శుభోదయ కిరణాలు (హిరా గుహలో )

3155044786_e059f68917_o

మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ

 

మహా ప్రవక్త (స) గారి వయసు 40 సంవత్సరాలకు దగ్గరవుతుండగా అల్లాహ్‌ా ఆయన కోసం ఏకాంతాన్ని వ్రియంగా చేశాడు. తరచూ ఆయన (స) సత్తు విండి, నీళ్ళు తీసుకుని మక్కాకు రెండు మైళ్ళ దూరాన ఉన్న నూర్‌ పర్వతంవై గల హిరా గుహలోకి వెళ్ళేవారు. రమజాను మాస మంతా హిరా గుహలోనే ఆరాధన, అనుశీలనల్లో, సృష్టి రహస్యాల ఛేదన లో నిమగ్ను లయ్యేవారు. నిత్యం తన జాతి వారిలో తిష్ఠ వేసిన విగ్రహా రాధన, మద్యపాన సేవనం, విషయ లోలత్వం లాంటి సామాజిక రుగ్మ తల గురించి, వారి నైతిక దుస్థితి గురించి తీవ్రంగా మథన పడేవారు.

ప్రవక్త (స) గారి ఏకాంతం కూడా అల్లాహ్‌ా సూచనల్లోని ఒక సూచనే. దైవదౌత్యానికి మూడు సంవత్సరాల ముందు నుండే అల్లాహ్  తన ప్రవక్త (స) కోసం ఈ ఏకాంతాన్ని సమ్మతించాడు. ప్రవక్త (స) ఈ ఏకాంతంలోనే నెలలు గడివేవారు. బ్రహ్మాండమైన ఈ విశ్వ కర్మాగారం వెనుక ఉన్న ఆ శక్తి ఏది? మానవుల ఆ నిజ స్వామిని ఆరాధించే సరైన పద్ధతి ఏమిటి? వీటివైనే ఆయన తన మనసును కేంద్రీకరించారు. దైవేచ్ఛతో చివరికి ఆ ఘడియ రానే వచ్చింది.

జిబ్రయీల్‌ దైవ వాణి తీసుకొస్తున్నారు

దైవ ప్రవక్త (స) గారికి 40 యేండ్లు నిండాయి. అప్పుడు దైవ దౌత్య సూచనలు ప్రస్ఫుటమవసాగాయి. దివ్య కాంతులు విరజిమ్మసాగాయి. ఆ సూచనలు ఆయన (స) గారి కలలు. ఆయన చూసే ప్రతి కల ప్రభాకరుని లేకిరణంలా నిజమయ్యేది. ఈ పరిస్థితి ఆరు నెలల వరకు కొనసాగింది. ఈ కల దైవ దౌత్యపు నలభై భాగాల్లోని ఒక భాగం. అది రమజాన్‌ మాసం. ఎప్పటిలాగే ఆయన (స) దైవ ధ్యానంలో లీనమై ఉన్నారు. హిరా గుహలో ఆయన ఏకాంతవాసపు మూడవ సంవత్సరం అది. దైవ దూత జిబ్రయీల్‌ (అ) దైవ వాణికి సంబంధించిన కొన్ని దైవ  వచనాలను  తీసుకొచ్చారు.

అధిక శాతం పండితుల వ్యాఖ్యానం రీత్యా ఖుర్‌ఆన్‌ అవతరణ రమజాను మాసం 21వ తేదీన జరిగింది. హిరాలో ప్రవక్త (స) ముందు ప్రత్యక్షమైన హజ్రత్‌ జిబ్రయీల్‌ ‘చదువు’ అన్నారు. దానికి ఆయన ‘నేను చదువుకోలేదు’ అని సమాధానం ఇచ్చారు. (గట్టిగా అదిమి వదిలి) మళ్ళీ ‘చదువు’ అని పురమాయించారు. ఆయన మళ్ళీ ‘నేను చదవలేను’ అని పలికారు. మళ్ళీ జిబ్రయీల్‌ (అ) ఆయన్ని గట్టిగా అదిమి వదు లుతూ ‘చదువు’ అని కోరారు. ‘నేను చదువుకున్నవాణ్ణి కాను’ అని తిరిగి బదులి చ్చారు.

మూడవసారి కూడా జిబ్రయీల్‌ (అ) అదిమి వదిలి ఇలా అన్నారు: ‘చదువు నిన్ను సృష్టించిన నీ ప్రభువు పేరుతో! ఆయన మనిషిని కరడు గట్టిన రక్తంతో సృష్టిం చాడు. చదువు, నీ ప్రభువు ఎంతో దయాళువు. ఆయన కలము ద్వారా మనిషికి జ్ఞానబోధ చేశాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు’. (అలఖ్‌: 1-5)

ఈ సంఘటన జరిగిన వెంటనే మహా ప్రవక్త (స) భయాందోళనలతో వణుకుతూ హజ్రత్‌ ఖదీజా (ర.అ) వద్దకు వచ్చి ‘దుప్పటి కప్పు, దుప్పటి కప్పు’ అని అన్నారు. కాస్త శాంతించిన మీదట ఆయన జరిగిందంతా హజ్రత్‌ ఖదీజా (ర.అ)కు వివరించారు. దానికి హజ్రత్‌ ఖదీజా (ర.అ) ఇలా ఓదార్చారు: ”అల్లాహ్‌ా ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని వృథా కానివ్వడు. ఎందుకంటే మీరు బంధువుల పట్ల బాధ్యతా నిర్వహణలో ఎలాంటి లోటు రానివ్వరు. ఇతరుల భారాన్ని తమరే మోస్తారు. ఆర్తులను, అనాథలను ఆదుకుంటూ ఉంటారు. అతిథులకు ఉచిత రీతిలో మర్యాద చేస్తారు. ఆపదల్లో ఉన్నవారికి (న్యాయప్రాప్తి కొరకు) తోడ్పడతారు”.

ఆ తర్వాత ఆయన్ని తీసుకొని ఆమె తన పెదనాన్న కుమారుడైన వరఖా బిన్‌ నౌఫిల్‌ దగ్గరకు వెళ్లారు. ఆయన వయసు పైబడిన పండు ముదుసలి. క్రైస్తవ మతస్తుడు. మహా ప్రవక్త (స) జరిగిన వృత్తాంతం అంతా వివరించగా, ఆ అద్భుత శక్తి ఎవరో కాదు, ప్రవక్త (అ)పై అవతరించిన దైవదూతే. ఇప్పుడు నేను పసి బాలుడ్ని అయి ఉంటే ఎంత బావుండేది.

మీ జాతి వారు మిమ్మల్ని బహిష్కరించే రోజు నేను సజీవంగా ఉంటే ఎంత బాగుండు అని విచారం వ్యక్తం చేశాడు. ‘ఏమిటి? నా జాతి వారు నన్ను బహిష్క రిస్తారా?’ అని ఆశ్చర్యంగా అడిగారు మహా ప్రవక్త (స). అవును, మీకు లభించిన ఇటువంటి సందేశాన్ని పొంది, దాన్ని ప్రజలకు అందజేసిన వారందరి పట్లా ప్రజలు వైరంతోనే మసిలారు. మీకు ఆ పరిస్థితులు ఎదురయ్యే వరకు నేను గనక జీవించి ఉంటే మీకు అండగా ఉంటాను అని సమాధానమిచ్చాడు వరఖా. కాని ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన మరణించాడు.

ఆ తర్వాత కొన్ని దినాల వరకు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)పై దివ్యావిష్కృతి అవతరించడం ఆగిపోయింది. అలా చాలా రోజులే గడిచాయి. ప్రవక్త (స) ఉదాసీనత క్రమ్ముకుంది. వహీ అవతరణకై ఎంతో ఆత్రుతతో ఎదురు చూడసాగా రాయన. ఆ తర్వాత కొంత కాలానికి దైవవాణి అవతరించింది. దివ్యావిష్కృతి అవత రించే విధానాలు ఈ రీతిలో ఉండేవి:

1) ప్రవక్త (స) గారిపై దివ్యావిష్కృతి తొలి థలో నిజమైన కల రూపంలో వచ్చేది.

2) ప్రవక్త (స)పై దివ్యావిష్కృతి (వహీ) అవతరించేటప్పుడు గంట మ్రోగుతున్న శబ్దం విన్పించేది. దాని ధాటికి ప్రవక్త (స) నుదుటిపై విపరీతంగా చెమటలు పట్టేవి. ఎముకలు కొరికే చలిలో సయితం అలాగే జరిగేది ముఖ్యంగా జిబ్రయీల్‌ (అ) వచ్చేటప్పుడు ఈ పరిస్థితి ఏర్పడేది.

3) ఒక్కోసారి ప్రవక్త (స) ఎదుట దైవదూత మానవాకారంలో ప్రత్యక్షమై సంబోధించే వాడు. మానవాకారంలో ఉన్న దైవదూతను ప్రవక్త (స) వారి సహచరులు సయితం చూసేవారు.

దివ్యావిష్కృతి అవతరణ 23 సంవత్సరాల వరకు సాగింది. ప్రవక్త (స) 40వ ఏట నుండి ప్రారంభమై 63వ సంవత్సరం ఆయన మరణించేంత వరకూ అవతరిస్తూనే ఉంది. దైవ ప్రవక్త (స)పై అవతరించిన తొలి ఖుర్‌ఆన్‌ వచనాలు దాసుల నుండి కోరేదేమిటంటే – వారు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేయాలి. తమ కార్యకలాపా లన్నింటినీ అల్లాహ్‌ాకు ప్రత్యేకించుకోవాలి. మనోవాంఛలను అల్లాహ్‌ా ప్రసన్నత కోసం పరిత్యజించాలి అన్నది.

సందేశ సారాంశం

అ)  ఏకేశ్వరోపాసన (తౌహీద్‌)       ఆ)  దైవదౌత్యం (రిసాలత్‌)    ఇ)  పరలోక జీవితం (ఆఖిరత్‌)పై విశ్వాసం

ఈ) పతనానికి గురి చేసే అనైతిక చర్యల నుండి, అసభ్య ప్రహేళికల నుండి మాన వాత్మలను ప్రక్షాళనం చేయడం.

ఉ)   సమస్త విషయాలను అల్లాహ్‌ాకు అప్పగించడం.

Related Post