తెలుగు వెలుగు కోసం ప్రతిన పూనుదాం!

'సంస్కృతికి మూల హేతువు మనిషిలో వికసించిన విజ్ఞాన ధాతువు' అన్నారు సినారె. సహస్రాబ్దాల సంస్కృతీ వారస త్వం, మరే భాషకూ లేని తలకట్టు ధీమ త్వంతో జేగీయమానమై తరతరాలుగా తెలుగువారి విజ్ఞాన దాహార్తిని తీరుస్తూ వచ్చింది మన మాతృ భాషే.

‘సంస్కృతికి మూల హేతువు మనిషిలో వికసించిన విజ్ఞాన ధాతువు’ అన్నారు సినారె. సహస్రాబ్దాల సంస్కృతీ వారస త్వం, మరే భాషకూ లేని తలకట్టు ధీమ త్వంతో జేగీయమానమై తరతరాలుగా తెలుగువారి విజ్ఞాన దాహార్తిని తీరుస్తూ వచ్చింది మన మాతృ భాషే.

(సంక్షిప్తంగా)
‘తెలుగునకు పర్యాయపదమై వెలుగు విక సించె, వెలుగునకు ఆమ్రేడితమ్మై తెలుగు వినిపించె’ కవితా పయోనిధి దాశరథి భావోద్వేగాలకు అక్షర రూపమది.
‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ…గతమెంతో ఘనకీర్తి కలవోడ’ అన్న వేములపల్లి శ్రీ కృష్ణ ప్రబోధాత్మక గీతం మూడు నాలుగు థాబ్దాల క్రితం తెలుగునాట మార్మోగిపో యేది. తెలుగుఆట, తెలుగుపాట, తెలుగు నుడికారం, తెలుగు మమకారం-సం క్రాంతికి వేసిన రథం ముగ్గులా మున్నూట అరవై అయిదురోజులూ జాతి మనోరథమై సాగి, ముంగిళ్లలో తెలుగుదనాన్ని రాశులు పోసిన రోజులవి.

కాలం మారింది. ‘గతమెంతొ ఘనకీర్తి’ పాటా ఆగింది. తెలుగు నుడికారం బడికి దూరమైంది. యాభయ్యారక్షరాల వర్ణ మాల తెలుగింటికి భారమైంది. సొంతింటి లోనే అమ్మ భాషకు ఆదరణ కొరవడిన వేళ, తియ్యందనాల తెలుగు మళ్ళీ ఇంటింటి వెలుగు కావాలన్న శుభసం కల్పంతో – తెలుగు భాషా వికాస మహో ద్యమం కోసం ఉద్భవించిన ‘రామోజీ ఫౌండేషన్‌’ విస్పష్ట కార్యాచరణతో ముంద డుగేస్తోంది!
‘సంస్కృతికి మూల హేతువు మనిషిలో వికసించిన విజ్ఞాన ధాతువు’ అన్నారు సినారె. సహస్రాబ్దాల సంస్కృతీ వారస త్వం, మరే భాషకూ లేని తలకట్టు ధీమ త్వంతో జేగీయమానమై తరతరాలుగా తెలుగువారి విజ్ఞాన దాహార్తిని తీరుస్తూ వచ్చింది మన మాతృ భాషే. అలాంటి కామధేనువును కాలదన్ని కాలధర్మమనే కబేళాకు తోలడం సరైనదేనా? పొరుగున తమిళ, కన్నడ సోదరులూ అలాగే చేస్తు న్నారా? లేదు లేదన్నదే సమాధానం. వాళ్ల లా అమ్మభాషను అక్కున చేర్చుకొనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములం కావాలి మనం దరం! ఉద్యోగమైనా, సద్యోగమైనా ఆంగ్ల భాషే బతుకు తెరువన్న వెర్రిభ్రమల మాయమబ్బు థాబ్దాలుగా తెలుగుగడ్డపై దట్టంగా ముసురేసింది. రాజ్యభాషగా తెలుగును గుర్తించి, గౌరవించలేని పాల కుల ఏలుబడిలో మాతృభాష ఉనికి మనికి ప్రశ్నార్థకమైపోయాయి. అధునాతన సాంకే తిక పరిజ్ఞాన సాగర మథనంలో నిత్య నూతనావిష్కరణలను భావితరం ఆదరం గా అందిపుచ్చుకొంటున్నా ఆయా వస్తు సేవలకు తెలుగు పేర్లు లేవు. కాబట్టే రేపటి పౌరులకు తెలుగు భాష అక్కరకు రానిదవుతోంది. పాలకుల అలక్ష్యం, పాలి తుల ఉదాసీనత తెలుగువారి నోట తేట తెనుగు పూటలు కనుమరుగు కావడానికి కారణం. లొసుగులూ లోపాల్ని పూరించు కొంటూ తెలుగు భాషకు అమృతత్వాన్ని సాధించాలన్నదే మా సత్సంకల్పం.
వ్యావహారిక భాషోద్యమంతో తెలుగునాట పెను సంచలనం సృష్టించినవారు గిడుగు రామ్ముర్తి పంతులు. మాతృ భాషకు మహో జ్జ్వల భవితను ఆశిస్తూ ప్రతి తెలుగువాడు తనవంతు తోడ్పాటును అందించడానికి ప్రతిన పూనాలి. అమ్మభాషపై మమకా రాన్ని పంచే మహోద్దేశంతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్‌ తన ‘తెలుగు వెలుగు’ సప్తవర్ణ మాసపత్రిక తొలిసంచికను నేడే ఆవిష్క రిస్తోంది. తెలుగువాడిలో నిద్రాణమై ఉన్న జాతీయతా స్పూర్తిని తట్టి లేపి, దేశ విదే శాల్లో ఉన్న తెలుగువారికి ఉమ్మడి వేదికగా నిలవడమే లక్ష్యంగా తెలుగు వెలుగుతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనీ ఈ ఫౌండేషన్‌’ నిర్ణయిం చింది. పిల్లల కోసం విజ్ఞానం, విలువలు, వినోదాల కలబోతగా ఒక మాస పత్రిక; పాఠశాల స్థాయిలో పిల్లలకు వివిధ పోటీల రూపేణా కొత్త తరానికి తెలుగు వెలుగు; సాహిత్య గ్రంథాల ప్రచురణ, తెలుగు వెలుగు.ఇన్‌ పేరిట వివిధ తెలుగు సంఘాలకు, సంస్థలకు ఉమ్మడి వేదిక త్వరలో సాకా రం కానున్నాయి.

ఎప్పటికప్పుడు భాష పరిపుష్టికి దోహద పడేలా ఆంగ్ల పదాలకు సమానార్థక పదాల సేకరణ, సృష్టి నిరంతర క్రతువు లా సాగాలి. ఈ యజ్ఞంలో భాషాభిమాను లందరూ భాగస్వాములు కావాలి. దాంతో పాటే రామోజీ జ్ఞానాలయం పేరిట ఒక బృహత్‌ గ్రంథాలయంలో జాతి సాహితీ సంపదను పరిరక్షించి, వాటిలో అవ కాశం ఉన్నవాటి ని అంతర్జాలం(నెట్‌)లో నిక్షిప్తం చేయడం ద్వారా భాషా పరిశోధ నల్ని ప్రోత్సహించాలన్నది ఇంకో ఆలో చన. భావి అవసరాలకు దీటైన ఓ మంచి ప్రామాణిక నిఘంటు నిర్మాణం ఈ ఫౌం డేషన్‌ భుజానికెత్తుకున్న మరో గురుతర బాధ్యత.
వాటితోపాటే, భాషాప్రేమికుల్ని సంఘ టితం చేసి -ఏ ‘ఇజా’లతో నిమిత్తం లేని తెలుగు భాషోద్యమం ద్వారా పాలకులపై ఒత్తిడి పెంచి తెలుగును ‘రాజపూజ్యం’ చెయ్యడం, అన్ని స్థాయిల్లో పాలన తెలు గులో సాగేలా, పాఠశాలల్లో ఒక బోధ నాంశంగా తెలుగు తప్పనిసరి అయ్యేలా చూడటం – ఈ ఫౌండేషన్‌ భాషోద్యమ లక్షంగా స్వీకరిస్తోంది.

కార్యాచరణ రూకల్పనలకు ఈ ఫౌండేషన్‌ త్రికరణశుద్ధిగా నిబద్ధమవు తుంది. మాసపత్రికలు, నిఘంటువులు, కొత్త పదసృష్టి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాషోద్యమం – తదితరాలన్నింటా ముందుండి నడిపించాల్సింది తెలుగు వారే.
‘తెలుగు సాహితి సంస్కార జలధి
తరతరాల వెలుగురా తెలుగు సంస్కృతి’
అని ఎలుగెత్తి చాటుదాం.
‘గతమెంతో ఘనకీర్తి
భవిత సముజ్జ్వల దీప్తి’గా
తెలుగు వెలుగుకోసం ప్రతిన పూనుదాం.
(ఈనాడు 29-08-2012 సౌజన్యంతో)

Related Post