ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
హిజ్రీ శకం 6వ యేట…
దైవ అంతిమ ప్రవక్త(స) తన సందేశ కార్య పరిధిని మరింత విస్తృత పరచాలని సంక ల్పించుకున్నారు. అరబ్బు, అరబ్బేతర రాజ్యాలకు చెందిన చక్రవర్తులకు ఎనిమిది లేఖలు వ్రాసి ఇస్లాం స్వీకరించమని ఆహ్వా నించారు.
ఈ ఆహ్వాన పత్రాన్ని అందుకున్న వారిలో యమామ రాజ్యాధికారి సుమామ బిన్ ఉసాల్ (ర) కూడా ఉన్నారు.
అజ్ఞాన కాలంలో అరేబియాలో పేరు మోసిన అరబ్బు పరిపాలకులలో సుమామా బిన్ ఉసాల్(ర) ఒకరు. హనీఫా తెగకు చెందిన ఈ సర్దారును చూసి మహా మహులు కూడా ఈర్ష్య చెందేవారు. ఎందు కంటే అరేబియాలో ఈయన మాటకు తిరుగులేదు. పైగా ప్రచారణ పొందిన నాయకుడు. ఈయన ఏ నిర్ణయం గైకొన్నా ఇతర తెగల వారు శిరసావహించేవారు.
అజ్ఞాన భూతం ఆవరించివున్న రోజుల్లో దైవప్రవక్త (స) వ్రాసిన ఉత్తరం సుమామాకు అందింది. సుమామా ఆ ఉత్తరం చది వారు. పరిహసించారు. నుదురు చిట్లిం చారు. అతని భృకుటి ముడిపడింది. అతనిలో నిద్రాణమై ఉన్న దానవుడు మేల్కొ న్నాడు. దైవప్రవక్త (స)కు కీడు తలపెట్టా లనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. చివరికి అతనికి అవకాశం దొరికింది. చప్పుడు చేయకుండా వెనుక నుండే వచ్చి ప్రవక్త(స)పై దాడి చేయబో తుండగా అతని బాబాయి అడ్డుకున్నాడు. ఆ విధంగా దైవ కృప వల్ల ఆయ న(స)కు ప్రాణాపాయం తప్పింది.
సుమామా దైవప్రవక్త (స)పై చేసిన హత్యాయత్నం విఫలమైంది. అయితే అతను ప్రవక్త ప్రియ సహచరులకు అపకారం తల పెట్టాడు. ఒక ప్రదేశంలో అనేక మంది సహాబీలను ముట్టడించి నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఈ మారణ హోమం గురించి తెలియగానే, సుమామా ఎక్కడ కనిపించినాసరే హతమార్చమని దైవప్రవక్త (స) ప్రకటించారు.
హృదయ విదారకమైన ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకే సుమామా కాబా యాత్రకు సంకల్పించుకున్నాడు. కాబా గృహ ప్రదక్షిణ చేసి, అక్కడ ప్రతిష్ఠించబడి వున్న విగ్రహాలకు జంతుబలి ఇవ్వాలని మొక్కుకున్నాడు. మొక్కుబడిని తీర్చేందుకు యమామ నుండి మక్కాకు బయలు దేరాడు.
సుమామ మక్కా చేరుకోవాలంటే మదీనా మీదుగా ప్రయాణిచాలి. రాత్రి పూట మదీనా పొలిమేరలు దాటాలనుకున్నాడు. అయితే మదీనా దీగర రక్షణ కోసం గస్తీ తిరుగుతున్న ముస్లిం సిపాయిలు అనుమా నాస్పద స్థితిలో సుమామాను పట్టుకు న్నారు. అతనెవరో కూడా సిపాయిలకు తెలీదు. అతన్ని తెచ్చి మస్జిదె నబవీ స్థంభానికి కట్టివేశారు. తెల్లవారక దైవ ప్రవక్త (స) ఆ వ్యక్తిని చూసి, తగు నిర్ణయం తీసుకుంటారని సిపాయిలు భావించారు.
దైవప్రవక్త (స) మస్జిదు లోపలికి విచ్చేశారు. దూలానికి కట్టబడి ఉన్న ఆ ఖైదీని చూసి ఆయన (స) తన సహచరులతో ఇలా అన్నారు: ”ఇంతకీ మీరు నిర్బంధించిన ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా ?” దైవప్రవక్తా! ఏమో మాకు తెలీదు, అన్నారు అందరూ. ”ఇతనే సుమామా బిన్ అసాల్. ఇతని పట్ల మంచిగా మెలగండి” అని ఆదేశించారు దైవప్రవక్త(స) .
ఇంట్లో ఉన్న భోజనాన్ని సుమామా బిన్ అసాల్ కోసం పంపించండి. నా ఒంటె పాలు కూడా ఉదయం సాయంత్రం సుమా మాకే సమర్పించాలి” అని కూడా ఆయన(స) ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన (స) సుమామా వైపు తిరిగి ఆప్యా యంగా పలకరించారు.
”సుమామా ! ఇప్పుడేమంటావ్?”
అనేదేముంది! ఒకవేళ తమరు నన్ను చంపినట్లయితే మీ సహవాసుల రక్తం చిందించిన హంతకుణ్ణి శిక్షించినట్లవు తుంది. ఒకవేళ మన్నించి వదలిపెడితే అపకారికి ఉపకారం చేసిన వారవుతారు. ఒకవేళ సొమ్ముకావాలంటే చెప్పండి, కోరి నంత సొమ్ము సమర్పించటానికి సిద్ధంగా ఉన్నాను’ – సూటిగా జవాబిచ్చారు సుమామా.
దైవప్రవక్త(స)వారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. రెండ్రోజుల వరకూ అదే స్థితిలో ఉన్నాడు. కాని అతనికి అతిధి మర్యాదలు మాత్రం జరుగుతున్నాయి. ప్రవక్త(స)వారు వచ్చి ప్రశ్నించారు:
”సుమామా! నీ అభిప్రాయమేమిటో చెప్పు?”
ఇంతకు ముందు వెలిబుచ్చిన అభి ప్రాయానికే కట్టుబడి ఉన్నాను. క్షమించి వదలి పెడితే మీ మేలును గుర్తుంచు కుంటాను. ప్రతీకారం గనక తీర్చుకుంటే మీ సహచరులను పొట్టనపెట్టుకున్న ఒక నరహంతకునిపై ప్రతీకారం తీర్చుకున్న వారవుతారు. నష్టపరిహారం కావాలంటే, కావలసినంత సొమ్మును ఇవ్వటానికి సిద్ధం గా ఉన్నాను. దైవప్రవక్త(స) మౌనంగా నిష్క్రమించారరు. మూడవ రోజు ఆయన (స) మళ్ళీ వచ్చి ప్రశ్నలు వేశారు:
”సుమామా! ఏమంటావ్ ?”
ఏమంటాను! ముందు అన్న వాటినే అంటాను. మీరు నాకు క్షమాబిక్ష పెడితే ఒక కృతవ¦ు్ఞ్ఞనికి మేలు చేసినట్లవుతుంది. ఒకవేళ నన్నుహతమారిస్తే మీ సహవాసుల రక్త పిపాసికి తగిన శాస్తి జరుగుతుంది. ఒకవేళ ధనం కావలసి ఉంటే చెప్పండి, మీరు కోరినంత ధనం చెల్లించుకుంటాను.
”ఇతని కట్లు విప్పండి. ఇతన్ని విడిచి పెట్టండి” సహచరులకు ఆజ్ఞాపించారు దైవప్రవక్త(స).
సుమామా శరీరానికున్న బంధనాలైతే త్రెంచుకున్నాయి. కాని ప్రవక్త(స) ఔదార్యబంధం మాత్రం సుమామా అణువణువునూ పెనవేసుకుపోయింది. కారుణ్యమూర్తి (స) వారి నగుమోము ఆ రాతి గుండెను కరిగించింది.
శ్రీశ్రీశ్రీ సుమామా బిన్ ఉసాల్ ఒల్లు విరుచుకుంటూ మస్జిద్ ప్రాంగణం దాటారు. బఖీ ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఓ కర్జూర తోటలోకి ప్రవేశించారు. ఆ తోటలో ఓ చిన్న కోనేరు ఉంది. అక్కడ తన ఒంటెను ఆపి తనివితీరా స్నానం చేశారు. తనను తాను ప్రక్షాళనం చేసుకున్నారు. తిరిగి మస్జిదె నబవీకి వచ్చి అందరి సమక్షంలో బిగ్గరగా సాక్ష్యవచనం పలికారు.
”అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్‌హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”
అవును, అల్లాహ్‌ా తప్ప మరో ఆరాధ్యదైవం లేడని నేను సాక్ష్య మిస్తున్నాను. ముహమ్మద్ (స) అల్లాహ్‌ా ప్రవక్త అనీ, అల్లాహ్‌ా భక్తు డని నేెను సాక్ష్యమిస్తున్నాను.
తరువాత ఎంతో ఆప్యాయతతో ఇలా అన్నారు: ”ఓ నా ప్రియమైన ముహమ్మద్ (స) దైవసాక్షిగా చెబుతున్నాను ఇస్లాం స్వీకరిం చక ముందు మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడేవాణ్ణి కాను, కాని ఈనాడు నా దృష్టిలో మీ ముఖారవిందం కన్నా ప్రియతమ మైన ముఖారవిందం మరేదీలేదు…. దైవసాక్షి! ఇంతకు మునుపు నా దృష్టిలో ఈ (మదీనా) నగరం కన్నా చెడ్డ నగరం మరేదీ లేదు. కాని ఈనాడు నా దృష్టిలో ఈ (మదీనా) నగరం కన్నా గొప్ప నగరం ప్రపంచంలో మరొకటి లేదు.”
కొన్ని క్షణాల తర్వాత ఆయన బాధాతప్త హృదయంతో ఇలా అన్నారు: ‘ఓ దైవప్రవక్తా! నేను మీ ప్రియచరులను నిర్ధాక్షిణ్యంగా చంపేశానే అన్న బాధ నన్ను కృంగదీస్తోంది. నా ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏమిటి?’
‘సుమామా (ర) నీవు ఆందోళన పడకు. ఇస్లాం స్వీకరించిన మీదట తగకాలంలోని నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి’ అని కారుణ్యమూర్తి (స) అతనికి శుభవార్త వినిపించారు.
ఈ శుభవార్త వినగానే సుమామా మొహం సంతోషంతో దేదీప్య మానం అయింది. సంతోషాతిశయంతో ఆయన నోట వెలువడిన మాటలివి: ”దైవసాక్షి! నేను అజ్ఞాన కాలంలో ఎంతమంది ముస్లింలను పొట్టనబెట్టుకున్నానో అంతకన్నా రెట్టింపు మంది ముష్రిక్కులను నా కరవాలానికి ఆహుతి చేస్తాను. ఇక నుంచి నా జీవనం, నా ఖడ్గం, నా వద్ద ఉన్న సర్వస్వం మీకు, మీరు తెచ్చిన జీవన ధర్మానికే అంకితం”.కొన్ని నిమిషాల తర్వాత……
‘దైవప్రవక్త (స)! తమరి ఆనతి ఉంటే ఉమ్రాకి వెళతాను’ అన్నారు. ”ఉమ్రాకి తప్పకుండా వెళ్ళు. అయితే ఇస్లామీయ పద్ధతి ప్రకారమే ఉమ్రా చేయాలి” దైవప్రవక్త (స) అతనికి ఉమ్రా చేసే పద్ధతిని బోధించారు. సుమామా (ర) సెలవు తీసుకుని మక్కా వైపుకు పయన మయ్యారు. మక్కా చేరుకోగానే హెచ్చు స్వరం తో తల్బియా పఠించసాగారు.
లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్-లబ్బైక్ లాషరీక లక లబ్బైక్-ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్ లా షరీకలక్.
(హాజరయ్యాను దేవా! నేను హాజరయ్యాను. సహవర్తులు లేని ఓ ప్రభువా! నేను హాజర య్యాను. ప్రశంసలు నీకే శోభిస్తాయి. అను గ్రహాలన్నీ నీవు ప్రసాదించినవేను. సార్వభౌమ త్వం కూడా నీదే. నీకు సాటి ఎవరూ లేరు.)
మక్కా నగరంలో తల్బియా వచనాలు బిగ్గర గా పలుకుతూ ప్రవేశించిన మొట్టమొదటి ముస్లిం కూడా సుమామా బిన్ ఉసాల్ (ర) .
కాబా ప్రాంగణంలో ప్రతిధ్వనించిన ఈ వచనాలను విని ఖురైషులు ఓర్చుకోలేక పోయారు. తమ పౌరుషాన్ని రెచ్చ గొట్టిన ఆ వ్యక్తిని పట్టుకోవటానికి అందరూ కత్తులు కటార్లతో సహా వచ్చి ఆయన్ని చుట్టు ముట్టా రు. వాళ్ళను చూసి సుమామా (ర) మరింత బిగ్గరగా లబ్బైక్ పలికారు. అంతే మక్కా వారు తమ ఒరలలో నుంచి ఖడ్గాలు బయటికి తీశారు. ఒక యువకుడు బల్లెంతో ఆయనపై లంఘిస్తూ ఉండగానే…
”ఒరేయ్! ఈయన ఎవరో నీకు తెలుసా?” అన్నారెవరో. ”ఈయన మామూలు మనిషి కారు. యమామ రాజ్యపాలకుడైన సుమామా గారీయన. దైవం తోడు! మన వల్ల ఈయనకే దైనా అపకారం జరిగిందంటే ఈయన జాతి జనాలు మనపై ఆర్థిక ఆంక్షలు విధిస్తారు. మనం ఆకలితో అలమటించాల్సి వస్తుంది, తెలుసా?”.
ఈ మాటలు వినగానే అందరి ఖడ్గాలు ఒక్క సారిగా వారి ఒరల్లో ఒదిగిపోయాయి. ఆ తర్వాత నగర పెద్దలు సుమామా (ర)తో చర్చలు జరిపారు. ”సుమామా! అసలు మీకెేమై పోయింది? మీరెందుకు ధర్మ విహీను లయ్యారు? మీరు మీ పూర్వీకుల మతధర్మాన్ని విడిచి పెట్టేశారా?” ”నేను ధర్మ విహీనుణ్ణి కాలేదు. మరింత గొప్ప ధర్మాన్ని అవలంబిస్తున్నాను. కాబా ప్రభువు సాక్షిగా చెబుతున్నా! ఇక నుంచి నజద్ ప్రాంతం వారు ముహమ్మద్ (స)కు విధే యత చూపకపకపోతే ఒక్క గోధుమ గింజ కూడా పంపించను” అని తెగేసి చెప్పేశారు.
కురైషులపై ఒక్కసారిగా పిడుగుపడినట్ల యింది. వారంతా చూస్తూ ఉండగానే సుమామా ఉమ్రా చేశారు. అదీ మహాప్రవక్త (స) సూచించిన పద్ధతి ప్రకారం చేశారు. ఉమ్రా అనంతరం ఆయన దైవ మార్గంలో ఒక పశువును ఖుర్బానీ చేసి, తన స్వరాజ్యా నికి తిరుగు ప్రయాణమయ్యారు. యమామా చేరగానే రాజ్య ప్రముఖులనుద్దేశించి, ఇక మీదట కురైషులకు ఆర్థిక సహాయం చేయ రాదని ఆజ్ఞాపించారు. అంతే! తక్షణం ఆర్థిక ఆంక్షలు అమలుపరచబడ్డాయి.
సుమామా బిన్ ఉసాల్ (ర) గారు విధించిన ఆర్థిక ఆంక్షల ఫలితంగా మక్కాలో కష్టాలు మొదలైనాయి. కరవు తాండవించింది. పౌర సరఫరాలకు అంతరాయం కలిగింది. ధరలు పెరిగిపోయాయి. ప్రజలు ఆకలితో అలమ టించసాగారు. తమ పసిపిల్లలు ఆకలితో ప్రాణాలు కోల్పోతారేమోనని కురైషులు భయ పడిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దైవ ప్రవక్త (స)కు ఉత్తరం వ్రాయటం తప్ప మార్గాంతరం లేదని వారు తెలుసుకున్నారు. కురైషులు వ్రాసిన లేఖ సారాంశమిది:
”మీరు బంధుత్వ సంబంధాలను గురించి నొక్కి వక్కాణించేవారు. ఇతరులకు కూడా బంధుత్వ హక్కును గురించి ఉపదేశిస్తారను కున్నాం. కాని మీరు బంధుత్వ తెగత్రెంపులకు పురికొల్పుతున్నట్లు అర్థమవుతోంది. ఈ బంధుత్వ విచ్ఛిన్నానికి మా పెద్దలు తల్లడిల్లి పోయారు. మా పిల్లలు ఆకలితో మాడిపో యారు. ఇలా చెప్పటంలోని మా ఉద్దేశమేమి టంటే సుమామా బిన్ అసాల్ మాకు అందే ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. మీరు దయ చేసి ఈ ఆర్థిక సహాయనిన్న పునరుద్ధరించ వలసిందిగా సుమామకు ఆదేశించండి …..”
వెంటనే దైవప్రవక్త (స) సుమామాకు ఉత్తరం వ్రాస్తూ కురైషులకు నిలిపివేసిన ఆర్థిక సహా యాన్ని తిరిగి కొనసాగించవలసిందిగా సూచించారు. ప్రవక్త (స) వారి ఆజ్ఞను శిరసా వహిస్తూ సుమామా ఆహార ధాన్యాలను ఎగు మతి చేశారు.
హజ్రత్ సుమామా బిన్ ఉసాల్ (ర) జీవితాం తం విశ్వాసపాత్రునిగా మెలిగారు. దైవ ప్రవక్త (స)కు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు.
దైవప్రవక్త (స) పరమపదించినపుడు కొంత మంది దైవధర్మం పట్ల విముఖత చూప సాగారు. ఆ రోజుల్లోనే ముసైలమా కజ్జాబ్ తల ఎత్తాడు. ఆ అబద్ధాలకోరు తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. అప్పుడు సుమామా తన జాతి జనులను ముసైలమా ఉపద్రవం నుండి రక్షింటానికి నడుం బిగిం చారు. ఆయన ఇలా అన్నారు:
”ఓ హనీఫా తెగవారలారా! మీరు దారికి రండి. ముసైలమా కజ్జాబ్ బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బాగా తెలుసు కోండి! ముహమ్మద్ (స) అల్లాహ్ సత్య ప్రవక్త. ఆయన (స) తదనంతరం మరో ఎవరూ ప్రళయదినం వరకూ రారు. ఓ బనూ హనీఫా కాంతి కిరణం లేని ఆ అంధకార బంధురం నుంచి బయట పడండి. దైవసాక్షి! ఆ అసత్య వాది మాట వినటంకన్నా దౌర్భాగ్యం మరొ కటి లేదు. వాడి మాటను త్రోసిపుచ్చిన వారే ధన్య జీవులు.”
ఆ తరువాత ఆయన (స) దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తుల్ని పఠించారు: ”ఈ గ్రంథావతరణ అల్లాహ్‌ా తరపున జరిగింది. ఆయన మహా శక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు. పాపా లను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమో దించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది.” (అల్ మోమిన్-2,3)
మీరే చెప్పండి – అల్లాహ్‌ా అవతరింపజేసిన ఈ పవిత్ర వాక్కుల ముందు ముసైలమా కజ్జాబ్ చేసే అధిక ప్రసంగం ఏ పాటిది? ఉదాహరణకు ఆ సత్యవిరోధి సూక్తుల్ని చూడండి…..
”బెకబెకమనే ఓ మండూకమా! నీ బెకబెకలు ఎంత వరకు? త్రాగేవారెవరినీ అడ్డుకోలేవు. కనీసం నీళ్ళనయినా కలుషితం చెయ్యలేవు.”
ఆ తర్వాత సుమామా తన జాతి జనులలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారిని సమీకరించి, ధర్మభ్రష్టులకు వ్యతిరేకంగా పోరాటం మొద లెట్టారు. భూమండలంలో దైవవాక్కు ఉన్నతి కై అహరహం కృషి చేశారు.
అల్లాహ్ ఇస్లాం ముద్దు బిడ్డ అయిన సుమామా బిన్ ఉసాల్ (ర)కి ఉత్తమ ప్రతి ఫలం ప్రసాదించుగాక! స్వర్గంలో ఈయనకు దైవభీతిపరుల సరసన చోటు కల్పించుగాక !! (ఆమీన్)