ఉపవాసి వల్ల జరిగే పొరపాట్లు

ఉపవాసి వల్ల జరిగే పొరపాట్లు
1) రమజాను మాసం రాగానే కొందరు ముస్లిం సోదరులు ప్రార్థనల, పారాయణాల కోసం సమయం కేటాయించాల్సింది పోయి,  ఆహార పానీయాలను అతిగా కొనుగోలు చేయడంలో సమయాన్ని వెచ్చిస్తుం టారు.
2) కొందరు సోదరులు సహరీ భోజనాన్ని అర్థ రాత్రి వేళ ముగించు కుంటారు. లేదా తొందరగా చేసుకుంటారు. ప్రవక్త (స) వారి సంప్రదా యం సహరీని ఆలస్యం చేసి చేయడం.
3) కొందరు సోదరులు ఉపవాస సంకల్పం చేసుకోరు. ఉషోదయానికి ముందు ఫర్జ్‌ ఉపవాసం కోసం సంకల్పం చేసుకోకపోతే ఉపవాసం నెరవేరదు.
4) కొందరు సోదరులు ‘అల్లాహుమ్మ అసూము గదన్‌ లక…’ అంటూ ఉపవాసం సంకల్పం చేసుకుంటారు. కొన్ని ఉర్దూ మరియు తెలుగు పుస్తకాలలో పొరపాటున ఈ దుఆ పేర్కొనడం వల్ల వారు అలా చేస్తా రన్నది స్పష్టం. అయితే వారు చేసిన సంకల్పానికి అర్థం -‘ఓ అల్లాహ్‌! నేను నీ కోసం రేపు ఉపవాసం ఉంటాను’ అన్నది.  కాబట్టి మనం ఈ రోజు ఉపవాసం కోసం రేపటి ఉపవాస సంకల్పం చేయడం ఏమిటి?
5) చేతిలో నీళ్లుండి అజాన్‌ అవుతే ఒకరెండు గెక్కెళ్లు త్రాగచ్చు, ముందర అన్నం ఉండి అజాన్‌ అవుతే ఒకరెండు ముద్దలు తినొచ్చు అన్న వెసులుబాటును కొందరు పూర్తి అనుమతిగా భావించి బాగానే లాగించేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కొందరు సిగరెట్‌, పాన్‌ పరాగ్‌ వ్యసనపరులయితే బరి తెగించి ఒకరెండు దమ్ములు లాగేస్తుం టారు. ఇది ముమ్మాటికి పాపం.
6) రమజాను మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న అవగాహన లేకపోవడం.ప్రయాణావస్థలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా రమజాను గురించి తెలుసుకోకపోవడటం పొరపాటే.
7) కొందరు సోదరులు రమజాను మొదటి రాత్రి (నెలవంక కనబడిన రాత్రి) అది రమజాను రాత్రి కాదన్న ఉద్దేశ్యంతో తరావీహ్‌ా నమాజు చేయరు. చంద్రమానం ప్రకారం,రోజు సూర్యాస్తమయంతో ప్రారంభవు తుందని వీరు గ్రహించాలి.
8) కొందరు సోదరులు ఎవరయినా మరచి తింటూ త్రాగుతూ ఉంటే ‘అల్లాహ్‌ తినిపిస్తున్నాడు, త్రాపిస్తున్నాడ’న్న ఉద్దేశ్యంతో  ఆ సదరు వ్యక్తి ని వారించరు. తినని, త్రాగని అని వదిలేస్తారు. ఇది పద్ధతి కాదు.  ఒకవేళ ఉపవాసం లేని వ్యక్తి సయితం బహిరంగా ప్రదేశాల్లో త్రాగుతూ, తింటూ తారస పడితే వారించడం మన ధర్మం.
9) కొందరు సోదరులు యుక్త వయసుకు చేరని పిల్లలపై ఉపవాసం విధి కాదని వారు ఉపవాసం ఉంటామని మారాం చేసినా ఉండని వ్వరు. అయితే ఇస్లామీయ శిక్షణ అనేది బాల్యం నుండి ఇస్తే వస్తుం దన్న విషయం వారు గ్రహించాలి. మరికొందరయితే  అమ్మాయికి 12, 14 సంవత్సరాలవుతున్నా రజస్వల కాలేదు అని ఉపవాసం నుండి మినహాయించేస్తుంటారు. ఇది మంచిది కాదు.
10) ఉపవాసం సమయంలో గోటింటాకు పూసుకోరాదని, స్నానం చేెయరాదని, పళ్లు తోమరాదని, ఉమ్ము మింగరాదని, కూర రుచి చూడరాదని, ఇలా చేయడం ఉపవాసాన్ని భంగ పరుస్తందని భావి స్తారు. ఇది సరి కాదు.
11) కొందరు సోదరులు ఉప్పుతో ఉపవాసాన్ని విరమిస్తుంటారు. ఇది సున్నత్‌కు విరుద్ధం. ఉపవాసం ఖర్జూరంతోనయినా విరమించాలి, లేదా మంచి నీళ్ళతోనయినా విరమించాలన్నది ప్రవక్త (స) వారి ఆదేశం.
12) కొందరు సోదరులు ఒకరి ఇంటగానీ, మస్జిద్‌లోగానీ ఇఫ్తార్‌ చేసిన తర్వాత ఎలాంటి దుఆ చేయకుండా లేచి వెళ్ళి పోతారు. ఒకరి దగ్గర మనం ఉపవాసం విరమిస్తే వారి కోసం దుఆ చేయడం ప్రవక్త (స) వారి సంప్రదాయం. 13) కొందరు సోదరులు లైంగిక అశుద్ధత నుండి శుద్ధి పొందలేదన్న ఉద్దేశ్యంతో ఉపవాసం ఉండరు. ఉపవాస సంకల్పం చేసుకొని తర్వాత అయినా స్నానం చేసుకునే అనుమతి ఉంది. అలాగే ఉపవాస స్థితిలో స్వప్నస్ఖలనం జరిగితే ఉపవాసం భంగమవుతుందని భావించడం కూడా సరి కాదు.
14)  కొందరు సోదరులు సౌకర్యం ఉండి కూడా రమజాన్‌ చివరి థకంలో ఏతికాఫ్‌ పాటించరు.
15) కొందరు సోదరులు ఉపవాసం ఉండి తమ అమూల్యమయిన సమయాన్ని సిరీయళ్లు, ఇతర ప్రోగ్రాములు చూడటంలో దుర్వినియోగ పరుస్తుంటారు. ఇది ముమ్మాటికీ గర్హనీయం. అలాగే సన్మానాలు పొందే పండగ రాత్రిని షాపింగ్‌ మాల్‌లో గడపటం అవాంఛనీయం.
అల్లాహ్‌ మనందరికి రమజాను మాసపు సువర్ణ ఘడియల్ని సద్వినియోగ పర్చుకునే సద్బుద్ధిని అనుగ్రహించుగాక! (ఆమీన్)

 

Related Post