దైవభీతి (తఖ్వా)
త ఖ్వా అనే పదం ”విఖాయా”అనే అరబీ పదం నుంచి వచ్చింది. ”తఖ్వా” అనే పదానికి నిర్వచనం ‘ఆగి ఉండటం, దూరంగా ఉండటం.’ ఇస్లామీయ పరిభాషలో ‘దైవానికి అప్రియమైన విషయాల నుండి దూరంగా ఉండటం, దైవం తరపున నిషిద్ధం అయినవాటి నుండి ఆగి ఉండటం’.
తఖ్వా నిర్వచనం: హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) తఖ్వా గురించి హజ్రత్ ఉబై బిన్ కాబ్ (ర) గారికి ప్రశ్నించగా ఆయన (ర) ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ‘ఓ అమీరుల్ మోమినీన్! మీరు ఎప్పుడైనా ముళ్ళులతో నిండున్న దారిలో నడిచారా?’ అని ప్రశ్నిస్తే, ”ఔను, ఆ పరిస్థితి నాకు ఎదురయ్యింది” అని బదులిచ్చారు. ‘అటువంటి దారిలో మీరు ఎలా నడుస్తారు?’ అని మరోసారి ప్రశ్నించగా ”నా దుస్తులను ముళ్ళులతో గుచ్చుకోకుండా వాటిని కాపాడుకుంటూ నడుస్తాను” అని జవాబిచ్చారు ఉమర్ (ర). ‘తఖ్వా విషయం సైతం ఇంతే. ఎలాంటి దుష్టకార్యాలకు గురి కాకుండా, చెడు చేష్టల దరిదాపులకు పోకుండా, దైవ మార్గంలో తన జీవితాన్ని గడపటమే తఖ్వా’ అని హజ్రత్ ఉబై బిన్ కాబ్ (ర) పేర్కొన్నారు. అర్బాజ్ బిన్ సారియా (ర) ఉల్లేఖించారు: ఒక సారి మహా ప్రవక్త (స) మమ్మల్ని నమాజ్ చది వించి, కొన్ని విషయాలు బోధించారు. అటు వంటి ప్రభావితమైన హితబోధను విని మా గుండెలు సైతం ద్రవించాయి. అప్పుడు మహా ప్రవక్త(స) సహచరుల్లో ఒకరు ఇలా అన్నారు: ”మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే మీరు ఎంతో కాలం జీవించరని అనిపిస్తుంది. కనుక మీరు మాకు ఏదయినా ఉపదేశించండి’. అప్పుడు మహా ప్రవక్త(స) ”అల్లాహ్‌ా భయభక్తులను అవలం బించండి మరియు మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి” అని హితవు పలికారు.
తఖ్వా ప్రాముఖ్యత: అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్‌లో పలు చోట్ల తఖ్వా ప్రాముఖ్యాన్ని తెలియపరి చాడు: ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు భయపడండి, మరియు ప్రతి వ్యక్తి రేపటికి తాను ఏమి చేసి పంపుకున్నాడో చూసుకోవలెను. మరియు మీరు అల్లాహ్ కు భయ పడండి, నిశ్చ యంగా మీరు చేసే పనులన్నీ అల్లాహ్కు తెలుసు.” (అల్ హష్ర్:18)
తఖ్వా కేవలం దైవాజ్ఞ మరియు దైవ ప్రవక్త (స) ఉపదేశమే కాదు, దైవాజ్ఞల సారాంశం మరియు ఉద్యేశం కూడానూ. దివ్యఖుర్‌ఆన్‌లో పలుచోట్ల తఖ్వా గురించి నొక్కి వక్కాణించ బడింది. ఉదాహరణకు: ”విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌ాకు ఏ విధంగా భయ పడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి.” (ఆలి ఇమ్రాన్: 102) ”విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయ పడండి, మరియు రుజు వాక్కును పలకండి”. (అల్ అహ్ జాబ్:70) ”మీరు మీ శక్తికి తగ్గ అల్లాహ్ కు భయ పడండి.” (అల్ తగాబున్:16)
ఇస్లామీయ బోధనలు, ఇస్లామీయ ఆరాధనలన్నింటి ఉద్యేశం తఖ్వాయే. ఆరాధనల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది.” (అల్ బఖర:21)
ఉపవాసం ఉద్దేశాన్ని వివరిస్తూ-”విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయిం చబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో, దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (అల్ బఖర : 183)
భయభక్తులు గలవారి గుణగణాలు: వాస్తవానికి దైవభీతి కలవాడు ఎవడు? ఇదొక ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే సమాజంలో ప్రతి వ్యక్తి తఖ్వాకై వివిధ ప్రమాణాలను సృష్టించుకున్నాడు. కొందరి దృష్టిలో నమాజ్ ప్రమాణమైతే, మరి కొందరి దృష్టిలో జకాత్, అలాగే కొందరి దృష్టిలో ఆరాధనలు ప్రమాణ మైతే మరి కొందరి దృష్టిలో పరస్పర వ్యవహా రాలు ఉన్నాయి. కాని ఓ వ్యక్తి విశ్వాసాలు, ఆరాధనలు నైతిక విలువలు, లావాదేవీలు అన్ని రంగాల్లో దైవాజ్ఞ ప్రకారం తన జీవి తాన్ని గడుపుతాడు, అతనే వాస్తవానికి భయ భక్తులు గలవాడు.
‘సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ నూ అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్ అవ తరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్ట పడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాథుల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, సహాయం చెయ్యండి అని అర్థించే వారి కొరకూ, ఖదీలను విడుదల చెయ్యటాని కి వ్యయపరచటం. ఇంకా నమాజును స్థాపిం చటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దాని ని పాలించేవారు, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటం హజ్ గురించి ప్రస్తావిస్తూ:’ఎవరు దేవుని సూచనలను గౌరవిస్తారో, ఆ గౌరవము హృదయముల నుండి వచ్చిన భక్తియే.” (అల్ హజ్:32)
మరియు తఖ్వా అత్యుత్తమ సామగ్రి అని కూడా పేర్కొనడం జరిగింది. ”భయభక్తులు అన్నిటి కంటే ఉత్తమమైన సామగ్రి.” (అల్ బఖర:197) అలాగే ఖుర్బానీ గురించి దివ్యఖుర్‌ఆన్‌లో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది:”జంతువుల మాంసముగాని, వాటి నెత్తురుగాని అల్లాహ్‌ాకు చేరవు. కాని మీ భయభక్తి ఆయనకు చేరుతుంది.” (అల్ హజ్:37)
నైతిక ప్రబోధనలను అధ్యయనం చేస్తే, మనకు తెలిసేదేమంటే నైతిక వ్యవస్థపు పునాది తఖ్వా ప్రాప్తిపై ఆధారపడుతుంది.”మీరు (పురుషులు) ఉదార స్వభావంతో వ్యవహరిస్తే, అది దైవభీతికి అత్యంత చేరువయినది”. (అల్‌బఖర:237) ‘మీరు న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సమానమైనది.’ (అల్ మాయిద:8)
హజ్జతుల్ వదా సందర్భానా దైవప్రవక్త(స) తఖ్వా గురించి హితబోధ చేస్తూ ఈ విధంగా సెలవి చ్చారు: ”మీరు మీ ప్రభువుకు భయ పడండి, ఐదు పూటల నమాజ్ చెయ్యండి, రమజాన్ మాసపు ఉపవాసాలు పాటించండి, మీకు ప్రసాదించబడిన దాని నుండి జకాత్ ఇవ్వండి, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి, (ఇవన్నీ మీరు పాటిస్తే) మీ ప్రభువు (తయారు చేసిన) స్వర్గంలో మీరు ప్రవేశిస్తారు”. (తిర్మిజీ)
తఖ్వా సంబంధం: తఖ్వా దైవ బోధనల సారాంశం, మరియు ఇస్లామీయ బోధనలలో అతి ముఖ్యమైనది. తఖ్వా మనస్సుకు సంబంధించిన విషయం కనుక మనస్సే తఖ్వా అసలు కేంద్రం. ”ఎవరు దేవుని సూచనలను గౌరవిస్తారో, ఆ గౌరవము హృదయముల నుండి వచ్చిన భక్తియే”. (అల్ హజ్:32) ”అల్లాహ్ వారి హృదయాలను ధర్మనిష్ఠ (తఖ్వా) కోసం పరికించాడు.” (అల్ హుజురాత్:3)
పై ఆధారాలను బట్టి తెలిసిందేమంటే మనస్సు తఖ్వా కేంద్రం. మహా ప్రవక్త (స) కూడా తఖ్వా కేంద్రం గురించి వివరిస్తూ తమ సహచరుల ఎదుట ఈ విధంగా సెలవిచ్చారు: ”తఖ్వా ఇక్కడుం టుంది, అని మూడు సార్లు ఆయన (స) తమ గుండె వైపు సైగ చేశారు”. (ముస్లిం)
భయభక్తులు గలవారి గుణగణాలు:వాస్తవానికి దైవభీతి కలవాడు ఎవడు? ఇదొక ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే సమాజంలో ప్రతి వ్యక్తి తఖ్వాకై వివిధ ప్రమాణాలను సృష్టించుకున్నాడు. కొందరి దృష్టిలో నమాజ్ ప్రమాణమైతే, మరి కొందరి దృష్టిలో జకాత్, అలాగే కొందరి దృష్టిలో ఆరాధనలు ప్రమాణ మైతే మరి కొందరి దృష్టిలో పరస్పర వ్యవహా రాలు ఉన్నాయి. కాని ఓ వ్యక్తి విశ్వాసాలు, ఆరాధనలు నైతిక విలువలు, లావాదేవీలు అన్ని రంగాల్లో దైవాజ్ఞ ప్రకారం తన జీవి తాన్ని గడుపుతాడు, అతనే వాస్తవానికి భయ భక్తులు గలవాడు.
‘సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ నూ అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్ అవ తరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్ట పడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాథుల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, సహాయం చెయ్యండి అని అర్థించే వారి కొరకూ, ఖదీలను విడుదల చెయ్యటాని కి వ్యయపరచటం. ఇంకా నమాజును స్థాపిం చటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దాని ని పాలించేవారు, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటం లో స్థైర్యం చూపేవారూ సత్పురుషులు.వాస్తవం గా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే.” (అల్ బఖర:177) అదే విధంగా సూర ఆలి ఇమ్రాన్‌లో ఇలా వచ్చింది:’మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు స్వర్గం వైపున కు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమయినది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్య బడింది. వారు కలిమిలో, లేమిలో ఏ స్థితిలో ఉన్నా తన సంపదను ఖర్చు చేసేవారు,కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరులతప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనుంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం. వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యం వారి వల్ల జరి గిపోతే లేదా ఏదైనా పాపంచేసి, వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే, వెంట నే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు-ఎందుకంటే అల్లాహ్ తప్ప పా పాలను క్షమించగలిగే వాడెవడున్నాడని-వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వ కంగా మొండివాదం చెయ్యరు”. (ఆలి ఇమ్రాన్:133)
తఖ్వా మార్గం చాలా కఠినమైన మార్గం. ముళ్ళులతో నిండున్న మార్గం. ఆ మార్గంపై నడిచేవారు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొం టారు. చివరికి పరలోకంలో నిశ్చయంగా వారు ఉద్యానవనాలలో ఎల్లప్పుడు హాయిగా ఉంటారు. దివ్యఖుర్‌ఆన్ అధ్యయనం ద్వారా తెలిసేదే మంటే దైవం పరలోకపు సర్వ అనుగ్రహాలను దైవభీతి గలవారికే తయారు చేసి పెట్టాడు. దివ్యఖుర్‌ఆన్‌లో పలు చోట్లలో దీని గురించి ప్రస్తావన వచ్చింది.”నిశ్చయంగా భయభక్తులు గలవారు సురక్షిత మైన స్థలములో ఉంటారు”.(అల్‌దుఖాన్:51)
ఇంకో చోట ”నిశ్చయముగా భయభక్తులు కల వారు ఉద్యావనాలలో, భోగభాగ్యాలలో ఉం టారు”. (అల్ తూర్:17) మరో చోట ఈ విధంగా ఉంది: ”నిశ్చయముగా భక్తులు స్వర్గ వనములలో కాలువలలో ఉంటారు”. (జారియాత్:15)అదే విధంగా ”నిశ్చయముగా భయభక్తులు గలవారికి వారి ప్రభువు వద్ద సౌఖ్యములు గల స్వర్గవనములు తప్పక గలవు.” (అల్ కలమ్ : 34) ”నిశ్చయముగా భయభక్తులు గలవారికే సాఫల్యము గలదు.” (అన్ నబా: 31)
పరలోకంలో దైవభీతి గలవారికి ఓ వెలుతురు ప్రసాదించడం జరుగుతుంది, దాని ద్వారా వారు తమ పరలోక ప్రయాణాన్ని సాగి స్తారు.”ఓ విశ్వాసులారా! దేవునికి భయపడండి, మరియు అతని ప్రవక్తను విశ్వసించండి, అల్లాహ్‌ా మీకు తన అనుగ్రహము నుండి రెండు భాగములు ప్రసాదిస్తాడు, మీకు వెలుతురు సైతం ప్రసాది స్తాడు. దానిద్వారా మీరు నడవగలరు, మరియు మిమ్మల్ని క్షమిస్తాడు కూడా. అల్లాహ్‌ా క్షమించేవాడు అనుగ్రహించేవాడు.”(అల్‌హదీద్:28)
కేవలం పరలోక ప్రయోజనాలే కాకుండా, ఇహలోక లాభాలు సైతం ప్రాప్తమవుతాయి. వాటిలో కొన్ని ఇవి: అల్లాహ్ ప్రేమ: అల్లాహ్ ప్రసన్నత కొరకు దైవభీతి మరియు పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించే వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడని దివ్య ఖుర్‌ఆన్ తెలియజేస్తుంది. ”అల్లాహ్ భయభక్తులు గల వారంటేనే ఇష్టపడతాడు”. (తౌబా:4)
అల్లాహ్ సాన్నిధ్యం: తఖ్వా యొక్క జీవితాన్ని అవలంబించటం వల్ల దైవ సాన్నిధ్యం సైతం ప్రాప్తమవుతుంది. ”అల్లాహ్ కు భయ పడుతూ ఉండండి, భయభక్తులు గలవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయం తెలుసుకోండి”. (అల్ బఖర:194)
ఉపాధి లభించే మార్గం: దైవం దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తు న్నాడు: ‘ఏ వ్యక్తి అయితే అల్లాహ్ కు భయపడతాడో, అల్లాహ్ అతనికి గట్టెక్కే మార్గాన్ని చూపుతాడు (ముక్తిమార్గము కల్పిస్తాడు) మరియు అతనికి తెలియని మార్గం ద్వారా ఉపాధి ప్రసాదిస్తాడు’. (అల్ తలాఖ్: 2,3)
గీటురాయిని ప్రాప్తి, పాపాల మన్నింపు: అల్లాహ్ తన భయభక్తుల ను అవలంబించేవారికి ఓ విచక్షణా శక్తి ప్రసాదిస్తాడు. దాని ద్వారా అడుగడుగునా వారికి స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ఏ మార్గం సత్యమైనదో, ఏది అసత్యమైనదో. ”విశ్వసించిన ప్రజలారా! మీరు గనక భయభక్తులను అవలంబిస్తే, అల్లాహ్ మీకు గీటురాయిని ప్రసా దిస్తాడు, మీ నుండి మీ చెడులను దూరం చేస్గాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ అత్యధికంగా అనుగ్రహించేవాడు.” (అన్ఫాల్:29)
సదాచారాల స్వీకరణ: ఆచారాలు దైవ సమక్షంలో స్వీకరించబడ టానికి తఖ్వాయే పునాది. ”భయభక్తులు గలవారి మొక్కుబడులనే (ఆచారాలనే) అల్లాహ్ స్వీకరిస్తాడు.” (అల్ మాయిదహ్‌ా:27)
గౌరవప్రాప్తి: అల్లాహ్ దృష్టిలో తఖ్వాయే అసలైన ప్రమాణం. ఆ తఖ్వా ద్వారా దాసుడు శ్రేష్ఠమైన స్థాయి పొందగలడు.భయభక్తులు గలవారికే సర్వ రకాల సాఫల్యం, ప్రతిఫలం లభిస్తుంది. పరలోక లాభాలే కాకుండా ఇహలోక సాఫల్యం సైతం ప్రాప్తమవుతుంది. సూర యూసుఫ్ అధ్యయనం చేస్తే మనం గ్రహించే నీతి ఏమంటే ప్రవక్త యూసుఫ్ (అ) అధికార పీఠం అధిష్టించాక ఆయన (అ) సోదరులం దరూ లేమిలో ఆయన వద్దకు వచ్చి విన్నవించుకున్నారు. ప్రవక్త యూసుఫ్ (అ) తమ సోదరులను సంభాషిస్తూ తన పరిచయం చేశాక తన సాఫల్యానికి కారణమయిన మౌలిక రహస్యాలను పేర్కొన్నారు.”వాస్తవం ఏమిటంటే భయభక్తులతో, ఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లాహ్ వద్ద వృధా కాదు.” (యూసుఫ్ :90)