.

విశ్వంలోనే విశిష్టమయిన మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 5100 పట్టణాలు, 380 నగరాలు. ఈ సుమ వనంలోని ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి రెమ్మ, ప్రతి కొమ్మ, ప్రతి మొక్క, ప్రతి చెట్టు విలువయినదే. మన భారతావనిలో నివసించే 8 అతి పెద్ద మతాలలోని 6వేల కులాలకు చెందిన 1700కు పైగా భాషలు మాట్లాడగలిగే 125 కోట్ల మంది భారతీయులు మన సోదరులు. ఎంత అద్భుతం!

శతాబ్దాలుగా కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్న మన దేశంలోని వివిధ సాంఘిక జన సముదాయాలు తమ తమ పూర్వీకులు మాతృ దేశ విముక్తి కోసం, ఆ తర్వాత సొంత గడ్డ ప్రగతీ-వికాసాల కోసం చేసిన అనుపమ త్యాగాలను, సాగించిన అవిరళ కృషిని తెలుసుకోవ డం వల్ల ఒకరి పట్ల మరొకరికి గౌరవ భావం కలుగుతుంది. ఆ గౌరవ భావం నుండి సదవగాహన, సద్భావన, ఆ సద్భావన నుండి సహిష్ణుత, సమరస భావం జనిస్తుంది. అది సాటి ప్రజల కోసం కుల మతాలకతీతంగా ఎలాంటి త్యాగానికయినా సిద్దమయ్యేలా మనల్ని తీర్చి దిద్దుతుంది.

68వ స్వాంతంత్య్ర సంబరాలు ఘనంగా జరుపుకొని కొద్ది రోజులే అయ్యాయి. ఈ సందర్భంగా మనం సాధించిన పురోగతి ఎంత? తిరోగతి శాతం ఎంత? అన్న ఆత్మసమీక్ష అందరికీ అవసరం. స్వా తంత్య్రం సిద్ధించినప్పటి నుండి ఎందరో మాహానుభావులు భరత జాతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. ఫలితం- 5.125 ట్రిలియన్‌ డాలర్ల (రూ.2.71 కోట్ల కోట్లు) స్థూల జాతీయోత్పత్తి, 1.99 ట్రిలియన్‌ డాలర్ల (రూ.99.8 లక్షల కోట్లు) స్థూల దేశీయో త్పత్తి, రూ.2.15 లక్షల తలసరి ఆదాయం (పీపీపీ), రూ.79,200 తలసరి దేశీయోత్పత్తిలతో ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. సర్వ సత్తాక, సార్వభౌమ, గణతంత్ర స్వేచ్ఛా స్వరాజ్యంగా భారత్‌-అవతరిం చిన తొలి నాళ్లలో 35 కోట్ల మంది ప్రజల అభివృద్ధి దృష్ట్యా కేవలం రూ.200 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమయి నేడు రూ.17 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించుకునే స్థాయికి ఎదిగింది. ఇవి ఇటువంటి కొన్ని ప్రగతి ఫలాలు ముమ్మాటికీ భారతీయులందరీ సమిష్టి కృషి ఫలితమే. జాతికి గర్వకారణమే. అయితే ఇదంతా 67 యేండ్లలో మనం సాధించిన ప్రగతి నాణేనికి ఒకవైపు తళుకులీనుతున్న కాంతి కోణం మాత్రమే. దీనికి మించిన చీకటి కోణం వెలుగు చూస్తున్న కఠోర వాస్తవాలను సయితం పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సంపూర్ణ స్వరాజ్యంగా దేశాన్ని నిలబెట్టాల్సి బాధ్యత దేశ పౌరుడయిన ప్రతి ఒక్కరి మీద ఉంది.

ఇప్పటి వరకు మనం సాధించిన ప్రతి రూపాయి అభివృద్ధి వెనకాల 70 పైసల అప్పు దాగి ఉంది. స్థూల దేశీయోత్పత్తి 99 లక్షల కోట్లు కాగా ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ వంటి విదేశీ ఆర్థిక సంస్థలతో పాటు పలు జాతీయ సంస్థలకు రూ.61.71 లక్షల కోట్ల మేర ప్రభు త్వం అప్పులతో తకరారుతోంది. ఇప్పటికిప్పుడు-భారత దేశం మీది కాదు, మేం స్వాధీనం చేసుకుంటాం-అని ఆయా సంస్థలు ప్రకటిస్తే, 125 కోట్ల మంది భారతీయుల తల తాకట్టు పెట్టి అయినా సరే, తలకు 40 వేల చొప్పున రుణం చెల్లించాల్సిందే. దేశ జిడీపీలో 66.7 శాతం వాటా అప్పులే ఆక్రమించాయి. వాటి వడ్డీ చెల్లింపులకు మన పాలకులు రూ.3 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. 1975 లో డాలర్‌ రూపాయి మారకం విలువ రూ8.40. అది నేడు రూ.58. 55లకు క్ష్షీణించింది. జనాభాకి తగ్గట్టు ఉత్పత్తి, ఉత్పాదక సామర్థ్యాలు నమోదు కాకపోవడంతో డాలర్‌తో రూపాయి విలువ సెంచరికీ పరు గులు తీస్తోంది.

క్రీ.శ1700లో ప్రపంచ ఆదాయంలో భారత్‌ వాటా 22.3 శాతం నుండి 1952 నాటికి 3.8 శాతం గణనీయ స్థాయికి దిగజారిపో యింది. ప్రస్తుతం ప్రపంచ ఆదాయంలో భారత్‌ వాటా 2.09 శాతం అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారయిందో ఆలో చించండి! మనది పురోగతా? తిరోగతా?! ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిపిస్తే సేవ చేసుకుంటామని ఊదరగొట్టి అందలమెక్కిన అయ్య వార్లు అందినకాడికి మెక్కి స్విజ్‌ బ్యాంకులో కుక్కిన నల్లధనం అక్ష రాల 120 లక్షల కోట్లు, 1947తో పోల్చుకుంటే 2012 నాటికి ఆర్థిక వృద్ధి రేటు 20 రెట్లు పెరిగినప్పటికీ ఆమ్‌ ఆద్మీ ఆర్థిక స్థితి గతుల్లో ఆశించిన మార్పు ఏమీ కనబడటం లేదు.
ప్రపంచానికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేశ వ్యవసాయ రంగం సవా లక్ష సమస్యలతో కునారిల్లుతుంది. స్వాతంత్య్రం పొందిన తొలి నాళ్ల లో జీడిపీలో ప్రాథమిక రంగం వాటా 65 శాతం నుండి 2013 నాటికి 10 శాతం పతన స్థాయికి పడిపోయింది. వ్యవసాయ వార్షిక వృద్ధి రెటు 3.6 శాతానికి దిగజారింది. దీంతో అభినవ భారతంలో ఆకలి కేకలు మృత్యుఘోషలా భయ పెడుతున్నాయి. దేశంలో 55 కోట్ల మంది ప్రజలు ప్రతి రోజు రాత్రిళ్లు పస్తులుంటు న్నారు. ప్రతి ఏటా కోటి మంది ఆకలి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రతి రోజు 7 వేల మంది ఆకలితో ఆలమటించి మృత్యు వాతన పడుతున్నారు. ప్రపంచలోని 40 శాతం మంది బాలలు అంటే దాదాపు 22 కోట్ల మంది మన దేశంలోనే నివసిస్తు న్నారు. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకి 6గురు వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతి రోజు 14 లక్షల మంది హృద్రోగ మృతులతో మన దేశం ప్రపమచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమిం చడం ప్రమాద ఘంటికలే. 15-29 వయస్కులయిన యువతలో ప్రతి వెయ్యి మందిలో 200 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. కారణం – అభివృద్ధి పేరిట అప్పులు చేస్తున్నా-చేసే ప్రతి అభివృద్ధి పనిలో అవినీతికే అగ్ర తాంబూలం అంటున్న నాయక మన్యులు. సర్వ జనుల చేత సృష్టించబడు తున్న సంపద కొందరి చేతుల్లోకి వెళుతుంది. నేటికీ 30 కోట్ల మంది ప్రజలు విద్యుత్తు వెలుగులకు దూరంగా జీవిస్తున్నారంటే మౌలికాభివృద్ధికి జరుగుతున్న నిధుల యజ్ఞం ఎంత బూటకమో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే,

అభివృద్ధి అంటే పంచ భూతాలను పణంగా పెట్టి ధనార్జనే ధ్యేయంగా వ్యహరించడమా? లేదా సంపాదించిన ధనంతో మానవ వనరుల దగ్గర నుండి సహజ వనరుల వరకు అన్నింటిని మెరుగు పర్చుకునేలా మానవ జీవితాలను అందంగా మలచడమా? అనే విచక్షణను సగటు భారతీయ పౌరుడు తిలోదకాలిస్తున్న కారణంగా పుట్టెడు పేదరికం, కడివెడు రోగాలతో అభినవ భారతం సమసమ్య లతో కొట్టుమిట్టాడుతోంది. పాలకులు ప్రజల్ని, ప్రజలు పాలకుల్ని వంచించే ప్రక్రియ ప్రాజాస్వామ్య భారత్‌లో రోజురోజుకి వ్రేళ్ళూను కు పొతుంది. ఇది దేశ సమైక్యతను విఘాతం కలిగించే ప్రమాదకర దిశగా తీసుకెళుతున్నది. ఇవి సరిపోవన్నట్టు మతత్వ శక్తులు, వారి కుయుక్తులు దేశాన్ని మరింత సమస్యల సుడి గుండంలోకి నెడు తున్నాయి. అంతిమంగా ఒక మాట, వందల సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న స్వరాజ్యం మళ్ళీ ఆర్థిక బానిసత్వ వాతన పడకుండా ఆత్మావలోకనం చేసుకుంటూ అంకిత భావంతో దేశాభ్యున్నతి కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేసి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాపాడుకో వాల్సిన తరుణం ఇది!

Related Post