సర్వేంద్రియ సంరక్షణా సాధనం ఉపవాసం

మజాను నెలలోగాని, మరేతర నెలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే,హృద యాన్ని నాస్త్తికత్వం, బహుదైవ భావన,విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపా డుకోవాలి.మనసు నిండా తౌహీద్‌ సుగం ధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలో చనలకు మన మది సుమవనంగా మారాలి. అందులో ప్రేమ పూలు, మానవత్వపు మం దారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్‌ా నామస్మరణతో అది నిత్య చైతన్యధాత్రిగా విరాజిల్లాలి.

 

”ఎవరు అల్లాహ్‌ను విశ్వసిస్తారో వారి హృదయానికి అల్లాహ్‌ (సరైన దిశలో మార్గదర్శకత్వం వహిస్తాడు”. (ఖుర్‌ఆన్‌64:11

హృదయమూ ఉపవాసం పాటిస్తుంది

హృదయానికి మార్గదర్శకం లభించడం మామూలు విషయం కాదు. అది సకల మార్గ దర్శకాలకు మూలం. సర్వ సాఫల్యాలకు జీవం. మనిషి కట్టుకునే సత్కార్యాల సుందర సౌధానికి అది మొట్టమొదటి ఆధారం. ప్రాపంచిక జీవనం అతని ప్రతి కదిలికకూ కారణం. ప్రేరణం హృదయ మార్గదర్శనమే. ”మానవ శరీరంలో ఓ మాంసపు ముద్ద ఉంది.అది సక్రమంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అదిగనక రోగగ్రస్తమయితే పూర్తి శరీరం రోగగ్రస్తమవు తుంది. అది మరేదో కాదు, మనిషి హృద యమే” అని బోధించారు మానవ మహో పకారి ముహమ్మద్‌ (స).
ప్రతి ప్రాణికీ హృదయముంటుంది. అందు లో రెండు పార్శ్యాలు ఉంటాయి. ఒక పార్శ్యం విశ్వాసం వెలుగుతో, సచేతనంగా స్పందిస్తూ ఉంటుంది. పూర్తిగా దైవానికి లోబడి, నిత్యం దైవధ్యానంతో నిండి ఉంటుంది. ”దైవభీతి ఇక్కడున్నది” అని దైవప్రవక్త (స) చెప్పింది ఈ పార్శ్యాన్ని ఉద్దేశించే.”హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలికించి సావధానంగా మసలుకునే ప్రతి వ్కక్తికీ ఇందులో (ఖుర్‌ఆన్‌ లో హితబోధ గలదు”. (ఖుర్‌ఆన్‌-50:37) అని అల్ల్లాహ్‌ సెలవిచ్చింది కూడా ఈ పార్శ్యం గురించే.

మరొక పార్శ్యం రోగస్త్రమయి, అచేతనావస్థ లో సకల మాలిన్యాలతో కలుషితమయి ఉం టుంది. ”వారి హృదయాలలో రోగం ఉంది” (బఖరా:10)అని, ”వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా? ఖుర్‌ఆన్‌ గురించి వారు లోతు పరిశీలన ఎందుకు చేయడం లేదు.” (ఖుర్‌ఆన్‌-47:24) అని, ”వారి చర్మ చక్షువులకు అంధత్వం లేదు, వారి హృదయ చక్షువులకు అంధత్వం ఆవహించి ఉంది” అని, ”వారికి హృదయాలు ఉన్నాయి కాని వారు వాటితో అర్థం చేసుకోరు” అని అల్లాహ్‌ చెప్పింది ఈ చెడు పార్శ్యం గురించే. ”మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయి” (బఖరా:88) అని, ”నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబ ంధించి మా హృదయాలు తెరలో ఉన్నాయి”. (ఖుర్‌ఆన్‌-41:5) అని సత్య తిరస్కారులు తెలి యజేస్తున్నదీ ఆ హృదయ స్థితే. ఈ హృద యం నుండే దైవప్రవక్త (స) అల్లాహ్‌ా శరణు వేడుకున్నారు: ”ఓ అల్లాహ్‌ా నిష్ప్రయోజనకర మైన విద్య నుండి,  భక్తిరహిత హృయం నుండి, స్వీకృతికి నోచుకోని ప్రార్థన నుండి నేను నీ శరణు కోరుతున్నాను”.

రమజాను నెలలోగాని, మరేతర నెలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే,హృద యాన్ని నాస్త్తికత్వం, బహుదైవ భావన,విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపా డుకోవాలి.మనసు నిండా తౌహీద్‌ సుగం ధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలో చనలకు మన మది సుమవనంగా మారాలి. అందులో ప్రేమ పూలు, మానవత్వపు మం దారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్‌ా నామస్మరణతో అది నిత్య చైతన్యధాత్రిగా విరాజిల్లాలి.

నోరూ ఉపవాసం పాటిస్తుంది

”(ఓప్రవక్తా! నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్‌ వారి మధ్య కల తలు రెపుతాడు. నిశ్చయంగా షైతాన్‌ మాన వుని పాలిట బహిరంగ శత్రువు”. (ఖుర్‌ ఆన్‌ -17:53) అని అల్లాహ్‌ా సెలవిచ్చినా, ”తన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతర ముస్లిం లకు హాని కలిగించనివాడే ముస్లిం” అని మహాప్రవక్త ముహమ్మద్‌ (స) నొక్కి వక్కాణిం చినా-అది నోటి ఉపవాసం గురించే. రమ జాను కానివ్వండి. మరేతర మాసం కాని వ్వండి విశ్వాసి నోటిని అదుపులో పెట్టుకో వాలి. మనసు గృహం అయితే నోరు గుమ్మం వంటిది. కాబట్టే ‘నోరు బాగుండే ఊరు బాగు ంటుంది’ అన్నారు వెనుకటికి మన పెద్దలు. పాము కాటుకి, నిప్పు వాతలకు మనిషి తట్టు కోగలడేమోగానీ, నోటి కాటుకి, మాటల తూటాలకి మనిషి నిలువునా దహించుకు పోతాడు. ”కోతలరాయుళ్ల నాలుకలు కోసిన కోతలే నరకవాసులు” అని ప్రవక్త (స) చెప్పింది ఇందుకే. ఈ యదార్థం తెలిసిన అబ్దు ల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ తన నాలుక నుద్దేశించి:

”ఓ నాలుకా! నాలుగు మంచి మాటలు మాట్లాడి మూట కట్టుకో. కుదరకపోతే కనీ సం దుర్భాషకు దూరంగా మసలుకో.ఆ విధం గానయినా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో” అనేవారు. ”రేపు ప్రళయ దినా న నీతులు చెప్పి నీచంగా బ్రతికేవారి నాలు -కల్ని నరకాగ్ని కత్తెరలతో కత్తిరించడం జరు గుతుందని” మహాప్రవక్త (స) హెచ్చరించా రంటే ఎముక లేని ఈ నాలుక ఎన్ని అనర్థాలకు దారి తీయగలదో అర్థమవుతోంది. కనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి. అవసరమయినప్పుడు, అవసర మయినంత, అవసరమయిన రీతిలో, అవసర మున్నవారితో మాత్రమే మాట్లాడాలి. నోరు ఉంది కదా అని వాగితే గూబ పగులుతోంది జాగ్రత్త!అని అల్లాహ్‌ా హెచ్చరిస్తున్నాడు: ”మనిషి నోట ఒక మాట వలువడటమే ఆల స్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దాన్ని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు”.
(ఖుర్‌ఆన్‌-50: 18)
దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవర యితే ఉపవాసం ఉండి కూడా అబద్దాలాడ టం, అబద్దాల ఆధారంగా బ్రతకడం మాను కోడో అటువంటి వ్యక్తి ఆకలిదాహాల పట్ల అల్లాహ్‌ాకు ఎటువంటి ఆసక్తి లేదు”. కాబట్టి సోదరులారా! నాలుకను అదుపులో పెట్టుకో వడం కంటే ఎక్కు యోగ్యమయిన విషయం ఏదీ లేదు. మన నాలుకే మన పాలిట నాకం కాగ లదు, నరకంగా మారగలదు కూడా!

నయనోపవాసం

”నయన నైచ్యాన్ని, హృదయ హైన్యాన్ని సయితం ఆయన ఎరుగును”.(గాఫిర్‌:19)
నయనం హృదయ ప్రేరణం. మనసుకు చేరే మార్గం. లజ్జారహిత నేత్రాలు కళ్ళెం లేని గుర్రాలతో సమానం. వాటిని కంట్రోల్‌ పెట్టక పోతే కనబడిందల్లా తమదే అంటాయి. రమ్యంగా కనబడే ప్రతిదీ తమదేనన్న తలతిక్క తలపులకు తలుపులు తీస్తాయి. ఎదుటి వారి గౌరవాన్ని కాలరాచి, వారి రహస్య విషయా లను తరచి తరచి చూసే నికృష్ట నయనాలు ఘోర పాపాన్ని మూట గట్టుకుంటాయి. సాధా రణంగా నేత్రాలు చెడుని మంచిగా తలంచి మోస పోతాయి. మనసులో దురుద్దేశం ఉరక లేస్తుంది.ఆ మార్గంలో దూసుకుపోవాలని పరి తపిస్తాడు మనిషి. కొద్దిదూరం నడిచాక తెలు స్తుంది తాను అశ్లీలబురదలో మునిగి ఉన్నా నని. బయటికి రావాలనుకున్న ప్రతిసారి ఆ పాపపు ఊబి అతన్ని మరింత లోనికి లాక్కుం టుంది. కాబట్టి హృదయం, నోరుతోపాటు నయనాలు కూడా నియంత్రణలో ఉండాలి. మన నయనాలను అశ్లీలదృశ్యాలనుండి కాపా డుకోవాలి.అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ‘(ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపుల ను క్రిందికివాల్చి ఉంచాలనీ,వారు తమ మర్మ స్థానాలను కాపాడుకోవాలనీ,అది వారి కొరకు శ్రేయోదాయకమని వారితో చెప్పు. వారు చేసే దంతా అల్లాహ్‌ాకు తెలుసు”. (నూర్‌: 30)

వీనులూ ఉపవాసం ఉంటాయ

”నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విష యాల వెంట పడకు.ఎందుకంటే చెవి, కన్ను, హృదయం-వీటన్నింటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది”. (ఖుర్‌ఆన్‌-17:36)
‘చెడు అనకు’ అన్నది నోరు పాటించే ఉపవా సమయితే, ‘చెడు కనకు’ అన్నది నయనోప వాసమయితే, ‘చెడు వినకు’ అన్న వీనులు పాటించాల్సిన ఉపవాసం. బూతు పదాలను, బూతు సాహిత్యాన్ని, సంగీత ధ్వనుల నుండి వీనులను కాపాడుకోవాలి. ఎందుకంటే అస త్యాలు, అశ్లీల పదాలకు అలవాటుపడ్డ వీను ల్లో రేపు ప్రళయదినాన సీసం పోయడం జరు గుతుంది. అట్టి కర్ణపుటాలకు కరుణామయుని వచనాలు సోకవు. ఫలితంగా సత్యవాణి విన్న ప్పుడు వారిలో ఉండాల్సిన సహజ స్పందన ఉండదు. అల్లాహ్‌ అమృతవాణి వారి కర్ణ పుటాలను తాకి వెనక్కి వచ్చేస్తుంది. అటువం టి వారి కర్ణశక్తి మూలంగా వారికి ఎటువం టి శుభంగానీ, ప్రయోజనంగాని కలగదు. దీనికి భిన్నంగా విశ్వాసుల వీనులు సత్యామృ తాన్ని తనివితీరా గ్రోలడమే కాక మనిషిలోని మనసు తన్మయం చెందేలా చేస్తాయి. విశ్వా సుల ఈ విశేష లక్షణం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహిం చిన కారణంగా వారి కళ్ళ నుంచి అశ్రువులు జలఝరి వలె ప్రవహించడం నీవు గమని స్తావు”. (ఖుర్‌ఆన్‌-5: 83)
సత్యం విన్నప్పుడు సత్యపథంలో నడుస్తున్న హృదయాలకు మరింత శక్తి, స్థిరత్వం ప్రాప్తి స్తుంది. దీనికి భిన్నంగా, అసత్యం విన్నప్పుడు దాని తాలూకు దుష్ప్రభావాలు నిర్మలమయిన హృదయంలో తిష్ఠ వేసేందుకు ప్రయత్ని స్తాయి. ఆ చెడు భావాలు మరింత ముదిరితే ప్రమాదం. అల్లాహ్‌ా అటువంటి వీనులకు సీలు వేసేస్తాడు జాగ్రత్త!

ఉదర ఉపవాసం

”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కేవలం అల్లాహ్‌ా ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను మాత్రమే తినండి, త్రాగండి.అల్లాహ్‌ాకు కృతజ్ఞ తలు తెలుపండి”. (ఖుర్‌ఆన్‌-2:172)
మనం తినే ఆహారం మనం దేహంపై, మన ప్రవర్తనపై, మన సామాజిక జీవితంపై, కుటుంబ, ఆధ్యాత్మిక జీవనంపై ప్రభావం చూపుతుంది. ధర్మ సంపాదన మనిషిలో మాన వత్వాన్ని, మంచిని పెంచితే, అధర్మ సంపాద సకల అనర్థాలకు అలవాలంగా మారుతుంది. ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలను భుజించ కుండా ఓ నిర్ణీత సమయం వరకు ఉండటం రమజాను ఉపవాసమయితే, అధర్మ ఆహారం నుండి ఉదరాన్ని కాపాడుకోవడం సంవత్సరపు 12 నెలల్లో అనునిత్యం నిరాటంకంగా, నిర్వ ఘ్నంగా, నిర్విరామంగా పాటించాల్సిన ఉప వాసం.అల్లాహ్‌ా నిషేధించిన అక్రమార్జనల్లో వడ్డీ వ్యాపారం మహాపరాధం.”ఓ విశ్వసించిన ప్రజలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొంద టానికి గాను అల్లాహ్‌కు భయపడండి”. (ఖుర్‌ఆన్‌-3: 130)
”తండ్రి లేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టలను నరకాగ్నితో నింపు కుంటున్నారు. త్వరలో వారు మండే అగ్నిలో ప్రవేశిస్తారు”. (ఖుర్‌ఆన్‌-4: 10)

దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ‘స్వహస్తాలతో సంపాదించే సంపాదనకన్నా పరిశుద్ధ మయిన ఆహారం మరొకటి లేదు’.’అధర్మ సం పాదనతో పోషించబడిన శరీరం నరకాగ్ని ఎక్కువ అర్హత కలిగి ఉంటుంద’న్నారు. ‘అక్ర మార్జన ద్వారా జీవించే వ్యక్తి ప్రార్థనలు స్వీకృ తం కావు’ అని కూడా మరో చోట సెలవిచ్చా రు. ఖుర్‌ఆన్‌లో అక్రమార్జన, లంచం గురించి ఇలా హెచ్చరించడం జరిగింది:”ఒకరి సొమ్ము ను ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకం డి. బుద్ధిపూర్వకంగా, అక్రమ రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయడం కోసం అధికారులకు లంచం(ముడుపులు) చెల్లించ కండి. అది (ధర్మం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే”. (ఖుర్‌ఆన్‌-2: 188)
అల్లాహ్‌ మనందరికి రమజాను మాసాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించడంతోపాటు ఉప వాస మాధ్యమంతో సర్వ ఇంద్రియాలను సం రక్షించుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక! (ఆమీన్‌)

Related Post